Followers

జర్నలిస్టులకు అండగా ఉంటా...


 


జర్నలిస్టులకు అండగా ఉంటా!



మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి హామీ


   గాజువాక, పెన్ పవర్ ప్రతినిధి శ్రీనివాస్ 

జర్నలిస్టులకు తాను అండగా నిలుస్తానని, వారి కష్టసుఖాల్లో భాగస్వామినవుతానని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం  గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని జర్నలిస్టులతో  స్వగృహంలో సమావేశమైన ఆయన విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల కుటుంబాలకు తాను భరోసాగా నిలుస్తానని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తన వంతు సహాయం అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. తన రాజకీయ ఎదుగుదలలో విలేకరుల పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తమకు మద్దతుగా నిలిచిన  గురుమూర్తి రెడ్డికి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పితాని సూర్య ప్రసాద్,  కె.పరుశురాం, కృష్ణ శ్రీ, గుప్త, బాలు, శ్రీనివాస రావు, కుమార్, జాన్ వరబాబు, రాజు, శ్రీను, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


ఏపీ లో రెడ్‌జోన్‌లో 97 మండలాలు


రెడ్‌జోన్‌లో 97 మండలాలు


ఒక పాజిటివ్‌ కూడా రాకుంటే 28 రోజులకు గ్రీన్‌జోన్‌


కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు


రేపటి నుంచి కేంద్ర మార్గదర్శకాల అమలు


రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ.


 (చింతా వెంకటరెడ్డి,  స్టేట్ బ్యూరో, పెన్ పవర్) 


రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్‌ మండలాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 676 మండలాలు ఉన్నాయి. మండల కేంద్రం యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్లలో కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. రెడ్‌జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్‌ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు ఒక్కటీ నమోదు కాకుంటే అప్పుడు గ్రీన్‌జోన్‌ పరిధిలోకి మండలం చేరినట్లు ప్రకటిస్తారు.


రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ..


కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నంద్యాల, బనగానపల్లి గ్రామీణ, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (పట్టణ), నందికొట్కూరు (పట్టణ), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (పట్టణ), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (పట్టణ)


నెల్లూరు (14): నెల్లూరు (పట్టణ), నాయుడుపేట (పట్టణ), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు (పట్టణ), కావలి (పట్టణ), కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు


గుంటూరు (12): గుంటూరు (పట్టణ), నరసరావుపేట, మాచర్ల (పట్టణ), అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి (పట్టణ), పొన్నూరు (పట్టణ), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (పట్టణ)


పశ్చిమగోదావరి (9): ఏలూరు (పట్టణ), పెనుగొండ గ్రామీణ, భీమవరం (పట్టణ), తాడేపల్లిగూడెం (పట్టణ), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (పట్టణ), నరసాపురం (పట్టణ)


ప్రకాశం (9): ఒంగోలు (పట్టణ), చీరాల (పట్టణ), కారంచేడు, కందుకూరు (పట్టణ), గుడ్లూరు, కనిగిరి (పట్టణ), కొరిసపాడు, మార్కాపురం (పట్టణ), పొదిలి


తూర్పుగోదావరి (8): శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (పట్టణ), రాజమండ్రి (పట్టణ), అడ్డతీగల, పెద్దాపురం (పట్టణ), రాజమహేంద్రవరం గ్రామీణ


చిత్తూరు (8): శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు


కడప (7): ప్రొద్దుటూరు (పట్టణ), కడప (పట్టణ), బద్వేలు (పట్టణ), పులివెందుల (పట్టణ), మైదుకూరు (పట్టణ), వేంపల్లె, ఎర్రగుంట్ల (పట్టణ)


కృష్ణా (5): విజయవాడ (పట్టణ), పెనమలూరు గ్రామీణ, జగ్గయ్యపేట (పట్టణ), నూజివీడు (పట్టణ), మచిలీపట్నం (పట్టణ)


అనంతపురం (5): హిందూపురం (పట్టణ), అనంతపురం (పట్టణ), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు


విశాఖపట్నం (3): విశాఖ (పట్టణ), పద్మనాభం, నర్సీపట్నం (పట్టణ). కేసులు నమోదైతే గ్రీన్‌జోన్‌ మండలం రెడ్‌జోన్‌లోకి వెళ్తుంది. ఈనెల 20 నుంచి కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను జిల్లాల్లో అమలుచేయాలని కలెక్టర్లను కోరింది.


శభాష్‌.. శ్రామిక మి సేవలు అమోఘం


శభాష్‌.. శ్రామిక మి సేవలు అమోఘo !


మురికితో నిత్యం సావాసం - కరోనా నివారణకై యుద్దం!


చిత్తూరుజిల్లా... శ్రీకాళహస్తి , పెన్ పవర్ న్యూస్


 


మనం రోడ్డుపై నడుచుకుంటూ వేళ్తున్నప్పుడో, బస్సుల్లో, వాహనాలల్లో ప్రయాణం చేసేటప్పుడో, పక్కన నుంచి దుర్వాసన వస్తేనే ముక్కుమూసుకుని వెళ్తుంటాం. వాసన భరించలేక త్వరగా వెళ్లండి అంటూ తోటి వారిని పరుగులు పెట్టిస్తాం. కానీ నిత్యం అదే మురుగుతో సావాసం చేస్తుంటారు వాళ్లు. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పరిశుభ్రత కోసం పాటుపడుతుంటారు. చెత్తాచెదారాన్ని, మురుగును ఒక్కచోట చేర్చి, మనకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంటారు. వాళ్లు ఒక్క రోజు పని మానేస్తే చాలు, రోడ్లన్నీ, వీధులన్నీ మురుగుతో, చెత్తాచెదారంతో కంపుకొడుతుంటాయి. కానీ వారి పని లాగే వారి బతుకుల్లో కూడా చెప్పుకోవడానికి 'చెత్త్త'నే మిగిలింది. వారి జీవితాల్లో 'పరిశుభ్రత' మచ్చుకైనా కానరావడం లేదు. చాలీచాలని జీతాలతో పూటగడవడమే కష్టమవుతోంది. అనుక్షణం మురుకితో జీవిస్తూ, ఆ 'మురికి' లాగే తమ జీవితాలు ఉండోద్దని కోరుకుంటున్నా పారిశుధ్య కార్మికులే నేటి మన శ్రమజీవులు..ఇంటి ముందు కొంచెం దుర్గంధం వెదజల్లి దోమలు వస్తేనే ఆరోగ్యం చెడిపోతుందని మనం భావిస్తాం. అటువంటి పరిస్థితుల్లో రోజు డ్రయినేజీలోకి దిగి మురికినీరు, తడి చెత్త ట్రాక్టర్లలోకి ఎత్తడంతో కార్మికులు ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతోంది. రోజు చెత్తలోనే ఉండడంతో వారి జీవితాలకు భరోసా లేకుండా పోతోంది. వచ్చిన జీతంలో సగం ఆస్పత్రికే ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో రోజు వారి జీవన ప్రమాణం క్రమంగా తగ్గుతుంది.అలాంటి శ్రామికులే నేటి ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో దేశం లాక్‌డౌన్‌లో ఉన్న నేపధ్యంలో కరోన నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమైనదని  కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న కార్మికులకు నేటి మన నిజమైన హీరోలు ! వారి సేవలను గుర్తిద్దాం! వారికి తగు రీతిలో సత్కరించి గౌరవిద్దాం అంటున్నారు నేటి నాయకులు! దీంతో వారిపడ్డ కష్టాన్ని గుర్తించిన నాయకులకు మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ మరింత చురుకుగా పనిచేస్తూ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ, తమకు తామే సాటి తమకు రారు ఎవరు పోటీ అన్న విధంగా నేటి పారిశుద్ధ కార్మికులు కరోనామహమ్మారి దేశంనుంచి పారదోలడానికి నగరవీధులను పారిశుద్ధ్యంగా ఉంచుతూ శభాష్ శ్రామిక అని నిరూపించుకున్నారు ! ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న సేవలను నాయకులు ఇప్పటికి గుర్తించి వారి పాదాలు కడిగి పూలతో పాదాభిషేకం చేస్తున్నారు తగురీతిగా వారిని గౌరవించి శాలువాలతో సత్కరిస్తున్న ఆర్థిక సహాయాలు అందజేస్తూ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు ఈ శ్రామికుడు పడుతున్న కష్టానికి గుర్తించి మీకు మేమున్నాం అండగా అంటూన్నారు నేటి శ్రమవిలువ తెలిసిన రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, కొంత మంది ఉద్యోగస్తులు, పారిశుధ్య కార్మికుల సేవలును గుర్తించి మాటల్లో కాక చేతల్లో చూపిస్తూ ఆ పారిశుద్ధ్య కార్మికులకు ఆదుకుంటున్నారు ఈ పారిశుద్ధ కార్మికుల సేవల గురించి .. నాయకులు, స్వచ్ఛందసంస్థలు, యువత , కొంతమంది ఉద్యోగస్తులు మాట్లాడుతూ... ఈ ఆపత్ కరమైన పరిస్థితులు నిత్యం మానవాళికి సేవలు చేస్తూ నగర వీధులు పరిశుభ్రంగా ఉంచుతూ కరోనామహమ్మారిని పారదోలడానికి ఢిల్లీ నుంచి పల్లెలోని గల్లీ వరకు నగర వీధుల్లో పరిశుభ్రంగా ఉంచుతుంది బ్లీచింగ్ లు చల్లుతూ కరోనామహమ్మారి రాకుండా రసాయనిక మిశ్రమాలను వీధి వీధి స్ప్రే చేస్తూ తమ ప్రాణాలుసైతం లెక్క చేయకుండా విధినిర్వహణకై ప్రజల రక్షణ కోసమే శ్రమిస్తున్న ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఎంత చేసిన తక్కువేనని ఇలాంటి శ్రామికులను ఇప్పటికైనా మనము గుర్తించడం వారి శ్రమకు మనం ఇస్తున్న విలువ అంటూ నాకు పారిశుద్ధ్య కార్మికులను వారి సేవలను కొన్ని ఆడుతున్నారు


వీరు సురక్షితులా.. వీరికి తప్పక చేయాలి .. కరోనా రాపిడ్ పరీక్షలు..


వీరు సురక్షితులా..?
వీరికి తప్పక చేయాలి ..
కరోనా రాపిడ్ పరీక్షలు..


(పెన్ పవర్ ప్రతినిధి-విజయనగరం)



విజయనగరం జిల్లాలో
అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దులను మూసి వేశాం. పటిష్ట భద్రతా చర్యలు వల్ల విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా కృషి చేసాం. కానీ కరోనా రాపిడ్ పరీక్షల విషయంలో కాస్తా వెనక బడ్డాం. అయినప్పటికీ ప్రస్తుతానికి విజయనగరం పరిస్థితి రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే చాలా మెరుగ్గానే ఉంది. అయితే ఒక చిన్న అనుమానం ప్రజల మనసును తొలుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, వారితో పాటు మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఉందన్న ఆలోచనతో కరోనా విషయంలో క్షేత్ర స్థాయిలో మాకు కనిపించిన ఒక అంశాన్ని, ఆలోచనను అధికార యంత్రాంగం ముందుకు తీసుకువస్తున్నాం..!!


విజయనగరం జిల్లా మీదుగా, సరిహద్దుల వెంబడి ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు నిత్యావసర సరుకులతో పాటు ఇతరాత్ర గూడ్స్ ని రవాణా చేసే ట్రక్కులు, లారీలు, కంటైనర్లు, వ్యాన్లు వంటి వాహనాలు నిత్యం తిరుగుతున్నాయి. ఇటీవల లాక్ డౌన్ నుంచి వీటికి సడలింపు ఇవ్వడం ద్వారా ఈ వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఒక విధంగా తప్పనిసరైనప్పటికీ, చిన్న అజాగ్రత్త వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం కనిపిస్తోందనిపిస్తోంది.


ఆయా ప్రాంతాల్లో రహదారుల వెంబడి ఉండే టీ దుకాణాలు, మెడికల్  షాప్ లు, చిన్న చిన్న చిల్లర దుకాణాలు లాక్ డౌన్ సడలింపు సమయాల్లో తెరచి ఉంటున్నాయి. వీటిల్లో టీ దుకాణాలు తెల్ల వారి జాముల్లోనూ, మెడికల్ షాప్ లు 24/7 తెరచి ఉంచుతున్నారు. అక్కడక్కడ పల్లెల్లో రోడ్ వెంబడి చుట్ట, బీడీ, సిగరెట్లు అమ్మే చిల్లర దుకాణాలు కూడా తెరిచే ఉంటున్నాయి. అయితే ఇతర జిల్లాలు, అంతరాష్ట్రాల నుంచి గూడ్స్ తో ప్రయాణిస్తున్న వాహనాలు  మన జిల్లాలోని రహదారుల గుండా ప్రయాణించేటప్పుడు వాటి డ్రైవర్లు, సిబ్బంది అక్కడక్కడ, అప్పుడప్పుడు ఆయా చోట్ల తమ అవసరాలను బట్టి వాహనాలు నిలిపి ఆయా దుకాణ దారులు వద్ద కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే అలా తమ వద్దకు వచ్చే వారు ఎవరు, ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వారు సురక్షితులా కాదా ఆని దుకాణ దారులు, మెడికల్ షాప్స్ వారికి తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే అలా ప్రయాణిస్తూ వస్తున్న ఈ వాహన డ్రైవర్లు, క్లీనర్ల వల్ల కరోనా వైరస్ ప్రబలు తుందేమోనన్న ఆందోళన ఇప్పుడు  ప్రజల నుంచి వ్యక్తమౌతోంది.


ఆయితే అలా వచ్చిన లారీ డ్రైవర్లు, క్లీనర్ లను పట్టుకొని వారికి కరోనా రాపిడ్ పరీక్షలు చేయడం కష్ట సాధ్యమయ్యే పని. అలాగని వారికి ఏమీ లేదు, వారు  సురక్షితులనే గ్యారంటీ ఇచ్చి వదిలేయనూ లేం. అయితే ఇప్పటి వరకు తీసుకున్న లాక్ డౌన్ మేజర్మెంట్స్ లో ఈ అంశానికి ప్రాధాన్యత లేకపోయి కూడా ఉండవచ్చును. కానీ అసలైన అప్రమత్తత ఇక్కడే ఎక్కువ తీసుకోవాలనిపిస్తోంది.


అందుకోసం అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల రహదారుల వెంబడి ఉండే చిల్లర దుకాణాలు, టీ దుకాణాలు, దాభాలు, మెడికల్ షాప్స్ ల్లో ఉండే వారిని గుర్తించి వారికి వెంటనే కరోనా రాపిడ్ పరీక్షలు చేయించాలి. అటువంటి వాటిని పూర్తిగా మూసి వేయడం లేదా, వారికి కరోనా పట్ల పూర్తిగా అవగాహన కల్పించడం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడొక విషయాన్ని గుర్తు చేస్తున్న..కరోనా మాదిరిగానే ప్రపంచాన్ని కబళించిన  హెచ్ఐవి(ఎయిడ్స్) వైరస్ కూడా మన దేశంలో ఎక్కువగా రవాణా వ్యవస్థ ద్వారానే వ్యాప్తి చెందిన విషయం మనకి విదితమే. దూర ప్రాంతాలకు సరుకు రవాణా చేసే లారీ డ్రైవర్లు, సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా ఈ హెచ్ఐవి వైరస్ వ్యాప్తికి అప్పట్లో ప్రధాన కారకులైనట్టు గణాంకాలు చెప్పేవి. 


ఇప్పుడు అంత కంటే ప్రమాద కరమైన కరోనా వైరస్ కూడా రవాణా వ్యవస్థ ద్వారానే ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉందని గుర్తించే  ముందు చూపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, ప్రయివేటు రవాణా వ్యవస్థలను లాక్ డౌన్ మేజర్మెంట్స్ లో భాగంగా నిలిపి వేశారు. తద్వారా వైరస్ చైన్ లింక్ ను కూడా తెంపే ప్రయత్నం చేశారు. అయితే రెండు వారాల లాక్ డౌన్ లో ప్రజల నిత్యావసర సరుకులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, తద్వారా ప్రజల ఇబ్బందులు పడడం,  రైతుల రబీ పంట ఉత్పత్తులు కూడా రవాణా లేక నష్టాల పాలవుతున్నట్టు గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గూడ్స్ లారీల రాకపోకలకు లాక్ డౌన్ సడలింపు ఇచ్చాయి. దీంతో  గత కొన్ని రోజులుగా రోడ్డెక్కిన గూడ్స్ లారీలు రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తున్నాయి. అలా ప్రయాణ క్రమంలో లారీ డ్రైవర్లు, క్లీనర్ల్ వల్ల కరోనా వైరస్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాపిస్తుందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.  అయితే వైరస్ వాహకులుగా అనుమానించినప్పటికీ, మనం వారిని కట్టడి చేయలేం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో రహదారుల వెంబడి చిల్లర దుకాణాలు, టీ దుకాణాలు, మెడికల్ షాప్స్ వారికి ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో కరోనా రాపిడ్ పరీక్షలు చేయించాలి. కరోనా పాజిటివ్ గుర్తించినట్టైతే వారిని కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడం ద్వారా ఆదిలోనే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేస్ కూడా నమోదు కాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉన్న యంత్రాంగం ఈ విషయమై కూడా ఒకసారి దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.


పేదరికాన్ని పరిహాస్యం చేసిన మంత్రి సురేష్


 పేదరికాన్ని పరిహాస్యం చేసిన మంత్రి సురేష్


:కాంగ్రెస్ పార్టి ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు

 


(న్యూస్ డెస్క్, పెన్ పవర్ ప్రకాశం జిల్లా)


ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లాక్ డౌన్ నేపథ్యంలో కూలీపనులు లేక ఇబ్బందులు పడుతున్న 500 మంది పేదలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతులమీదుగా నిత్యావసర సరుకులు అందించేందుకు YSRCP నాయకుడు చిల్లంచెర్ల మురళీకృష్ణ తన శ్రీనివాస సినిమా హాలులో పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని.ఎపిసిసి సభ్యులు యర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు.ఇది మంచి పరిణామమేనని హర్షించదగ్గ విషయమని.మరి కలెక్టర్ పర్మీషన్ ఉందా,హద్దులు సామాన్యులకేనా అధికార పార్టీలకు ఉండవా అని ప్రశ్నించారు.అలాగే మంత్రిగారు వచ్చేంతవరకు పేదలను ఎండలో బండలపై గంటన్నర పాటు కూర్చోపెట్టడంతో ఊపిరాడక చెమటలు పట్టి,సోస వచ్చేవరకు పేదలు ఇబ్బందులు పడ్డారని.ఆ తరువాత అనుచర గణంతో సాఫీగా వచ్చిన మంత్రి కొంతమందికి ఇచ్చి వెళ్ళిపోయారని.మంత్రి వెళ్లిపోవడంతో తమవరకు సరుకులు రావేమో అనుకొని జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారని.500 వందల మందికి సరుకులు సిద్దం చేయగా అక్కడికి దాదాపు 1000 మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని,ఆకలి వారిని అలా ప్రేరేపించిదని,జన తాకిడి ఎక్కువ అవటంతో సరుకులు ఉన్న వాహనాన్ని డ్త్రెవర్ అక్కడనుండి తరలించాడు సరుకులను అందుకొనేందుకు పేదలు వాహనాన్ని వెంబడించి అలసిపోయి,విసిగి వేసారి ఆగిపోయారని.సరుకులు 500 మందికి కూడా పంపిణీ కాకపోవడంతో పేద ప్రజలు ఫోటోలకు పోజులిచ్చేందుకు పిలిచారా అంటూ ప్రజలు తిట్టుకుంటూ,నిరాశతో వెనుదిరిగారని ఆవేదన వ్యక్తం చేశారు.లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక,ఆకలితో అలమటించి పోతున్న పేదలకు,ఆశ చూపి నిరుత్సాహ పరచటం,పేదరికాన్ని పరిహాస్యం చేయటమేనని,నిజంగా పేదల కడుపులు నింపాలని వారికి ఉంటే డోర్ డెలివరి ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు, ఆ సమయంలో పంపిణీ సరుకులు తీసుకెళ్ళెందుకు వచ్చిన ప్రజలను నిలువరించేదుకు పోలీసులు వచ్చి అదుపుచేయడం జరిగిందని,అంత అవసమేమి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.


పేద ప్రజలను ఆదుకోవాలి  


పేద ప్రజలను ఆదుకోవాలి   అంటూ   ఒక రోజు నిరాహారదీక్ష              


ఎం.ఎల్ .సి. సంధ్యా రాణి        


సాలూరు , పెన్ పవర్ ప్రతినిధి :  


పేద ప్రజలను   ఆదుకోవాలంటు ఎం.ఎల్ .సి.సంధ్యా రాణి శనివారం ఉదయం తన స్వగృహంలో ఉదయం తొమ్మిది గంటలకు నిరాహారదీక్ష ప్రారంభించారు .  అనంతరం విలేకరుల తో మాట్లాడుతూ  ప్రజలు లాక్ డౌన్ వలన ఆదాయం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నిత్యావసర దరలు పెరిగిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయాలని  తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన  అన్న క్యేంటిన్లు వేంటనే పునరుద్ధరణ చేస్తె లాక్ డౌన్ సమయంలో  ఎంతో ఉపయోగ పడుతుందని  అన్నారు. అన్న ధాతకు ప్రభుత్వం  అండగా నిలబడి వారి పంటలను మద్దతు ధరతో ప్రభుత్వమే కోనుగోలు చేయాలని, మరణించిన వారికి భీమా ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. కరోనా నివారణకు పనిచేస్తున్న పోలీసు ,వైద్య , మున్సిపల్ , పాత్రికేయుల కు రక్షణ కిట్ లు ఇవ్వాలని  అన్నారు. ఈ కార్యక్రమం లో పిన్నింటి ప్రసాదు, నిమ్మాది తిరుపతి రావు, నల్లి గోవింద తదితరులు పాల్గొన్నారు .


పేదలకు నిత్యవసర సరుకులు పంపిణి పోస్టల్ సిబ్బంది


పేదలకు నిత్యవసర సరుకులు పంపిణి పోస్టల్ సిబ్బంది


సాలూరు, పెన్ పొవర్ ప్రతినిధి


కరోనా రక్కసి వలన జన జీవన పరిస్థితులు అతల కుతలం అయిపోతుంటే నిరుపేదలు ఒక పూట ఉంటే రెండో పూటకు లేని బడుగు జీవులుకు సాలూరు పట్టణంలో ఎన్నో స్వచ్చంద సంస్థలు, అధికారులు వారిని గుర్తించి వారికి తోచిన విదంగా  సహయ సహకారులు అందిస్తున్నారు.వివలరాల్లో కి వెళితే పార్వతీ పురం డివిజన్, సాలూరు సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ కె .చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోస్టు మాస్టర్ రమేష్ , సిబ్బంది నిధులు సేకరించి పట్టణం లో ఉన్న 150 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకు శవివారం ఉదయం పంపిణి చేసారు. ఈ సందర్భముగా ఇన్స్‌పెక్టర్  చంద్రశేఖర్ మాట్లాడుతు ఈ కరుణ నేపథ్యంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అనేక సేవలు అందిస్తుందని,నగదు ట్రాన్ జేషన్ , ఇతర రాష్ట్రాల నుండి మెడికల్ వివిధ రకాల డిస్ట్రిబ్యూషన్ సేవలు అందిస్తుందని చెప్పారు.ఈ సమయంలో తినడానికి తిండి లేని బడుగు జీవులకు,మాకు తోచిన ఈ చిన్న సహాయం అందించాలని నేపథ్యంలో మా సిబ్బంది అందరూ ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.  ప్రజలకు ఇబ్బంది  కలగకుండా ఉదయం 6 నుంచి 11  గంటల వరకు వారికి అవసరమైన నగదు ట్రాన్ జేషన్ అవసరాలు తిరుస్తూ నిరంతరం సేవలు పోస్టల్ డిపార్ట్ మెంట్ అందిస్తుందని చెప్పారు.తదనంతరం ఆయన  చేతులు మిాదుగా పేదలకు నిత్యవసరమైన బియ్యం,బంగాళదుంపలు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి తో కూడిన సంచులు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో సాలూరు సబ్ డివిజన్ పోస్టల్ సిబ్బంది  సతీష్ , శేఖర్ , తదితరులు పాల్గొన్నారు 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...