Followers

జూలై 1 నుంచి కూత పెట్టనున్న  కొత్త అంబులెన్స్ లు.


 


జూలై 1 నుంచి కూత పెట్టనున్న  కొత్త అంబులెన్స్ లు.

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్) 


 


జూలై 1 నుంచి కొత్త 108 అంబులెన్సులు కూత పెట్టను న్నాయి. ఆధునిక సౌకర్యాలతో  ఒకే రకమైన వాహనాలు కుయ్  కుయ్ మంటు  గ్రామాల్లో సందడి చేయనున్నాయి.  ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో  రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా  10 60 వాహనాలను  సిద్ధం చేసింది. ఈ 108 వాహనాలను జూలై  నెలనుంచి  ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.  వైయస్ రాజశేఖర్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పుడు  ప్రజలు ఆనారోగ్యానికి గురైతే  రవాణా సౌకర్యం కల్పించాలని  108  వాహనాలను  ఏర్పాటు చేశారు. తర్వాత  చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత  108 వాహనాల నిర్వహణపై నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో   వాహనాలు మూలకు చేరుకున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలిస్తున్న వాహనాలు  మొరాయించడం సర్వసాధారణమైపోయింది. ఉద్యోగులకు సైతం   వేతనాలు అందని దుస్థితి. ఈ పరిస్థితుల్లో   సీఎం జగన్  ప్రతిష్ఠాత్మకమైన  నిర్ణయం తీసుకొని  రాష్ట్ర వ్యాప్తంగా  ఆధునిక హంగులతో  నూతన వాహనాలను  ఆసుపత్రులకు  అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా  10 60 వాహనాలను సిద్ధం చేసి ఉంచారు. లాక్ డోన్ అనంతరం  ఈ అంబులెన్స్లను  ఆస్పత్రులకు  కేటాయించనున్నారు. ఒకే రోజు ఈ వాహనాలు  ప్రారంభించాలని  ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వాహనాలు  రానున్నాయని  తెలియడంతో  సిబ్బందిలో ఆనందం వెల్లివిరుస్తుంది.


 

 

గ్యాస్ లీక్ బాదిత కుటుంబాలని పరామర్శించిన మంత్రులు..


గ్యాస్ లీక్ బాదిత కుటుంబాలని పరామర్శించిన మంత్రులు..

 

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

ఎల్జీ పాలిమర్స్  గ్యాస్ లీక్ అయిన ఘటనలో అస్వస్థతకు గురైన కుటుంబాలను  రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్యెల్లే తిప్పలు నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు అదీప్ రాజ్ పరామర్శించారు. గోపాలపట్నం  ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వద్ద రసాయన లీక్ బాధితులకు  చెక్కులను అందించగా.. పెందుర్తి లో ప్రభుత్వ ఆస్పత్రిలో  43 మందికి చెక్కులను అందించారు.  అనంతరం  రాజ్యాసభ సభ్యులు విజయసాయి రెడ్డి , రాష్ట్ర పర్యాటక శాఖ  మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర చలన చిత్ర టివి ఇండస్ట్రీ , అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారికి స్థానిక  ఎమ్యెల్లే  అదీప్ రాజ్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ అధ్యక్షుడు సరగడం చిన్నప్పల నాయుడు, వైఎస్ఆర్సిపి నాయకులు ఆది రెడ్డి మురళి పాల్గొన్నారు.

 కోర్కెలు తీర్చాలటు ప్లకార్డులు ప్రదర్శన..






 కార్మికుల కోర్కెల దినోత్సవం సందర్భంగా

 కోర్కెలు తీర్చాలటు ప్లకార్డులు ప్రదర్శన..

 

సి ఐ టి యు ,కార్మిక సంఘాల నాయకులు..

 

 

పోలవరం : పెన్ పవర్

 

 

సిఐటియు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికుల కోరికల దినోత్సవాన్ని పురష్కరించుకొని గురువారం పోలవరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ, ఆశ వర్కర్లు , పంచాయతీ కార్మికులు అందరూ కలిసి తమ కోరికలు నెరవేర్చాలని కోరుతూ  ప్లకార్డుల తో కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా సి ఐ టి యు ఏపీ ల్యాండ్  జిల్లా కమిటీ సభ్యులు గుడెల్లి వెంకట్రావు, సిఐటియు పోలవరం మండల కార్యదర్శి అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు పి ఎల్ ఎస్ కుమారి లు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కరోనా విజృంభించిన వేళ పంచాయతీ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది అత్యవసర సేవలు చేస్తూ కరోనా నియంత్రణకు ఎంతో కృషి చేస్తున్నారని కానీ ప్రభుత్వపరంగా కరోనా నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న  ఉద్యోగులకు ఇవ్వాల్సిన రక్షణ పరికరాలు ఇవ్వడంలేదని విమర్శించారు. పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు 10,500 రూపాయలు ఇవ్వాలని కోరుతూ జీవోలు ఉన్నప్పటికీ  వాటిని అమలు చేయడం లేదని, ఆశ, అంగనవాడి, మిడ్ డే మీల్స్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేసి కనీస వేతనం 21 వెయ్యి రూపాయలు ఇవ్వాలని ,కరోనా వ్యాధి నివారణ చర్యల్లో విధులు నిర్వహిస్తుండగా కరోనా వ్యాధి సోకి చనిపోయిన కార్మికులకు ,ఉద్యోగులకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, కరోనా వైరస్ నిర్ములన విధుల్లో ఉన్న పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్స్ తదితరుల  అందరికీ ప్రత్యేక అలవెన్సులు గా నెలకు పాతిక వేల రూపాయలు ఇవ్వాలని, కరోనా నియంత్రణ విధులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదిస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ పది గంటలు పెంచాలని చూస్తుందని అన్నారు. 10 గంటలు పని వద్దు ఎనిమిది గంటల పని ముద్దు  అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, పోలవరం మండలం పంచాయతీ సిబ్బంది,ఆశా వర్కర్లు,అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..


 

 


 



 

లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ కేసు నమోదు 


పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ కేసు నమోదు 

 

 

నిడదవోలు, పెన్ పవర్

 

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ కేసు నమోదు  పెరవలి మండలం నల్ల కుల వారి పాలెం గ్రామంలో కొవ్వూరు ఆర్ . డి. ఓ  తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆకుల రఘు  రెడ్ జోన్ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తూ సదర్ ప్రాంతాల్లో విధినిర్వహణలో ఉన్న గ్రామ వాలంటీర్ లను ఆశా వర్కర్ లను ఏఎన్ఎం నర్సింగ్ వారిని మరియు పోలీస్ సిబ్బంది ని సదరు ప్రాంతాలలో ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ కేసుల విషయాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు సదరు ప్రాంతంలో ఉన్న ప్రజలను బయటకు వెళ్ళకుండా బయట వారిని రెడ్ జోన్ ప్రాంతాలలో సంచరించకుండా కట్టుదిట్టమైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు లాక్ డౌన్ నిబంధనలను సడలించిన దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్ డి ఓ  తాడేపల్లిగూడెం టౌన్ సిఐ ఆకుల రఘు  సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 69కరోనా పాజిటివ్ కేసులకు గాను 


40కేసులు డిశ్చార్జ్ అవ్వగా 29మంది ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులలో చికిత్స పొందుతున్నారు.


 

 

వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ





వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ


మునగపాక, పెన్ పవర్


 















 



 

 




మునగపాక మండలంలో వై ఎస్ ఆర్ సి పి ఎమ్మెల్యే కన్నబాబు రాజు, మరియు కన్నబాబు రాజు తనయుడు బి. సి. డి. బ్యాంక్ జిల్లా చైర్మన్ సుకుమార్ వర్మ. సొంత నిధులతో అరబ్బు పాలెం గ్రామంలో సుమారు 650 కుటుంబాలకు ఐదేసి కేజీల చొప్పున ఐదు రకాల కూరగాయలు మండలం గడపగడపకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు కాండ్రేగుల నూకరాజు,జెట్పిటీసీ అభ్యర్థి సోంబాబు, గ్రామ వైఎస్ఆర్ నాయకులు అచ్చింనాయుడు, సర్పంచ్ అభ్యర్థి తుట్ట వెంకటప్పారావు, ఎంపీటీసీ అభ్యర్థి బొడ్డేడ బుజ్జి మాజీ ఎం పి టి సీ సరగడం శ్రీనివాస్ రావు, వైయస్సార్ సిపి పార్టీ అభిమానులు కార్యకర్తలు, వాలెంట్రీలు పాల్గొన్నారు















పూజలు చేసే చేతులు కన్నా సాయం చేసే  చేతులు మిన్న


పూజలు చేసే చేతులు కన్నా సాయం చేసే  చేతులు మిన్న


ఎంవీపీ కాలనీ, పెన్ పవర్


 


సహాయమే సంస్కారం అనే స్ఫూర్తితో విశాఖపట్నం పోర్ట్ డాక్ ఎంప్లాయిస్ అండ్ సెక్టార్ సిక్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పారిశుధ్య కార్మికులకు, వాలంటరీ లకు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రెటరీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రాణభయంతో వణికిస్తూ, ప్రాణాలను హరిస్తూ, తిండి, నిద్ర తీరిక లేకుండా భయభ్రాంతులను గురి చేస్తున్న మహమ్మారి కరోనా తో  ప్రపంచం తలకిందులైన తరుణంలో.. సంఘంలో  చాలామంది మేముసైతం అంటూ.. భయపడకండి మేమున్నామని స్టే హోం.. స్టే సేఫ్ అంటూ  వైద్యులు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, రాత్రింబవళ్లు చేసే సేవ అనితర సాధ్యం... ఆ కోవలోనే ఎంవీపీ లో  లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ఇప్పటివరకు కాలనీలో అనేక సేవా కార్యక్రమములు చేయడం జరిగిందని కాలనీలో అందరికీ కరోన వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన  జాగ్రత్తలు, అవి ఎలా తీసుకోవాలి, అలాగే సామాజిక దూరం  పాటించడం పై కాలనీవాసులు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి మాస్క్ లను పంపిణీ చేయటం జరిగింది. దగ్గరే ఉన్న క్యాన్సర్ హాస్పటల్ కు వచ్చు రోగులకు భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఎంవిపి యంగ్ స్టార్ యూత్ వారు కూడా పేదలకు సహాయం చేస్తున్న తరుణంలో వారిని గుర్తించి తమ అసోసియేషన్ తరపున 16 వేల రూపాయల వస్తు సామాగ్రిని, భోజన సామాగ్రిని అందించడం జరిగిందని, తాము కూడా పేదలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగిందని, ఈ సేవా కార్యక్రమంలో తమ సంఘ సభ్యులు చేదోడువాదోడుగా తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరిగిందని, కాలనీలో ఏ సహాయం కావాలన్నా  తాము ముందుంటామని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ పరశురాం, కే రాము, బి. లక్ష్మణరావు, పి. అప్పలరాజు, ఎల్. సత్యం, ఎల్ ప్రభాకర్, వి ధనరాజు, ఆర్ కేశవ, కే సత్తి రాజు, వి వి వి ప్రసాద్ లు పాల్గొన్నారు.


విజయనగరం జిల్లాను తాకిన కరోనా


విజయనగరం జిల్లాను తాకిన కరోనా


 


బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విజయనగరం


పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం, చిలకపల్లికి చెందిన మహిళకు కోవిడ్ 19 పాజిటివ్


విశాఖలో రెండు నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్న మహిళ


కుమారుడి ద్వారా తల్లికి సంక్రమించిన వ్యాధి


శ్రీకాకుళం- విజయనగరం జిల్లాల్లో వ్యాపారం నిమిత్తం ప్రయాణించిన ఆమె కుమారుడు


ప్రత్యక్ష కాంటాక్ట్ కలిగిన పదకొండు మంది కుటుంబ సభ్యులు, స్థానికులను విజయనగరం క్వారెంటైన్ ఆస్పత్రికి తరలింపు


*గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలం, ఒంపల్లి గ్రామానికి విజయవాడ నుండి వచ్చిన వ్యక్తికి ట్రూనాట్ టెస్ట్ లో కరోనా పాజిటివ్..మరోసారి పరీక్షల కోసం శాంపిల్స్ పంపిన అధికారులు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...