Followers
కరోనా వైరస్ నిర్మూలనకు అందరూ సహకరించాలి
జిల్లా అధికార యంత్రాంగానికి పేక్ ఈ మెయిల్
విశాఖపట్నం, పెన్ పవర్
జిల్లా అధికార యంత్రాంగానికి పేక్ ఈ మెయిల్ తలనొప్పిగా మారింది. జిల్లా కలెక్టర్ అంటూ vadarevuchand@gmail.com పేరుతో కొందరు ఆగంతకులు ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోన్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి రాగా స్పందించిన ఆయన vadarevuchand@gmail.com పేరుతో వచ్చే మెయిల్స్‌ని నమ్మవద్దని, అది ఫేక్ మెయిల్ అని ప్రకటించారు. ఈ ఫేక్ ఈ మెయిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైద్యుల గైర్హాజరుపై జిల్లా అధికారికి ఫిర్యాదు
వైద్యుల గైర్హాజరుపై జిల్లా అధికారికి ఫిర్యాదు
కొయ్యూరు...పెన్ పవర్
మండలంలోని యూ చీడీ పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రా మానికి చెందిన జి అప్పారావు డి.రమేష్ ఎం.గోపాల్ రావులు వైద్యాధికారులు ల్యాబ్ టెక్నీషియన్ పై జిల్లా మలేరియా నిర్మూలన అధికారి మణికి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ సకాలంలో అందుబాటులో ఉండరని అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులకు వైద్యం అందడం లేదని వారు వాపోయారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చినవారు వైద్యులు లేక అత్యవసర పరిస్థితుల్లో తూ.గో.జిల్లా వై రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని వారు పేర్కొన్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వైద్యులు స్థానికంగా అందుబాటులో ఉండేలా చూడాలని వారు అధికారిని కోరారు.
నిరాటంకంగా సాగుతున్న రౌతు కరోనా సేవ
నిరాటంకంగా సాగుతున్న రౌతు కరోనా సేవ
గిరి పల్లెల్లో మ్రోగుతున్న మరణ మృదంగం.
రహదారులకు నోచుకోని గిరి పల్లెలు.
గిరిపుత్రుల దరిచేరని ఉచిత వైద్యం.
అత్యవసర పరిస్థితుల్లో డోలీయే శరణ్యం.
గిరిజనాభివృద్ధికి పెద్ద పేట పాలకుల ఊతపదం.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం ( పెన్ పవర్)
ప్రకృతి అందాలకు నిలయమైన విశాఖ మన్యంలో గిరి పల్లెలు సమస్యల సుడిలో నలిగిపోతున్నాయి. కానీ స అవసరాలకు నోచుకోని ఈ పల్లెల్లో గిరిపుత్రులు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. రహదారులులేక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం పల్లెల్లో ఎక్కడో ఒకచోట మరణ మృదంగం మోగుతూనే ఉంది. గిరిజన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన డానికి అక్కడ పరిస్థితులే నిదర్శనం. పాడేరు మండలం మినుములూరు పంచాయితీ గాలి పాడు గ్రామానికి చెందిన చిట్టమ్మ నిండు గర్భిణీ ప్రసవ వేదనతో అవస్థలు పడుతూ ఉండగా అంబులెన్స్ వచ్చే గత్యంతరం లేక మైళ్ల దూరం డోలీపై మినుములూరు పీహెచ్సీకి తరలించారు. వైద్యులు డెలివరీ చేసినప్పటికీ పరిస్థితి విషమించి బిడ్డ చనిపోయింది. నెలలు నిండక డోలీలొ తీసుకు రావడం వల్ల ఆలస్యమై బిడ్డ మృత్యువాత పడింది. హుకుంపేట మండలం గతుంగ్ పంచాయితీ కరకవలస గ్రామంలో గెమ్మేలి కళ ఇంట్లో పాము కాటుకు గురైంది. గ్రామానికి రహదారి సౌకర్యం లేక 5 కిలోమీటర్లు డోలీపై మోసుకొని అడ్డదారిలో వచ్చి అక్కడ నుండి మరో పది కిలోమీటర్లు ఆటోలో పాడేరు ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. సకాలంలో వైద్య సేవలు అందక మహిళ మృతి చెందింది. ఇలా రోజు ఎవరో ఒకరు ప్రమాదవశాత్తు చనిపోతూనే ఉన్నారు. ఈ మరణ మృదంగం గానికి ప్రధాన కారణం రహదారి సౌకర్యం.. విశాఖ ఏజెన్సీలో 11మండలాల పరిధిలో వేల సంఖ్యలో శివారు గ్రామాలు ఇదే దుస్థితి లో ఉన్నాయి. గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎన్నికల ముందు పాలకుల పాట ఊతపధంలా మారిపోయింది. పూర్వం రహదారులు లేక డోలీలపై ప్రయాణాలు చేసేవారిని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ 2020 నాటికి డోలీలు ఉపయోగిస్తున్నారు అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉన్న ఊరు కన్న తల్లి అని గిరిపుత్రులు పల్లెలను విడవడం లేదు. ప్రభుత్వాలు ఆ వైపు కన్నెతైన చూడటం లేదు.
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా
ఉచిత బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు.
పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
కరోనా కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని పాడేరు ఎమ్మెల్యే కోట్ట గుళ్ళు భాగ్యలక్ష్మి హెచ్చరించారు. బుధవారం జి.మాడుగుల జి సి సి గొడౌను ఆమె తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం జరిగింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం నెలకు మూడు సార్లు ఉచిత బియ్యం ఇస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు అందాల్సిన బియ్యం ఎవరు దోచుకోవాలని చూసిన పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ గొడౌన్ నుంచి పెద్ద మొత్తంలో బియ్యం దారి మళ్లించినట్లు ఫిర్యాదులు అందాయని ఈ మేరకు కలెక్టర్ జి సి సి ఎండి జెసి లకు ఫిర్యాదులు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఉచిత బియ్యం గిరిజనులకు సక్రమంగా అందించాలని ఎక్కడైనా అవినీతి జరిగినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉచిత బియ్యం పంపిణీ లో అధికారులు నిబంధనలు పాటించాలని భాగ్యలక్ష్మి కోరారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...