Followers

గుమ్మల్లదొడ్డి లో ప్రతీ ఇంటికి కోడి గుడ్లు పంపిణీ


గుమ్మల్లదొడ్డి లో ప్రతీ ఇంటికి కోడి గుడ్లు పంపిణీ

 

గోకవరం పెన్ పవర్.

 

 

తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం, గుమ్మళ్ళదొడ్డి లో దాతలు తమ ఔదార్యాన్ని చాటుతున్నారు. ప్రస్తుత  విపత్కర పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ ఇంటికి పరిమితం అయ్యారు..ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్య తరగతి ప్రజల కు తన వంతుగా సహకరించాలని ఇదే గ్రామానికి చెందిన శరకణం మురళీ కృష్ణ కుటుంబం నిర్ణయించుకుంది. వైద్యులు ఇస్తున్న సలహా మేరకు ప్రోటీన్లు అధికంగా ఉండే కోడి గుడ్లు పంపిణీ చెయ్యడానికి ముందుకు వచ్చారు. సుమారు 1200 పై చిలుకు కుటుంబాలకు 65,000/- విలువ చేసే కోడిగుడ్లను స్వయంగా ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత మురళీ కృష్ణ మాట్లాడుతూ,  తాను ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు గా పని చేస్తున్నాను అని, కూలీలు పడుతున్న ఇబ్బందులు తెలుసు కనున , కార్మిక దినోత్సవం రోజున గ్రామంలోని ప్రతీ ఇంటికి స్వయంగా గుడ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు, స్థానిక యువకులకు కృతజ్ఞతలు తెలిపారు...

ఘనంగా మేడే ఉత్సవాలు


ఘనంగా మేడే ఉత్సవాలు

 

గోకవరం, పెన్ పవర్

 

తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపో నందు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద కార్మికులుఘనంగా గా మేడే దినోత్సవా  సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి పైడి మల్ల లక్ష్మణరావు మాట్లాడుతూ 1886 అమెరికాలో కార్మికుల త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ వారికి జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా డిపో లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోకవరం ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు గొర్లె త్రిమూర్తులు, అక్కిరెడ్డి కృష్ణ, ప్రగడ ప్రసాద్,కవల రామకృష్ణ, బి. కె. పాదం, బూసీ గంగరాజు, రిటైర్ కార్మికులు పాలపర్తి నారాయణ రావు, మంగరాతి నాగేశ్వర రావు, డిపో కమిటీ యస్ అర్ కె దొర,అప్పాజీ, బేబి రావు, పైల శ్రీనివాస రావు, గేరేజి కార్మికులు దేముడు శ్రీను తదితరులు పాల్గొన్నారు

పారిశుధ్యంపై మ‌రింత శ్ర‌ద్ద పెట్టాలి


పారిశుధ్యంపై మ‌రింత శ్ర‌ద్ద పెట్టాలి



జోన్‌లను బ‌ట్టి మాస్కుల పంపిణీ



కంటైన్‌మెంట్ జోన్‌ల‌లో ప్ర‌తిరోజూ స‌ర్వే



ప‌ట్ట‌ణాల్లో త్రాగునీటి ఎద్ద‌డి రానివ్వొద్దు



మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు మంత్రి బొత్స ఆదేశం



         విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్


పారిశుధ్యంపై మ‌రింత దృష్టి పెట్టాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నుంచి ఆయ‌న శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆయా మున్సిపాల్టీల్లో చేప‌డుతున్న పారిశుధ్య, అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను, మాస్కుల పంపిణీ వివ‌రాల‌ను తెలుసుకున్నారు.

           మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు అల‌స‌త్వాన్ని విడ‌నాడాల‌ని, రాష్ట్రంలో పారిశుధ్యాన్ని మ‌రింత మెరుగు ప‌ర్చేందుకు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా  పారిశుధ్య సిబ్బందికి, సెక్ర‌ట‌రీల‌కు మ‌ద్య స‌మ‌న్వ‌యం ఉండేలా చూడాలని సూచించారు. ఇంటింటి చెత్త‌సేక‌ర‌ణ ప్ర‌తీరోజూ చేప‌ట్టాల‌న్నారు. రాష్ట్రంలో మాస్కుల పంపిణీని వేగ‌వంతం చేయాల‌ని అన్నారు. రెడ్‌జోన్‌, ఆరెంజ్ జోన్‌, గ్రీన్ జోన్ల‌లో ప్రాధాన్య‌తా క్ర‌మంలో పంపిణీ చేప‌ట్టాల‌న్నారు. కంటైన్‌మెంట్ జోన్‌ల‌లో వాలంటీర్ల ద్వారా ప్ర‌తిరోజూ ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే క్వారంటైన్ కేంద్రాల‌వ‌ద్ద పారిశుధ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపాల‌ని, ఈ కేంద్రాల‌వ‌ద్ద సిబ్బందిని నియ‌మించే బాధ్య‌త జిల్లా కేంద్రంలోని క‌మిష‌న‌ర్లదేన‌ని పేర్కొన్నారు.
           
           మ‌న‌బ‌డి నాడు-నేడు క్రింద మున్సిప‌ల్ ప‌రిధిలో రాష్ట్రంలో 783 పాఠ‌శాల‌ల అభివృద్దికి చ‌ర్య‌లు చేపట్టామ‌ని మంత్రి తెలిపారు. ఈ ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించి ఆగ‌స్టు నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మ‌రుగుదొడ్లు నిర్మాణం, త్రాగునీరు, విద్యుత్, భ‌వ‌నాల మైన‌ర్ మ‌ర‌మ్మ‌తులు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం త‌దిత‌ర ప‌నుల‌న్నీపేరెంట్స్ క‌మిటీల ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టాల‌ని సూచించారు. ప‌ట్ట‌ణాల్లో తాగునీటి ఎద్దడి త‌లెత్త‌కుండా చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని, సీజ‌న‌ల్ వ్యాధుల‌పై దృష్టి పెట్టాల‌ని ఆదేశించారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మంత్రితోపాటు విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ ఎస్ ఎస్ వ‌ర్మ‌,  విజ‌య‌వాడ నుంచి ఎంఏయుడి సెక్ర‌ట‌రీ శ్యామ‌ల‌రావు, క‌మిష‌న‌ర్ విజ‌య్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  


పాడి రైతులకు కరోనా బోనస్ అందజేసిన చుక్క





పాడి రైతులకు కరోనా బోనస్ అందజేసిన చుక్క

 

           పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:కరోనా వైరస్ నివారణా చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధం లో ఉన్న పాడి రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా విశాఖ డైరీ ముందస్తుగా ప్రకటించిన15 రోజుల పేమెంట్ ని బోనస్ గా మాజీ సర్పంచ్ చుక్క రామునాయుడు పాడి రైతులకు శుక్రవారం ఉదయం స్థానిక పాల ఉత్పత్తి కేంద్రం ఆవరణలో అందజేశారు.256 మంది పాడి రైతులకి బోనస్ అమౌంట్ కింద  మూడు లక్షల 56 వేల రూపాయలు పంపిణీ చేశారు. అలాగే ఇటీవల కాలంలో పాల సోసైటీ పరిధిలో రెండు పాడి గేదలు మరణించడంతో వారికి ఇన్సూరెన్స్ రూపంలో వచ్చినటువంటి ఒక్కొక్క పాడి గేదె కి 38 వేల రూపాయలు చొప్పున మరణించిన రెండు పాడి గేదెల సంబంధించిన రైతులకు ఇన్సూరెన్స్ అమౌంట్ అందజేయడం జేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాల సొసైటీ అధ్యక్షుడు కుండ్రపు చిన్నబాబు, సొసైటీ సూపర్వైజర్లు, సొసైటీ స్టాఫ్,   పాడి రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

పరవాడ లో మేడే సంబరాలు




సిఐటియు ఆధ్వర్యంలో పరవాడ లో మేడే సంబరాలు


 

పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:కరోనా ప్రభావం వలన బహుతిక దూరం పాటిస్తూ శుక్రవారం నాడు పరవాడ,ఫార్మాసిటీ, ఎన్టీపీసీ దగ్గర సిఐటియు గనిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో సిఐటియు జెండాలను ఎగరవేశారు.పరవాడలో గనిశెట్టి,ఎన్టీపీసీ దగ్గర యూనియన్ అధ్యక్షుడు పయిల పోతునాయుడు,ఫార్మాసిటీ లో యూనియన్ అధ్యక్షుడు ఎమ్.బాబురావు,లంకెలపాలెం ముఠా యూనియన్ వర్కర్ల ఆధ్వర్యంలో కే.అప్పారావు, చీపురుపల్లి రెడ్డి.సన్ని బాబు జెండాను ఎగురవేశారు.మండలంలోని అన్ని ప్రాంతాలలో ముఠా వర్కర్ల యూనియన్లు,కార్మిక సంఘాల యూనియన్లు సిఐటియు జెండాలను ఎగురవేసి కార్మికుల ఐక్యత వర్థిలాలి అని నినాదాలు చేసి మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. 


 

 



 

పోలీస్ సిబ్బందికి పాదరక్షలు వితరణ చేసిన సూరాడ బంగార్రాజు


కరోనా నియత్రణకు అహర్నిశలు శ్రమిస్తున పోలీస్ సిబ్బందికి పాదరక్షలు వితరణ చేసిన సూరాడ బంగార్రాజు


            పరవాడ పెన్ పవర్



పరవాడ మండలం:కరోనా వైరస్ ప్రభావం నానాటికి పెడుతున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి  కరోనా వైరస్ బారి నుండి ప్రజలను కాపాడడం కోసం నిరంతరం శ్రమిస్తున్న  పరవాడ పోలీసు సోదరులను గౌరవిస్తూ తిక్కవానిపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి అభ్యర్థి సురాడ బంగారు రాజు తన సొంత నిధులతో 48 మంది పోలీస్ సిబ్బందికి పాదరక్షలు(షూస్) ని సమకూర్చగా వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర సి.ఈ. సి సభ్యులు పయిల శ్రీనివాసరావు,మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు లు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో సిబ్బందికి అందజేసారు.కార్యక్రమంలో భాగంగా పోలీసు సోదరులకు సహాయం చేసిన బంగారురాజు ని సి.ఐ రఘువీర్ విష్ణు అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల వైసిపి పార్టీ ఉపాధ్యక్షుడు బొంది అచ్చిబాబు,మాజీ ఎం.పి.టి.సి సభ్యులు తిక్కాడ సత్యనారాయణ,సూరాడ తాతారావు, హరీష్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

 



ప్రజాభిప్రాయమే మున్సిపల్ శాఖ పనితీరుకు కొలమానం

 


 


 


 


 


 


 


ప్రజాభిప్రాయమే మున్సిపల్ శాఖ పనితీరుకు కొలమానం -


మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధిశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ 


 


విశాఖపట్నం, పెన్ పవర్  :


 


ఆంధ్రప్రదేశ్ లో గల పట్టణ/నగరాలలో నివశిస్తున్న ప్రజల మద్దతే మున్సిపల్ శాఖలోని అధికారులు, సిబ్బంది పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధిశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు ఆయన ఎం.ఏ అండ్ యు.డి శాఖ కార్యదర్శి శ్యామలరావు సిడిఎంఏ విజయకుమార్‌తో కలసి రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లు మరియు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని, మున్సిపల్ ముఖ్య విధులైన పారిశుద్ధ్యం, రసాయనాలు చల్లించడం వంటి కార్యక్రమాలు తు.చ.తప్పకుండా చేయాలని, ప్రజలు వద్ద నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండాలని ఆదేశించారు. ఏదైనా మున్సిపాలిటీకి గాని, కార్పోరేషన్ గాని కోవిడ్ పనులు నిర్వహించడానికి నిధులు లేమి ఉంటే, తనకుగాని, మున్సిపల్ శాఖ కార్యదర్శి దృష్టిలోగాని, మున్సిపల్ శాఖ కమిషనర్ దృష్టిలోగాని పెట్టాలని సూచించారు. వేసవి కాలం నడుస్తున్నందున నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఇంజనీరింగు అధికారులను కోరారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుకుండా తగు జాగ్రత్తలు తీసుకోనడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, పెద్ద కాలువల్లో పూడిక తీయడం మే నెలాఖరులోగా పూర్తి చేయాలని కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం మున్సిపల్ పాఠశాలల్లో నిర్దేశిత కాలానికి పనులు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ పరిపాలన మరియు అభివృద్ధిశాఖా కార్యదర్శి జె.శ్యామలరావు పారిశు ద్ర్య విభాగంలో నియమించిన వార్డు కార్యదర్శులును పూర్తిగా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నం చేయాలని వారి ద్వారా పారిశుద్ధ్య పనులు విరివిగా చేపట్టి ప్రజలు నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. కోవిడ్ క్వారంటైన్ కేంద్రాల్లో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి పనులు అప్పగించరాదని, ప్రత్యేకంగా తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకొని క్వారంటైన్ కేంద్రాల్లో పనులు అప్పగించాలన్నారు. నిషేధిత ప్రాంతాల్లో పాసులు మంజూరు చేయడం వంటి విధులు, నిబంధనలు అనుగుణంగా చేపట్టాలని, ఏమైనా సమస్యలుంటే తనదృష్టికి గాని, సి.డి.ఎం.ఏ దృష్టికి గాని తేవాలన్నారు. కరోనా వ్యాధి వలన మరణించిన వారి అంత్యక్రయలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. సి.డి.ఎం.ఏ విజయకుమార్ ఎస్ఆర్ కె ఆర్జి మాట్లాడుతూ వార్డు వాలంటీర్లు సేవలు వినియోగించుకొని, ప్రభుత్వం ఆదేశించిన విధంగా నాలుగవ విడత గృహాల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కొన్ని మున్సిపాలిటీలు, పారిశుద్ధ్య సిబ్బంది హాజరు తక్కువగా ఉందని, గృహాల నుండి చెత్తను వేరుచేసి, సేకరణ చేయడంలో అలసత్వం కనబడుతున్నదని వీటిపై కమిషనర్లు దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ప్రభుత్వాదేశాలుసారంగా ప్రతి ఇంటిలో కల వ్యక్తికి మూడు మాస్కులు చొప్పున అందించే పనిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాబోయే కాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని తగు ప్రణాళికా సిద్ధం చేసుకోవాలని కాలువల్లో పూడికతీత మే నెలాఖరకు పూర్తి చేయాలన్నారు. జివిఎంసి కి సంబంధించి కమిషనర్ మాట్లాడుతూ కరోనా నియంత్రన గూర్చి నగరంలో చేపడుతున్న కార్యక్రమాలను ముఖ్యంగా, నిషేధిత ప్రాంతాలలో మురికివాడల్లో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, రసాయనాలు జల్లడం వంటి కార్యక్రమాలు తెలిపారు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండడానికి తగు చర్యలు చేపట్టామని తెలిపారు. కాలువల్లో పూడికతీతకు గాను పరిపాలన ఆమోదం తెలిపామని చెప్పారు. రాబోయే కాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్నారు. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా మెప్మా వారు అందించిన మాస్కులను నగరంలోని పౌరులకు త్వరితగతిన అందించడానికి తగు చర్యలు చేపట్టామన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు. ఇంకా ప్రజారోగ్య ఇంజనీర్-ఇన్-చీఫ్ డా.వి.చంద్రయ్య ఇంజనీరింగు పనులు పురోగతి గూర్చి వీడియో కాన్ఫరెన్సులో తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జివిఎంసి తరపున అదనపు కమిషనర్లు సోమన్నారాయణ, డా.వి.సన్యాసిరావు చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, చీఫ్ ఇంజనీరు వేంకటేశ్వరరావు, సి.ఎం.ఓ. హెచ్ డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, పిడి యుసిడి వై.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యు) ఫణిరామ్, పర్యవేక్షక ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు, విశాఖ, విజయనగరం జిల్లాల పబ్లిక్ హెల్త్ పర్యవేక్షక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.


 


 


 


 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...