Followers

దేశ ప్రజలకు  ఉపరాష్ట్రపతి సందేశం


కరోనా మహమ్మారి నేపథ్యంలో.. మూడో విడత లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు  ఉపరాష్ట్రపతి సందేశం


ఉమ్మడి భాగస్వామ్యం, సంఘటిత ఆచరణతో కరోనాపై పోరు సాగిద్దాం


భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు


న్యూస్ డెస్క్, పెన్ పవర్ :



కరోనా మహమ్మారి నేపథ్యంలో మే 4 నుంచి మరో 2 వారాల పాటు 3వ విడత లాక్ డౌన్ (3.O) ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించడం కోవిడ్ -19తో సాగుతున్న సమిష్టిపోరాటంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాను. నా దృష్టిలో ఈ నిర్ణయం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత ఏజెన్సీలు, వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలతో సహా వ్యాపారుల సహకారంతో వైరస్  వ్యతిరేక పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉంది. ప్రజల జీవితాల పై దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి యుద్ధ వ్యూహాన్ని రూపొందించి చాలా వరకూ విజయం సాధించింది. ఈ ప్రయత్నం అందించిన సానుకూల ఫలితాలను సమాజం హర్షిస్తోంది. 
లాక్ డౌన్ 3.O విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు భరోసాను అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు మరియు జీననోపాధిని ఏక కాలంలో సమతుల్యం చేయవలసిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం మొదలు కానుంది. గ్రీన్ జోన్స్ లో చాలా భాగం, ఆరెంజ్ జోన్స్ లో కొంత భాగం ఆవసరమైన ఆర్థిక పునరుజ్జీవనానికి పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత మార్గంలో అడుగు ముందుకు వేయాలి.
ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమౌతున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ఇలాంటి వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు. మొదటి, రెండవ లాక్ డౌన్ సమయాల్లో తీసుకువచ్చిన గొప్ప మార్పులు, రాబోయే కాలంలో వైరస్ పూర్తిగా అంతమొందే వరకూ అన్ని చోట్ల కొనసాగుతూనే ఉండాలి. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, సమావేశాలు నిర్వహించకపోవడం లాంటి వాటి ద్వారా ఇప్పటి వరకూ ఎంతో లబ్ధి పొందాం. ఇక మీదట కూడా ఇదే మార్గంలో పయనించాలి. ఎందు కంటే కనిపించని ఈ శత్రువు మనం ఆలసత్వం వహిస్తే మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉంది. 
సమర్థవంతమైన నిర్ణయాల ద్వారా కోవిడ్ -19 వ్యతిరేకపోరాటంలో భారతదేశంలో ముందంజలో ఉంది. దీన్ని నేను కోవిడ్ – కామనాలిటి ఆఫ్ విజన్, ఇంటెంట్ అండ్ డిటర్మినేషన్ *(‘COVID’ – Commonality of Vision, Intent and Determination)* గా భావిస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో విభిన్న భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో నివసిస్తున్న 130 కోట్ల మంది భారతీయులు అనుసరించిన ఇలాంటి సాధన ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు వంటి ముందు వరుస యోధులతో పాటు రైతులు, ప్రజలు కూడా ప్రశంసలకు అర్హులే. కానీ ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు, సాధించాల్సిన విజయం చాలా ఉంది. కోవిడ్ వైరస్ అన్ని వర్గాలతో కలిసి ఎక్కువ కాలం జీవించగలదని అంచనా వేసిన నేపథ్యంలో, మనం ఈ మహమ్మారి నిజాన్ని అంగీకరిస్తూనే దూరం చేసే ప్రయత్నాలు కొనసాగించాలి.  
లాక్ డౌన్ 3.Oలో మనమంతా ప్రవర్తించే విధానం మీద ఆధారపడే కరోనా తర్వాత సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఉద్దేశించిన తదుపరి చర్యలు ఉంటాయి. రెండు వారాల పరిమితి, భవిష్యత్ కార్యాచరణ కాలపరిమితిని నిర్ణయిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక పరీక్ష. ఒక దేశంగా, మనమంతా ఇందులో కచ్చితంగా ఉత్తీర్ణులం కావడం అత్యం కీలకం. ఇందులో మనం ఏ విధంగానూ విఫలం కామని నా గట్టి నమ్మకం. ఇంతకు ముందు నేను చెప్పినట్లు తదుపరి పొడిగింపు, సడలింపు, ముగింపు నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది.
ఈ దిశలో పౌరులందరూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.


వైసీపీ నాయకుల ఆద్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ


 


పూర్ణా మార్కెట్, పెన్ పవర్


 


గోకుల్ థియేటర్ నుంచి చావుల మదుం రోడ్ లో ఉన్న పాత శివాలయం వద్ద హోటల్ ఎస్ ఎస్ జి రెసిడెన్సి అధినేత గోగుల.రామారావు, పవన్ హెచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి శ్రీనివాస్ ల ఆర్థిక సహాయంతో "కరోనా లోక్ డౌన్ "....వలన ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఈ ప్రాంత వాసులకు కు 500 మందికి సుమారు వెయ్యి రూపాయల విలువైన నిత్యవసర వస్తువులు  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ , వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ , వైయస్సార్సీపి నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ , పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుల సమక్షంలో పేదలకు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తూ వారి వారి కుటుంబాలను కాపాడుకోవాలని ప్రజలకు తెలియజేశారు, పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్  ఈ కార్యక్రమం నిర్వహించిన సంస్థలను ఇటువంటి సమయంలో వారు ఉదార స్వభావం తో ఇటువంటి మంచి కార్యక్రమాలు తలపెట్టడం ఎంతో అభినందనీయం అని వారిని ప్రశంసించారు,
ఈ కార్యక్రమంలో ఈ యొక్క సంస్థల డైరెక్టర్లు దాసరి రాధాకృష్ణ, వేచాలపు దొరబాబు, బిక్కిన శ్రీనివాస్, రొంగలిసూర్యనారాయణ, లెక్కల నాయుడు, మకర గోపి, గంట శ్రీను మరియు ఆయా సంస్థల యొక్క సహాయక బృంద సభ్యులు పాల్గొన్నారు.


79 వ వార్డ్ లో కొనసాగుతున్న రౌతు కరోనా సహాయం





79 వ వార్డ్ లో కొనసాగుతున్న రౌతు కరోనా సహాయం

 

              పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:కరోనా సహాయంలో భాగంగా అలుపు ఎరగని యోధుడిలా ప్రజకు సహాయం చేస్తూ ముందుకు సాగుతున్న రౌతు శ్రీనివాస్.79 వ వార్డు అగనంపూడి పరిధి దిబ్భ పాలెం మరియు గళ్ళవాని పాలెం శనివాడ లో గల అపార్ట్మెంట్ల వాచ్మెన్,పారిస్యుద్య కార్మికుల లకు నిత్యావసర సరుకులను 79 వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రౌతు శ్రీనివాస్ పంపిణీ చేశారు.సుమారు 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరణం సత్యారావు,దంతులూరి సుబ్బరాజు, ఈగల పోలినాయుడు నర్సింగరావు,ఈలపు శ్రీను,సిరంశెట్టి బాబ్జి,పివి.రమణ,మామిడి నాయుడు, బోబ్బరి సూర్య,గంతకోరు అప్పారావు, సింగిడి సింహాచలం, బలిరెడ్డి సత్యనారాయణ,మాడిస వెంకట్రావు, కరణం జగదీష్,కరణం సురేష్,పి నాగేశ్వరరావు,గొల్లవిల్లి వెంకట్రావు, మామిడి సత్తిబాబు,మోటూరి సత్యారావు,మువ్వల మహేష్,ఎం  నాగరాజు,ఉరికోటి రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు


 

 



 

ఉమర్ ఆలీషా ట్రస్ట్ ద్వారా పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి


 


 


 


ఉమర్ ఆలీషా ట్రస్ట్ ద్వారా పారిశుధ్య కార్మికులకు లక్ష రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణి


 


ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ , పిఠాపురం వారి ఆధ్వర్యంలో  కోవిడ్ 19 మహమ్మారిని నిరోధించుటకు నిరంతరము శ్రమిస్తున్న జీవీఎంసీ భీమిలి జోన్ లో పని చేయుచున్న 150 మంది పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణి చేయడము జరిగినది . భీమిలి పరిధి లో పని చేస్తున్న 60 మంది పారిశుధ్య కార్మికులకు భీమిలి రేల్లివీది నందు, తగరపువలస పరిధి పనిచేస్తున్న 90 మంది పారిశుధ్య కార్మికులకు సంతపేత గ్రామసచివాలయం నందు ఈ కార్యక్రమం నిర్వహింపబడింది. భీమిలి బీచ్ లో ఉన్న 12 మంది జెయింట్ వీల్ వలస కార్మికులకు వంట నూనె, గోధుమపిండి కుడా పంపిణ చేయడమైనది. ఈ సందర్భముగా భీమిలి మునిసిపల్ జోనల్ కమీషనర్ గోవిందా రావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులందరికి కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు ఉమర్ ఆలీషా ట్రస్ట్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డా. ఆనంద కుమార్ పింగళి మాట్లాడుతూ "ట్రస్ట్ చైర్మన్ డా. ఉమార్ ఆలీషా ఆదేశాల మేరకు ఉభయ తెలుగు రాష్టాలలో తమ వాలంటీర్స్ ద్వారా కరోనా పై అవగాహన కార్యక్రమములు నిర్వహిస్తూ మరియు ఉచితముగా 16 లక్షల మందికి వ్యాధి నిరోధక శక్తి పెంపొందిప చేసే హోమియా మందులు పంపిణి చేశామని , అలాగే సుమారుగా 16 వేల మాస్కులు కుట్టించి పంపిణి చేశామని అన్నారు. అవసరమైన చోట్ల భోజనము పాకెట్స్ మరియు నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నామన్నారు. ఈ రోజు భీమిలిలో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే మొత్తము 17 నిత్యావసర సరుకులు, పంపిణి చేయడము జరిగిందన్నారు. " ఈ కార్య కార్యక్రమములో భీమిలి మునిసిపల్ జోనల్ కమీషనర్ గోవిందా రావు , TPRO శ్రీనివాస రావు , సానిటరీ ఇనస్పెక్టర్ బి. ఎం నాయుడు, మరియు మునిసిపల్ సిబ్బంది, ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డాక్టర్ ఆనంద కుమార్ పింగళి , పి. మంజుల, కె. ప్రసాద రెడ్డి, శివ రెడ్డి, ఎం . మురళీధర్ , రవి పాల్గొన్నారు.


మానవసేవయే మాధవ సేవ


మానవసేవయే మాధవ సేవ



మానవసేవయే మాధవ సేవ స్ఫూర్తితో ఎంవిపి యంగ్ స్టార్స్ యూత్ సెక్టార్  సిక్స్ వారు పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు నిరాశ్రయులకు రోడ్లపై ఉన్న యాచకులకు మీకు మేమున్నాము అని ముందుకువచ్చి లాక్ డౌన్ ప్రకటించనప్పడి నుండి ఇప్పటివరకు పేదలకు బ్రేడ్ ఆహారం మంచినీళ్లు ప్యాకెట్ వారి సొంత ఖర్చులతో పార్టీలకతీతంగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారి కార్యక్రమాలకు చేదోడుగా విశాఖ పోర్ట్ డాగ్ ఎంప్లాయిస్ అండ్ సెక్టార్ సిక్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు రెండు రోజుల భోజన సామాగ్రిని యూత్ కి అందజేశారు గతంలో కూడా వీరు భోజన సామాగ్రిని అందించడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమం చేయుటలో యువకులకు అభినందించంతొ పాటు మీకు ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేయడం జరిగింది కాలనీవాసులు  కూడా వారి యొక్క సహాయ కార్యక్రమాలకు అభినందించి ప్రోత్సాహాన్ని ఇవ్వటం జరిగింది అలాగే విశాఖ పోర్టు డాగ్ ఎంప్లాయిస్ వారు కాలనీలో ప్రతి నివాసితులకు వద్దకు వెళ్లి కరోనా పై అవగాహన కల్పిస్తూ కాలనీవాసులకు మాస్క్ లను పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు  మాస్క్ ధరించాలి అని అందరికీ ఉచిత    మాస్క్ లను పంపిణీ చేయడం జరిగింది కాలనీలో కూడా  బ్లీచింగ్ జల్లించటం  కార్యక్రమములు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్, పరుశురాం, కే రాము,, బి లక్ష్మణ్ రావు, పి అప్పలరాజు, సత్యం, ఎస్ నర్సింగరావు, డీ రజనీకాంత్, ధనరాజ్, ఆర్ కేశవ, ఎల్ మహేష్, ఎం రాజేష్ పాల్గొంటారు జరిగింది


ప్రజల ముందుకు డిస్ ఇన్ఫెక్షన్ ఛాంబర్


ప్రజల ముందుకు డిస్ ఇన్ఫెక్షన్ ఛాంబర్


 

తూర్పు నియోజకవర్గం 12వ వార్డు ఆరిలోవ తోట గరువు హైస్కూల్ ప్రాంగణంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిస్ ఇన్ఫెక్షన్ చాంబర్ ను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ మీనా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా రోడ్డుమీద కూడదని అవసరాన్ని బట్టి కుటుంబానికి ఒకరిగా కొనుగోలు చేయడానికి రావాలని నగరంలో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రజలు ప్రభుత్వం కి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీ ఎం ఆర్ అధినేత మావూరి వెంకట రమణ. గోపీనాథ్ రెడ్డి.ఏసిపి రంగరాజు. మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు. సి ఐ లక్ష్మణ మూర్తి     యస్ఐలు గోపాల్ రావు. సురేష్. ఆరిలోవ పోలీస్ సిబ్బంది వైసిపి నాయకులు జీ వి ఎం సి. గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

 దాతలకు కృతజ్ఞతలు.. 


 


 దాతలకు కృతజ్ఞతలు.. 


ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్


భీమవరం,  పెన్ పవర్


కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండటానికి ముందుకు వస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎంఎలు గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి సహయ నిధి నిమిత్తం పలువురు ప్రముఖులు స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విరాళాల రూపంలో చెక్కులను ఎంఎల్ప గ్రంధి శ్రీనివాస్ కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం బాధ్యతగా పని చేస్తుందని, ఎక్కడికక్కడ కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే మాదిరిగా లాక్ డౌన్ లో ప్రజలు ఇబ్బందులు పడకుండా మూడు దఫాలుగా బియ్యం, కందిపప్పును కూడా అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని అన్నారు. చిన అమిరం గ్రామానికి చెందిన భాసిని డవలపర్స్ అధినేతలు కొల్లి నరిసింహమూర్తి, చికిలే సత్యానందం, ఆరేటి పద్మారావులు రూ లక్ష వెయ్యి 116 ల చెక్కును ఆ గ్రామ మాజీ సర్పంచ్ గొట్టుముక్కల సత్యనారాయణరాజు (ధర్మరాజు) ఆధ్వర్యంలో అందించారు. పట్టణానికి చెందిన టాక్సీ ఓనర్స్ అసోషియోషన్ అధ్యక్ష, కార్యదర్శులు వేగి భగవాన్ నారాయణ, మోటుపల్లి వెంకటరత్నంలు రూ 30 వేల చెక్కును, పట్టణానికి చెందిన ఆర్ పిలు రూ 20 వేలు చెక్కును అందించారు. ఈ సందర్భంగా దాతలకు ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...