Followers

కూరగాయల మద్దతు ధరకై దేవరాపల్లిలో రైతుల నిరసన.





కూరగాయల మద్దతు ధరకై దేవరాపల్లిలో రైతుల నిరసన.

 

     స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్).

 

కూరగాయలకు మద్దతు ధర కల్పించాలని దేవరాపల్లి లో రైతులు నిరసన చేపట్టారు. రోజు వారి  హోల్ సేల్ కూరగాయల మార్కెట్ కు రెండు రోజులుగా కూరలు తేకుంటా వ్యాపారులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.       ముందుగా రైతులు సమాలొచనతో కాయగూరలు మార్కెట్ కు  తీసుకు రాకూడదని నిర్ణయం చేసుకు న్నారు.గు రువారం  మార్కెట్ కు ఎవరు కూరగాయలు తీసుకు రాకపోవడంతో మార్కెట్  వెల వెల బోయింది. మార్కెట్ కి  పాడేరు హుకంపేట విశాఖపట్నం నుండి వచ్చిన కోంతమంది వ్యపారులు విస్తుపోయారు. తిరిగి పోలేక  రైతులుకు  పోన్లు చేసి కాయగూరలు తెప్పించు కోనే ప్రయత్నం చేశారు.రైతులు స్పందించక పోవడంతో  ,వ్యాపారులు తిరిగి వెళ్ళిపోయారు , రైతులు కోసం ,అధికారులు పంపిన రెండు బస్సులు ఖాళీగా పోయాయి.ఆరుగాలాలు కష్టించి పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు.బజారు కి తెచ్చిన కూరగాయల కి  కనీసం కూలి డబ్బులు అయిన రావడం లేదు. మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విశాఖ రైతు బజారులో రైతులు నేరుగా అమ్ము కోనే విధంగా కార్డులు ఇవ్వాలని ,కోల్డ్ స్టోరేజ్ నీర్మీంచాలని సిపి ఎం నాయకుడు వెంకన్న డిమాండ్ చేశారు.


 

 



 

గిరిజన గ్రామంలో నీటి కష్టాలు తీరాయి 


10000 లీటర్ల  సామర్ధ్యం  కలిగిన  నీటి ట్యాంకు  నిర్మాణం 


గిరిజన గ్రామంలో నీటి కష్టాలు తీరాయి 


 


 


           విజయనగరం,


విజయనగరం  జిల్లాలో  అనేక గిరిజన  గ్రామాలు  ఉన్నాయి. వీటి లో కొన్ని  తరతరాలు  గా నీటికోసం  ఇబ్బందులు  పడుతుండేవి. నీటి చలమలే  వీరి కి ఆధారం. వేసవి  కాలం  లో ఇవి ఎండి  పోతే  నీటికి కట  కటే. దీని  తో పాటు ఈ నీటి  ని తాగుతుండడం వల్ల  అనేక మంది తరచూ  జబ్బుల పలు అవుతుండే వారు. ఇలాంటి కుగ్రామమే విజయం నగరం  జిల్లా  పాచిపెంట  మండలం లో గుమ్మడి  గూడా  పంచాయతీ  పరిధిలో  లో ఉన్న ఆడారి  వలస  గ్రామం.ముప్పై  కుటుంబాలు నివాసముండే  మారుమూల  ఉన్న ఈ  గిరిజన గ్రామం జనాభా  96.ఇంతక మునుపు గ్రామానికి  దూరం  గా ఉన్న నేల  బావే  వీరి మంచి నీటికి ఆధారం. ఆ బావి మంచి  నీటి గడ్డ కి అతి సమీపం లో ఉండడం వలన వర్షాకాలం లో బురద  నీరు, కలుషిత నీరు అందు లో  చేరి  త్రాగేందుకు  ఇబ్బంది గా ఉండేది.  అదే విధంగా  వేసవి  కాలం లో భూగర్భ  జలాలు  తగ్గీ  మంచిది నీటి కొరత  ఏర్పడుతుండేది. గ్రామ  ప్రజలు  తమ మంచి  నీటి కష్టాలు  ఎప్పుడు  తీరుతాయా  అని ఎదురు  చూపులు చూసేవారు. 


 


          అయితే వీరి నీటి కష్టాలను  గుర్తించిన  గ్రామీణ  నీటి సరఫరా  విభాగం అధికారులు  కేంద్ర  మరియు  గ్రామ పంచాయతీ భాగస్వామ్యం తో  రూపొందించి  బడిన  స్వజల పధకం లో ప్రతిపాదనలు  పంపి ఆమోదింప  చేసుకొన్నారు. ఆమోదం  వచ్చిన పిమ్మటనే త్వరగా  పనులు  ప్రారంభించి  బోరు బావి  ని సోర్స్  గా గుర్తించి  దాని పనులు పూర్తి చేసారు. గ్రామం లో 10000 లీటర్ల  సామర్ధ్యం  కలిగిన  నీటి ట్యాంకు  నిర్మాణం  చేపట్టారు. ఇప్పుడు గ్రామం లో ఏడు మంచిది నీటి కొళాయి  ల ద్వారా   నిరంతరం  నీటి సరఫరా  జరగుతోంది. దీంతో తమ నీటి కష్టాలు తీరాయని  గ్రామస్థులు  ఆనందం  వ్యక్తం చేస్తూన్నారు. వేసవి సందర్బంగా  మంచి నీటి  పర్యవేక్షణ లో భాగంగా గా ఈ గ్రామాన్ని జిల్లా  పర్యవేక్షక  ఇంజనీరు  శ్రీ పప్పు రవి గారు ఇతర  అధికారులు  సందర్శించినప్పుడు  గ్రామస్థులు  తమ నీటి కష్టాలు  ఏ  విధంగా  తీరింది  వివరించి  తమ కష్టాలను తీర్చిన  ప్రభుత్వానికి, జిల్లా కలెక్టరు  వారికి, గ్రామీణ  నీటి సరఫరా  అధికారులకు  తమ  కృతజ్ఞతలు  తెలియజేసుకొన్నారు.


 


పారిశుద్ధ్య, సచివాలయ సిబ్బందికి సిరిపురపు చేయూత.







పారిశుద్ధ్య, సచివాలయ సిబ్బందికి సిరిపురపు చేయూత.

 

            పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిపురపు అప్పలనాయుడు సొంత నిధులు వెచ్చించి పరవాడ గ్రామ సచివాలయ సిబ్బందికి,పారిశుధ్య కార్మికులకు గురువారం ఉదయం గ్రామ సచివాలయ ఆవరణలో  ఉచితంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ వలన సామాన్య ప్రజలతో పాటు, ప్రజలకు సేవలు అందించే ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో సిరిపురపు తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఇప్పటికే పరవాడ గ్రామంలో 2000 కుటుంబాలకు సుమారు పది లక్షలు సొంత నిధులు ఖర్చు చేసి ఐదు కేజీలు నాణ్యమైన బియ్యం,అరకేజీ పంచదార, కేజీ కందిపప్పు, కేజీ గోధుమపిండి ,అరకేజీ ఎర్ర గోధుమనూక తదితర సరుకులను పంపిణీ చేశారు. అంతేకాకుండా వేసవికాలంలో నీటి ఎద్దడి తో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు ప్రతి నెల రెండు లక్షలు నిధులు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సిరిపురపు చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పయిల శ్రీనివాసురావు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,పి.ఎమ్.సి చైర్మన్ పయిల హరీష్, బండారు రామారావు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి పయిల నరేష్, చీపురుపల్లి శ్రీను,పయిల పైడం నాయుడు,ఇల్లపు ప్రవీణ్ గంగాధర్, గండి గోవింద్,సిరిపురపు అయ్యబాబు, బొడ్డు అచ్చం నాయుడు,వర్రి నుకేంద్ర, లాలం రవీంద్ర,రొంగలి అప్పారావు, పంచాయితీ కార్యదర్సులు అచ్యుతారావు,భాస్కర్  తదితరులు పాల్గున్నారు.


 








 


 






 

 




 




 


 



 



కర్నూలు  మున్సిపల్ కమిషనర్ గా పాడేరు పీఓ బదిలీ.


కర్నూలు  మున్సిపల్ కమిషనర్ గా పాడేరు పీఓ బదిలీ.

   స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్) 


 


పాడేరు  సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ  ప్రాజెక్ట్ డైరెక్టర్ డి కే బాలాజీ  కర్నూలు జిల్లా మునిసిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అతని స్థానంలో  పాడేరు  సబ్ కలెక్టర్  సలిజమల వెంకటేశ్వర రావు  ఇన్చార్జిగా  బాధ్యతలు  చేపట్టారు. కర్నూలు  మున్సిపల్ కమిషనర్ గా  డీకే  బాలాజీ ని  నియమిస్తూ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహన్నీ  గురువారం   ఉత్తర్వులు  జారీ చేశారు. అలాగే  పాడేరు  ఐ టి డి ఎ  ప్రాజెక్ట్  బాధ్యతలు  స్థానిక  సబ్ కలెక్టర్  వెంకటేశ్వర్ల కు  అప్పగించారు. రంపచోడవరం  ఐటీడీఏ పీవో  నిశాంత్ కుమార్  పాడేరు పిఓగా బదిలీపై వస్తారని  జోరుగా ప్రచారం జరిగింది. కాని  అతన్ని  జె సిగా  బదిలీ చేస్తారని  తెలుస్తోంది. పి ఓ  డీకే బాలాజీ  బదిలీ  కావడంతో  గిరిజన సంఘాలు  ఉద్యోగులు  విచారం వ్యక్తం చేస్తున్నారు.


 


 దివ్యాంగ బాలుడు సేవలు అభినందనీయం

 దివ్యాంగ బాలుడు ది పేష్ సేవలు అభినందనీయం


విశాఖపట్నం , 


జివిఎంసి పరిధిలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లా డౌన్ వల్ల ఇబ్బందిపడుతున్న ప్రజలకు సేవలందిస్తున్న పోలీసులకు 200 మాస్కులు, 100 శానిటైజర్లు , 50 గెవుజులు, 100 ఎనర్జీ డ్రింక్స్ లను దివ్యాంగ బాలుడు మూల ది పేష్ అందించాడు. పెన్ స్కూలులో 7వ తరగతి చదువుతున్న ది పేష్ టివిలలో పోలీసులు అందిస్తున్న సేవలు చూసి స్పందించాడు. తన తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో మాస్కులు, గెజులు, శానిటైజర్లు కొనుగోలుచేసి గురువారం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులకు, సిబ్బందికి దిపేష్ స్వయంగా అందించారు. ది పేష్ చేసిన వితరణకు పోలీసుశాఖ వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


కరోనా విధుల్ని నిర్వహిస్తున్న జివిఎంసి సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ వితరణ

 


కరోనా విధుల్ని నిర్వహిస్తున్న జివిఎంసి సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ రసాయనాన్ని వితరణ చేసిన పిఆర్‌టియు (అర్బన్), విశాఖపట్నం


విశాఖపట్నం,


జివిఎంసి పరిధిలో కరోనా నివారణ గూర్చి కేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులకు వైరస్ నుంచి రక్షించుకొనే నిమిత్తం వినియోగించుకోవడానికి 100 బాటిళ్ళ శానిటైజర్ రసాయనాన్ని 100 మాస్కులను పిఆర్‌టియు అర్బన్, విశాఖపట్నం యాజమాన్యం వారు జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకు ఆయన ఛాంబర్‌లో జివిఎంసి డిప్యూటీ ఎడ్యూకేషనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు సమక్షంలో సంఘ ప్రెసిడెంట్ పి.హరిక్రిష్ణ, సెక్రటరీ కె.నాగేశ్వరరావు, స్టేట్ కౌన్సిలర్ ఎల్.క్రిష్ణారావు చేతులు మీదుగా ఉచితంగా అందించారు. పిఆర్‌టియు (అర్బన్), విశాఖపట్నం సంఘ సభ్యులు చేసిన వితరణకు జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన ప్రత్యేక అభినందనలు తెలిపారు.


క్వారంటైన్ లో ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉండాలి


క్వారంటైన్ లో ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉండాలి


ఆరోగ్యసేతు యాప్ ప్రతి ఒక్కరితో డౌన్లోడ్ చేయించాలి   


జిల్లా రెవెన్యూ  అధికారి  జె. వెంకటరావు


        విజయనగరం, 


 


క్వారంటైన్ లో వున్నవారితో స్నేహపూర్వకంగా వుండాలని, స్వంత బంధువుల్లా భావించి వారితో మాట్లాడుతూ వుండాలని జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు క్వారంటైన్ కేంద్రాల నిర్వహణపై  క్వారంటైన్ ప్రత్యేకాధికారులకు ఆదేశించారు.   గురువారం కలక్టరేట్ ఆడిటోరియం లో ప్రత్యేకాదికారులతో సమావేశం నిర్వహించారు.  క్వారంటైన్ లో ఉంటున్న వారికి మెనూ ప్రకారం మంచి ఆహారాన్ని అందించాలని, సౌకర్యవంతమైన  వసతులను కల్పించాలని, స్వంత ఇంటిని మరిపించేలా ఉండాలని అన్నారు.   అక్కడి  గదులు, పరిసరాలు, టాయలెట్లు పరిశుభ్రంగా వుండేలా చూడాలని అన్నారు.  క్వారంటైన్ లో వుంటున్న వారికి ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందివ్వడంతో పాటు వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలన్నారు.  మానసిక సమస్యలు వుండే వారికి మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ చేయించాలన్నారు.  ఆరోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారికి మందులను కూడా తెప్పించి ఇవ్వాలన్నారు.  ప్రతి ఒక్కరికీ ట్రానాట్ పరీక్షలు నిర్వహించాలని, 14 రోజుల నిర్భందం తప్పనిసరి అని అన్నారు.  12వ రోజున అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి 13వ రోజున వైద్యుని సలహాలు తీసుకొని, కరోనా నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే డిస్ చార్ట్ చేయాలని సూచించారు.  డిస్ చార్ట్ చేసేటప్పుడు క్వారంటైన్ నిబంధనలు పాటించేలా వారి వద్ద నుండి పూచీకత్తులు తీసుకోవాలన్నారు.  వారిని ఇళ్లకు పంపేటప్పుడు సమస్య తలెత్తకుండా ముందుగానే స్ధానిక పోలీసు అధికారికి సమాచారం ఇవ్వాలన్నారు.  క్వారంటైన్ లో రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు.  క్వారంటైన్ లో కూడా సామాజిక దూరం పాటించాలన్నారు.  క్వారంటైన్ లో ఉన్న ప్రతి ఒక్కరితో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేయించాలని,  క్వారంటైన్ నుండి బయటకు వెళ్లిన తర్వాత కూడా దానివలస ప్రయోజనాలున్నాయని తెలిపారు.  ఈ యాప్ ద్వారా పాజిటివ్ కేసుల వివరాలు కూడా తెలుసుకోవచ్చన్నారు. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...