జివిఎంసి కమిషనరు విన్నపానికి స్పందించి పారిశుద్ధ్య కార్మికులకు , పునరావస కేంద్రాల్లో నిరాశ్రయులకు, ఆహార పదార్ధములు పంపిణీ చేపట్టిన దాతలు
విశాఖపట్నం/ పూర్ణా మార్కెట్ , పెన్ పవర్ ప్రతినిధి సతీష్ కుమార్
జివిఎంసి పరిధిలో కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు చేపట్టిన ప్రభుత్వాదేశాలు ప్రకారం లాక్ డౌన్ కార్యక్రమం అమలవుచున్నది. లాక్ డౌన్ కాలంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పునారావాస కేంద్రాల్లో గల నిర్వాసితులకు తగు సహాయ సహకారాలు అందించాలని కమిషనర్ గారు పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకొని కార్పోరేషన్ పారిశుద్ధ్య విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు నగరంలో ప్రముఖ సంస్థల యాజమాన్యాలను, ముఖ్య వ్యక్తులను సంప్రదించి, పునారావాస కేంద్రాలలోని నిర్వాసితులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం అందించాలని విన్నవించారు. కమిషనర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు స్వచ్చభారత్ అంబాసిడర్లు అయిన ఓ.నరేష్ కుమార్ గారు మరియు కాశీ విశ్వనాధరాజుగారు కలసి నగరంలో గల సుమారు 5700 మంది పారిశుధ్య కార్మికులకు భోజన సదుపాయాలు అందించడానికి అంగీకరించారు మరియు పునరావాస కేంద్రాలలో గల సుమారు 2000 మంది నిర్వాసితులకు దైనందిన జీవనంలో వాడుకొనే సబ్బు, పేస్టు, బ్రష్ మొదలగు వస్తువులుగల కిట్ ను ఒక్కొక్కరికి అందించడానికి ముందుకు వచ్చి 2000 కిట్లను అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకు ఆయన ఛాంబర్ లో అందించారు. మరియు వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం నగరంలోగల పునారావాస కేంద్రాలలో ప్రతి రోజు సుమారు 1900 మంది వరకు భోజనసదుపాయాలు అందిస్తున్నారు. నరేష్ కుమార్ మరియు కాశీ విశ్వనాధ్ రాజు గార్లు చేస్తున్న ఇటువంటి మంచి సామాజిక కార్యక్రమాలకు కమిషనర్ గారు వారివురికి కృతజ్ఞతలును పత్రికా ప్రకటన ద్వారా తెలియపరిచారు.