Followers

ముస్లింలకు  రంజాన్ పండుగ వేడుకలు ఇళ్ళల్లో నే జరుపుకోవాలి


ముస్లింలకు  అతి ముఖ్యమైన పండుగ రంజాన్.

 కోవిడ్ 19 వల్ల ఇళ్ళల్లో వేడుక లు జరుపుకోవాలి.

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

 

స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)

 

 

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 కారణంగా ముస్లింలు రంజాన్ పండుగను  ఇళ్లవద్దనే ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం  ఉదయం మంత్రి ఎంపి లు, జిల్లా కలెక్టరు, ఎస్ పిలతో కలసి ముస్లిం మత పెద్దలతో పవిత్ర రంజాన్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై వుడా చిల్డ్రన్ ఎరినాలో సూవేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లింలకు  రంజాన్ అతి ముఖ్యమైన పండుగని, వారు బందుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటారని, అయితే కోవిడ్–19 ప్రమాదము ఉన్నందున వారు పండుగను  కొన్ని పరిమితులకులోబడి నిర్వహించుకోవలసి రావడం బాధాకరమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం అభివృద్దికి, సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను  అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.  పండుగతో పాటు ప్రజలను కాపాడుకోవాలన్నారు. యిప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్, ముస్లిం మత పెద్దలతో ఈ విషయాన్ని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారన్నారు.  ఎం పి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వీలైనంత వరకు ఇంటికే పరిమితమై రంజాన్ పండుగను జరుపుక్పోవాలని సూచించారు.  విశాఖపట్నంలో సుమారు 25వేల మంది ముస్లిం కుటుంబాలు ఉన్నాయని వారందరికి ప్రగతి భారతి ట్రస్టు ద్వారా నిత్యావసర సరకులు  కిట్ లను అందజేస్తామన్నారు. మత పరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి  ప్రత్యేక ఆర్ధిక సహాయం క్రింద  5 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.  జిల్లా కలెక్టర్ వినయచంద్ మాట్లాడుతూ కోవిడ్–19 సందర్భంగా ముస్లింలు రంజాన్ పండుగను  ఇళ్ల వద్దనే జరుపుకోవాలని సూచించారు.  మీ అందరికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. అందరి సూచనలతో రాష్ట్ర స్థాయిలో మార్గదర్శకాలు వస్తాయన్నారు. 

ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు రెహమాన్,  పలువురు మత పెద్దలు వారి అభిప్రాయాలను తెలియజేశారు. విశాఖపట్నం శాంతకాముక జిల్లా అని, అందరు సంమయనం పాటిస్తూ, పవిత్ర రంజాన్ మాసం నిష్టతో ఉపవాసం చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిగారి సూచనలు పాటిస్తూ సమాజాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో  వి ఎం ఆర్ డి ఎ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు,  ఎస్ పి అట్టాడ బాబూజీ, మత పెద్దలు ఐ.హెచ్. ఫరూఖ్, తదితరులు పాల్గొన్నారు. 

వలస కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ : ఎమ్మెల్యే అధీప్ రాజు


వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకుల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అధీప్ రాజు


            పరవాడ, పెన్ పవర్ ప్రతినిధి  చింతమనేని అనిల్ కుమార్

 

పరవాడ మండలం:ఎట్టకేలకు కరోనా లాక్ డవున్ వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన నిత్యావసర సరుకులను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధీప్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేశారు.మండలం లోని పరవాడ,తాణాo,లంకెలపాలెం,ఈ బోనంగి గ్రామాల్లో ఉన్న ఇతర రాష్ట్రాలు అయిన ఒరిస్సా,ఛత్తీస్ గడ్,బెంగాల్,మహారాష్ట్ర లనుండి వచ్చిన వలసకూలీలు 456 మందికి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 కేజీల బియ్యము,3 కేజీల గోధుమపిండి,1 కేజీ కందిపప్పు,1లీటర్ నూనె పేకెట్టు ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పరవాడ తహశీల్దార్ గంగాధర్,ఆయా గ్రామాల విఆర్వో లు పాల్గొన్నారు.

ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ


 


ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులను


పంపిణీ చేసిన సిఐటియు జి.కోటేశ్వరరావు

 

            పరవాడ,  పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్

 

పరవాడ మండలం: కరోనా కారణంగా తమ విధుల్లో అహర్నిశలు పగలన,రాత్రి అనక కష్టపడుతున్న మండలం లోని 60 మంది ఆశా వర్కర్లకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు నిత్యావసర

సరులను పంపిణీ చేశారు.కరోనా వైరస్

కారణంగా ప్రభుత్వాలు ప్రజలకు విధించిన స్వీయ నిర్బంధం మొదలు అయిన దగ్గరనుండి సుమారు నెల రోజుల నుండి ప్రజలు కరోనా భారిన పడకుండా ఉండటానికి వారు తీసుకోవలిసిన జాగ్రత్తలు గురుంచి వివరిస్తూ వారిని ఛైతన్య వంతులను చేయడం కానీ గ్రామాల్లో హైపో క్లోరైడ్ పిచికారి చేయించే కార్యక్రమాల్లో కానీ ముఖ్యపాత్ర పోషించి ఎండను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమిస్తున వ్యక్తులు ఆశా వర్కర్లు వారికి జిల్లా సీఐటీయూ వారి ఆధ్వర్యంలో 5 కేజీల బియ్యము,1కేజీ కందిపప్పు,1కేజీ గోధుమపిండి ని అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ,సిఐటియు 79 వ వార్డు కార్యదర్శి యు.వి.రమణ,సిపిఎం నాయకురాలు పి.మాణిక్యం,సిఐటియు నాయకురాలు ఏ.వరలక్ష్మి,వెన్నెల లక్ష్మి,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

మానవత్వాన్ని మరవని పోలీస్ రమణయ్య 


అహర్నిశలు ప్రజలకోసం శ్రమిస్తూ కూడా మానవత్వాన్ని మరవని పోలీస్ రమణయ్య 


 

              పరవాడ,  పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్

 

పరవాడ మండలం:కరోనా వైరస్ వ్యాప్తి చెoదకుoడా కరోనా బారిన ప్రజలు పడకుండా అహర్నిశలు రాత్రి అనక,పగలు అనక,ఎండ అనక,తిండి వున్నా లేకున్నా శ్రమిస్తున వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అంతటి భాద్యతలో కూడా సామాజిక స్పుహతో వవహరిస్తున్నారు కొందరు పోలీసులు ఆ కోవకి చెందిన వ్యక్తే పరవాడ పోలీసు స్టేషన్ క్రైం ఇన్స్పెక్టర్ రమణయ్య.కరోనా లాక్ డవున్ కారణంగా ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా దాతలు చాలామంది సామాజిక స్పృహతో ఎవరు చేయగలిగిన సహాయం వారు చేస్తున్నారు.కానీ రమణయ్య నూతనంగా ఆలోచించి 23 మంది పాత నేరస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయుడు,రాజేష్,నాగేంద్ర, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. 

"జనసేవలో" జనసేన నాయకుడు కింతాడ


"జనసేవలో" జనసేన నాయకుడు కింతాడ


             పరవాడ,  పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్

 

పరవాడ మండలం:కరోనా వలన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోండి అని పిలుపునిచ్చిన జనసేన అధినాయుడు పవన్ కళ్యాణ్ పిలుపుకు స్పందించి జనసేవలో ముందుంటున్న జనయోధుడు కింతాడ ఈశ్వరరావు.79 వ వార్డ్ జాజులవాని పాలెం లో వార్డ్ జనసేన అభ్యర్థి ఈశ్వరరావు తన వ్యక్తిగత నిధులతో సుమారు 300 వoదల కుటుంబాలకు కురాగాయల్ని మంగళవారo పంపిణీ చేస్తూ ప్రజలకు కరోనా బారిన పడకుండా వుండటానికి ఇంటి నుంచి బయటకు రావద్దు అని జాగ్రత్తలు చెప్పారు.అనంతరం కింతాడ జనసైనికులను ఉధ్యేసించి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు లాక్ డవున్ లో నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జన సైనికులు తమవంతు సహాయంచేస్తూ వారిని ఆదుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ దుల్ల రామునాయుడు,మోటూరి సన్యాసినాయుడు,లక్క రాజు,శ్రీనివాస్,పిల్లి శివ కృష్ణ,శంకర్,చందు,జనసైనికులు పాల్గొన్నారు.

వేoకటాపురం లో ఆర్ హెచ్ ఐ క్లాసిల్ కంపెనీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ


వేoకటాపురం లో ఆర్ హెచ్ ఐ క్లాసిల్ కంపెనీ నిత్యావసర సరుకుల పంపిణీ


         మునగపాక,  పెన్ పవర్ ప్రతినిధి

 

మునగపాక మoడలం:కరోనా స్వీయ నిర్బంధ వలన ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ నిత్యవసర సరకులకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆర్ హెచ్ ఐ క్లాసిల్ కంపెనీ వారు గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.వెంకటాపురం గ్రాంలో ఉన్న క్లాసిల్ కంపెనీవారు సామాజిక బాధ్యత తో గ్రామంలో ఉన్న 450 కుటుంబాలకు కేజీ కందిపప్పు,కేజీ పంచదార,కేజీ గోధుమ రవ్వ,లీటర్ మంచి నూనె పేకెట్టు లను కంపెనీ ఛైర్మన్ ఆర్.వి.యెస్.రాజు,మునగపాక ఎస్సై శ్రీనివాసరావు ముఖ్య అతిధులుగా పాల్గొని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుందరపు వేంకట కనక అప్పారావు,సుందరపు తాతాజీ,బొమ్మిరెడ్డి పల్లి సాయి వజ్రం,ఎమ్ నాగవర్మ,సుందరపు శ్రీనివాసరావు,కడియం అనురాధ,ముమ్మిన శ్రీనివాసరావు,మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత


ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సందేశం


 


న్యూ ఢిల్లీ , పెన్ పవర్ ప్రతినిధి


ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నేలను, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలి. మన పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యధావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది.


నేల తల్లి అనే మాట వినపడగానే మా తాతగారు గుర్తుకు వస్తారు. చిన్నతనంలో ఆయన దగ్గరే పెరగడం వల్ల నా జీవితం మీద, నా వ్యక్తిత్వం మీద ఆయన ప్రభావం చాలానే ఉంది. నేల గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. *“నేల... తల్లి లాంటిది. మనల్ని పెంచి పోషించడానికి అమ్మ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో, అమ్మను జాగ్రత్తగా చూసుకోవడానికి మనం కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. అమ్మ లేని మనిషే కాదు, అన్నం తినని మనిషి కూడా ఉండడు. అందుకే ప్రతి మనిషి నేలను అమ్మలాగే చూసుకోవాలి”* అని ఆయన ఎప్పుడూ చెబుతుండే వారు. అందుకే నేను పర్యావరణ పరిరక్షణ గురించి చెబుతూ ఉంటాను. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందని విశ్వసిస్తుంటాను.


విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి శిఖరాల్ని చూస్తున్న తరుణంలో భూ పరిరక్షణ గురించి మాట్లాడుకోవలసి రావడం ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మన పూర్వికులు మనకు ఎంతో స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించారు. అయితే దాన్ని మనం ఎంత వరకూ కాపాడుకుంటున్నామని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేల బాగుంటే మనమూ బాగుంటాం. అలాంటి తల్లి  అనాలోచిత మానవ చర్యల వల్ల కలుషితం అవుతూనే ఉంది. ప్రకృతి విరుద్ధంగా చేస్తున్న చర్యల వల్ల భూమి వేడెక్కుతోంది. ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల వాయు కాలుష్యం పెచ్చు మీరుతోంది. నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. చివరకు నేలను అమ్మకన్నా మిన్నగా చూసుకునే అన్నదాతలు సైతం రసాయనాల వాడకంతో నేలతల్లి పట్ల చేస్తున్న అపచారాన్ని గుర్తించడం లేదు.


1970లో ప్రారంభమైన ఈ ధరిత్రి దినోత్సవం 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ ఏడాది పర్యావరణ చర్యలు (climate action) నేపథ్యంతో జరుపుకుంటున్నాం. వాతావరణ మార్పులు ప్రస్తుతం ప్రపంచానికి సవాలు విసురుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఈ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మన జీవితాలను మార్చేందుకు అదే విధంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మన జీవన విధానంలో మార్పులు రావలసిన అవసరం ఉంది. ఇది ఒక రోజుకు కాదు మన జీవితానికి అన్వయించుకోవలసిన అవసరం ఉంది.


ఇందు కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. తరిగిపోయే వనరులకు బదులు, పునర్వినియోగించుకోగలిగే వనరుల మీద దృష్టి పెట్టాలి. పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత ఆర్థికాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి. చౌకైన, సమర్థవంతమైన సౌర విద్యుత్ లాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించగలిగే సాంకేతిక పరిజ్ఞానం మీద దృష్టి పెట్టాలి. అడవుల పెంపకం, జీవ వైవిధ్య సంరక్షణ కోసం ప్రతిన బూనాలి. వ్యక్తిగత రవాణా స్థానంలో సమర్థవంతమైన ప్రజారవాణాను వినియోగించుకోవాలి. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. రసాయనాలు వాడని వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం అందించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో, ప్రతి మనిషి బాధ్యత కూడా అంతే ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించగలిగితే, ధరిత్రి దినోత్సవం గురించి ఇలా మాట్లాడుకోవలసిన అవసరం రాదని భావిస్తున్నాను.


ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన మధ్య దూరం ఉండాలని చెబుతుందే తప్ప, పర్యావణాన్ని కాపాడుకునే దిశగా మనం వేసే అడుగులను అది ఆపలేదు. అంతే కాదు భయపడి పారిపోతుంది కూడా. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే భూతాపం మరింత పెరిగి, 2100 కల్లా భూమి మీద మానవుడు బ్రతికే పరిస్థితి ఉండబోదని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామలాం మాతరం వందే మాతరం... అని నిత్యం నినదించే మనం భవిష్యత్ తరాలకు ఎలాంటి భూమిని అందించబోతున్నాం. వందేమాతరం గీతం స్ఫూర్తిని ప్రతి మదిలోనూ నింపుకుని మన నేలతల్లిని మనమే కాపాడుకునేందుకు సిద్ధం కావాలి. మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన గాలి, నీరు, నేలను యధావిధిగా ముందు తరాలకు అందించడం తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...