Followers

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ ఆకలి కేకలు

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ ఆకలి కేకలు......

 

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

రాష్ట్ర వ్యాప్తంగా 3729 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ , ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం వీరి సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేది. గడిచిన సంవత్సరం నుండే 10 రోజుల వ్యవధి తో 12 నెలలకు జీతాలు వొచ్చెల ఇప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జీవితంలో ఆనందం వెరిసింది.  దీని ప్రకారం ఈ సంవత్సరం ఏప్రియల్ 1 తేదీ నుండి వీరి సేవలు పునారుర్దింపబ డాలి. కానీ దీని నిమిత్తం ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.  జీతాలు లేక కుటుంబ పోషణ కు ఒప్పంద గురువులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పంద అధ్యాపక సంగం పిలుపు మేరకు ప్రస్తుత సమస్యలు తెలిపేందుకు విద్యాశాఖ మంత్రి శ్రీ. ఆదిములపు సురేష్ మెయిల్ కు ప్రతీ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆర్జీ ని ఈ రోజు పంపారు.మరి కొంత మంది 1902కి ఫోన్ చేసి సమస్య వివరించారు. ఇందులో నాన్ సంక్షన్ లో పని చేసే అధ్యాపకులకు దాదాపుగా 8నెలల నుండి జీతాలు లేదు. వీరి సమస్యలు తొందరగా పరీక్షించాలని ప్రభుత్వాన్ని,  ప్రభుత్వ ఒప్పంద అధ్యాపకుల సంగం వినయ పూర్వకం గా కోరుతున్నది. కరోనా నేపధ్యం లో పరిస్తితి ని అర్దం చేసుకొని ఒప్పంద అధ్యాపకుల ఆకలి తీర్చమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మండలంలో  ప్రారంభమైన ఉపాధి హామీ పథకం





మండలంలో  ప్రారంభమైన ఉపాధి హామీ పథకం

 

కిర్లంపూడి, పెన్ పవర్

 

కిర్లంపూడి    గోనేడ నుండి రామవరం  వెళ్లే రహదారిలో  పంట కాలువలో ఉపాధిహామీ పనులు మొదలు పెట్టారు

కరోన లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇ ళ్లకు పరిమితమైన దినసరి కూలీలకు లాక్ డౌన్ సడలింపులో భాగంగామళ్ళీ ఉపాధిహామీ పనులు మొదలు అయ్యాయి.మాస్క్ లు ధరింపజేసి సామాజిక దూరం పాటింపజేస్తూ పనులు చేయిస్తున్నామని, శాని టైజర్,తో పాటు త్రాగునీరు  కూడా అందుబాటు లో  ఉంచామని సుమారు 80 మంది ఉపాధి కూలీలు రోజుకు పని చేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్  కర్రి శ్రీను తెలిపారు ఉదయం 6.30 నుండి 10.30 వరకు రోజు పని జరుగుతుందని అన్నారు


 

 



 

జర్నలిస్టుల సంక్షేమం గురించి పట్టించుకోండి


జర్నలిస్టుల సంక్షేమం గురించి పట్టించుకోండి

 

 

 జగ్గంపేట, పెన్ పవర్ 

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం పట్టించుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్ అన్నారు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ది లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించి ఇప్పుడిప్పుడే సడలింపు లతో రోడ్ ఎక్కుతున్నారు అయినప్పటికీ కరోనా వ్యాప్తి ఆగలేదు రికార్డులు బద్దలు కొట్టి మరి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ప్రపంచం నలుమూలల ఏమి జరుగుతుందో ప్రజలు టీవీ పేపర్లో ద్వారా తెలుసుకుంటారు టీవీల దగ్గర కూర్చుని మరీ తెలుసుకుంటారు పత్రికలు చదువుకుంటూ పరిస్థితులను విశ్లేషించుకుంటూన్నారు కరోనా కోసం కష్టపడి పని చేసేటటువంటి అధికారులకు ప్రభుత్వం నుండి వేతనాలు అందుతున్నాయి తగిన గుర్తింపు ప్రజల నుండి ప్రశంసలు వస్తున్నాయి వారి అందరితో పాటు ఈ కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ లో నిలబడి సమాచార సేకరణసేచి దేశప్రజలకు అందించే దేశవ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు తీవ్ర నష్టం వాటిల్లింది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ప్రకటించిన లెక్కల ప్రకారం ఇప్పటికే 4వేల 500 కోట్లు మేరకు ప్రకటన రూపంలో దినపత్రికలు ఆదాయం కోల్పోయిన ఈ కరోనా సంక్షోభం నుండి దేశం పూర్తిస్థాయిలో బయటపడే టప్పటికి  పదిహేను వేల కోట్ల మేరకు నష్టాలు ఉంటాయి ఈ లెక్కన 15వేల పత్రికల నష్టం చూస్తే దాదా పు 40 వేల కోట్ల పై మాటే దేశవ్యాప్తంగా మీడియాలో ప్రత్యక్షంగా మూడు లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఉన్నాయి పెద్ద పత్రికలు ఇప్పుడే వేల సంఖ్యలో సబ్ ఎడిటర్లు రిపోర్టర్లు డిజైనర్లు అడ్వటైజ్మెంట్ డిపార్ట్మెంట్ సిబ్బందిని తొలగిస్తున్నాయి మరికొంత మంది సిబ్బంది తో నడుస్తున్న పత్రికలు వేలాదిగా ఉన్నాయి చిన్న పత్రికల విషయానికొస్తే 10 నుండి 20 మంది సిబ్బందితో నడుస్తున్న పత్రికలు వేలాదిగా ఉన్నాయి ఇవన్నీ దాదాపుగా కరోనా వాగ్దానం మొదలైనప్పటి నుండి ప్రింటింగ్ నిలిపివేసి కేవలం పి.డి.ఎఫ్ కాపీ ని వాట్సాప్ గ్రూపు లో  పెట్టడానికి పరిమితమయ్యాయి పలు చిన్న పత్రికలు డిజైనర్లు సిబ్బందికి జీతాలు లేక పి.డి.ఎఫ్ కాపీ కూడా నిలిపివేస్తున్నారు యాజమాన్యాల ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులు సంక్షేమానికి వారు చర్యలు తీసుకోవడం లేదని గగ్గోలు పెట్టలేని పరిస్థీతిలో జర్నలిస్టు ఉన్నారు ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలు ఏమైనా కనికరిస్తాయా అని జర్నలిస్టులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ఈ కష్టకాలంలో జర్నలిస్టులకు నెలకు 10,వేలు ఆర్థిక సహాయం అందించాలి హర్యానా ప్రభుత్వం పది లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటిస్తే తమిళనాడు ప్రభుత్వం మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం చేసింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సమస్యల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు జర్నలిస్టులకు ఎక్కడ ఏమి ఒరిగిందేమీ లేదు అక్కడ అక్కడ ఒక బియ్యం మూట కూరగాయలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసి జర్నలిస్టులను అవమానిస్తున్నారు ప్రభుత్వ గౌరవప్రదంగా ఆదుకునేది లేదు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకం గడువు ముగిసి నెలరోజులు పైబడింది కరోనా కష్టకాలంలో జర్నలిస్టులు ప్రీమియం చెల్లించాలి జర్నలిస్టులను కర్వేపాకు మాదిరిగా తీసిపారేస్తున్నాయి  ప్రభుత్వాలు తెల్లారిలేస్తే ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు ప్రసారం కావాలి ఆ ప్రచారం చేసే జర్నలిస్టులకు మాత్రం భద్రత ఉండదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు 10 వేలు ఆర్థిక సహాయం అందించాలని పులి ప్రసాద్ అన్నారు .

ఆశీలు పేరుతో నిలువు దోపిడీ..


ఆశీలు పేరుతో నిలువు దోపిడీ..

 

లీలాకృష్ణ జోక్యంతో అడ్డుకట్టు..

 

మండపేట, పెన్ పవర్ : 

 

మండపేట పట్టణంలో ఆశీల పేరుతో ఆశీలు వసూలు చేసే దళారీలు వర్తకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మండపేట పట్టణంలో రోజు వారీ తోపుడు బండ్లు, సంచార  వర్తకులు వివిధ ప్రాంతాల నుండి మండపేట పట్టణానికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. పురపాలక సంఘం ఆశీల పాట దారుడు వీరి వద్ద నుండి కేవలం పది రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అయితే లాక్‌డౌన్‌ ను అదునుగా చూసుకొని 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. మామిడి కాయల సీజన్ కావడంతో మామిడికాయల వ్యాపారుల నుండి వినియోగదారులు పచ్చడి కోసం మామిడి కాయలు కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న మహిళల వద్దకు వెళ్లి మామిడి కాయలను పచ్చడి బద్దలుగా తరిగించు కోవడం జరుగుతుంది. దళారీల ముసుగులో ఉన్న ఆశీలదారులు మామిడికాయల వర్తకులను, పచ్చడి బద్దలు కోసే మహిళల వద్ద నుండి కూడా చెరొక 30 రూపాయలు వసూలు చేయడంతో మామిడి కాయల వ్యాపారాలు గగ్గోలు పెడుతూ ఈ విషయాన్ని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వేగుళ్ల లీలా కృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై గురువారం ఉదయం వేగుళ్ల లీలా కృష్ణ మార్కెట్ కు చేరుకుని వర్తకులను అడిగి ఆశీల దోపిడి విధానాన్ని తెలుసుకున్నారు.  వెంటనే ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్  దృష్టికి తీసుకురాగా ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్  ప్రభాకర్ ను విచారణకు ఆదేశించారు. ఆర్ ఐ ప్రభాకర్ చౌదరి మామిడికాయల వర్తకులతో మాట్లాడుతూ పది రూపాయలకు మించి వసూలు చేయరాదన్నారు. రసీదు లేకుండా అధిక వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయమన్నారు. ఆపై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆశీలకు  తగిన రసీదులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట  జన సేన నాయకులు శెట్టి రవికుమార్, గోళ్ళ శ్రీనివాస్ ,  కోనాల చంద్ర బోస్, బొమ్మన సతీష్ కుమార్ తదితరులున్నారు.

వెల్లువెత్తిన శుభాకాంక్షలు


వెల్లువెత్తిన శుభాకాంక్షలు

 

కాకినాడ, పెన్ పవర్

 

 

శాసన మండలి ప్రతిపక్షనేత, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ను మండపేట  ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కాకినాడ లోని ఆయన స్వగృహం లో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. తుని నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ యనమల కృష్ణుడు , జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మండల మాజీ ఎంపిపి అడబాల బాబ్జి , జిల్లా ఆత్మకమిటి డైరెక్టర్ పిల్లా వీరవెంకట్రాజు  తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.


మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది


మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది

 

మండపేట, పెన్ పవర్

 

 

మండపేట రామచంద్రపురం నియోజకవర్గం ఇతరమండలాలనుండి వలస కూలీలు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామంలో బట్టీ పని చేయడానికి అనేక కుటుంబాలు వలస వెళ్లాయి అయితే లాక్ డౌన్ తో గత నలభై రోజులుగా అక్కడ చిక్కుకుపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యంతో మండపేట ఏడిద రోడ్ లో ఉన్న విజయ ఫంక్షన్ హాల్ 157 మంది బాధితులు వచ్చారు భారతీయజనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు  కన్నా పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు వేమా ఆదేశాలతో అమలాపురం పార్లమెంటు క్వారంటైన్ విజిటర్స్ టీమ్ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్ కోనసత్యనారాయణ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వీరందరికీ బుధవారం రక్త పరీక్షలు తీసుకున్నారని అలాగే తమకు ఇక్కడ వసతి సదుపాయాలు బాగానే ఉన్నాయని బాధితులు తెలిపారు మీరందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించాలని ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాతానని వారికి హామీ ఇచ్చారు. అలాగే రాయవరం మండలం రాయవరం గ్రామంలో హై స్కూల్ వద్ద 72 మందిని త్రిపురాంతకం గ్రామంనుండి  రామచంద్రపురం , కే గంగవరం అనపర్తి కపిలేశ్వరపురం రాయవరం బిక్కవోలు తాళ్ళరేవు మండలాల కుటుంబాలు ఈ రెండు చోట్ల ఉన్నారని వీర్ని యోగ క్షేమాలు తెలుసుకున్నారు ఆయన వెంట మండపేట అద్యక్షులు మద్దుల సుబ్బారావు, రాయవరం మండల అధ్యక్షులు చింతా అమ్మిరెడ్డి నాగిరెడ్డి త్రిమూర్తులు పాల్గొన్నారు


క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యమైన భోజన సదుపాయాలు


క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యమైన భోజన సదుపాయాలు


- చేతులు కడిగే అలవాటును ప్రోత్సహించాలి


 కేంద్రాల నిర్వహణపై అప్రమత్తంగా వుండాలి


-ఒక కేంద్రంలో వుండే వారందరికీ ఒకేసారి పరీక్షలు జరపాలి


 జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్


విజయనగరం,


: జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారికి నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. ప్రతి కేంద్రం లోను పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యెక శ్రద్ధ చూపాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ మాస్క్ లు అందజేయడం తో పాటు ప్రతి ఒక్కరు కేంద్రాల్లో వుండే సమయంలో భౌతికదూరం పాటిస్తూ సంచరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేసారు. ఈ కేంద్రాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారిని పలు తరగతులుగా వర్గీకరించి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు పరీక్షలు చేపట్టాలన్నారు. గ్రీన్ జోన్ నుండి వచ్చే వారిని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి వీరికి క్వారంటైన్ కేంద్రంలో చేరిన వెంటనే పరీక్షలు జరిపి నెగటివ్ గా నిర్ధారణ జరిగాక హోం క్వారంటైన్ కు పంపించవచ్చని పేర్కొన్నారు. ఆరంజ్, రెడ్ జోన్ ల నుండి వచ్చే వారిని కొద్ది రోజులపాటు కేంద్రంలో ఉంచిన తర్వాత వారికి పరీక్షలు జరిపి ఇంటికి పంపించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిని కుడా ఆయా రాష్ట్రంలో కరోనా కేసుల ఆధారంగా కేంద్రంలో కొన్ని రోజుల పాటు ఉంచిన తర్వాత పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎక్కువ రోజులుగా కేంద్రాల్లో ఉంటున్న వారికి తొలుత పరీక్షలు జరిపి వారిని పంపించాలని చెప్పారు. ఒక కేంద్రంలో వుండే వలస కులీలందరికీ ఒకేసారి పరీక్షలు జరపాలని చెప్పారు. ఆయా మండలాల వైద్యాధికారులు, ప్రొగ్రమ్ అధికారులు ఆయా కేంద్రాల్లో తహసీల్దార్లతో చర్చించి టెస్ట్ లు జరపాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు నోడల్ అధికారులుగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు, ఎస్.సి.కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ జి.జగన్నాధంలను నియమించామన్నారు.


 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...