Followers

పాడి రైతులకు బోనన్లు పంపిణీ 


పాడి రైతులకు బోనన్లు పంపిణీ 


మాకవరపాలెం, పెన్ పవర్ 



కరోణా కారణంగా తామరం గ్రామ పాడి రైతులకు విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో తామరం పాల సేకరణ కేంద్రం వద్ద గొంతన హరిబాబు గారి ఆధ్వర్యంలో 92 మంది పాడి రైతులకు సుమారు 97000 రూపాయలు కరోగా బోనస్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ పాలకవర్గ సభ్యులు పాడి రైతులు కలసి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, డైరక్టర్ శిరంరెడ్డి సూర్యనారాయణ, నర్సీపట్నం డెయిరీ నేనే ఇరుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలసొసైటీ అధ్యక్షుడు ప్రగడ రమణ, సూపర్‌వైజర్ సతీష్, సెక్రటరీ కోసూరు వెంకటరమణ, హెల్పర్ ద్వారపురెడ్డి శ్రీను పాల్గొన్నారు.


జనసేన ఎంపిటిసి అభ్యర్ధిపై దాడి అన్యాయం


జనసేన ఎంపిటిసి అభ్యర్ధిపై దాడి అన్యాయం


జనసేన నియోజకవర్గ నాయకులు సూర్యచంద్ర 



మాకవరపాలెం, పెన్ పవర్  



మాకవరపాలెం మండలం బిబి.పేట గ్రామంలో నివసిస్తున్న జనసేన ఎంపిటిసి అభ్యర్ధి మొగిలి కృపరాజుపై వైసిపి నాయకులు దాడులు చేయడం అన్యాయముని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు రాజాన వీర సూర్య చంద్ర అన్నారు. శనివారం ఈ విషయమై మాకవరపాలెం ఎస్పై కరక రాముకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన చూట్లాడుతూ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు, తామురం పిఎసిఎస్ పర్సన్ ఇన్ చార్జ్ అయిన పాశపు నాగేశ్వరరావు గత కొద్ది కాలంగా తరచూ దుర్భాషలాడి, పలుమార్లు దాడికి పాల్పడ్డారన్నారు. రోజురోజుకు మా నాయకుడికి ఆదరణ చూసి సహించలేక నాగేశ్వరరావు మరణాయుధాలతో దాడికి దిగుతున్నారన్నారు. ప్రతీ సారి నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వెంటనే చంపుతావుని బెదిరిస్తున్నారని చెప్పారు. కావున ఇప్పటికైనా వైసిపి నాయకులు నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ప్రాణాలను రక్షణ కల్పించాలని కోరారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల సీజ్ మాకవరపాలెం మాకవరపాలెం పరిదిలోని కొండల అగ్రహారం గ్రామంలోని వరాహ నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. లా డాన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇనుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై తెలియజేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండడంతో ఎవ్వరు వీటిపై దఅష్టి పెట్టలేదు. కొందరు ఇదే అదునుగా భావించి ఇనుక ఎనిమిది వేలకు అనుకుంటున్నట్లు తెలిసింది. 


కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు 


కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు 



నర్సీపట్నం, పెన్ పవర్ 


 నర్సీపట్నం మున్సిపాలిటీలోని 8, 9 నార్మల్లో ఎస్ఆర్ పిట్టా మూర్తి సౌజన్యంతో మేడేను పురస్కరించుకొని 60 కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను జనసేన నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు రాజాన వీర సూర్య చంద్ర చేతుల మీదుగా నాయకులు వంచాడ హరినాథ్, దేశెట్టి సూరి భూమి, ముత్యాల నర్సింగ్, పల్లా శ్రీను, గాలి రుణ సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సూర్య చంద్ర మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా కార్మికులు ఇంటికే పరిమితమయ్యా రన్నారు. వారికి తోడుగా జనసేన పార్టీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 8, 9 నార్మలకు చెందిన 60 కార్మిక కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇప్పటికే 8, 9 వార్మల్లో జనసేన పార్టీ తరపున కూరగాయల, పండ్లు, గుడ్లు, నిత్యావసరాలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే నాయకుడు మారిశెట్టి రాజా తన సొంత నిధులలో నిరుపేదలైన 30 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వూడి కళ్యాణ్ చక్రవర్తి, అద్దేపల్లి గణేష్, వాకా రమణమూర్తి, మునికోటి విజయ్, పరవాడ మోహన్, నాగు, సురేష్, పండు పాల్గొన్నారు.


నర్సీపట్నంను రెడ్ జోన్ నుంచి తొలగించాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి 


నర్సీపట్నంను రెడ్ జోన్ నుంచి తొలగించాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి 



నర్సీపట్నం, పెన్ పవర్ 


నర్సీపట్నంను రెడ్ జోన్ పరిధి నుంచి తొలగించాని జిల్లా కలెక్టర్ ను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉచూశంకర్ గణేష్ శనివారం విశాఖ కలెక్టర్ కార్యాలయంలో కలిసి విన్నవించారు. డిల్లి మర్కజ్ కు వెళ్లి నర్సీపట్నంలో మత ప్రచారానికి వచ్చిన తమిళనాడుకు చెందిన వారికి కరొనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. నర్సీపట్నంలో స్థానికులు ఎవరికి కరోనా పాజిటివ్ రాలేదని వివరించారు. గత 28 రోజులుగా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23, 24 వార్మలను రెడ్ జోన్ పరిధిలో ఉంచారని చెప్పారు. గత నెల రోజులుగా నర్సీపట్నంలో ఎవరికి కరోనా సోకలేదని ఈ పరిస్థితుల్లో నర్సీపట్నంను రెడ్ జోన్ పరిధి నుంచి తప్పించాలని కోరారు. 


ధర్మారాయుడు పేట పాడి రైతులకు విశాఖ డైరి కరోనా సహాయంగా బోనస్ పంపిణీ 




ధర్మారాయుడు పేట పాడి రైతులకు విశాఖ డైరి కరోనా సహాయంగా బోనస్ పంపిణీ 

 


             పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:కరోనా సహాయక చర్యల్లో భాగంగా విశాఖ డైరీ యాజమాన్యం పాడి రైతులకు 15 రోజుల పేమెంట్ ను బోనస్ గా పంపిణీ చేస్తున్నారు.ధర్మారాయుడు పేట పాల సొసైటీ లోని 250 మంది పాడి రైతులకు 3,66,204 రూ లను బోనస్ గా సొసైటీ అధ్యక్షుడు కావాలి రామునాయుడు రైతు లకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్స్ తెలుగు యువత ఆర్గనైజర్ వియ్యపు చిన్నా,పయిల శ్రీను,మోటూరు అప్పలరాజు,పయిల అప్పారావు,సూపర్ వైజర్ కృష్ణ,అత్థివిల్లి వెంకటరమణ మూర్తి,లీలా,పాడి రైతులు పాల్గొన్నారు.


 

 



 

రైతు భరోసా కేంద్రాలను ఈనెల 15కే సిద్దం చేయాలి


రైతు భరోసా కేంద్రాలను ఈనెల 15కే సిద్దం చేయాలి


ధాన్యం సేకరణ లక్ష్యాలను సాధించాలి


వీడియో కాన్పరెన్స్ లో జిల్లా కలక్టరు డా. హరి జవహర్ లాల్


 


        విజయనగరం,పెన్ పవర్ 


:  జిల్లాలో ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమేనని, రైతు సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలక్టర్ డా. హరి జవహర్ లాల్ వ్యవసాయాధికారులను ఆదేశించారు.  శనివారం కలక్టర్ మండల వ్యవసాయాధికారులతో పలు అంశాలపై వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేసారు.  రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30న ప్రారంభించనున్నామని, 15 నాటికే అన్ని సదుపాయాలతో సిద్దంగా వుంచాలని ఆదేశించారు.  ఇందులో ఏమైనా ఇబ్బందులుంటే నేరుగా కలక్టర్ నే సంప్రదించాలని సూచించారు.  విత్తనాల పంపిణీకి కావలసిన అంచనాలను తయారు చేసుకొని వాటికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలని, సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని అన్నారు.  రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేసే రైతు భరోసా ఆర్ధిక సహాయం కోసం లబ్ధిదారుల జాబితాలను ఈనెల 10లోగా వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.  పురుగు మందులు, ఎరువుల సరఫరాకు కూడా లబ్ధిదారుల జాబితాలను ఈనెల 5 లోగా సిద్దం చేసుకోవాలన్నారు.  ఇటీవల సంభవించిన అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాలను అంచనావేసి మే 5లోగా లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలన్నారు.  గత ఏడాది ఆగస్ట్, అక్టోబరు నెలల్లో జరిగిన పంట నష్టాల లబ్ధిదారులను మరోసారి వెరిఫై చేసి ఈనెల 10లోగా జాబితాలను పంపాలన్నారు.


 


      ధాన్యం సేకరణ లక్ష్యాలను సాధించాలి: జిల్లాలో ధాన్యం సేకరణకు ఈ రబీ కోసం 45 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసామని, 32 వేల మెట్రిక్ టన్నుల సేకరణకు లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు.   గ్రామస్ధాయి వ్యవసాయ సహాయకుల సహకారంతో  గ్రామాల్లో టాంటాం వేయించి గత ఏడాది కంటే ఎక్కువ సేకరించేలా చూడాలన్నారు. 


 


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  సంయుక్త కలక్టరు జి.సి. కిషోర్ కుమార్, సంయుక్త కలక్టరు- 2  ఆర్. కూర్మనాధ్, వ్యవసాయ శాఖ  సంయుక్త సంచాలకులు ఎం . ఆశాదేవి, వ్యవసాయ ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు మండలాల నుండి వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.


దేశ ప్రజలకు  ఉపరాష్ట్రపతి సందేశం


కరోనా మహమ్మారి నేపథ్యంలో.. మూడో విడత లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు  ఉపరాష్ట్రపతి సందేశం


ఉమ్మడి భాగస్వామ్యం, సంఘటిత ఆచరణతో కరోనాపై పోరు సాగిద్దాం


భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు


న్యూస్ డెస్క్, పెన్ పవర్ :



కరోనా మహమ్మారి నేపథ్యంలో మే 4 నుంచి మరో 2 వారాల పాటు 3వ విడత లాక్ డౌన్ (3.O) ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించడం కోవిడ్ -19తో సాగుతున్న సమిష్టిపోరాటంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాను. నా దృష్టిలో ఈ నిర్ణయం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత ఏజెన్సీలు, వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలతో సహా వ్యాపారుల సహకారంతో వైరస్  వ్యతిరేక పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉంది. ప్రజల జీవితాల పై దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి యుద్ధ వ్యూహాన్ని రూపొందించి చాలా వరకూ విజయం సాధించింది. ఈ ప్రయత్నం అందించిన సానుకూల ఫలితాలను సమాజం హర్షిస్తోంది. 
లాక్ డౌన్ 3.O విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు భరోసాను అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు మరియు జీననోపాధిని ఏక కాలంలో సమతుల్యం చేయవలసిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం మొదలు కానుంది. గ్రీన్ జోన్స్ లో చాలా భాగం, ఆరెంజ్ జోన్స్ లో కొంత భాగం ఆవసరమైన ఆర్థిక పునరుజ్జీవనానికి పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత మార్గంలో అడుగు ముందుకు వేయాలి.
ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమౌతున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ఇలాంటి వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు. మొదటి, రెండవ లాక్ డౌన్ సమయాల్లో తీసుకువచ్చిన గొప్ప మార్పులు, రాబోయే కాలంలో వైరస్ పూర్తిగా అంతమొందే వరకూ అన్ని చోట్ల కొనసాగుతూనే ఉండాలి. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, సమావేశాలు నిర్వహించకపోవడం లాంటి వాటి ద్వారా ఇప్పటి వరకూ ఎంతో లబ్ధి పొందాం. ఇక మీదట కూడా ఇదే మార్గంలో పయనించాలి. ఎందు కంటే కనిపించని ఈ శత్రువు మనం ఆలసత్వం వహిస్తే మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉంది. 
సమర్థవంతమైన నిర్ణయాల ద్వారా కోవిడ్ -19 వ్యతిరేకపోరాటంలో భారతదేశంలో ముందంజలో ఉంది. దీన్ని నేను కోవిడ్ – కామనాలిటి ఆఫ్ విజన్, ఇంటెంట్ అండ్ డిటర్మినేషన్ *(‘COVID’ – Commonality of Vision, Intent and Determination)* గా భావిస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో విభిన్న భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో నివసిస్తున్న 130 కోట్ల మంది భారతీయులు అనుసరించిన ఇలాంటి సాధన ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు వంటి ముందు వరుస యోధులతో పాటు రైతులు, ప్రజలు కూడా ప్రశంసలకు అర్హులే. కానీ ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు, సాధించాల్సిన విజయం చాలా ఉంది. కోవిడ్ వైరస్ అన్ని వర్గాలతో కలిసి ఎక్కువ కాలం జీవించగలదని అంచనా వేసిన నేపథ్యంలో, మనం ఈ మహమ్మారి నిజాన్ని అంగీకరిస్తూనే దూరం చేసే ప్రయత్నాలు కొనసాగించాలి.  
లాక్ డౌన్ 3.Oలో మనమంతా ప్రవర్తించే విధానం మీద ఆధారపడే కరోనా తర్వాత సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఉద్దేశించిన తదుపరి చర్యలు ఉంటాయి. రెండు వారాల పరిమితి, భవిష్యత్ కార్యాచరణ కాలపరిమితిని నిర్ణయిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక పరీక్ష. ఒక దేశంగా, మనమంతా ఇందులో కచ్చితంగా ఉత్తీర్ణులం కావడం అత్యం కీలకం. ఇందులో మనం ఏ విధంగానూ విఫలం కామని నా గట్టి నమ్మకం. ఇంతకు ముందు నేను చెప్పినట్లు తదుపరి పొడిగింపు, సడలింపు, ముగింపు నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది.
ఈ దిశలో పౌరులందరూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...