Followers
గ్యాస్ లీక్ బాదిత కుటుంబాలని పరామర్శించిన మంత్రులు..
కోర్కెలు తీర్చాలటు ప్లకార్డులు ప్రదర్శన..
లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ కేసు నమోదు
వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ
వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ
మునగపాక, పెన్ పవర్
పూజలు చేసే చేతులు కన్నా సాయం చేసే చేతులు మిన్న
పూజలు చేసే చేతులు కన్నా సాయం చేసే చేతులు మిన్న
ఎంవీపీ కాలనీ, పెన్ పవర్
సహాయమే సంస్కారం అనే స్ఫూర్తితో విశాఖపట్నం పోర్ట్ డాక్ ఎంప్లాయిస్ అండ్ సెక్టార్ సిక్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పారిశుధ్య కార్మికులకు, వాలంటరీ లకు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రెటరీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రాణభయంతో వణికిస్తూ, ప్రాణాలను హరిస్తూ, తిండి, నిద్ర తీరిక లేకుండా భయభ్రాంతులను గురి చేస్తున్న మహమ్మారి కరోనా తో ప్రపంచం తలకిందులైన తరుణంలో.. సంఘంలో చాలామంది మేముసైతం అంటూ.. భయపడకండి మేమున్నామని స్టే హోం.. స్టే సేఫ్ అంటూ వైద్యులు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, రాత్రింబవళ్లు చేసే సేవ అనితర సాధ్యం... ఆ కోవలోనే ఎంవీపీ లో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ఇప్పటివరకు కాలనీలో అనేక సేవా కార్యక్రమములు చేయడం జరిగిందని కాలనీలో అందరికీ కరోన వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి ఎలా తీసుకోవాలి, అలాగే సామాజిక దూరం పాటించడం పై కాలనీవాసులు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి మాస్క్ లను పంపిణీ చేయటం జరిగింది. దగ్గరే ఉన్న క్యాన్సర్ హాస్పటల్ కు వచ్చు రోగులకు భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఎంవిపి యంగ్ స్టార్ యూత్ వారు కూడా పేదలకు సహాయం చేస్తున్న తరుణంలో వారిని గుర్తించి తమ అసోసియేషన్ తరపున 16 వేల రూపాయల వస్తు సామాగ్రిని, భోజన సామాగ్రిని అందించడం జరిగిందని, తాము కూడా పేదలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగిందని, ఈ సేవా కార్యక్రమంలో తమ సంఘ సభ్యులు చేదోడువాదోడుగా తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరిగిందని, కాలనీలో ఏ సహాయం కావాలన్నా తాము ముందుంటామని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ పరశురాం, కే రాము, బి. లక్ష్మణరావు, పి. అప్పలరాజు, ఎల్. సత్యం, ఎల్ ప్రభాకర్, వి ధనరాజు, ఆర్ కేశవ, కే సత్తి రాజు, వి వి వి ప్రసాద్ లు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాను తాకిన కరోనా
విజయనగరం జిల్లాను తాకిన కరోనా
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విజయనగరం
పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం, చిలకపల్లికి చెందిన మహిళకు కోవిడ్ 19 పాజిటివ్
విశాఖలో రెండు నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్న మహిళ
కుమారుడి ద్వారా తల్లికి సంక్రమించిన వ్యాధి
శ్రీకాకుళం- విజయనగరం జిల్లాల్లో వ్యాపారం నిమిత్తం ప్రయాణించిన ఆమె కుమారుడు
ప్రత్యక్ష కాంటాక్ట్ కలిగిన పదకొండు మంది కుటుంబ సభ్యులు, స్థానికులను విజయనగరం క్వారెంటైన్ ఆస్పత్రికి తరలింపు
*గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలం, ఒంపల్లి గ్రామానికి విజయవాడ నుండి వచ్చిన వ్యక్తికి ట్రూనాట్ టెస్ట్ లో కరోనా పాజిటివ్..మరోసారి పరీక్షల కోసం శాంపిల్స్ పంపిన అధికారులు.
దేశానికే రోల్‌మోడల్‌గా కరీంనగర్
దేశానికే రోల్‌మోడల్‌గా కరీంనగర్
హైదరాబాద్, పెన్ పవర్ ప్రతినిధి దాసు.
కరోనా వైరస్ కట్టడిలో కరీంనగర్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ.. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చాలా కఠినంగా ఒక పకడ్బందిగా వ్యూహంతో వ్యవహరించిందన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహారణ కరీంనగర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలో ఎవరికీ కూడా కంటైన్మెంట్ అనే పదం తెలియనప్పుడు తెలంగాణ అప్రమత్తమైంది. దేశంలో ఫస్ట్ కంటైన్మెంట్ జోన్ కరీంనగర్ అన్నారు. ఇండోనేషియా నుంచి 11 మంది రావడం వారికి పాజిటివ్ రావడంతో మేలుకుని ఢిల్లీ ప్రభుత్వాన్నికి తెలిపి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, స్థానిక మంత్రి గంగుల కమలాకర్‌కు అహోరాత్రులు శ్రమించి ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా కరోనాను కట్టడి చేశారన్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి అభినందనలు తెలుపుతున్నట్లు సీఎం అన్నారు. కరీంనగర్ నుంచి మనం దేశానికి రోల్‌మోడల్ అయ్యామన్నారు. దీని నుంచి ఏ విధంగా పకడ్భందిగా వ్యవహరించాలో కేరళ రాష్ట్రం సైతం స్ఫూర్తిని తీసుకుందన్నారు..
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...