పూర్ణా మార్కెట్, పెన్ పవర్
గోకుల్ థియేటర్ నుంచి చావుల మదుం రోడ్ లో ఉన్న పాత శివాలయం వద్ద హోటల్ ఎస్ ఎస్ జి రెసిడెన్సి అధినేత గోగుల.రామారావు, పవన్ హెచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి శ్రీనివాస్ ల ఆర్థిక సహాయంతో "కరోనా లోక్ డౌన్ "....వలన ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఈ ప్రాంత వాసులకు కు 500 మందికి సుమారు వెయ్యి రూపాయల విలువైన నిత్యవసర వస్తువులు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ , వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ , వైయస్సార్సీపి నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ , పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుల సమక్షంలో పేదలకు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తూ వారి వారి కుటుంబాలను కాపాడుకోవాలని ప్రజలకు తెలియజేశారు, పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్ ఈ కార్యక్రమం నిర్వహించిన సంస్థలను ఇటువంటి సమయంలో వారు ఉదార స్వభావం తో ఇటువంటి మంచి కార్యక్రమాలు తలపెట్టడం ఎంతో అభినందనీయం అని వారిని ప్రశంసించారు,
ఈ కార్యక్రమంలో ఈ యొక్క సంస్థల డైరెక్టర్లు దాసరి రాధాకృష్ణ, వేచాలపు దొరబాబు, బిక్కిన శ్రీనివాస్, రొంగలిసూర్యనారాయణ, లెక్కల నాయుడు, మకర గోపి, గంట శ్రీను మరియు ఆయా సంస్థల యొక్క సహాయక బృంద సభ్యులు పాల్గొన్నారు.