Followers

కరోనా వైరస్ నివారించడంలో జర్నలిజందే కీలక పాత్ర 


కరోనా వైరస్ నివారించడంలో జర్నలిజందే కీలక పాత్ర 

 

పెన్ పవర్, దేవరపల్లి 

 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారించడంలో జర్నలిస్టులది కీలకపాత్ర అని గోపాలపురం ఎమ్మెల్యే తలారివెంకట్రావు అన్నారు.ఈక్లిష్టమైన పరిస్థితిలలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నారని,  ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితిలో వారికి, వారి కుటుంబాలకు ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ సహాయం అందిస్తున్నామని ఆయన అన్నారు.శుక్రవారం నాడు ఆయన నియోజకవర్గంలోని ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఒక్కరికి సుమారు రెండు వేల రూపాయలు విలువగల బియ్యం,నిత్యావసర వస్తువులు,కూరగాయలు,కోడిగుడ్లు,తదితరములను అందజేసారు.అన్ని ఎమర్జెన్సీ సేవకులతో పాటు, విలేఖర్లు కూడా మమేకమై చేస్తున్న సేవలు ఎనలేనివని ఆయన ప్రశంసించారు.తమ పార్టీ మరియు ప్రభుత్వం ఎల్లవేళలా జర్నలిస్టులకు అండగా ఉంటుందని ఆయన భరోస ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన విలేఖర్లు,వైఎస్ఆర్ సీపీ నాయకులు,కూచిపూడి సతీష్ కె వి కె దుర్గారావు దోనేలి జానకిరామ్  గడ జగదీష్ తదితరులు  పాల్గొన్నారు.

40 వ రోజుకి చేరుకున్న పార్డ్ ఇండియా అన్నదాన సంకల్పం


40 వ రోజుకి చేరుకున్న పార్డ్ ఇండియా అన్నదాన సంకల్పం

 

పెన్ పవర్, దేవరపల్లి

 

 

 దేవరపల్లి మండలం లోని యర్నగూడెం మరియు త్యాజంపూడి గ్రామాల్లో లాక్ డౌన్ వలన కష్టాలు పడుతున్న 60 మంది వృద్దులకు, వలస కార్మికులకు, అసహాయులకు పార్డ్ ఇండియా ఉచిత భోజన సౌకర్యం కల్పించింది.  శ్రీ విజయదుర్గా మెకానికల్ వర్కర్ల యూనియన్ అధ్యక్షులు, పార్డ్ ఇండియా గ్రామ కమిటీ సభ్యులు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు  సౌజన్యంతో ఈనాటి ఆహార పంపిణీ దిగ్విజయంగా సాగింది.40 వ రోజుకి చేరుకున్న  ఆహార పంపిణీ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు, పార్డ్ ఇండియా సోషల్ క్యాంపెయినర్ సుంకవల్లి సత్తిరాజు, కోఆర్డినేటర్ సోమిశెట్టి వెంకట్రావు, కొంపెల్లి బాబూరావు, ఏలూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.  కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు  దాతృత్వాన్ని పార్డ్ ఇండియా జాతీయ కార్యవర్గం అభినందించిందని సుంకవల్లి సత్తిరాజు పేర్కొన్నారు.

మసీద్ సెంటర్ ఏరియా ప్రజలకు కూరగాయలు వితరణ..


మసీద్ సెంటర్ ఏరియా ప్రజలకు కూరగాయలు వితరణ...

 

పోలవరం: పెన్ పవర్

 

 పోలవరం మండలంలో మసీద్ సెంటర్ పరిసర ప్రాంతం 150 మీటర్ల దూరంలో వరకు పోలీస్, ప్రభుత్వ అధికారుల ఆధీనంలో ఉండడంతో ఆ ఏరియా ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేనందున పోలవరం కూరగాయల వ్యాపారస్తులు స్వర్గీయ ముక్కు కృష్ణారావు అక్క గారు అయిన కొత్త గుండు రమామణి  గారు సుమారు నాలుగు వందల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. రెడ్ జోన్ ఏరియాలో ప్రజలకే కాకుండా ఆ ఏరియా లో డ్యూటీలు నిర్వహిస్తున్న కొంతమంది కి కూడా కూరగాయలు అందజేశారు. మసీద్ సెంటర్ ఏరియా లో నా తమ్ముడు స్వర్గీయ ముక్కు కృష్ణారావు కూరగాయల వ్యాపారం చేసే వారిని ఆ ఏరియా ప్రజలతో మాకు ఎంతో సన్నిహిత అనుబంధాలు ఉన్నాయని  ఈ కష్టకాలంలో వారికి తమ వంతు సహాయంగా కూరగాయలు అందజేశామని కొత్త గుండు రమా మణి తెలిపారు. ఈ సేవ కార్యక్రమంలో కొత్త గుండు సాయిబాబు, కొత్త గుండు సూరిబాబు, బొచ్చు శాంతారావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

నిడదవోలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కర్డ్ రైస్ వితరణ


నిడదవోలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కర్డ్ రైస్ వితరణ

 

 

నిడదవోలు, పెన్ పవర్

 

 

 

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారితో అను నిత్యం పోరాటం చేస్తున్న నిడదవోలు సర్కిల్ పోలీసులకు, నిడదవోలు మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఆశ వర్కర్లులకు...వారు చేస్తున్న సేవకు కృతజ్ఞతగా వారికి శనివారం ఉదయం 11.30 గంటలకు కర్డు రైస్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో  ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ దారపురెడ్డి శ్రీరామ ప్రతాప్  మాట్లాడుతూ... కరోనా వైరస్ విజృoభిస్తున్న తరుణంలో దాతలు...ప్రజలకి ఎంతోకొంత సహాయ పడాలని,  ప్రజల్లోఅవగాహన కల్పించవల్సిన బాధ్యత ప్రతి మీడియా మిత్రునికి ఉందని, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరుచుకోవాలని, అందరూ ఇళ్ళ లోనే ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కు ధరించాలని అన్నారు. కరోనా వైరస్ అరికట్టాల్సిన భాద్యత అందరికి ఉందని,  అందరూ సహకరించాలని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎప్పటికప్పుడు న్యూస్ లను అందిస్తూ,  మీడియా మిత్రులు చేస్తున్న సేవ అమోఘం మని,   ప్రభుత్వం నుండి పోలీసులకు,పారిశుద్ధ్య కార్మికులకు, ఆశ వర్కర్లులకు..ఎటువంటి సహాయం అందడం లేదని,  అందుచేత తమ వంతుగా వారిలో... నూతన ఉత్సహం కలిగించేoదుకు, వారు చేస్తున్న విశిష్ట సేవలకు కృతజ్ఞతగా, చిరుకానుకగా, వారికి కార్డు రైస్ అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశ వర్కర్లులు చేస్తున్న సేవ మరువరానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు నీలం నాగేంద్ర ప్రసాద్, సెక్రటరీ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, ప్రెస్ క్లబ్ సభ్యులు ఉజ్జిన మురళి కృష్ణ, బందెల అనిల్, తేలు నాని, యెనుముల రంగారావు, సనమండ్ర రాజ్ కుమార్, తంగెల రాము,ముత్యాల అంజి బాబు,  షేక్ నజీర్, నీలాపు గురునాధ్ రెడ్డి, గరగా త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పోలిరెడ్డి నాగ సత్య వెంకట్ రామారావు( ఎం.కామ్ ), పూసల బాలు, తాడిమళ్ల పి.ఈ.టి రాము, ఉజ్జిన బలరాం, పాలేటి రాజశేఖర్, శ్రీరంగం వీరేంద్ర, దారపురెడ్డి త్రినాధ్ తదితరులు సహకరించారు.

 ఎయిడ్స్ వారికి ఉచిత మందుల పంపిణీ 


 ఎయిడ్స్ వారికి ఉచిత మందుల పంపిణీ 



(పెన్ పవర్, ఉలవపాడు)


వలేటివారిపాలెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఒంగోలు ఏఆర్ సెంటర్ వారి సహకారంతో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్, విహాన్ ఎన్టీవో వారి ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ద్వారా వలేటివారిపాలెం మండలంలోని అన్ని గ్రామాలలో ఎయిడ్స్ తో జీవిస్తున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం డిఆర్ పి జి బాల సుబ్రహ్మణ్యం, లింగ వర్కర్ వీరమల్ల రవీంద్ర, వై లీలమ్మ, వి కోటేశ్వరి, విహాన్ సంస్థ సిబ్బంది అయిన జె అనూష డి కళ్యాణి పాల్గొన్నారు. మండలం లోని చుట్టుపక్కల గ్రామాలలో జీవిస్తున్న హెచ్ఐవి వారికి మందులు అవసరం అయిన వారు స్థానిక లింక్ వర్కర్ వై లీలమ్మ ఫోన్ నెంబర్ 9177976076 కు ఫోన్ చేయాలన్నారు. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించు కొనవల సినదిగా తెలియజేశారు. 


ఐఎఫ్ సి ఫౌండేషన్ వారు ప్రతి నెల 2వ తేదీ నిత్యావసర సరుకులు పంపిణీ 



ఐఎఫ్ సి ఫౌండేషన్ వారు ప్రతి నెల 2వ తేదీ నిత్యావసర సరుకులు పంపిణీ 



(పెన్ పవర్, ఉలవపాడు) 



ఐఎఫ్ సి ఫౌండేషన్ ఉలవపాడు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల పేదవారికి ఎలాగైతే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారో శనివారం కూడా సరుకులు పంపిణీ చేశారు. ఇప్పుడున్న కష్ట కాలంలో కూడా మేమున్నామంటూ ఐఎఫ్ సి ఫౌండేషన్ వారికి సహాయ, సహకారాలు అందిస్తున్న ఉలవపాడు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంస్థ మన అందరిది అన్నారు. ఇంకా మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజర్ రహీమ్, కోఆర్డినేటర్ షాహాబుద్దీన్, రసూల్, రాజేష్, పాల్గొన్నారు. 


నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి 



నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి 



 అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే అన్నా 



(పెన్ పవర్, బేస్తవారిపేట) 



స్థానిక బీసీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది అంటూ బీసీ కాలనీ మహిళలు ఎమ్మెల్యే అన్నా రాంబాబు దృష్టికి తీసుకొని వెళ్ళారు. వెంటనే స్పందించిన అన్నా వెంకట రాంబాబు తక్షణం స్పందించడంతో పాటు, వారికి నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా అధికారులను తన వద్దకు పిలిపించుకుని నీటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో బిసి కాలనీ మహిళలు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కు ధన్యవాదములు తెలిపారు. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...