Followers

దేశానికే రోల్‌మోడల్‌గా కరీంనగర్


దేశానికే రోల్‌మోడల్‌గా కరీంనగర్


 


హైదరాబాద్, పెన్ పవర్ ప్రతినిధి దాసు‌.


 


కరోనా వైరస్‌ కట్టడిలో కరీంనగర్‌ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ.. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చాలా కఠినంగా ఒక పకడ్బందిగా వ్యూహంతో వ్యవహరించిందన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహారణ కరీంనగర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలో ఎవరికీ కూడా కంటైన్మెంట్‌ అనే పదం తెలియనప్పుడు తెలంగాణ అప్రమత్తమైంది. దేశంలో ఫస్ట్‌ కంటైన్మెంట్‌ జోన్‌ కరీంనగర్‌ అన్నారు. ఇండోనేషియా నుంచి 11 మంది రావడం వారికి పాజిటివ్‌ రావడంతో మేలుకుని ఢిల్లీ ప్రభుత్వాన్నికి తెలిపి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, స్థానిక మంత్రి గంగుల కమలాకర్‌కు అహోరాత్రులు శ్రమించి ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా కరోనాను కట్టడి చేశారన్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి అభినందనలు తెలుపుతున్నట్లు సీఎం అన్నారు. కరీంనగర్‌ నుంచి మనం దేశానికి రోల్‌మోడల్‌ అయ్యామన్నారు. దీని నుంచి ఏ విధంగా పకడ్భందిగా వ్యవహరించాలో కేరళ రాష్ట్రం సైతం స్ఫూర్తిని తీసుకుందన్నారు..


కేకే లైన్ లో విరిగిపడ్డ కొండచరియలు ముగ్గురు మృతి      


 


కేకే లైన్ లో విరిగిపడ్డ కొండచరియలు ముగ్గురు మృతి       


న్యూస్ డెస్క్/అనంతగిరి,  పెన్ పవర్.                      


కేకే లైన్ లో మంగళవారం ఉదయం  కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ముగ్గురు  రైల్వే ఉద్యోగులు మరణించారని సమాచారం.... అలాగే ఇదే ఘటనలో మరికొంతమంది కాంట్రాక్టు లేబర్ చనిపోయి ఉంటారని విశ్వసనీయ సమాచారం వివరాల్లోకి వెళితే సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండ చర్యలు విరిగి రైల్వే ట్రాక్ పై పడిపోవడం తో అనంతగిరి మండలం బొర్రా చిమిడిపల్లి సమీపంలో 31వ  టన్నలు దగ్గర కొండచరియలు విరిగిపడి విజయనగరం జిల్లా చెందిన కొత్తవలస మండలం కు చెందిన తుమకపల్లి చిన్నిపాలెం కొనమనివాణిపాలెం గ్రామాలకు చెందిన కూలీలు 50 పనిచేస్తుండగా పైనుండి మట్టి పెళ్ళాలు పడి 5గురు కూలీలు కు గాయాలు రైల్వే OHలో పిట్టర్ గా పనిచేస్తున్న జి. సురేష్ 36 సo,, లు మృతిచెందారు. మరో ఉద్యోగి బోస్ 40సo,, తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారు 1 అమ్మతల్లి50. 2 అప్పలరాజు 36. 3ఈశ్వరరావు45. 4 సత్యనారాయణ40. 5రమణ 36అనంతగిరి మండలం బొర్రా చిమిడిపల్లి సమీపంలో 32 టన్నలు దగ్గర కొండచరియలు విరిగిపడి విజయనగరం జిల్లా చెందిన కొత్తవలస మండలం కు చెందిన తుమకపల్లి చిన్నిపాలెం కొనమనివాణిపాలెం గ్రామాలకు చెందిన కూలీలు 50 పనిచేస్తుండగా పైనుండి మట్టి పెల్లలు పడి 5గురు కూలీలు కు గాయాలు రైల్వే OHలో పిట్టర్ గా పనిచేస్తున్న జి. సురేష్ 36 సo,, లు మృతిచెందారు. మరో ఉద్యోగి బోస్ 40సo,, తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారు 1 అమ్మతల్లి50. 2 అప్పలరాజు 36. 3ఈశ్వరరావు45. 4 సత్యనారాయణ40. 5రమణ 36


మానవత్వాన్ని చాటుకున్న జి.మాడుగుల ఎస్సై ఉపేంద్ర


 


జి.మాడుగుల, పెన్ పవర్ 


పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణులను ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న జి.మాడుగుల ఎస్సై ఉపేంద్ర. ఒక వైపు భారీ వర్షం, చిమ్మచీకటి, మరోవైపు అత్యంత మారుమూల ప్రాంతమే కాకుండా మావోయిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన కిలంకోట పంచాయతీ కె.బందవీధి గ్రామంలో సోమవారం రాత్రి ఇద్దరు మహిళలు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. బైక్ అంబులెన్స్ బొయితిలి వరకు వెళ్ళింది. భారీ వర్షం కావటంతో ముందుకు వెళ్లలేకపోయింది ఇందుకుతోడు రహదారి సదుపాయం సక్రమంగా లేదు. ఈ విషయం స్థానిక ఎస్సై ఉపేంద్రకు తెలియటంతో  వెంటనే స్పందించారు. ప్రయివేటు జీపును గ్రామానికి పంపించి పురిటి నొప్పులతో బాధపడుతున్న అనుగురి. మత్యకొండమ్మను ముందుగా మద్దిగరువు వరకు తరలించి బైక్ అంబులెన్స్ ద్వారా జి.మాడుగుల తరలించారు. అదే గ్రామానికి చెందిన సాగేని.ఈశ్వరికి పురిటి నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతుందని సమాచారం రావటంతో అదే జీపులో మరో సారి  గ్రామానికి వెళ్లి గర్భిణిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. సోమవారం అర్ధరాత్రి అనుగురి మత్యకొండమ్మ పాపాకు జన్మనివ్వగా, సాగేని ఈశ్వరి బాబుకు జన్మనిచ్చింది. మంగళవారం ఎస్సై ఉపేంద్ర ఆసుపత్రికి వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాగేని ఈశ్వరి రక్తహీనతతో బాధ పడుతుండటంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. సరియైన సమయానికి స్పందించి ఆసుపత్రికి తరలించిన పోలీసులకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు చెప్పారు.


ముఖ్యమంత్రి జగన్ చర్యలు ప్రశంసనీయం...

 ముఖ్యమంత్రి జగన్ చర్యలు ప్రశంసనీయం...


ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్


భీమవరం,పెన్ పవర్ 


భీమవరం, కరోనా వైరసను రాష్ట్రంలో అరికట్టడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ కరోనా వైరస్ పరీక్షలు ఎక్కడికక్కడ జరిగేలా కిట్లు పంపించి నిత్యం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి అండగా తాము సైతం అంటూ ప్రతీ ఒక్కరూ స్పందించి ముందుకు వస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం వీరవాసరం మండలానికి చెందిన పలువురు పార్టీ నాయకులు స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ లో వీరవాసరం మండలంలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అందించడం అభినందనియమని అన్నారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి మండలంలోని ప్రతీ గ్రామంలోనూ కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పార్టీ నాయకులను అభినందిస్తున్నానని అన్నారు. తోలేరు గ్రామ మాజీ సర్పంచ్, వైసిపి నాయకులు భోగిరెడ్డి శ్రీనివాసరావు రూ లక్ష, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగరాజు శ్రీనివాసరాజు రూ 54 వేలు, పార్టీ సీనియర్ నాయకులు గొలగాని సత్యనారాయణ రూ 51 వేలు , క్రిస్టి లూధరన్ చర్చి నుండి కె వినోద్ కుమార్ రూ 10 వేల చెక్కులను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి వీరిని ప్రత్యేకంగా అభినందించారు.


 తాజా పరిస్థితులపై ఎమ్మెల్యే గ్రంధి సమీక్ష

 


 


 తాజా పరిస్థితులపై ఎమ్మెల్యే గ్రంధి సమీక్ష..


భీమవరం, పెన్ పవర్


భీమవరం కరోనా వైరస్ కట్టడిలో భాగంగా అధికారులు తీసుకుంటున్న చర్యల పర్యవేక్షణలో భాగంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో తహశీల్దార్ రమణరావు, మున్సిపల్ కమీషనర్ కె రమేష్ కుమార్, వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్ లతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల పట్టణంలో మూడు పాజిటివ్ కేసులు నమోదైన నేపధ్యంలో మూడు రోజులు పట్టణ బంద్ కు పిలుపునివ్వగా బంద్ ఎలా జరిగింది, దాని యొక్క ప్రభావం ఏమిటనే దానిపై అధికారులను ఆరా తీసారు. అదే మాదిరిగా పట్టణంలో ఉన్న రెడ్ జోన్లలో సూపర్ శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ నివసిస్తున్న ప్రజల ఇబ్బందులపై అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ముందుగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిద్దరికీ కూడా చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో వారు ప్రస్తుతం హెం క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. నేటి నుండి మరో మూడు రోజులు పాటు పట్టణంలో బంద్ ను ప్రకటించాలని చాలా మంది కోరుతున్నారని, కాని జిల్లాను ఆరెంజ్ జోన్ గా ప్రకటించిన నేపధ్యంలో ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను అనుసరించి బంద్ పై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరోనా కట్టడిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనియమని ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పని చేసి భీమవరంలో కరోనా అనేది లేకుండా చేయాలని ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ మూడు మీటర్ల భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. యధావిధిగానే కాయగూరల షాపులు, కిరాణా షాపులు ప్రభుత్వం ప్రకటించిన సమయంలోనే తెరిచి ఉంచాలని అన్నారు. మాంసాహర మార్కెట్ కు ప్రస్తుతం అవకాశం లేదని అన్నారు. అయితే మాంసాహరాన్ని ఇంటింటికి తిరిగి విక్రయించుకోవచ్చని, కాని ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని అన్నారు. అదే మాదిరిగా ప్రతీ వ్యక్తి స్వచ్చంధంగా భౌతిక దూరాన్ని పాటించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరారు.


భక్తజనం లేకుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4638 వ జయంతి


భక్తజనం లేకుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4638 వ జయంతి..

 

పోలవరం, పెన్ పవర్

 

 పోలవరం మండలంలో అఖండ గోదావరి నదీతీరాన ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4638 వ జయంతి వేడుకలను వైరస్ ప్రభావంతో ఘనంగా జరుపుకో లేక పోయామని   వాసవి క్లబ్ గౌరవ అధ్యక్షులు చెక్క వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు పైడిపల్లి ఫణి కుమార్ శర్మ  మాట్లాడుతూ ఆర్యవైశ్య కమిటీ సభ్యులు పెరుమల్ల సూర్యనారాయణ మూర్తి, ఎక్కి శెట్టి వెంకట రాజా సూచనల మేరకు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 4638 వ జయంతి వేడుకలను శనివారం భక్తజనం లేకుండానే నిర్వహించామన్నారు. సాంప్రదాయ పధ్ధతిలోనే అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన నిరాడంబరంగా అర్చకులు చే నిర్వహించారు. అనంతరం వాసవి క్లబ్ గౌరవ అధ్యక్షులు చెక్క వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 18 కలిసాలు ఏర్పాటు చేసి దివ్య పంచామృత స్థానం చేయించి స్త్రీల చే సామూహిక లక్ష కుంకుమార్చనలు వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగేవని ఈ సంవత్సరం వైరస్ మహమ్మారి సోకడంతో ప్రభుత్వ, పోలీసు అధికారులకు సూచనలు పాటిస్తూ నిరాడంబరంగా భక్తజనం లేకుండా అర్చకుని చే సాధారణ పూజా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. మహమ్మారి పూర్తిస్థాయిలో తొలిగిపోవాలని మరుసటి సంవత్సరం భక్తజనంతో ఘనంగా అమ్మవారి జయంతి వేడుకలు జరుపుకోవాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ పై  పోలీస్ కేసు


ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ పై  పోలీస్ కేసు నమోదు

 

పెన్ పవర్ తాడేపల్లిగూడెం. 

 

 

 

తాడేపల్లిగూడెం లో  నిబంధనలను అతిక్రమించి వాకింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసిన పట్టణ పోలీసులు.

శశి కాలేజీ ప్రాంగణం వద్ద పాదచారులకు అనుకూలమైన విశాల స్థలం ఉండటంతో భారీగా తరలి వెళ్తున్న పాదచారులు.

తెల్లవారుజాము నుండే సుమారు 200 మంది పాదచారులు ఆ ప్రాంగణానికి రావడం అలవాటు.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 30మంది ఇది పాదచారుల కు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించిన పట్టణ పోలీసులు.

కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఒక సమూహంగా పాదచారులు నడవడం చట్టరీత్యా నేరం సిఐ ఆకుల రఘు. 

ఈ దాడిలో పాల్గొన్న సీఐ ఆకుల రఘు టౌన్ ఎస్సై గురవయ్య ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ మరియు  పోలీస్ సిబ్బంది. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...