ప్రయివేటు వైద్యులకు, మెడికల్ షాపుల వారికి ప్రత్యేక సమావేశం
(పెన్ పవర్, బేస్తవారిపేట)
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రయువేటు డాక్టర్స్, మెడికల్ షాపుల వారికి ఎంఆర్డీ శ్రీనివాసరావు, ఎండిఓకవితా చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా లక్షణాలతో ఎవరైనా ప్రజలు మీ వద్దకు చికిత్సకు లేదా మందుల కోసం వస్తే తక్షణం అధికారులకు సమాచారం అందించాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, కరోనా లక్షణాలతో మందుల కోసం వచ్చిన వారి వివరాలు సేకరించి భద్రంగా ఉంచాలన్నారు. వారి వివరాలు ఏరోజుకా రోజు మండల కార్యాలయానికి తెలియజేయాలని తెలిపారు. అలానే డాక్టర్లు వైద్యం అందించే సమయంలో చేతికి గ్లోజులు, ముఖానికి మాస్కులు తప్పకుండా ఉపయోగించాలన్నారు. మెడికల్ షాపులు, హాస్పిటల్స్ వద్ద సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలా కాదని ప్రభుత్వం అందించిన సూచనలు పాటించకుండా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎంఆర్త్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరావు, ప్రయివేటు డాక్టర్లు, మెడికల్ షాప్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.