Followers

సచివాలయ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ


సచివాలయ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ


ఇందిరగాంధీ మున్సిపాల్ స్టేడియం, 36వ వార్డ్ 6వ సచివాలయం (వాలంటీర్ ఆఫీస్)


 


 పూర్ణా మార్కెట్, పెన్ పవర్ ప్రతినిధి : సతీష్ కుమార్


సామాజిక సేవలో బాగంగా,       ప్రస్తుతం కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నములో లాక్ డౌన్ పాటిస్తున్న సమయంలో  నిర్విరామంగా సేవాభావంతో పనిచేస్తున్న సచివాలయం సిబ్బందికి విళ్లురి భాస్కర్ (విఎంఆర్. ఫౌండేషన్) ద్వారా రేషన్ కిట్ల పంపిణీ.


విశాఖపట్నం వన్ టౌన్ . విల్లురీ భాస్కర్ (విఎం ఆర్. ఫౌండేషన్) ఆధ్వర్యంలో, ద్రోనం రాజు శ్రీనివాస్ (విఎం ఆర్ డి ఏ) చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేసి, 35వ  వార్డు, 6వ  సచివాలయములో వున్న, సెక్రెటరీ లకు  , 45 మంది  అడ్మిన్లకు,105 గురు ఉన్న  సచివాలయ వాలంటీర్  సిబ్బందికి, బియ్యం, పప్పు, సబ్బులు మొదలగు వస్తువుల కిట్లని విల్లురి భాస్కర్(విఎం ఆర్ ఫౌండేషన్) సహాయముతో , విఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చేతుల మీద అందజేయడం   జరిగింది , ఈ కార్యక్రమములో బుజ్జి(రామకృష్ణ వీధి),  మంగరాజు, నాయని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


నిత్యావసర సరుకుల పంపిణీ


నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన వైసిపి సీనియర్ నాయకులు, ఎం.ఎస్ఆ.ర్, మెరైన్ అధినేత ముదునూరి సతీష్ రాజు


 







పెన్ పవర్ , ఐ.పోలవరం ప్రతినిధి  కే. వేణు కుమార్ 

 

గత నెల రోజుల పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ తో లాక్ డౌన్లో ఉన్న విధి నిర్వహణలో 24 గంటలు పని చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఐ.పోలవరం మండలం ఎదురులంక గ్రామానికి చెందిన వైసిపిసీనియర్ నాయకులు, ఎం.ఎస్ఆ.ర్, మెరైన్ అధినేత ముదునూరి సతీష్ రాజు మంగళవారం తను పదిమందికి సాయి పడేలా ఉండాలనే కృతనిశ్చయంతోవిధినిర్వహణలో ఉన్న పాత్రికేయులకు బియ్యం, నిత్యవసర వస్తువులు, మాస్కులు, శానిటేషన్ పంపిణీ చేశారు. అలాగే ఐ.పోలవరం మండలం లో గ్రామవాలంటీర్లకు కూడా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మండలంలో ఉన్న పేద ప్రజలకు ఈ నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుందని సతీష్ రాజు అన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి ముదునూరు సతీష్ రాజు అని మండలంలో ఉన్న ప్రజలు సతీష్ రాజు కి ధన్యవాదాలు తెలిపారు.


 

 








 


 






 

 




 




 


 



 



 


 


ఆకట్టుకున్న కరోనా అవగాహన చిత్రాలు       





ఆకట్టుకున్న కరోనా అవగాహన చిత్రాలు                 

 

పెన్ పవర్,  ఆత్రేయపురం ప్రతినిధి చిరంజీవి 

 

మండలం ర్యాలిగ్రామంలో కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది దాని నిర్మూల న కు ఎవరు ఎలా పాటు పడుతున్నారో ప్రజలలో అవగాహన కల్పించటానికి శ్యామ్ జాదుగర్ మ్యాజిక్  ఫ్యామిలీ వేయించిన చిత్రాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి అని ఆత్రేయపురం మండల అధికారి నాతి బుజ్జి అన్నారు. మనం అందరం తప్పని సరిగా మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటించి ఇంటికి పరిమితి అయినపుడు మాత్రమే కరోనా ను అదుపుచేయ గలమని అన్నారు. ఈ సందర్భంగా గా కరోనా కు భయపడకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారి డాక్టర్ ఎన్. సునీత, సెక్రెటరీ కృష్ణ, గ్రామ రెవెన్యూ అధికారి వాసు, చిత్రకారుడు కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ లను నాతి బుజ్జి ఘనం గా సన్మానించారు. అనంతరం మాస్క్ లు, భోజన పొట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గోగుల నాగేశ్వరరావు, పసలపూడి కుమార్, నాగేష్, కేశవ స్వామి ఆలయ అధికారి కృష్ణ చైతన్య, శ్యామ్, మోహిత్ లు పాల్గొన్నారు.


 

 



 

గ్రామాల్లో గుడుంబా జోరు


*గ్రామాల్లో గుడుంబా జోరు*

 

సీతానగరం, పెన్ పవర్ ప్రతినిధి : శివరామకృష్ణ 

 

మండల కేంద్రం మై శెట్టిబలిజ పేట నందు నాటుసారా విక్రయించడం కొందరు ఉపాధిగా మార్చుకున్నారు.  పెద్ద కొండేపూడి, వెంకట నగరం, ముగ్గుళ్ల... సారా తయారీ కేంద్రాలు గా రూపాంతరం చెందిస్తున్నారు. రోజుా కొన్ని వందల లీటర్ల నాటుసారాను ఇక్కడ నుంచి ఇతర గ్రామాలకు తరలించడం పై మండలంలో పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు. గుడుంబా రహిత గ్రామాలు గా సాగిన తర్వాత మళ్లీ లాక్ డౌన్ తో  చిన్న కొండేపూడి, పెద్ద కొండేపూడి, చీపురుపల్లి, సింగవరం, ముగ్గుళ్ల, మండల కేంద్రం నందు గల శెట్టిబలిజ పేట... గుడుంబా అమ్మకాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ఒక లీటరు నాటుసారా 6 వందల నుంచి 7 వందల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తుంది. కొందరు ఎంతైనా ఖర్చు చేసి ముత్తు కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. నాటుసారా అధిక వ్యాపారం సీతానగరం  శెట్టిబలిజ పేట నుండి మొదలై పలు గ్రామాల ప్రజలకు  ఒక లీటరు నుండి ఐదు లీటర్లు వరకు ఫోన్ చేసిన వారికి నేరుగా వారి ఇంటికే అందించడం  జరుగుతుందని సంబంధిత అధికారులు స్పందించి సారా వ్యాపారాలను తొలగించి తమ కుటుంబాలను కాపాడాలని పలువురు మహిళలు కోరుకుంటున్నారు. నామమాత్రపు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

కరోనా వైరస్ పై ప్రత్యేక అవగాహన సదస్సు





కరోనా వైరస్ పై ప్రత్యేక అవగాహన సదస్సు

 

....... సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి.

 

గోకవరం, పెన్ పవర్ ప్రతినిధి : సిబ్వ రామ కృష్ణ 

 

తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం, గుమ్మళ్ళదొడ్డి  గ్రామంలో స్థానిక రామాలయం వద్ద కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి కరోనా వైరస్ పై ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ  పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కలిసిగట్టిగా ఎదుర్కోవాలంటే  ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు రాకుండా హోమ్ క్వారైంటెన్ పాటించాలన్నారు. అత్యవసరమైతే నే ఒక్కరు మాత్రమే  బయటకు రావాలన్నారు. గుంపులు గుంపులుగా తిరగకుండా సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. రాజమండ్రి ,రాజానగరం, కడియం ధవలేశ్వరం పలు ప్రాంతాలు కేసులు ఎక్కువై ప్రభుత్వం వారు రెడ్ జోన్ ప్రకటించారు కాబట్టి ప్రజలు ఎవరు ఆయా ప్రదేశాలకు వెళ్ళకూడదు అని  సూచించారు. ఎవరైనా అటువంటి ప్రదేశాలనుంచి వచ్చినట్లయితే తమకు సమాచారం అందించాలని కోరారు. అనవసరంగా రోడ్ల పైకి వచ్చి తిరిగే వారిపై కేసు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.    కార్యక్రమంలో కానిస్టేబుల్ లు  రాము, గోవింద్, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

 

 



 

అక్రమంగా తరలిస్తున్న సారా బెల్లం స్వాధీనం.


అక్రమంగా తరలిస్తున్న 495 కేజీల సారా బెల్లం స్వాధీనం.

 

గోకవరం, పెన్ పవర్  ప్రతినిధి : శివ రామ కృష్ణ 

 

 

తూర్పు గోదావరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కాకినాడ  డి అరుణ రావు  ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్   అడబాల సతీష్  వారి సిబ్బంది తో గోకవరం మండలం వీర లంక పల్లి గ్రామ పరిధిలోని కోరుకొండ నుండి గోకవరం వెళ్ళు దారిలో వాహన తనిఖీ నిర్వహించి చుండగా గోకవరం నుండి అక్రమంగా సారా తయారీ కి ఉపయోగించు 495 కేజీల బెల్లం బస్తాలను మరియు u1 రవాణాకు ఉపయోగించు ఆటోను స్వాధీనపరచుకొని సదరు బెల్లం రవాణా చేయుచున్న వెదురుపాక గ్రామానికి చెందిన కోమటి దుర్గారావు మరియు బుర్ర గోవిందరాజులు అను ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై  తెలియజేసినారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది జానీ రమణ బాల దేవి పాల్గొన్నారని తెలిపినారు .మరియు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ఏ విధమైన మద్యం నాటు సారాయి ,కళ్ళు ఇతర మత్తు పదార్థాలను తయారీ రవాణా మరి అమ్మకాలను ఉపేక్షించేది లేదని ఎస్సై  తెలిపినారు. ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం కోరుకొండ ఎక్సైజ్ స్టేషన్ తరలించారు.

మారిటైం బోర్డు ఛైర్మన్ గా జి శ్రీధర్ రెడ్డి


 


మారిటైం బోర్డు ఛైర్మన్ గా జి శ్రీధర్ రెడ్డి


(పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం )


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ గా విశాఖపట్నంకు చెందిన మిలీనియం సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత జి శ్రీధర్ రెడ్డి (మిలీనియం శ్రీధర్ రెడ్డి) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తన స్వయంకృషితో ఎదిగారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజానీకానికి జి శ్రీధర్ రెడ్డి అంటే అసలు తెలియదు. ఆయన తన సంస్థ పేరునే తన పేరుగా మార్చుకుని మిలినీయం శ్రీధర్ రెడ్డిగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. ఇంటి పేరును పక్కన పెట్టి మరీ సంస్థ పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న కృషీవలుడు శ్రీధర్ రెడ్డి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 90వ దశకం చివరలో మిలీనియం సాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలిచి కంప్యూటర్ విద్యను అందించిన విద్యాదాతగా జిల్లా ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అటువంటి మహౌన్నతమైన విలువలు కల్గిన శ్రీధర్ రెడ్డికి ఈ పదవి లభించడం పట్ల ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ అభినందనలు తెలియజేశారు. తనకు అప్పగించిన ఈ గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, తనను గుర్తించి పదవి అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...