Followers

పారిశుధ్య కార్మికులకు శాలువాతో సత్కారం


పూర్ణా మార్కెట్, పెన్ పవర్ ప్రతినిధి : సతీష్


 38 వ వార్డు ఘోష ఆసుపత్రి జంక్షన్ నందు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని సయ్యద్ తహసీన్ భాను , ఉత్తరాంధ్ర మైనారిటీ సంఘ నాయకులు సయ్యద్ ముస్తఫా ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజా క్షేమం కొరకు పని చేస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన మరియు గౌరవించాల్సిన అవసరం ఉన్నదని గత 20 రోజులుగా అనేక విధాలుగా తహసీన్ భాను నేతృత్వంలో వారికి మరియు వార్డు లో గల నిరు పేద ప్రజల  కోసం కూరగాయలు, బియ్యం వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు, మంగళవారం పారిశుధ్య కార్మికులకు శాలువాతో సత్కరించి వారికి మిఠాయిలు పంచిపెట్టారు, మరియు కరోనా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కార్మికులకు మరియు  ప్రజలక తెలియజేశారు. ఈ కష్టకాలంలో 38 వార్డులో ప్రజలకు నిరంతరం అన్నివేళలా అండగా ఉంటామని ముస్తఫా విజ్ఞప్తి చేశారు, స్వచ్ఛందంగా ప్రజలందరూ ముందుకు వచ్చి కులమతాలకు అతీతంగా పార్టీలకతీతంగా పేద ప్రజలను ఆదుకోవాలని, అదేవిధంగా కరోనా  వ్యాధిని నివారించడానికి కృషిచేయాలని తెలియజేశారు


కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యం లో నిరాశ్రయులకు ఆహార పంపిణీ


   పూర్ణా మార్కెట్, పెన్ పవర్ ప్రతినిధి : సతీష్ కుమార్


       ప్రస్తుతం కరోనా మహమ్మారిని తరిమికొట్టడం లో భాగంగా లాక్ డౌన్ పాటిస్తున్న సమయంలో  నిర్విరామంగా సేవాభావంతో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సేవలు నిరుపమానమని కన్యకాపరమేశ్వరి దేవాలయ అధ్యక్షులు  పెనుగొండ వెంకట చంద్రశేఖర్ అన్నారు.


విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలో గల ఘోషా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది మరియు పేషెంట్ల సహాయకులకు మరియు ఆ ప్రాంతంలో గల నిరాశ్రయులకు సుమారు 150 మందికి మధ్యాహ్నం భోజనం, సాంబారు అన్నం, పెరుగన్నం అందించినట్లు తెలిపారు.   గత వారం రోజుల నుంచి ప్రతీరోజు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని మరియు  లాక్ డౌన్ వున్నంతవరుకు ప్రతీరోజు మధ్యాహ్నం భోజనం కన్యకాపరమేశ్వరి దేవాలయ సంఘ సభ్యులు అందించిన విరాళాలతో అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీయుతులు వి. వి. వి. సత్యనారాయణ మూర్తి, పేకేటి కామేష్, కందుల మధుబాబు,  కె ఎం వి ఎస్ టి రామకృష్ణ, జీవిఆర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే అంటే సీతక్కలా ఉండాలి


మాకు ఉన్నారు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావాలంటే ప్రాణభయంతో భయపడి పోతున్నారు.


ఆదివాసి అడవి బిడ్డల ఆకలి తీర్చడం కోసం తన ఆకలి సైతం మరచిపోయి అడవి బాట పట్టిన ఎమ్మెల్యే సీతక్క. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు లాక్ డౌన్ విధించిన అప్పటి నుంచి కూడా అడవి బిడ్డల ఆలనాపాలనా చూస్తూ అండదండగా ఉంటూ అమ్మగా,అక్కగా ఆశ్రయం ఇస్తుంటే ఎమ్మెల్యే అంటే ఇలానే ఉండాలి ఎమ్మెల్యే అంటే ఇలా చేయాలి ఎమ్మెల్యే అంటే ఇలా ఒకరికి ఆదర్శం కావాలి అనేలా మరిచిపోలేని విధంగా ప్రజలకు ప్రజా సేవ చేస్తుంది. అక్కడ ఆదివాసి బిడ్డలంతా ఈ సీతని ఎమ్మెల్యేగా గెలిపించు కోకుండా ఉండుంటే ఆకలి కేకలతో ఇప్పటికే సగం చచ్చి ఉండేవాళ్ళం అనెంత నమ్మకం ఇచ్చింది.  మేము ఎన్నో వందల మంది నాయకులను,ప్రజా ప్రతినిధులను చూశాం ఎవరికి ఎలాంటి న్యాయం జరగలేదు.  కానీ సీతక్క లాంటి ఎమ్మెల్యేను జీవితంలో చూడలేదు అనేది నమ్మకం.


 


108 కు కాల్స్ వెల్లువ ..  మద్యం షాపులు తెరిపించండి ..


108 కు కాల్స్ వెల్లువ .. 
మద్యం షాపులు తెరిపించండి ..
గోడు వెళ్ళబోసుకుంటున్న మందుబాబులు.


స్టేట్ బ్యూరో పెన్ పవర్, తెలంగాణ


కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో వ్యాప్తిని అరికట్టటానికి చేసిన లాక్ డౌన్ తో మందుబాబుల బాధ వర్ణనాతీతంగా మారింది. మందు కోసం ఉన్మాదుల్లా మారుతున్నారు.పిచ్చివాళ్ళవుతున్నారు . పిచ్చివారిగా ప్రవర్తిస్తున్నారు. మద్యం దొరకని అసహనం, కోపం వెరసి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు దాడులకు, దోపిడీలకు దిగుతున్నారు. కొందరు మందు కావాలి మహాప్రభో అని ప్రాధేయ పడుతున్నారు. మద్యానికి బానిసలైన వారు మద్యం లేకుండా ఉండలేకపోతున్నారు.


కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి మందుబాబుల ఆవేదన


లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి . ఈ సమయంలో మానసిక సంక్షోభం నెలకొంటుందని భావించి మానసిక సమస్యల పరిష్కారానికి జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది . ఇక ఈ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి మద్యం లేకపోతే చచ్చిపోవాలనిపిస్తోందని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం . ఇక అంతేకాదు దయచేసి వెంటనే వైన్‌ షాపులు తెరిచేలా చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారట.


108కి ఫోన్‌ చేస్తే సైకాలజిస్టుల సలహాలు.. కాల్స్ చేస్తుంది మందుబాబులే


లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు మానసిక ఇబ్బందులుంటే వారిని కాస్త ఆ మానసిక సమస్యల నుండి బయటకు తీసుకురావటానికి , వారికి సలహాలు ఇవ్వడానికి ఈ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక 108కి ఫోన్‌ చేసి సైకాలజిస్టుల సలహాలు పొందవచ్చు. ఈ కాల్ సెంటర్‌ను రెండు వారాల క్రితమే ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన కాల్స్ లో చాలా కాల్స్ మద్యం కోసమే కావటం పరిస్థితి ఎలా ఉందో చెప్తుంది . ఈ కాల్ సెంటర్‌కు వచ్చే ఫోన్ కాల్స్‌లో దాదాపు 80 శాతం మందుబాబుల కాల్స్ ఉండటం, ఇక వారు వైన్స్ షాపులు తెరిపించండి అని డిమాండ్ చేసేవారే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం .


ఆస్పత్రుల్లో మద్యానికి బానిసలైన వారి చికిత్స పై పెట్టని శ్రద్ధ


మద్యం దొరక్క తీవ్రమైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి హైదరాబాద్‌తో పాటు, ప్రతి జిల్లాలలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.వారిని మార్చటానికి ప్రయత్నం చెయ్యాలని చెప్తుంది సర్కార్ . ఇక సీఎం కేసీఆర్ కూడా ఆ దిశగా వారిలో పరివర్తన తీసుకురావాలని సూచించారు. కానీ ప్రస్తుతం వైద్యుల అందరి దృష్టి కరోనా కేసుల మీదే ఉంది . దీంతో ఇలాంటి రోగులకు చికిత్స వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వైద్యులకు ఇబ్బందికరంగా మారింది .ఇక మద్యం కోసం పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తున్న వాళ్లకు ఏం చెప్పాలో తెలియడం లేదని కాల్‌ సెంటర్‌ అధికారులు చెబుతున్నారు.


ప్రాణాలకే ప్రమాదం అంటున్న మానసిక నిపుణులు .. ప్రభుత్వ దృష్టి అవసరం


ఇక వారికి కావాల్సింది మద్యం .. అది లభించకపోతే మూడు వారాల తర్వాత వారిలో అనేక మార్పులు సంభవిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారి పరిస్థితి విషమించి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వీళ్ళకు కౌన్సిలింగ్ తో పాటు వీరికి చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి . లేదంటే మానసిక సమస్యతో మందుబాబులు ప్రాణాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు


ఐ పోలవరం మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి:


 


ఐ పోలవరం మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి:

 

   . పెన్ పవర్, ఐ. పోలవరం ప్రతినిధి         

 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు మన గౌరవ ప్రధాన మంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలతో వచ్చే నెల మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ యధావిధిగా కొనసాగుతూ ఉన్నది. ప్రజలెవ్వరు అపోహలు నమ్మరాదని, ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రాకూడదని ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటికి రావాలి అంటూ...  అత్యవసరం లేకుండా రోడ్లపై  తిరగకూడదని . వ్యక్తి గతంగా  సామాజిక దూరము పాటించవలెను. అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రాకూడదని. బయటికి వచ్చినప్పుడు మాస్కులు తప్పకుండ  ధరించాలని . ఎక్కువ సార్లు  చేతులు సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. మన రాష్ట్రంలో కరోన  ప్రభావితం ఎక్కువ అవుతుండుట వలన ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండి. పోలీసు వారికి సహకరించాలని ఐ పోలవరం ఎస్ ఐ రాము కోరారు.

 

రబీ దాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు,


రబీ దాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు,


వాటిని పొందేందుకు నిర్థేశించిన నాణ్యతా ప్రమాణాల గురించి రైతులందరికీ సమగ్ర అవహగాన కల్పించాలని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ పిపిసి కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.


 


కాకినాడ, పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్ : చినబాబు


          సోమవారం మద్యాహ్నం జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ సామర్లకోట మండలంలోని మేడపాడు, ఏడిబి రోడ్ లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా  పిపిసి కేంద్రాలలోని నాణ్యతా ప్రమాణాల నిర్థారణ యంత్రాలు, తూకాలు, ధాన్యం నిల్వ చేసే సదుపాయాలు, మద్దతు ధరలు, నాణ్యతా ప్రమాణాల సమాచారం బోర్డుల ప్రదర్శన రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. మేడపాడు  పిపిసి కేంద్రానికి వచ్చిన రైతులను ఆయన ఆత్మీయంగా పలకరించి, ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల గురించి తెలుసునా? అని వాకబు చేసారు.  ధరల గురించి తమకేమి తెలియదని, చదువు కోనందున బోర్డులపై వ్రాసినదేమిటో తమకు అర్థకాలేదని ఒక రైతు తెలియజేశాడు.   రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో పిపిసి కేంద్రం నిర్వాహక ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతుల నుండి కొనే ధాన్యానికి ఏఏ రకానికి ఎంత మద్దతు ధర చెల్లిస్తారు, రైతులు తమ ధాన్యానికి మంచి ధర వచ్చేందుకు పాటించ వలసిన తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలు గురించి ప్రతి రైతుకు సమగ్రంగా వివరించాలని ఆయన పిపిసి కేంద్రం ఏజెన్సీలను ఆదేశించారు.  రైతుల పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని,  దళారులకు తక్కవ ధరకు అమ్మి నష్ట పోవద్దని ఆయన రైతులను కోరారు. ఈ పర్యటనలో ఆయన వెంట సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డియం జయరాములు, పౌర సరఫరాల సంస్థ క్షేత్రాధికారులు పాల్గొన్నారు.


పట్టణాలకు  జోరుగా  నాటుసారా  అక్రమ రవాణా


 


పట్టణాలకు  జోరుగా  నాటుసారా  అక్రమ రవాణా


  అడ్డదారుల్లో  రాత్రివేళ  తరలిస్తున్న  నాటుసారా


 

 

     వి.మాడుగుల... పెన్ పవర్ ప్రతినిధి : మజ్జి శ్రీనివాస మూర్తి 

 

మాడుగుల మండలం నుంచి  పట్టణాలకు  నాటు సారా  అక్రమ రవాణా  జోరుగా సాగుతోంది. రాత్రి వేళల్లో ఆటోలు  బైకులు  వ్యాన్లు ద్వారా నాటు సారాను  ఆయా ప్రాంతాలకు  చార వేస్తున్నారు. పలు గ్రామాల్లో  నాటు సారా  తయారీ  కుటీర పరిశ్రమగా  మారిపోయింది. నాటు సారా  బట్టీల పై  ఎక్సైజ్ పోలీసులు  దాడులు  జరుగుతున్న  మరోపక్క  గుట్టుచప్పుడు కాకుండా  నాటు సారా తయారు చేసి  ఎగుమతి చేస్తున్నారు. మండలంలోని  గౌరవరం  ఒండ్రు వీది  కామ కోటం అవురువాడ  కృష్ణాపురం  తదితర  గ్రామాల్లో  నాటుసారా   తయారీ యదేశ్చగా  సాగుతోంది. ఈ గ్రామాల నుంచి  అనకాపల్లి  గాజువాక  తాళ్లపాలెం  విశాఖ  ప్రాంతాలకు  నాటుసారా తరలిపోతోంది. కఠినమైన  నిబంధనలతో  నడుస్తున్న  ప్రభుత్వ మద్యం షాపుల వల్ల  గ్రామీణ ప్రాంతాల్లో   నాటుసారా  తయారీ  అమ్మకాలు  జోరందుకున్నయి. ఇంతలో కరోనా లాక్ డౌన్  కారణంగా  మార్చి 22 నుంచి  ప్రభుత్వ మద్యం  దుకాణాలు  మూతపడ్డాయి. మందు బాబులు  సారా  కిక్కు వైపు   దృష్టి సారించడంతో  నాటు సారా వ్యాపారం మూడు సీసాలు  6 ప్యాకెట్ లుగా  సాగుతోంది. అందుబాటులో  సారా తయారీ ముడి  సరుకుల ( బెల్లం  అమ్మోనియా) అందుబాటులో  ఉండటం వల్ల  నాటు సారా తయారీ  భారీ ఎత్తున జరుగుతోందన్న  ఆరోపణలు లేకపోలేదు. మాడుగుల ఎక్సైజ్  సర్కిల్ ఇన్స్పెక్టర్  బత్తుల జగదీశ్వర్ రావు నాటు సారా  తయారీపై ప్రత్యేక నిఘా తో  దాడులు  నిర్వహిస్తున్నారు. బెల్లం పులుపు  ధ్వంసం చేస్తున్నారు. అయినా  తయారీదారులు  మాత్రం  వెనక్కి తగ్గడం లేదు. జనసంచారం  లేని  నిషీద  ప్రాంతాలకు  తమ స్థావరాలను  మార్చే స్తున్నట్లు  సమాచారం. పట్టణాల్లో  నాటు  సార్  వినియోగం  పెరిగి పోవడంతో  రహస్యంగా   ఆయా ప్రాంతాలకు   నాటుసారా  రవాణా చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు  కదలికలను  పసిగడుతూ  అర్ధరాత్రి వేళ  నాటు సారాను  గమ్యస్థానాలకు   చేర వేస్తున్నట్లు  విశ్వసనీయ  సమాచారం. రాత్రి 10 నుంచి  తెల్లవారు మూడు గంటల లోపు  అడ్డదారుల్లో  నాటుసారాని  తీసుకుని  పోతున్నట్లు  అధ్యక్షుల కథనం. ప్లాస్టిక్  కేన్లులో  సారా నింపి  మైకా సంచులు చుట్టి  తరలిస్తున్నారు.  ప్లాస్టిక్  కవర్లో సారా  నింపి  గోనె సంచుల్లో  తరలిస్తున్న సంఘటనలు లేకపోలేదు.నాటు సారా తయారీ దార్లకు గల్లీ లీడర్ల అండ మెండుగా  ఉన్నట్లు బోగాటా. ఎక్సైజ్  అధికారులు  పోలీసుల  కదలికలు   ఎప్పటికప్పుడు పైలట్ ల  ద్వారా  వారికి   చేరుతుంది. కొండల  అంచుల్లో  పొదల్లో  తోటల్లో  సారా  తయారీ  అరికట్టాలంటే   డోన్ కెమెరాలు  వినియోగించక  తప్పదని  పరిశీలకులు అంటున్నారు. ఈ మేరకు  ఎక్సైజ్ సిఐ  జగదీశ్వర్ రావు  మాట్లాడుతూ  ఇటీవల  6 వేల లీటర్ల  పులుపు  ధ్వంసం చేసాం. ఆటోలో తరలిస్తున్న  40 లీటర్ల  సారాను  పట్టుకున్నారు. ఆదివారం రాత్రి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి.రామారావు 100లీటర్ల నాటుసారా తరలిస్తున్న ఆరుగురు ని అరెస్ట్ చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...