Followers

కార్మిక చట్టాల మార్పుపై నిరసన

 



 


 


 నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు


కార్మిక చట్టాల మార్పుపై నిరసన


పెనవర్, భీమవరం:


 


కరోనా, లా డౌన్లలో ఉద్యోగులు, కార్మికులు అవస్థలు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం, పనిగంటలను పెంచడం వంటి విధానాలతో సందిట్లో సడేమియా అంటూ ప్రజలపై విరుచుకు పడుతున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం స్థానిక మావుళ్ళమ్మ గుడి రోడ్డులో భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కాలానికి వేతనాలు ఇవ్వడానికి, కనీస వేతనాల అమలుకు, మనస్సులేని పాలకులు దొడ్డి దారిన కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నారని అన్నారు. లా డౌన్లో ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందిస్తున్న ఆశ, అంగన్‌వాడి, గ్రామ వాలంటీర్, మున్సిపల్ కార్మికులకు అదనంగా చేసేందేమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు బి.వాసుదేవరావు మాట్లాడుతూ ప్రాణాంతక కరోనాతో పోరాడుతూనే ఉద్యోగ కార్మికులు తమ సేవలను అందిస్తున్నారని, వారికి మెడికల్ టెస్టు కాని, మాలు, గెజిట్లు గాని, ఇతర ప్రభుత్వం ప్రకటించిన బీమా సదుపాయం వంటి సౌకర్యాలను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.ఆంజనేయులు, కరణం సూరిబాబు, డేగల నాగు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, శిరీష్ కుమార్, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.


వారపు సంత అనధికార వసూళ్లు పై పోలీసులకు ఫిర్యాదు.

వారపు సంత అనధికార వసూళ్లు పై పోలీసులకు ఫిర్యాదు.

 

పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు.

 

పరవాడ, పెన్ పవర్

 

మండల గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా మంగళవారం జరిగిన వారపు సంతలో అనధికారికంగా ఆశీలు వసూళ్లు చేసిన వారిపై గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు తెలిపారు. వారపు సంతలో ఆశీలు వసూళ్లు చేయాలంటే గ్రామపంచాయతీ నిర్వహించే టెండర్ను దక్కించుకున్న వాళ్ళు మాత్రమే వసూళ్లు చేయాలని అలా కాకుండా అనధికారికంగా గ్రామపంచాయతీ పేరుతో ఆశీల్లు వసూళ్లు చేస్తున్నారని స్థానికులు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు చేపట్టామన్నారు. పంచాయతీ అనుమతి లేకుండా, పంచాయతీ పేరు చెప్పి వారపు సంతలో ఆశీలు వసూళ్లు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు.అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారపు సంతలో అనధికారికంగా వసూలు చేసిన నగదును రికవరీ చేస్తామని అన్నారు.

పంచగ్రామాల ఫలసాయాలు కూరగాయలపై  నిషేధం.


 


పంచగ్రామాల ఫలసాయాలు కూరగాయలపై  నిషేధం.



కేంద్రానికి సూచించిన  నీరి నిపుణుల బృందం.

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్) 


 


ఎల్జి పాలిమర్స్  విషవాయువు ప్రభావం కారణంగా పంచ గ్రామాల్లో పండిన ఫల సాయాలు కూరగాయలను  నిషేధించారు. మూడు కిలోమీటర్ల పరిధిలో రసాయన విషవాయువు ప్రభావం   వాటిపై ఉంటుందని  ఆ కారణంగా  వాటిని తీసుకోవద్దని  నిపుణుల బృందం సూచించింది. ఎల్జి పాలిమర్స్ రసాయన విషవాయువు లీకైన కారణంగా  12 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు ఆరు వందల వరకు  ఆసుపత్రిలో  చేరారు. ఈ సంఘటనపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్  ఇండస్ట్రియల్  రీసెర్చ్( సి ఎస్ ఐ ఆర్) మరియు  జాతీయ పర్యావరణ  సాంకేతిక పరిశోధన పరిశోధన  సంస్థ ( ఎన్.ఈ.ఈ.ఆర్.ఐ) ల నిపుణుల బృందం  క్షేత్ర స్థాయి లో పరిశీలించి  రసాయన విషవాయువు  స్టెరైన్ రేణువులను  రోడ్లు  ఇళ్లల్లో గుర్తించడం జరిగిందని  బృందం పేర్కొంది. ఒక ఇంటిలో 1.7 పీపీఎం  స్టార్ ఇన్  రేణువులు అధికంగా పడి ఉన్నాయని తెలిపారు. విషవాయువు ప్రభావం వల్ల స్థానిక ప్రజలు  ఏడాది పొడుగునా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు.   వాయువు తాకిన  చెట్లను మొక్కలను  జీవీఎంసీ ఆధ్వర్యంలో తొలగించాలని బృందం సూచించింది. మూడు కిలోమీటర్లు  పంచ గ్రామాల్లో  రసాయన విషవాయువు  ప్రభావం  ఇప్పట్లో  ఆగిపోయే అవకాశం లేదని  బృందం  కేంద్ర ప్రభుత్వానికి  నివేదిక సమర్పించింది.  కేంద్ర ప్రభుత్వం  నీ నివేదికతో  పంచ గ్రామాలపై  దృష్టి సారించాల్సిన  అవసరం ఉంది.


భీమవరంలో మళ్ళీ ఆంక్షలు కఠినతరం

 




 


 


భీమవరంలో మళ్ళీ ఆంక్షలు కఠినతరం


- ఇబ్బందులు పడ్డ ప్రజలు


- ఆసుపత్రికి వెళ్ళాలంటే 10 కిమీ తిరిగి వెళ్ళాల్సిందే


- పోలీసుల తీరుపై విమర్శలు


 


 


 


 


పెనవర్, భీమవరం:


 


గత కొన్ని రోజులుగా లాన్ ఆంక్షలపై చూసీ చూడనట్లుగా వ్యవహరించిన పోలీసులు నేడు మళ్ళీ ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో ఎప్పటిలాగానే ఆసుపత్రులకు, ఇతర పనుల నిమిత్తం భయటకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లా డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల మన్ననలు పొందిన పోలీసులు నేడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు కఠినతరం చేయడంతో ఆసుపత్రులకు వైద్యం నిమిత్తం వెళ్ళేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. బుధవారం ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్లలో ఒకే మార్గం ద్వారా ప్రజలు రాకపోకలు సాగించే సమయంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గురువారం పోలీసులు నిబంధనలకు కఠినతరం చేశారు. భీమవరం వన్ టౌన్ ప్రాంతం నుంచి టూటౌను వెళ్ళాలంటే ప్రకాశంచౌక్ - అంబేద్కర్ సెంటర్ల మధ్య ఉన్న యనమదుర్రు డ్రెయిన్ వంతెనపై నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే లాక్ డౌన్ నేపధ్యంలో ఒక వంతెన నుంచే ప్రజలను వదులుతున్నారు. వటౌన్ నుంచి ఆసుషత్రులకు వెళ్ళాలంటే టూటౌన్ కు వెళ్ళాల్సిందే. ప్రస్తుత పోలీస్ ఆంక్షల నేపధ్యంలో వంతెసనై రాకపోకలకు అభ్యంతరాలు తెలిపారు. కొన్ని విభాగాలకు చెందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వారితో పాటు పలు వాహనాలను అనుమతిస్తున్నారు. గురువారం ఆసుపత్రులకు వెళ్లే వారిని అటుగా అనుమతించకపోవడం వల్ల వారు 10 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది. వన్ నుంచి టూటౌనకు సర్పయ్య అగ్రహారం, బైపాన్‌రోడ్డు, ఉండి రోడ్డు రైల్వేగేటు మీదుగా టూటౌన్ చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. భీమవరం వటౌన్ ఎస్పై వెంకటేశ్వరరావు అతిగా ప్రవర్తించారని, దీంతో ఆసుషత్రులకు వెళ్ళే చిన్నారులను 10 కిలోమీటర్లు ఎండలో తిప్పి తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భీమవరం ప్రస్తుతం ంగా ఉందని, అందువల్లే ఈ ఆంక్షలు అని అధికారుల చెబుతున్నారు. చాలా చోట్ల నడలింపులు చేస్తున్నారని, దుకాణాలను కూడా తెరుస్తున్నారని, అయితే భీమవరంలో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తణుకు వంటి ప్రాంతాల్లో దుకాణాలను తెరుచుకునే అనుమతి ఇచ్చారని, జాగ్రత్తలు పాటించి వ్యాపారాలను నడుపుకునే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. భీమవరంలో కరోనా పాజిటివ్ వచ్చిన కొంతమంది ఏలూరులో క్వారంటైన్లో ఉన్నారని, వారికి నెగిటివ్ వచ్చి ఇక్కడకు తిరిగి వచ్చే వరకు రెజోన్ ని ఆరెంజ్ గా ప్రకటించే అవకాశాలు లేవని చెబుతున్నారు. అయితే క్వారంటైన్లో ఉన్న వారికి 14 రోజులు పూర్తయ్యిందని, వారికి పరీక్షలు నిర్వహించి వెంటనే పంపించే ఏర్పాటు చేయాలని భీమవరం ప్రజలు కోరుతున్నారు. నాల్గొవ దశ లా డౌన్లో సడలింపులు ఇచ్చే సమయంలో పోలీసులు ఈ విధంగా కఠినంగా వ్యవహరించడం దారుణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు ఆర్ధికంగా ఎంతో నష్టపోయారని, ఎంతో ఓపికతో ఉన్నారని, ఈ సమయంలో వారిని ఇంకా ఇబ్బందులకు గురిచేయడం దారుణమని చెబుతున్నారు. భీమవరంలో ఉన్న రెండు రెడ్ జోన్లలో ప్రజలు పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. ఎన్ని రోజులు ఇంకా రెజోన్లోనే మగ్గాలని, కోలుకున్న వారిని త్వరగా రప్పించి, తమకు విముక్తి కలిగించాలని కోరుతున్నారు. భీమవరంలో గురువారం కఠినతరం కఠినతరం చేయడంతో ద్వారా గురువారం అంబేద్కర్


జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గొల్ల బాబురావు





జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గొల్ల బాబురావు

 

ఎస్.రాయవరం,  పెన్ పవర్.

సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టులకు తనవంతు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. గురువారం ఉదయం అడ్డ రోడ్ లోని ఫంక్షన్ హాల్ లో నియోజక వర్గ విలేకరులతో సమావేశమైన ఆయన జర్నలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాసంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు వినూత్నమైన రీతిలో ప్రవేశపెట్టారని, అందులో జర్నలిస్టులను భాగస్వాములు చేస్తామన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపునకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.జూన్ 8న పట్టాలు ఇవ్వడంతోపాటు లబ్ధిదారులు ఇచ్చే రెండు సెంట్లు కంటే అదనంగా మరొక సెంటు ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుంటానని స్పష్టమైన హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తన వద్దకు సమయంలో నేను వచ్చి చెప్పవచ్చునని సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని తెలిపారు. హెట్రో సౌజన్యంతో నిత్యావసర సరుకులను జర్నలిస్టులకు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు వీసం రామకృష్ణ , మధువర్మ రాజు రెండు సంఘాలు జర్నలిస్టులు పాల్గొన్నారు.


 

 



 

వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తాం


 


వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తాం

-- జిల్లా ఎస్పి బాబు జీ

 

అనకాపల్లి,పెన్ పవర్

 

 వలస కార్మికులను త్వరలోనే వారి వారి స్వస్థాలలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ పేర్కొన్నారు. అనకాపల్లి దిశా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. దిశ సిబ్బంది , అధికారులు పనితీరుపై జగన్ అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే జార్ఖండ్, భీహార్ రాష్ట్రలకు చెందిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించామని తెలిపారు. ఒరిస్సా వలస కూలీలను కూడా త్వరలోనే వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్ డౌన్ ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు అనుగుణంగానే ప్రజలు నడుచుకోవాలని సూచించారు. పోలీసులకు సహకరించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే జిల్లా మొత్తంలో  లాక్ డౌన్ ఉల్లంఘిన  కింద 7000 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 74000 మోటార్ వాహనాల కేసులు, రూ.3.3కోట్లు ఎమ్ వి కేసుల అపరాధ రుసుము వసూలు చేసినట్లు వెల్లడించారు. మావోయిస్టుల కధలికలపై ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం గా ఉందన్నారు. లాక్ డౌన్లో మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజనులకు సంతలు లేకపోవడంతో 5000మంది గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసామనారు. పోలీసుల పనితీరును అభినందించారు.

జూలై 1 నుంచి కూత పెట్టనున్న  కొత్త అంబులెన్స్ లు.


 


జూలై 1 నుంచి కూత పెట్టనున్న  కొత్త అంబులెన్స్ లు.

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్) 


 


జూలై 1 నుంచి కొత్త 108 అంబులెన్సులు కూత పెట్టను న్నాయి. ఆధునిక సౌకర్యాలతో  ఒకే రకమైన వాహనాలు కుయ్  కుయ్ మంటు  గ్రామాల్లో సందడి చేయనున్నాయి.  ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో  రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా  10 60 వాహనాలను  సిద్ధం చేసింది. ఈ 108 వాహనాలను జూలై  నెలనుంచి  ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.  వైయస్ రాజశేఖర్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పుడు  ప్రజలు ఆనారోగ్యానికి గురైతే  రవాణా సౌకర్యం కల్పించాలని  108  వాహనాలను  ఏర్పాటు చేశారు. తర్వాత  చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత  108 వాహనాల నిర్వహణపై నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో   వాహనాలు మూలకు చేరుకున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలిస్తున్న వాహనాలు  మొరాయించడం సర్వసాధారణమైపోయింది. ఉద్యోగులకు సైతం   వేతనాలు అందని దుస్థితి. ఈ పరిస్థితుల్లో   సీఎం జగన్  ప్రతిష్ఠాత్మకమైన  నిర్ణయం తీసుకొని  రాష్ట్ర వ్యాప్తంగా  ఆధునిక హంగులతో  నూతన వాహనాలను  ఆసుపత్రులకు  అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా  10 60 వాహనాలను సిద్ధం చేసి ఉంచారు. లాక్ డోన్ అనంతరం  ఈ అంబులెన్స్లను  ఆస్పత్రులకు  కేటాయించనున్నారు. ఒకే రోజు ఈ వాహనాలు  ప్రారంభించాలని  ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వాహనాలు  రానున్నాయని  తెలియడంతో  సిబ్బందిలో ఆనందం వెల్లివిరుస్తుంది.


 

 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...