Followers

గుల్లాపల్లి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ పరిశీలించిన కలెక్టర్ 



గుల్లాపల్లి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ పరిశీలించిన కలెక్టర్ 



10 ఎక్స్పోర్ట్ కంపెనీలను నడిపేందుకు అనుమతులు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ 



(పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, ఒంగోలు) 



రాప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరు డా.పోల భాస్కర్ మద్దిపాడు మండలంలో గల ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్‌ను పరిశీలించారు. గ్రోత్ సెంటర్ లో సుమారు 10 ఎక్స్పర్టు కంపెనీలకు రన్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగిన దృష్ట్యా అక్కడ పనిచేసే కార్మికులు సామాజిక దూరం, సానిటైజేషన్ పాటిస్తున్న అంశాలను ఆయన పరిశీలన చేశారు. ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ లో ఎంట్రీపాయింట్ లోనే కార్మికులు ధరిస్తున్న మాస్కు , సానిటైజేషన్ చేపడున్న అంశాలను కలెక్టరు పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సడలింపులో అనుమతులు ఇచ్చిన పరిశ్రమలు వాటి అనుబంధ యూనిట్ల విభాగాలు ఎలా నడుస్తున్నాయి. కార్మికులకు అందిస్తున్న సదుపాయాల గురించి ఏ.పి.ఐ.ఐ.సి జనరల్ మేనేజరు నరసింహారావును అడిగి తెలుసుకున్నారు. గ్రోత్ సెంటర్ లో రాక్ ఫర్ ఎవర్ ఐ.ఎన్.సి కంపెనీని కలెక్టరు పరిశీలించారు. యూనిట్‌లో గ్రానైట్ రాయి కటింగ్ ప్రాసెసను పరిశీలించారు. మల్టీ వైర్ లో గ్రానైట్ రాయి కటింగ్ క్రొత్త టెక్నాలజి గురించి యూనిట్ జనరల్ మేనేజర్ పి.వెంకట్రావు జిల్లా కలెక్టరుకు వివరించారు. తమ యూనిట్ ద్వారా గ్రానైట్ కటింగ్ చేసిన 30ఎం.ఎం, 20ఎం.ఎం వాటిని యానైటెడ్ కింగ్ డమ్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నామని, రా మెటీరియల్ ను తెలంగాణా, ఒరిస్సా నుండి తెచ్చుకోవడం జరుగుతున్నదన్నారు. రాక్ ఫర్ ఎవర్ ఐ.ఎస్.సి కంపెనీలో 140 మంది కార్మికులకు గాను ప్రస్తుతం 40 మంది కార్మికులతో నడపడం జరుగుతున్నదని కలెక్టరుకు వివరించారు. కంపెనీలో కార్మికులు పనిచేసే చోట భద్రత విషయంలో అలాగే భౌతిక దూరం పాటించేలా, సానిటైజేషన్ ఖచ్చితంగా అమలు పరుస్తున్నామని కలెక్టరుకు వివరించారు. జిల్లా కలెక్టరు వెంట మద్దిపాడు తహశీల్దారు బాబ్స్, క్వాలిటీ కంట్రోల్ సూపర్ వైజర్ ఆంజనేయులు, గ్రానైట్ కటింగ్ ఇన్ చార్జి కిరణ్ కిషోర్, తదితరులు వున్నారు. 


కంటైన్మెంట్, సర్వేలెన్స్ పక్కాగా నిర్వహించాలి 


ఫొటో నెం. 124, 125 



కంటైన్మెంట్, సర్వేలెన్స్ పక్కాగా నిర్వహించాలి 



అధికారులు ఇంగిత జ్ఞానంతో బాధ్యతగా పని చేయాలి అధికారులతో కలెక్టర్ పోల భాస్కర్ 



(పెన్ పవర్, చీమకుర్తి) 



లాక్ డౌన్ మూడవసారి పొడిగించినందున కంటైన్మెంట్ సర్వేలెన్స్ పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అధికారులు ఇంగిత జ్ఞానం కలిగి చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. శుక్రవారం చీమకుర్తి మండలం ఎమ్.పి.డి.ఓ. కార్యాలయంలో మండల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చీమకుర్తి మండలంలో 28 రోజుల క్రితం ఒకరికి కరోనా వైరస్ సోకితే హైరిస్క్ జోన్, కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్ ఏర్పాటులో మండల స్థాయి అధికారులు ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైరిస్క్ జోన్లో 736 కుటుంబాలు వున్నాయని, కంటైన్ మెంట్ జోన్ పరిధిలో 7,620 కుటుంబాలలో మొత్తం 30,332 మంది జనాభా వున్నారని వైద్య అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. బఫర్ జోన్, కంటైన్ మెంట్ జోన్ పరిధిలో ఆరు గ్రామాలు వస్తాయని ఒకరు, ఎనిమిది గ్రామాలు వస్తాయని మరొకరు, రెండు గ్రామలే వస్తాయని ఇంకొకరు స్పష్టత లేని సమాధానం అధికారులు ఇవ్వడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పెరీమీటర్ కంట్రోల్ సమర్థంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ విస్తరణ అరికట్టడానికి చీమకుర్తి పట్టణంలోకి ప్రజలు, వాహనాలు రాకపోకలు పూర్తి గా నియంత్రించాలని ఆయన చెప్పారు. కంటైన్ మెంట్, బఫర్ జోన్ పరిధిలో హైరిస్క్ ప్రజలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. చీమకుర్తి మండలంలో 308 మంది నుంచి నమూనాలు సేకరించగా కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ అయినట్లు కలెక్టర్ చెప్పారు. కంటైన్మెంట్ జోన్లో 278 మంది నమూనాలు సేకరించి వి.ఆర్.డి.ఎల్. ద్వారా పరీక్షలు నిర్వహించామన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబీకులలో ఐదుగురు, సన్నిహితంగా మెలిగిన మరో తొమ్మిది మంది, అనుమానితులుగా 30 మందికి ట్రూనాట్ యంత్రాలు ద్వారా పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోకలేదని ఆయన తెలిపారు. మరో 60 మందిని ఎంఐసోలేషన్ లో వుంచామన్నారు. హైరిస్క్ జోన్ లో విధులు నిర్వహిస్తున్న 21 మంది పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోక లేదని వైద్యులు ధృవీకరించారని చెప్పారు. అనుమానస్పద లక్షణాలు కలిగిన మరో 40 మంది వృద్ధులకు పరీక్షలు కూడా చేశామన్నారు. చీమకుర్తిలో ప్రస్తుతం ఒకరికి మాత్రమే వ్యాధి వుందని, విస్తరణ జరగలేదన్నారు. కంటైన్ మెంట్ జోన్ పరిధిలోని వలస కూలీలకు రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. జిల్లాలో కరోనా వైరస్ కేసులు 60 నమోదు కాగా వైద్యం పొంది 44 మంది ఆరోగ్యవంతులై వైద్యశాల నుంచి డిశ్చార్జి అయ్యారని కలెక్టర్ తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆరుగురు వ్యక్తులు డిశ్చార్జి కానున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం 14 కంటైన్ మెంట్ జోన్లలో ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు లాక్ డౌన్ పక్కాగా అమలుచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి 17వ తేదీవరకు లాక్ డౌన్ 14 రోజులపాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటివరకు 12 వేల మంది నుంచి నమూనాలు సేకరించామని, ఏడు వేల మందికి వ్యాధి సోకలేదని నిర్ధారణ అయ్యిందన్నారు. మిగిలిన వారి నమూనాలు వి.ఆర్.డి.ఎల్. ద్వారా పరీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. ఫలితాలు వెల్లడైతే ఏ మేరకు కోవిడ్ విస్తరించిందో తెలుస్తుందని, దీనిని పూర్తి స్థాయిలో అరికట్టగలమని ఆయన వివరించారు. చీమకుర్తి లో గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు, క్రషర్లు నడపడానికి ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం చీమకుర్తిలో 40 క్వారీలు, 600 ఫ్యాక్టరీలు, 20 క్రషర్ లు వున్నాయని యజమానలు దరఖాస్తులు చేసుకుంటే అనుమతులు ఇస్తామని ఆయన వివరించారు. 6,034 మంది ఇతర రాష్ట్రాల నుంచి వలసకూలీలుగా చీమకుర్తిలో వున్నారని, పరిశ్రమలు ప్రారంభిస్తే ఎంతమంది వుంటారో యజమానులు గుర్తించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేలమంది ఇతర జిల్లాలకు చెందిన వలస కూలీలను వారి స్వస్థలాలకు ఆర్.టి.సి. బస్సుల ద్వారా తరలిస్తున్నామని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు ఆర్.డి.ఓ. ప్రభాకర రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధి కారి అద్దెయ్య, మైన్స్ ఏ.డి. నరసింహా రెడ్డి, ఉప కార్మిక కమీషనర్ శ్రీనివాస్ , తహసిల్దార్ కె. విజయకుమారి, ఎమ్.పి.డి.ఓ. వండర్ మెన్, చీమకుర్తి మున్సిపల్ కమీషనర్ బి. రవి కుమార్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు పండ్లు పంపిణీ 



గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు పండ్లు పంపిణీ 



(పెన పవర్, ఉలవపాడు)



 ఏపీ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు వికలాంగులకు అరటి, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ పండ్లను శనివారం పంపిణీ చేశారు. సింగరాయకొండ మండలం అప్పాపురం యానాది కాలనీలో ఎపి గిరిజన యానాది సేవా సంఘము జిల్లా కమిటీ పిలుపు మేరకు మల్లవరపు శ్రీను (ఈతముక్కల) సౌజన్యముతో గర్భిణీ మహిళలకు, వికలాంగులకు అరటి, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ కాయలు 30 మందికి అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసులు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో యానాదుల సమస్యలపై పోరాడేందుకు యానాది సేవా సంఘము ముందుండేది అని అన్నారు. కరోనా ప్రభావంతో జిల్లాలో యానాదులు పడుతున్న కష్టాలకు దాతలు ముందుకు వచ్చి సహాయము చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు. జై భీం, పీపుల్స్ జెఏసి జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు మాట్లాడుతూ యానాదులు వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉ న్నాయని, పిల్లలను చదివించుకుంటనే జీవితాలు బాగుపడతాయని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోడాల దుర్గా ప్రసాద్, యువ నాయకులూ తిరివీదుల హరి సాయి, డి.ఆంజనేయులు, పొట్లూరి శ్రీను, జై భీం పీపుల్స్ జె ఏ సి మండల ఉపాధ్యక్షులు నాని, సుబ్బారాయుడు, పి శశి, తదితరులు పాల్గొన్నారు. 


కేంద్ర మంత్రి ఆదేశాలు బుట్టదాఖలు 


కేంద్ర మంత్రి ఆదేశాలు బుట్టదాఖలు 



మంత్రుల మాటకు విలువ లేదా? 



స్విఘ్ ఆలో తెలంగాణ నోడల్ అధికారి ఫోన్?



 బిజీ, బిజీగా ఆంధ్రప్రదేశ్ నోడల్ అధికారి ఫోన్ ? 



(పెన పవర్, మార్కాపురం డివిజన్ ఇన్ ఛార్జి) 


కరోనా మహమ్మారితో మూడో దఫా లాక్ డౌన్ ను దేశం మొత్తం ఈ నెల 17వ తేదీ వరకు నిర్ణయించింది. అయితే ఇతర ప్రాంతాల్లో ఉండే వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులను స్వగ్రామాలకు చేరుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించి నోడల్ అధికారులను కూడా నియమించారు. అయితే సదరు నోడల్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నోడల్ అధికారులు నియమిస్తున్నట్టు వారి ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రజలను తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ నెంబర్లు పని చేయకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ నోడల్ అధికారి నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ నోడల్ అధికారి ఫోన్ నెంబర్ ఎప్పుడు చేసినా బిజీ, బిజీ అంటూ చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు, యాత్రికులు, వలస కూలీలు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తుండగా వీరి ఫోన్లు పని చేయక పోవడంతో వారికి నిరాశ కలిగిస్తుంది. స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనలకు అధికారులు విలువ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు విమర్శిస్తున్నారు. నెలల తరబడి ఇతర ప్రాంతాలలో ఉంటూ తమ కుటుంబ సభ్యులను చూసుకునేందుకు తాపత్రయపడుతున్న సందర్భంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేటాయించిన నోడల్ అధికారులు ఫోన్ లు పని చేసే విధంగా చర్యలు చేపట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్మికులను, యాత్రికులను, విద్యార్థులను తమ గమ్యస్థానాలకు చేర్చే చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర డిజిపి స్వయంగా అన్ని జిల్లాల ఎస్పీల ఫోన్ నెంబర్లు ఇచ్చి ఏదైనా కష్టకాలంలో ఉంటే వారి నెంబర్లకు సంప్రదించాలని పలు ఫోన్ నెంబర్లను విడుదల చేశారు. ఆ సమయంలో కొందరు అవసరం నిమిత్తం సమాచారం పెట్టినప్పటికీ వాటిని పరిశీలించకపోవడం అన్యాయమని అంటున్నారు. ఇప్పటికైనా డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఆ నెంబర్లకు వచ్చిన సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు కూడా వలస కార్మికులు, మత్స్యకారుల తరలింపుపై చూపిన శ్రద్ధ విద్యార్థుల తరలింపుపై చూపడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులను తరలించడంలో చూపించిన శ్రద్ధ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను తరలించే విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణలో ఉన్న విద్యార్థులను ఏపీకి తరలించేందుకు శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 


వైయస్సార్సీపి నాయకుల ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు కూరగాయల పంపిణీ



వైయస్సార్సీపి నాయకుల ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు కూరగాయల పంపిణీ



 (పెన్ పవర్, మార్కాపురం ఆర్ సి ఇన్‌ఛార్జి) 


మండలంలోని రాయవరం గ్రామంలో ఎస్సీ కాలనీ నందు ఉన్న 250 కుటుంబాలకు గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటించి ఎవరు కూడా ఇంటి నుండి బయటకు రాకుండా ఏడు రకాల కూరగాయలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. మన ప్రాంతాన్ని మనమే కాపాడుకుందాం అనే ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పిలుపు మేరకు కరోనా వైరస్ ప్రభావం వలన రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహించడంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ప్రతి కుటుంబానికి ఏడు రకాల కూరగాయలను నూతన ఎంపీటీసీ సభ్యులు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన ఎంపీటీసీ సభ్యులు గురవయ్య, దేవుండ్ల మల్లయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు దొడ్డ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ అడివయ్య, కొమ్ముసాని శ్రీనివాస్ రెడ్డి, కంది రామకృష్ణారెడ్డి, మాజీ జడ్పిటిసి కోటయ్య, విడుదల ప్రేమానందం, ప్రదీప్, రవి, ఆవులయ్య, తమ్మిశెట్టి ఆంజనేయులు, కంది రాములు, ఎస్ లక్ష్మయ్య, వైఎస్ఆర్ సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఫొటో నెం. 103 శిథిలావస్థకు చేరిన విద్యుత్ శాఖ భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే అన్నా (ప్పెవర్, కంభం) శిథిలావస్థకు చేరిన విద్యుత్ శాఖ భవనాలను గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు శనివారం పరిశీలించారు. పరిశీలించిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడటం జరిగింది. పరిస్థితిని మంత్రికి తెలియపరిచి త్వరలోనే చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు వెంట విద్యుత్ శాఖ అధికారి అంకయ్య, వైఎస్ఆర్ పార్టీ నాయకులు నెమిలిదిన్నె చెన్నారెడ్డి, కొత్తపల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు. 


 ఐకాన్ ట్రస్టు ఆధ్వర్యంలో హిజ్రాలకు నిత్యావసరాలు పంపిణీ 


 ఐకాన్ ట్రస్టు ఆధ్వర్యంలో హిజ్రాలకు నిత్యావసరాలు పంపిణీ 



(పెన్ పవర్,  గిద్దలూరు) 



లాక్ డౌన్ వల్ల పనిలేక అవస్థలు పడుతున్న హిజ్రాలకు ఐకాన్ ఛారిటబుల్ ట్రస్టు సేవా సైనికులు నిత్యావసర వస్తువులు శనివారం అందజేశారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల నిర్బందించిన విషయం మనందరికీ తెలిసిందే. లాక్ డౌన్ వల్ల రోజూ షాపులు నడుస్తుంటే డబ్బులు వసూలు చేసుకుని జీవనం సాగించే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేనందున నిరుపేద హిజ్రాల కుటుంబాలు పూట గడవటం కష్టంగా మారింది. ఆకలి కేకలు వేస్తున్నప్పటికీ వారిలో చాలా మంది నోరు విప్పి అడగలేని పరిస్థితి ఉంది. అటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి నిత్యావసర సరుకులు అందించటం జరిగిందని ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఐకాన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చీమలదిన్నె శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు చేతనైనంత సహాయం చేసి ఆపదలో ఉన్న వారికి తమవంతు సహాయపడి ఆదుకోవాలి అన్నదే యువకేర్ వారి సేవా కార్యక్రమాల సారాంశమని అన్నారు. తమ సొంత నిధులతో నిత్యావసర వస్తువులను పంచటం జరిగిందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చీమలదిన్నె శ్రీకాంత్ బాబు, ఉపాధ్యక్షులు యడవల్లి బాలు, గౌరవ సలహాదారులు అరికెరీ రాకేష్, తదితరులు పాల్గొన్నారు. 


ధరలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వం 


ధరలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వం 



మందుల కొరతతో ఇబ్బంది పడుతున్న రోగులు 



ఓ వైపు ఆర్ధిక ఇబ్బందులు, మరో వైపు కొరత కారణం 



(పెన్ పవర్, మార్కాపురం డివిజన్ ఇన్ ఛార్జి) 



కరోనా మహమ్మారి కారణంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల పట్టికలను అధికారులు ఏర్పాటు చేసినా అవి అలంకార ప్రాయంగా మారాయి. కొనుగోలుదారులు ఎవరైనా అధికారులు పెట్టిన ధరల పట్టిక పై ప్రశ్నిస్తే రవాణా చార్జీలు భారీగా పెరిగాయని, ఆ ధరలకు సరుకులు ఇవ్వలేమని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మందుల విషయానికి వస్తే రోగులకు అవసరమైన మందులు అందు బాటులో లేవంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు లేక మందుల సరఫరా నిలిచిపోయిందని సమాధానం ఇస్తున్నారు. గతంలో మందులు కొనుగోలు చేస్తే 10 నుంచి 20 శాతం వరకు కమిషన్ రూపంలో ఇచ్చే వారు ప్రస్తుత కష్టాలను సాకుగా చూపి ఆ కమిషన్ ఎత్తి వేయడమే కాక ధరలు పెంచి ఆమ్మకం సాగిస్తున్నారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరో వైపు ధరల పెరుగుదలతో కొందామంటే కొరివి, వేసుకోకపోతే రోగాలు పెరిగి ఆరోగ్య సమస్యలు అధికమవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ 40 రోజుల్లో వ్యక్తికి పది, ఐదు కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, ఒక కిలో శనగపప్పు, రూ.1000 నగదు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ప్రజలు కరోనా మరణాల కన్నా ఆకలి మరణాలే అధికం అవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల విమర్శలకు సమాధానం ఇచ్చేందుకే అధిక సమయం కేటాయిస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్త శుద్ధితో పని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి 3 మాస్కులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి పది రోజులు గడిచినా ఇంతవరకు సక్రమంగా పంపిణీ జరిగిన దాఖలాలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రాంతాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...