నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు
కార్మిక చట్టాల మార్పుపై నిరసన
పెనవర్, భీమవరం:
కరోనా, లా డౌన్లలో ఉద్యోగులు, కార్మికులు అవస్థలు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం, పనిగంటలను పెంచడం వంటి విధానాలతో సందిట్లో సడేమియా అంటూ ప్రజలపై విరుచుకు పడుతున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం స్థానిక మావుళ్ళమ్మ గుడి రోడ్డులో భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కాలానికి వేతనాలు ఇవ్వడానికి, కనీస వేతనాల అమలుకు, మనస్సులేని పాలకులు దొడ్డి దారిన కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నారని అన్నారు. లా డౌన్లో ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందిస్తున్న ఆశ, అంగన్వాడి, గ్రామ వాలంటీర్, మున్సిపల్ కార్మికులకు అదనంగా చేసేందేమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు బి.వాసుదేవరావు మాట్లాడుతూ ప్రాణాంతక కరోనాతో పోరాడుతూనే ఉద్యోగ కార్మికులు తమ సేవలను అందిస్తున్నారని, వారికి మెడికల్ టెస్టు కాని, మాలు, గెజిట్లు గాని, ఇతర ప్రభుత్వం ప్రకటించిన బీమా సదుపాయం వంటి సౌకర్యాలను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.ఆంజనేయులు, కరణం సూరిబాబు, డేగల నాగు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, శిరీష్ కుమార్, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.