అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసరాలు, బట్టలు, చీరలు,దుప్పట్లు పంపిణీ:
జగ్గంపేట, పెన్ పవర్
బాధితులను అన్నీ రకాలుగా ఆదుకుంటామని హామీ
జగ్గంపేట మండలం, నరేంద్ర పట్నం గ్రామంలో రెండు పెద్ద తాటాకుల ఇల్లు నిప్పు అంటుకుని కాలిపోవడంతో మూడు కుటుంబాలకు చెందిన చిత్తార పు యేసయ్య ,చిత్తాలపు నాగరాజు, చిత్తారపు నాగయ్య , కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు, వారిని బుర్రి చక్రబాబు అద్వర్యంలో రాష్ట్ర వై ఎస్ ఆర్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి, అమలాపురం పార్లమెంటు జిల్లా బూత్ కమిటీల ఇంచార్జ్ ఒమ్మి రఘురామ్ జగ్గంపేట మండల నాయకులు అత్తులూరి నాగబాబు గారు, బండారు రాజా గారు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి నిత్యావసరాలు, బట్టలు, చీరలు, పంచులు దుప్పట్లు తుమాల్లు, బియ్యం పంపిణీ చేశారు. బాదితులు సర్వస్వం కోల్పోయామని తమ గోడు వెలబుచ్చారు,దానికి రఘురామ్, నాగబాబు స్పందించి బాధితులకు మేము అందించిన సహాయం తాత్కాలిక ఉపసమనమని, వారిని ప్రభుత్వ పరంగా ముగ్గురు కుటుంబాలకు రావలసినవి ఆర్థిక సహాయం ఒకటి రెండు రోజులలోనే బ్యాంకు ఖాతాలలో జమ చేయిస్తామని, మూడు కుటుంబాలకు పక్కా గృహాలు శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ద్వారా నిర్మించే బాధ్యత మేము తీసుకుంటామని ఏ విధంగాను అదైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. పరామర్శలో బుర్రి రవి, నరేంద్రపట్నం గ్రామ నాయకులు,జగ్గంపేట ఎంపీటీసీ అభ్యర్థి చేకూరి మృత్యుంజయరాజు తదితరులు పాల్గొన్నారు.