Followers

మహాజ్ఞాని భగీరథమహర్షి జయంతి శుభాకాంక్షలు..


మహాజ్ఞాని భగీరథమహర్షి జయంతి శుభాకాంక్షలు..

 

డి పి వో శ్రీనివాస్ విశ్వనాథ్..

 

పోలవరం, పెన్ పవర్

 

భగీరథుడు మహా జ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపం ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారని, ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు.. భగీరథుని చరిత్ర గురించి ఆయనకు తెలిసిన కొన్ని విషయాలు ఇలా వివరించారు .  భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడు. అసలు భగీరథుడు గంగను ఆకాశం నుండి ఎందుకు తీసుకురావలసి వచ్చిందో, దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

 సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు అసమంజుడు జన్మించాడు. చిన్న భార్యకి అరవైవేలమంది కొడుకులు పుట్టారు. అసమంజుని కొడుకు అంశుమంతుడు.  సగరుడు 99 అశ్వమేధ యాగాలు పూర్తయి, నూరవ యాగం నిర్వహిస్తున్నాడు. నూరు యాగాలు పూర్తిచేసినవారు దేవలోకానికి రాజయ్యే అర్హత పొందుతారు. అందుకే ఎవరు నూరు యాగాలు పూర్తి చేయబోతున్నారు అని తెలిసినా ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో అని భయం. అందుకే సగరుని నూరవ యాగం సక్రమంగా పూర్తి కాకుండా చేయాలనుకున్నాడు. యాగాశ్వాన్ని పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టేశాడు.  సగరుని కొడుకులు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ బయల్దేరారు. చివరికి పాతాళంలో దొరికింది. కపిల మహర్షే దాన్ని తనవద్ద కట్టేసుకున్నాడని అపోహపడ్డారు. ఆ మహామునితో అసభ్యంగా మాట్లాడారు. ఆ అరుపులకు కపిలమహర్షి తపస్సుకు భంగం కలిగింది. ఆయన కోపంగా కళ్ళు తెరిచేసరికి ఆ కళ్ళలోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. అవి సగరపుత్రులను భస్మం చేశాయి. యాగాశ్వం కోసం వెళ్ళిన కొడుకులు ఎంతకూ తిరిగిరాకపోవడంతో మనుమడు అంశుమంతుని పంపాడు. అంశుమంతుడు పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి బాధపడ్డాడు. వారి ఆత్మలను ఊర్ధ్వ లోకాలకు పంపాలని ఉదకం చిలకరించబోతోంటే అశరీరవాణి ''అంశుమంతా, మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వ లోకాలు చేరవు. పవిత్ర గంగాజలంతో మాత్రమే సద్గతి పొందుతారు'' అంటూ పలికింది.  అంశుమంతుడు నిట్టూర్చి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.  సగరుని తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు. దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు చిన్న వయసులోనే రాజయ్యాడు. అప్పటివరకూ భస్మం అయిన రాజకుమారులకు సద్గతి కలగలేదు.చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పగా విషయం తెలుసుకున్నాడు. పవిత్ర ఆకాశగంగను భువికి తెస్తానని తల్లితో చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుని తలచుకుంటూ కఠోర తపస్సు చేశాడు.బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథా, నీ కఠోర దీక్ష అమోఘం. నీ కోరిక నెరవేరుతుంది. అయితే ఆకాశం నుండి మహోధ్రుతంగా కిందికి దూకుతుంది గనుక అది తిన్నగా భూమ్మీద పడితే కష్టం.. పరమేశ్వరుని ప్రసన్నం చేసుకో, అప్పుడే ఆకాశగంగను నియంత్రించడం సాధ్యమౌతుంది..'' అన్నాడు.భగీరథుడు మరోసారి శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై భువి నుండి దివికి ఉరుకుతున్న సురగంగకు తన జటాజూటాన్ని ఆధారంగా చేశాడు. దాంతో ఆకాశగంగ శివగంగగా మారి, అక్కణ్ణించి భువికి దూకింది. భగీరథుని వెంట పరుగులు తీసి ''భాగీరథి'' అయింది. జహ్నుముని ఆశ్రమంలో చిందులు వేసింది.అది చూసిన జహ్నుముని గంగను అమాంతం తాగేశాడు. అది చూసి కలవరపడిన భగీరథుడు 'గంగను వదలమని'' ప్రాధేయపడగా జహ్నుముని చెవిలోంచి వదిలాడు. అందుకే గంగను ''జాహ్నవి'' అంటారు. అక్కణ్ణించి మళ్ళీ భగీరథుని వెంట పరుగులు తీసి పాతాళం చేరి ''పాతాళగంగ'' అయింది.

 

 

 

ఆవిధంగా భగీరథుని మహా దీక్షతో గంగానది, పాతాళం చేరి సగరపుత్రుల చితాభస్మంమీద ప్రవహించి వారికి సద్గతులు కలిగించింది అని ఆకాశగంగను దివి నుంంచి భూవికీ తెచ్చిన భగీరథ మహర్షి చరిత్ర గురించి వివరించారు.

ప్రతీ నీటిబొట్టు చాలా విలువైంది.

 



 


ప్రతీ నీటిబొట్టు చాలా విలువైంది..


ఇంటింటికి తాగునీరే లక్ష్యం..


విస్సాకోడేరు లాకువద్ద అడ్డుకట్ట..


తాగునీటి పై ప్రతీ రోజూ పర్యవేక్షణ ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్


భీమవరం, పెన్ పవర్


ప్రతీ నీటి బొట్టు చాలా విలువైందని, భీమవరంలో ప్రతీ ఇంటికి తాగునీరందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎంఎ ఏ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. వేండ్ర వెళ్లే దారిలోని జి ఎన్వికెనాల్ కు విస్సాకోడేరు లాకు వద్ద అడ్డుకట్ట వేసే పనులకు ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్యా లాకు వద్ద అడ్డుకట్ట వేసి ఇంజన్లు ద్వారా నీటిని చెరువుల్లోకి తోడతామన్నారు. ఈ కార్యక్రమం మున్సిపాల్టీలో ఇప్పటి వరకూ ఎవరూ చేపట్టలేదని, ఇదొక చరిత్రని, దీనివల్ల పట్టణంలో వేసవి రోజుల్లో తాగునీటి ఇబ్బందులు ఉండవని, ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. రిజర్వాయర్లలో నీటి లెవిల్స్, ట్యాంకర్ల ద్వారా నీరు ఎక్కడికి వెళ్తుంది, జిపిఎస్ సిస్టం, సిసి కెమెరాల మోనటరింగ్ లాంటి పనులను డిఇ నారాయణరావు పర్యవేక్షిస్తారని, తాగునీరు పట్టణంలో ఏ విధంగా సరఫరా అవుతుంది, ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయనే దానిపై డిపై రాజారావు, ఎఇలు పర్యవేక్షిస్తారని అన్నారు. తాను ప్రతీ రోజూ తాగునీటి పంపిణీ పై పర్యవేక్షణ చేస్తామన్నారు. గతేడాది పట్టణంలోని ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బందులు పడ్డారని, ఆనాటి సమయంలో ట్యాంకర్లను బయటకు విక్రయించుకోవడం లాంటి అనేక అక్రమాలు జరిగాయని, నేడు వాటన్నింటిని అదుపులోకి తీసుకొచ్చి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బుధవారం మార్కెట్ నందు ఉన్న పంప్ హౌస్ కు మూడు 30 హెచ్ పి మోటార్లను , మూడు 25 హెచ్ పి మోటర్లను రూ 5 లక్షల మున్సిపల్ నిధులతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వీటివల్ల తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదన్నారు. అయితే అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, సినిమా ధియోటర్లు, హెటల్స్ యజమానులు కుళాయి నుండి మోటార్లు ద్వారా నేరుగా నీటిని తోడుకుంటే చర్యలు తీసుకుంటామని, కుళాయిలనుండి సంపులకు నీటిని పట్టుకుని సంపుల్లోని నీటిని మోటార్ల ద్వారా తోడుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కుళాయి కనెక్షన్ లు వెంటనే రద్దు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతీ ఇంటికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని అన్నారు. పట్టణంలో ఎవరికి సంపులున్నాయి, ఎవరికి లేవు అనే దానిపై వలంటీర్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని తెచ్చుకున్నామని అన్నారు. ప్రస్తుతానికైతే మంచినీటి చెరువులను పూర్తిగా నింపడం జరిగిందన్నారు. రిజర్వాయర్ల నుండి ఇటీవల ఒక వ్యక్తి అక్రమంగా ట్యాంకర్ ద్వారా నీటిని తరలించిన విషయంలో అతడిపై కేసు నమోదు చేయడంతో పాటు ట్యాంకర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. తాగునీటి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, పట్టణంలో ఏ ఇంటిలోనూ దాహర్తి సమస్య లేకుండా కృషి చేస్తున్నానని ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ కమీషనర్ కె రమేష్ కుమార్, ఎం ఇ ప్రసాద్, డిఇలు నారాయణరావు, రాజారావు, ఏఇలు, ఏఎంసి ఛైర్మన్ తిరుమాని ఏడుకొండలు పాల్గొన్నారు. అనంతరం మంచినీటి చెరువులను, నీటి నిల్వలను పరిశీలించారు.


తాగునీటి చెరువును 15 లక్షలతో అబివృద్ది చేసిన మంత్రి చెరుకువాడ


ఆచంట లో తాగునీటి చెరువును 15 లక్షలతో అబివృద్ది చేసిన మంత్రి చెరుకువాడ. శ్రీరంగనాథ రాజు





 

 


ఆచంట, పెన్ పవర్ 


 

 

ఆచంట మండలం ఆచంట వేమవరం లో సుమారు రూ 15 లక్షల రూపాయలతో అబివృద్ది చేసిన తాగునీటి చెరువు మరియు  మంచి నీటి సరఫరా ను గురువారం  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ .శ్రీరంగనాధరాజు ప్రారంభించారు.ఆచంట వేమవరం గ్రామంలో చాలాకాలంగా  ప్రధాన తాగునీటి చెరువు అబివృద్ధికి నోచు కోకుండా గత ప్రభుత్వం లో నిర్లక్షానికి గురైoది. గ్రామస్తుల కోరికపై మంత్రి తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చెరువు అబివృద్ధికి అధికారులను ఆదేశించడం, పనులు పూర్తికావటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు  మాట్లాడుతూ తాగునీటి కి ఇబ్బంది లేకుండా అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపామని అన్నారు. అధికారులతో సమీక్షించి ముందస్తు చర్యలు తీసుకోవటం తో పాటు శివారు గ్రామాలకు అవసరం అయితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి గ్రామంలో జరుగుతున్న శానిటేషన్, పారిశుధ్యపనులను, వైద్య ఆరోగ్య సర్వేను  పరిశీలించారు. లాక్ డౌన్ అమలు జరుగుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం, స్వీయనియంత్రణ పాటించాలన్నారు. కారోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకై అధికారుల ఆదేశాలను పాటించాలన్నారు.

అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు.అనంతరం  చౌకదర దుకాణాల వద్ద దూరం పాటించండి... మూడవ విడత ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ జరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ వారికి కేటాయించిన టైం స్లాట్ ఆధారంగా సరుకులు తీసుసు కోవాలన్నారు. బయోమెట్రిక్ తప్పనిసరి అయినందున శానిటైజర్ లు అందుబాటులో ఉంచామన్నారు. రేషన్ సరుకులను మే 10వతేదీ వరకు పంపిణీ చేస్తునందున ఎటువంటి ఆందోళనకు గురికావదన్నారు. రేషన్ షాపుల వద్ద తాగునీరు, షామియానా వంటి ఏర్పాట్లు చేశామని మంత్రి రంగనాథ రాజు వివరించారు. కార్యక్రమంలో పోలిశెట్టి లీలా సుబ్బారావు , గ్రామ ప్రెసిడెంట్,బండారు నాగేశ్వరావు,గ్రామ సెక్రటరీ,వేగుళ్ల బులిసత్తియ్య సొసైటీ ప్రెసిడెంట్ ,పుచ్చకాయల సూరిబాబు, గెద్దాడ మంగారావు ,కొడమంచిలి రాజు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.


 

 



 

అన్నదాత స్వచ్ఛంద సేవా భోజనం ప్యాకెట్లు  పంపిణీ  .





అన్నదాత స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా భోజనం ప్యాకెట్లు  పంపిణీ  ....

 

గోకవరం, పెన్ పవర్

 

 .......వెంకట నగరంలో35 వ రోజు చేరుకున్న భోజన ప్యాకెట్లు పంపిణీ.

        

 

బిజెపి సీనియర్ నాయకులు కరాసు. శివప్రసాద్( అన్నదాత)  గోకవరం మండలం వెంకట నగరం గ్రామంలో లో లాక్ డౌన్ కారణంగా ఆహారానికి ఇబ్బంది పడే  నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు గురువారం భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి మండల నాయకురాలు కరాసు. శ్రీ సాయి లత , ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ , రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదేశానుసారం జరిగింది . వాసంశెట్టి.వెంకట సత్య రామారావు, కె. మహేష్, పీతా సత్యనారాయణ, కోన సూరిబాబు, శ్రీనివాస్, మరియు వెంకటనగరం ప్రజలు కోన .వెంకటరామారావు , కోన రామ తులసి, చింతల బాబురావు, కోన్ అప్పలరాజు, దేవరశెట్టి  వాళ్ళమ్మ , కోన వెంకటరమణ, అడబాల రాజులు , దేవన రత్నం, కోన శేషారావు , బిజెపి నాయకులు పురం శెట్టి సత్య రమేష్ , పి. యుగంధర్ పాల్గొన్నారు.


 

 



 

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూరగాయల పంపిణీ







మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూరగాయల పంపిణీ

 

పెనుగొండ, పెన్ పవర్

 

పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆయన మాట్లాడుతూ లాక్ డోన్ సమయంలో

మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వాళ్ళకి ఎంతోకొంత సహాయపడే బాగుండేదని నా ఉద్దేశం అందుచేత మనమంతా కలిసి సహకరించాలి అలాగే పోలీసులు డాక్టర్లు పారిశుద్ధ కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు మనం వాళ్లకి ఎంత చేసినా తక్కువే పోలీసువారికి సహకరిద్దాం సురక్షితంగా ఇంట్లోనే ఉందాం చేతులు శుభ్రంగా కడుక్కోండి చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంచుకోండి మాస్కులు ధరించండి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సూచించారు. పెనుగొండ మండలంలోని సిద్ధాంతం వడలి,ములపర్రు  గ్రామాలలో పర్యటించి కరోనా వైరస్  వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పలు సూచనలు చేశారు.మాస్కులు ధరించడం,భౌతిక  దూరం పాటించుట, అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని, ప్రజలందరూ లాక్ డౌన్  నిబంధనలు పాటించి కరోనా వైరస్ ను పూర్తిస్థాయిలో నివారించడానికి సహకరించాలన్నారు.అనంతరం ములపర్రు గ్రామం మద్దిగుంట చెరువులో మూడు వందల కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చిన్ని రాజేంద్రప్రసాద్ రాము తదితరులు పాల్గొన్నారు


 




 

 


 



 



వైయస్ఆర్ భీమా అయిదు లక్షల చెక్కు  అందజేత

వైయస్ఆర్ భీమా అయిదు లక్షల చెక్కు  అందజేత

 

కొడమంచిలి పెన్ పవర్

 

కొడమంచిలి గ్రామానికి చెందిన  సాల శ్రీను ఆరునెలల క్రితం  రోడ్  ప్రమాదంలో చనిపోయారు, అయన కుటుంబానికి ప్రభుత్వ పరంగా వైయస్ఆర్ భీమా  పధకంలో భాగంగా మంజూరైన  చెక్కును అయన భార్య  సాల దుర్గ కు వైయస్ఆర్ పార్టీ సీనియర్ నేత సుంకర సీతారామ్ అందించారు,  ఈ సందర్భంగా సుంకర సీతారామ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నా వారిని ఆదుకొనే ఏకైక నాయకుడు యువ ముఖ్యమంత్రి జగన్  అని కొనియాడారు... సహజ మరణం తో పాటు ప్రమాదవసాత్తు మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాడానికి వైయస్ఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు.,  ఐకెపి ఏపిఎం జ్యోతి  రాణి ,భీమా మిత్ర డ్వాక్రా సిబ్బంది . వైయస్ఆర్ పార్టీ నేతలు ములగాడ వరప్రసాద్ ,పి వనమరాజు తదితరులు పాల్గున్నారు....

పరవాడ వైసిపి కార్యాలయంలో ఎంపీ సత్యవతి పుట్టినరోజు వేడుకలు

పరవాడ వైసిపి కార్యాలయంలో ఎంపీ సత్యవతి పుట్టినరోజు వేడుకలు


             పరవాడ పెన్ పవర్

పరవాడ మండలం:అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్.బిసెట్టి.వెంకట సత్యవతి పుట్టినరోజు వేడుకలును పరవాడ వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర  సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరోనా లాక్ డవున్ కారణంగా స్థానిక వైసిపి నాయకులు ఎంపీ సత్యవతి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియ చేయలేని పరిస్థితుల్లో స్థానిక పార్టీ కార్యాలయం లోనే పుట్టినరోజు వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,బండారు రామారావు,దళాయి నదియా,పయిల జూనియర్ అప్పలనాయుడు,పయిల నరేష్,వెంకట లక్ష్మి,ఇల్లపు ప్రవీణ్,పయిల పైడంనాయుడు,సిహెచ్.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...