దేశానికే రోల్‌మోడల్‌గా కరీంనగర్
హైదరాబాద్, పెన్ పవర్ ప్రతినిధి దాసు.
కరోనా వైరస్ కట్టడిలో కరీంనగర్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ.. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చాలా కఠినంగా ఒక పకడ్బందిగా వ్యూహంతో వ్యవహరించిందన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహారణ కరీంనగర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలో ఎవరికీ కూడా కంటైన్మెంట్ అనే పదం తెలియనప్పుడు తెలంగాణ అప్రమత్తమైంది. దేశంలో ఫస్ట్ కంటైన్మెంట్ జోన్ కరీంనగర్ అన్నారు. ఇండోనేషియా నుంచి 11 మంది రావడం వారికి పాజిటివ్ రావడంతో మేలుకుని ఢిల్లీ ప్రభుత్వాన్నికి తెలిపి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, స్థానిక మంత్రి గంగుల కమలాకర్‌కు అహోరాత్రులు శ్రమించి ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా కరోనాను కట్టడి చేశారన్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి అభినందనలు తెలుపుతున్నట్లు సీఎం అన్నారు. కరీంనగర్ నుంచి మనం దేశానికి రోల్‌మోడల్ అయ్యామన్నారు. దీని నుంచి ఏ విధంగా పకడ్భందిగా వ్యవహరించాలో కేరళ రాష్ట్రం సైతం స్ఫూర్తిని తీసుకుందన్నారు..