Followers

సిఎం సహాయనిధికి రూ.50 వేలు అందజేత



సిఎం సహాయనిధికి రూ.50 వేలు అందజేత



 (పెన్ పవర్, పొదిలి) 



కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సిఎం సహాయనిధికి అన్నవరం గ్రామానికి చెందిన ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కొత్తపులి బ్రహ్మారెడ్డి రూ.50 వేలు డిడిని పొదిలి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, జి శ్రీనివాసులు, మాజీ ఎఎంసి ఛైర్మన్ గుజ్జుల రమణారెడ్డి, ఉడుముల పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


 సిఎం సహాయనిధికి రూ.1 లక్ష అందించిన కంభాలపాడు గ్రామ నాయకులు 



 సిఎం సహాయనిధికి రూ.1 లక్ష అందించిన కంభాలపాడు గ్రామ నాయకులు 



(పెన్ పవర్, పొదిలి) 



మండలంలోని కంభాలపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 లక్ష డిడిని శనివారం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డికి స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో అందజేశారు. ఈ సందర్భంగా తెళ్లపరెడ్డి నారాయణరెడ్డి రూ.25 వేలు, నాగిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి రూ. 25 వేలు, బుగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి రూ. 25 వేలు, కల్లూరి భాస్కర్ రెడ్డి రూ.25 వేలు కలిసి రూ.1 లక్ష డిడిని అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, జి శ్రీను, గుజ్జుల రమణారెడ్డి, ఉ డుముల పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలి 


కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలి 



కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి మాదాసి వెంకయ్య 



(పెన్ పవర్, టంగుటూరు) 



ప్రాణంతకమైన కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, పిడిసిసి బ్యాంకు ఛైర్మన్ మాదాసి వెంకయ్య అన్నారు. ఆయన సూచనలతో రావూరి అయ్యారయ్య తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. టంగుటూరులో ఉపాధి హామీ కూలీలకు తుల్లిబిల్లి అశోక్ బాబు ఫేస్ మస్కులు 500 స్పాన్సర్ చేయగా రావూరి అయ్యవరయ్య చేతులమీద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు మండల అధ్యక్షులు సూదలగుంట హరిబాబు, ఎఎంసి వైస్ చైర్మన్ చింతపల్లి హరి, మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, సూదలగుంట వెంకటస్వామి, లాబ్ రమణయ్య, స్టేట్ వెంకటేశ్వర్లు, వీరనారాయణ, పైడి హరికృష్ణ, నిరంజన్, రవికాంత్, ప్రభుదాస్, బొడ్డు రవీంద్ర, కిషోర్ రాజు, అలెగ్జాండర్, తుళ్ళిబిల్లి క్రాంతి, బొల్లా హరి, రాజేష్, నత్తల మురళి, కె రాజు, రాజశేఖర్, దేవరపల్లి వరుణ్, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


చినారికట్లలో 6858 మాస్కులు పంపిణీ 



చినారికట్లలో 6858 మాస్కులు పంపిణీ 



(పెన్ పవర్, చినారికట్ల) 



మండలంలోని చినారికట్ల సచివాలయంలో శనివారం డిఆర్‌డిఎ ఆధ్వర్యములో తయారుచేసిన మాస్కులను మాజీ యంపిపి ఉడుముల రామనారాయణరెడ్డి పంపిణీ చేశారు. చినారికట్లలో 6858 మాస్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మండలంలోని 26 పంచాయితీలల్లో ఒక్కొక్కరికి మూడు మాస్కులను పంపిణీ చేసేందుకు లక్షా 20 వేల మాస్కులను స్వయం సహాయక పొదుపు గ్రూపు మహిళల ద్వారా తయారుచేసే ఏర్పాట్లు చేస్తున్నామని ఇందిరాక్రాంతి పధం ఎపియం కె గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమములో ఇఒఆర్ డి కె రాజకుమారి, యంపిపి, జట్పిటిసి అభ్యర్థులు మోరబోయిన మురళి, అక్కిదాసరి ఏడుకొండలు, విఆర్ పురుషోత్తమరెడ్డి, సిసిలు రాజయ్య, వేల్పుల ఎజ్రా, రామయ్య, బనయ్య, గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు. 


పేద బ్రాహ్మణులకు చేయూత


పేద బ్రాహ్మణులకు చేయూత


పూర్ణా మార్కెట్, పెన్ పవర్ 


ఈరోజు దక్షిణ నియోజకవర్గం పరిధిలో పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైశాఖి జల ఉద్యానవనం పార్కు" యజ్ఞ వల్క పరిషత్"... విశాఖపట్నం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పి. జగన్నాధ రావు, ఆర్థిక సహాయంతో కరోనా లోక్ డౌన్ వలన ఎటువంటి ఆధారము లేని బ్రాహ్మణులకు 200 మందికి బియ్యము పప్పు దినుసులు నూనె ఇతర కిరాణా సరుకులు, వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్  చేతుల మీదగా పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, అర్హులైన ప్రతి పేదబ్రాహ్మణ కుటుంబానికి 5000/- రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సందర్భంగా తెలియజేశారు, కరోనా వ్యాధి... నిర్మూలన మన చేతుల్లోనే ఉందని కనుక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటించి వ్యాధి నిర్మూలనకు దోహద పడాలని కోరారు,
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ సభ్యులు వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.


పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  సేవాకార్యక్రమాలు


పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  సేవాకార్యక్రమాలు


ఎంవీపీ కాలనీ, పెన్ పవర్


 లాక్ డౌన్ నుండి  నేటి  వరకు దశల వారిగా  ఫౌండేషన్ శక్తి మేరకు  పలు సేవ కార్యక్రమములు చేస్తూ వచ్చింది.నేడు చిన్న వాల్తేరు లో  కాపు వీధిలో హౌస్ సర్వాంట్లు లకు  మరియు చిన్న వాల్తేరు 21వ వార్డు పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు 600 మందికి భోజనాలు,  మజ్జిక పేకెట్స్,  మాస్క్ లు.  మరియు పోలీస్ వారికి గుల్గోజ్ డీ డ్రింక్స్,  పత్రిక విలేకరులు, మీడియా వారికి వంట సరుకులు అందజేయడం జరిగింది.  పట్టా ఫౌండేషన్ సేవా కార్యక్రమలకు ప్రోత్సహం అందించిన వారు  ప్రపధముగా ఫౌండేషన్ సభ్యుయుడు పట్టా. ఉదయ్ కిరణ్,  శ్రీమతి పెంటకోట. వనజ వెంకట్ గారు,  గౌరీ శంకర్ గారు, మరియు నమ్మి సాయి కిషోర్, బొడ్డేడ వెంకటలక్ష్మి నాయుడు,  పెంటకోట శ్రీలక్ష్మి నూకరాజు. పట్టా ఫౌండేషన్ అధ్యక్షులు పట్టా రమేష్ బాబు,  ఫౌండేషన్ సభ్యులు పట్టా. ఉదయ్ కిరణ్ ,  జి. దేముడుబాబు,  బొడ్డేడ. వెంకటలక్ష్మి , ఆర్. భారతి,  పట్టా. రవి , యం. సూర్యనారాయణ,  పసుపురెడ్డి. పొన్నస్వామి,  సూరిబాబు... తదితరులు పాల్గున్నారు.
: బడుగు బాలహీన వర్గాల నిరుపేదలకు అండగా ఉండాలనే దృఢసంకల్పం తో  పట్టా ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పట్టా రమేష్ బాబు  తెలిపారు. నగరంలో వివిధ  ప్రాంతలలో లాక్ డౌన్ కారణం గా పనులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  భోజన ప్యాకెట్ లు పంపిణి కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా సభ్యులు పట్టా ఉదయ్ కిరణ్, పెంటకోట వనజ, వెంకట్, గౌరీ శంకర్ ల సహకారంతో చినవాల్తెర్  లో ఇంటింటికి భోజన పంపిణి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా పట్టా రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తు వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు, యాచకులకు లాక్ డౌన్ ప్రారంభం నుంచి  తమ ఫౌండేషన్ ద్వారా భోజనం సదుపాయం కల్పిస్తున్నామన్నారు.పట్టా ఫౌండేషన్ ద్వారా ఇంతటి మహూన్నత కార్యక్రమం చేపట్టడం అదృష్టం గా భావిస్తున్నామన్నారు.సేవా కార్యక్రమాలు లాక్ డౌన్ ముగిసిన నిరుపేదలు పనులకువెళ్ళేవరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణ లో ఉన్న పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు కూడా సేవలందిస్తున్నామన్నారు, కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పొన్న స్వామి,  సాయి కిషోర్, దేముడు బాబు, వెంకట లక్ష్మి, భారతి, రవి, తదితరులు పాల్గొన్నారు


అనారోగ్యంతో సిపిఎం శాఖ కార్యదర్శి మృతి


ఫొటో నెం. 120 



అనారోగ్యంతో సిపిఎం శాఖ కార్యదర్శి మృతి


(పెన్ పవర్, పొదిలి) 



అనారోగ్యంతో పొదిలి రూరల్ సిపిఎం శాఖ కార్యదర్శి జి దేవదాసు (45) శుక్రవారం రాత్రి మృతి చెందారు. మండలంలోని మల్లవరం గ్రామంలో నివాసం ఉంటున్న దేవదాసు గత కొద్ది సంవ త్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శక్రవారం రాత్రి పరిస్థితి విషమించడంతో స్వగృహంలో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పొదిలి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఎం రమేష్, సిఐటియు నాయకులు పి. ఛార్లెస్, ప్రజాశక్తి పొది లి బాధ్యులు నర్రా వెంకటేశ్వర రెడ్డి మృతదేహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేవదాసు మరణం పార్టీ కి తీరని లోటని రమేష్ తెలిపారు. ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించాలి. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...