కష్టకాలంలో కళాకారులకు నేనున్నాను : మావూరి..
Followers
కష్టకాలంలో కళాకారులకు నేనున్నాను : మావూరి..
రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కోవిడ్ రక్షణ పరికరాలు
రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కోవిడ్ రక్షణ పరికరాలు
పంపిణీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి
జిల్లా యంత్రాంగం చేపడుతున్న కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొనే ప్రభుత్వ అద్దె వాహనాల డ్రైవర్లకు కరోనా నుండి రక్షణ కోసం అవసరమైన పరికరాలు, సామాగ్రితో రూపొందించిన ఒక కిట్ ను రవాణా శాఖ ఉచితంగా అందజేస్తోంది. జిల్లాలో 600 వాహనాల డ్రైవర్లకు ఉచితంగా ఈ కిట్లు అందించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించారు. 4 మాస్క్ లు, 4 గ్లౌస్ లు, 2 డెట్టాల్ సబ్బులు, 1 శానిటైజేర్ బాటిల్ ఈ కిట్ లో ఉంటాయని రవాణా శాఖ ఉప కమీషనర్ సి.హెచ్.శ్రీదేవి తెలిపారు. వాహన డ్రైవర్లు ఎన్నో ప్రదేశాలకు వెళ్తుంటారని, డ్రైవర్ లకు కోవిడ్ నుండి రక్షణ కల్పించేందుకే ఈ కిట్ ను వారికి ఉచితంగా అందిస్తున్నామని ఉప రవాణా కమీషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు రవాణా శాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో మోటారు వాహన తనిఖీ అధికారి బుచ్చిరాజు, సహాయ తనిఖీ అధికారి దుర్గ ప్రసాద్, కృష్ణ మోహన్, శ్యాం ప్రభు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులను పంపిణీ : శిరిపురపు
కరోనా నిర్బంధం వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శిరిపురపు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి చేయూతగా అందించారు
మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీ ఏం
మెప్మా ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ ప్రారంభం
- మెప్మా ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
- పట్టణ స్వయం సహాయక సంఘ మహిళలచే తయారు చేయబడిన మాస్కులు.
- రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మూడు మస్కులను అందించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.
- కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపీ గౌతమ్ సవాంగ్, మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ జీ. ఎస్. నవీన్ కుమార్, ఐఏఎస్, ఆదనపు మిషన్ డైరెక్టర్ శ్రీ కె. శివ పార్వతి.
- అనంతరం రాష్ట్రంలోని మాంసవిక్రయదారులకి మస్కులను పంపిణీ చేసిన మెప్మా అధికారులు మరియు సిబ్బంది.
- 100 క్లస్టర్లలోని 34 ఉత్పత్తి కేంద్రాలలో మాస్కుల తయారీ లో నిమగ్నమైన 13000 పట్టణ స్వయం సహాయక సంఘ మహిళలు.
స్టేట్ బ్యూరో చింతా వెంకటరెడ్డి, పెన్ పవర్ అమరావతి:
కరోన మహమ్మారి విజృంభన నేపథ్యంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా మరియు ఈ సంక్లిష్ట పరిస్థితిలో పేదవారికి అండగా నిలిచేలా ప్రణాళికా బద్ధమైన చర్యలను తీసుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో కరోన విజృంభన నిరోధక చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికి మూడు మాస్కుల చొప్పున్న అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోన పై చేస్తున్న పోరాటంలో ఒకవైపు నివారణ చర్యలు చేపడుతూ మరోవైపు వార్డ్ స్థాయిలో ప్రతి ఒక్కరికి కరోన నివారణ నియమలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మెప్మా ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘ మహిళకు జీవనోపాధి కల్పించేలా ఈ మాస్కుల తయారీ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఇందుకు గాను మెప్మా ఆధ్వర్యంలో 100 క్లస్టర్ లలో ఏర్పాటు చేసిన 34 ఉత్పత్తి కేంద్రాల ద్వారా 13000 మంది స్వయం సహాయక సంఘ మహిళలు రోజుకి లక్ష మాస్కుల తయారీ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన మాస్కులను పంపిణీ చేసే కార్యక్రమాన్నీ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఈ సందర్బంగా స్వయం సహాయక సంఘ మహిళల స్ఫూర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ జీ. ఎస్. నవీన్ కుమార్, ఐఏఎస్, ఆదనపు మిషన్ డైరెక్టర్ శ్రీ కె. శివ పార్వతి పాల్గొన్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వార్డ్ స్థాయిలో ఉన్న మాంసవిక్రయ మార్కెట్లోని మాంసవిక్రయదారులకి, చేపల విక్రయదారులకి, కొనుగోలుదారులకి స్వయం సహాయక సంఘ మహిళచే తయారు చేయబడిన మాస్కులను మెప్మా ప్రాజెక్ట్ అధికారులు మరియు సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోన నుంచి రక్షణ కల్పించే ఈ మాస్కులను పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ స్పూర్తిగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేసారు మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ జీ. ఎస్.నవీన్ కుమార్,ఐఏఎస్. అలాగే మెప్మా ప్రాజెక్ట్ అధికారులు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, కమీషనర్ల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నామని తెలియజేసారు.
కన్నా పై ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు అభ్యంతరకరం
కన్నా పై ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు అభ్యంతరకరం
బిజెపి నాయకులు చెరువు రామకోటయ్య
విశాఖపట్నం/ పూర్ణా మార్కెట్, పెన్ పవర్ ప్రతినిధి సతీశ్ కుమార్
కరోనా సమయంలో ప్రజలు మానసిక ఒత్తిడికి లోనవుతుంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పైశాచిక ఆనందం పరాకాష్టకు చేరిందని బిజెపి నాయకులు చెరువు రామకోటయ్య ఆరోపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఆరోపణలు చేయడం విజయసాయిరెడ్డి నీచ రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ఆరోపణలను, విమర్శలను విజయసాయిరెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. కరోనా కట్టడికి ప్రతిపక్షాలు ఇస్తున్న సలహాలను సూచనలను ప్రభుత్వం స్వీకరించాలని .. హేళన చేయడం తగదని సూచించారు.
లాక్ డౌన్ ఎత్తివేసే వరకు సేవలు కొనసాగిస్తాం" సేవా స్ఫూర్తి,"
లాక్ డౌన్ ఎత్తివేసే వరకు సేవలు కొనసాగిస్తాం" సేవా స్ఫూర్తి,"
జర్నలిస్ట్ లకు నిత్యవసర సరుకులు పంపిణి : ఎంపి విజయసాయి రెడ్డి
...
జర్నలిస్ట్ లకు నిత్యవసర సరుకులు పంపిణి చేసిన ఎంపి విజయసాయి రెడ్డి
పెదగంట్యాడ, పెన్ పవర్ ప్రతినిధి జయా కుమార్
నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వంకి చేరే విధంగా వారధిలా పని చేసే జర్నలిస్ట్ లకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు వైసీపీ జాతియ నాయకులు విజయసాయి రెడ్డి, కరోనా వైరస్ నేపాధ్యంలో లాక్ డౌన్ లో బాగంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ లకు సోమవారం టిఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్యక్షన ఎంపి విజయసాయి రెడ్డి, రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ , ఎంపి ఎంవీవీ సత్యనారాయణ, విఎమ్ ఆర్ డి చైర్మెన్ ద్రోణంరాజు శ్రీనివాస్ , సిఈసి నాయకులు దామా సుబ్బరావు చేతులు మీదగా విలేకర్లుకు నిత్యవసర సరుకులు పంపిణి చేసారు, కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, తిప్పల వంశీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి తదితరులు పాల్గున్నారు
Sent from my iPhone
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...