Followers

నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి 



నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి 



 అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే అన్నా 



(పెన్ పవర్, బేస్తవారిపేట) 



స్థానిక బీసీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది అంటూ బీసీ కాలనీ మహిళలు ఎమ్మెల్యే అన్నా రాంబాబు దృష్టికి తీసుకొని వెళ్ళారు. వెంటనే స్పందించిన అన్నా వెంకట రాంబాబు తక్షణం స్పందించడంతో పాటు, వారికి నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా అధికారులను తన వద్దకు పిలిపించుకుని నీటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో బిసి కాలనీ మహిళలు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కు ధన్యవాదములు తెలిపారు. 


ప్రయివేటు వైద్యులకు, మెడికల్ షాపుల వారికి ప్రత్యేక సమావేశం



ప్రయివేటు వైద్యులకు, మెడికల్ షాపుల వారికి ప్రత్యేక సమావేశం



 (పెన్ పవర్, బేస్తవారిపేట) 



స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రయువేటు డాక్టర్స్, మెడికల్ షాపుల వారికి ఎంఆర్డీ శ్రీనివాసరావు, ఎండిఓకవితా చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా లక్షణాలతో ఎవరైనా ప్రజలు మీ వద్దకు చికిత్సకు లేదా మందుల కోసం వస్తే తక్షణం అధికారులకు సమాచారం అందించాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, కరోనా లక్షణాలతో మందుల కోసం వచ్చిన వారి వివరాలు సేకరించి భద్రంగా ఉంచాలన్నారు. వారి వివరాలు ఏరోజుకా రోజు మండల కార్యాలయానికి తెలియజేయాలని తెలిపారు. అలానే డాక్టర్లు వైద్యం అందించే సమయంలో చేతికి గ్లోజులు, ముఖానికి మాస్కులు తప్పకుండా ఉపయోగించాలన్నారు. మెడికల్ షాపులు, హాస్పిటల్స్ వద్ద సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలా కాదని ప్రభుత్వం అందించిన సూచనలు పాటించకుండా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎంఆర్త్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరావు, ప్రయివేటు డాక్టర్లు, మెడికల్ షాప్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.


పక్క రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని స్వస్థలాలకు పంపిన అధికారులు



పక్క రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని స్వస్థలాలకు పంపిన అధికారులు



 (పెన్ పవర్, ఉలవపాడు) 



మండలంలోకి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కందుకూరు ఆర్డీఓ ఓబులేషు ఆధ్వర్యంలో తరలింపు కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం నుండి వచ్చిన వారిని వారి వారి ఊర్లకు టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ఎంపీడీవో టి రవికుమార్, తహసీల్దార్ పీ మరియమ్మ, ఎస్ ఐ ఎం దేవకుమార్ ఆర్డీవో ఏర్పాటు చేసిన బస్సులో కరేడు నుండి 15 మందిని వీరేపల్లి మోడల్ స్కూల్ నుండి నలుగురిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో అధికారులు తరలించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 


 పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ 



 పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ 



(పెన్ పవర్, బేస్తవారిపేట) 



ప్రస్తుత పరిస్థితిలో కరోనా మహమ్మారి యుద్ధప్రాతిపదికన ప్రజల్ని పట్టిపీడిస్తున్న తరుణంలో నిరుపేదలకు శనివారం ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేతుల మీదుగా వైసీపీ నాయకులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నిబంధనల సమయంలో నియోజకవర్గ ప్రజలు రోజువారి పనులలో నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడుతుంటే మీ అందరికి నేను ఉన్నా అంటూ మండలం, బేస్తవారిపేట పట్టణంలోని పేద కుటుంబాలను గుర్తించి వారికీ నిత్యావసర వస్తువులను నియోజకవర్గ శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు నెమలిదిన్నె చెన్నారెడ్డి , కంభం మండలం మార్కెట్ యార్డు చైర్మెన్ యేలం వెంకటేశ్వరరావు,బేస్తవారిపేట మండల సీనియర్ నాయకులు పూనూరు భూపాల్ రెడ్డి , మాజీ ఎంపీపీ వేగినాటి ఓ సురా రెడ్డి, బేస్తవారిపేట మండల కన్వినర్ బొల్లా బాలిరెడ్డి ,టౌన్ కన్వినర్ కొండా రఘునాథ్ రెడ్డి, అక్కపల్లి ఎంపీటీసీ చిలకల బాల రంగారెడ్డి , అనిల్ రెడ్డి , బేస్తవారిపేట మండల జడ్పీటీసీ అభ్యర్థి బండ్లమూడి రాజు, మోక్షగుండం ఎంపీటీసీ ఆవుల జగదీష్ రెడ్డి, టౌన్ నాయకులు మట్టా రమేష్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 


యువ కేర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ



యువ కేర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ



 (పెన పవర్, గిద్దలూరు)



 లాక్ డౌన్ వల్ల పనిలేక అవస్థలు పడుతున్న నిరుపేదలకు యువ కేర్ సేవా సైనికులు శనివారం నిత్యావసర వస్తువులు అందించారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల నిర్బందించిన విషయం మనందరికీ తెలిసిందే. లాక్ డౌన్ వల్ల రోజూ కూలి పని చేసుకునే నిరుపేద కుటుంబానికి పూట గడవటం కష్టంగా మారింది. ఆకలి కేకలు వేస్తున్నప్పటికీ వారిలో చాలా మంది నోరు విప్పి అడగలేని పరిస్థితి అటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి నిత్యావసర సరుకులు అందించటం జరిగింది. యువ కేర్ అధ్యక్షుడు ఆరీఫుద్దీన్ మాట్లాడుతూ దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు చేతనైనంత సహాయం చేసి ఆపదలో ఉన్న వారిని తమ వొంతు సహాయపడి ఆదుకోవాలి అన్నదే యువ కేర్ వారి సేవా కార్యక్రమాల సారాంశమని అన్నారు. స్వచ్చంద దాతల సహకారంతో నిత్యావసర వస్తువులను పంచటం జరిగిందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ కేర్ సేవా సైనికులు మాలిక్ బాషా,నిజాముద్దీన్, జనార్ధన్,హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. 


300 కుటుంబాలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ 



300 కుటుంబాలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ 



(పెన పవర్, పొన్నలూరు)



మండలంలోని కొత్త శింగరబొట్లపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో 300 నిరుపేద కుటుంబాలకు నిత్యవసరాలు, కూరగాయలు శనివారం ఎస్ఎ బ్రహ్మనాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కూరపాటి లక్ష్మీ నారాయణరెడ్డి, వాసుపల్లి లక్ష్మీ నరసారెడ్డి, కూరపాటి మాలకొండారెడ్డి, గాలం శ్రీను, వాకా నరసింహారెడ్డి, అప్పనబోయిన వెంకట శేషయ్య, గుండాల గిరిజా ఆధ్వర్యంలో నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, నిరుపేదలకు రూ.80 వేలు విలువ చేసే ఈ నిత్యావసరాలు, కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఖాదర్ వలి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, మాజీ మండల కన్వీనర్ బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ అభ్యర్థి కొండాబత్తిన మాధవరావు లు పాల్గొని పంపిణీ చేశారు. 


ఎంపికైన వాలంటీర్లకు నియామకపత్రాలు


ఎంపికైన వాలంటీర్లకు నియామకపత్రాలు



(పెన్ పవర్, ఉలవపాడు) 



ఇంటర్వ్యూలో ఎంపికైన 11 మంది గ్రామ వాలంటీర్లకు శనివారం ఎంపిడిఓ టి రవికుమార్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి వారికి కేటాయించిన గ్రామాలలో బాధ్యతగా పని నిర్వర్తించాలని, కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, పరిశుభ్రత పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, శానిటైజర్ లు వాడాలని, చేతులకు గ్లోజులు ధరించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాల మనము జాగ్రత్తలన్నీ పాటిస్తే కరోనా మన నుండి పారిపోతుందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా పనులు నిర్వర్తించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...