Followers

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు


అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తా 



రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనువాసురావు 



మధురవాడ,  పెన్ పవర్ ప్రతినిధి : సునీల్


 


అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిదంగా తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనువాసురావు అన్నారు. జివిఎంసి జోన్ 1 ఆరో వార్డు పరిధి బక్కన్నపాలెం గ్రామములో పోతిన వెంకటరమణబాబు జ్ఞాపకార్థం వారి కుమారులు పోతిన విజయ్ వినాయిక్, పోతిన సూర్యారావు పోతిన మూర్తిబాబు, దన సహాముతో బక్కన్నపాలెం గ్రామ ములో కూరగాయలు, నిత్యా వసరకులు పంపిణి కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రంలో ముఖ్య అతిధి గా మంత్రి అవంతి శ్రీనువాసురావు పాల్గొని పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన  లాక్ డౌన్ విధించడం వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వడం  తో ప్రజలు నానా ఇబ్బందులుఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్బంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 6 వ వార్డు దేవిమెట్ట గ్రామములో 400మందికి  ఇంటింటికి భోజనాలు అవంతి శ్రీనువాసురావు చేతులు మీదుగా పంపిణి  ప్రజలకు శనివారం పంపిణి నిర్వహించారు. పోతిన మూర్తిబాబు మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ సందర్బంగా ఈ ప్రాంత ప్రజానీకం ఇళ్లకే పరిమితం కావడంతో పేద ప్రజలకు జీవనోపాధి కష్టంగా ఉంటుందని ఉద్దేశంతో తమ  వంతు సహాయం చేయడం చాల సంతృప్తినిచ్చిందన్నారు.     కరోనా వైరస్ నివారణ చేయుట లో ప్రతి ఒక్కరు సహకారం అవసరమని అందరూ కలిసి కట్టుగా కరోనా పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలిసుల కు సహకరించి ప్రజలు రోడ్డులపై అనవసరంగా ఉండవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో 6వార్డు వైకాపా అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు,ఈ ఎన్ ఎస్ చంద్రరావు, 5వార్డు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు,  పోతిన ఎల్లాజీ, గుంటుబోయిన సంజీవ్ యాదవ్,  వైసీపీ నాయకులు 6వార్డు వైకాపా ప్రచార కమిటీ ఇంచార్జ్ పిళ్ళా రమణబాబు,4వార్డు వైకాపా అధ్యక్షుడు పిళ్ళా సత్యన్నారాయణ,  గాదె రోశిరెడ్డి,పోతిన శివకుమార్, వాండ్రాసి రవికుమార్   పాల్గొన్నారు


ప్రత్యేక సర్వే ద్వారా ట్రూ నట్ టెస్ట్, రాపిడ్ టెస్ట్ లు


మధురవాడ, పెన్ పవర్ ప్రతినిధి: సునీల్


 


కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా జి వి ఎంసి జోన్-1 పరిధిలో గల అన్ని వార్డులలో జ్వరం, జలుబు, దగ్గు,  సంబంధిత లక్షణాలతో బాధ పడుతున్న వారిని, వయోవృద్ధులను ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించి వారికి ట్రూ నట్ టెస్ట్, రాపిడ్ టెస్ట్ లను చేయిస్తున్నట్లు జీవీఎంసి జోన్-1 కమిషనర్ బొడ్డేపల్లి రాము  పెన్ పవర్ ప్రతినిధికి తెలియజేశారు. శనివారం స్వతంత్ర నగర్ సచివాలయం లో రాపిడ్ టీంసభ్యులు, కేజీహెచ్ ఈ ఎన్ టి విభాగ వైద్యులతో సుమారు 120 మంది అనుమానితులకు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి జోనల్ కమిషనర్ సమక్షంలో రాపిడ్ టెస్టులు నిర్వహించారు. వార్డ్ ఈ.డి.పి సెక్రెటరీ, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, పి.హెచ్.సి ఎఎన్ఎంలు, శానిటరీ ఇన్స్పెక్టర్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు జోన్-1 కమిషనర్ పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ బొడ్డేపల్లి రాము మాట్లాడుతూ కరోనా వ్యాధి పై విస్తృత అవగాహన కల్పించి అప్రమత్తం గా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ప్రాంతాలలో స్ప్రే చేయడం, బ్లీచింగ్ చల్లడం, జోన్-1 అన్ని వార్డులలో నిరంతర శానిటేషన్ ప్రక్రియ జరగాలని, వివిధ అనారోగ్యా సమస్యలతో బాధ పడుతున్న వారితో పాటుగా, అరవై సంవత్సరాల పై బడి ఉన్నవారికి  లక్షణాలు లేనప్పటికీ  ట్రూ నట్ టెస్ట్ లను చేసి డైలీ రిపోర్ట్ ను అందజేయాలన్నారు. సిబ్బంది విధుల్లో అలసత్వం వహించకుండా పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ సిబ్బంది కేజిహెచ్ ప్రొఫెసర్లు, సెక్రెటరీలు,వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఆర్ శ్రీనివాసరావు, కె అలేఖ్య, యు రాజేశ్వరి, బివాసంతి,ఎన్. కుమారి తదితరులు పాల్గొన్నారు.


భార్యను కత్తితో నరికి చంపిన భర్త


ప.గో...జిల్లా నల్లజర్ల మండలం ఆవపాడులో దారుణం...


 


నల్లజర్ల, పెన్ పవర్ ప్రతినిధి రాము


భార్యను కత్తితో నరికి చంపిన భర్త, పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్య. భర్త  పసుపు లేటి రంగారావు (62), భార్య కళావతి (55) లుగా గుర్తింపు భార్యపై అను మానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారంవి జయవాడ నుంచి 2 నెలల క్రితం ఆవపాడు వచ్చి నివాసం ఉంటున్న దంపతులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నల్లజర్ల పోలీసులు


108లో ఇంత మందా...!!


108లో ఇంత మందా...!!


లాక్ డౌన్ ఉల్లంఘించిన వైద్య సిబ్బంది


సాంపిల్స్ సేకరణ కి తీసుకు వచ్చి..


తిరిగి 108లో 18 మందిని కిక్కిరిసినట్టు తరలించి..


చర్యలు తీసుకుంటాం: కలెక్టర్


ఆ పై దృశ్యాలను చూసారా.. రాష్ట్రంలో ఎక్కడా ఇంత వరకు ఇలాంటి చిత్రాలు చూసి ఉండరేమో.. అయితే విజయనగరం జిల్లా కేంద్ర హాస్పిటల్ వద్ద మంగళ వారం సాయంత్రం కనిపించిన ఈ దృశ్యం వెనుక కథ ఏందో కాస్తా చదవండి..”


(పెన్ పవర్ ప్రతినిధి-విజయనగరం) 


రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన జిల్లాగా నిత్యం వార్తలకెక్కే విజయనగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. యావత్ ప్రపంచాన్ని కబళించేస్తున్న కరోనా మహమ్మారిని తమ దరిదాపుల్లోకి రాకుండా స్వీయ నియంత్రణ, వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తున్న జిల్లా ప్రజలు ఒక్క కరోనా పాజిటివ్ కేస్ కూడా నమోదు కాకుండా విజయనగరంను వార్తల్లో నిలిపారు. దేశంలో కరోనాహొ విజృంభనతో విధించిన జనతా కర్వ్యూ మొదలు నేటి లాక్ డౌన్ వరకు జిల్లా ప్రజానీకం ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తోంది. అయితే అక్కడక్కడ కొంత మంది ఆకతాయిలు లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై జిల్లా పోలీస్ శాఖ కేసులు నమోదు చేసి భారీగానే జరీమానాలు కూడా వసూళ్లు చేసింది. ఇప్పటి వరకులాక్ డౌన్ ఉల్లంఘన కింద జిల్లాలో 22 వేల వాహనాలకు రూ.కోటి 50 లక్షలు పెనాల్టీ వసూళ్లు చేసి,హొ 950 కేసులు నమోదు చేసి 558 వెహికల్స్ ని సీజ్ చేశారు. ఇవీ సామాన్యులపై పోలీస్ వారి చర్యలు. మరో వారం రోజులు పాటు మరింత కఠినంగాను వ్యవహరించనున్నారు. సరే ఇంత వరకు బాగానే ఉంది. ప్రజలహౌ క్షేమం కోసం ఇటువంటి కఠిన మైన చర్యలు తీసుకోవడం అభినందనీయమే. కానీ కొన్ని చోట్ల పోలీస్, అధికార యంత్రాంగం వారి పర్య వేక్షణ, విధి నిర్వహనలో అలసత్వం ఎలా ఉందో చెప్పడానికి పైన చూపుతున్న ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. కరోనా ఐసోలేషన్ కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద ఎటువంటి భద్రత చర్యలు తీసుకోలేదని చాటి చెబుతున్న దృశ్యాలు అవి. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వైద్య శాఖ సిబ్బందే లాక్ డౌన్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే ఇది తప్పు అని చెప్పే పర్య వేక్షణ అధికారి ఒక్కరు కూడా అక్కడ లేకపోవడం అత్యంత శోచనీయం. కీలకమైన చోట ప్రజా భద్రతను గాలి కొదిలేసిన పరిస్థితి ఆసుపత్రి ప్రాంగణంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నెల్లిమర్ల మండలం సతివాడ పిహెచ్ సి పరిధిలో ఉన్న పరిసర గ్రామాలకు చెందిన సుమారు 18 మంది వలస కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇటీవల లాక్ డౌన్ అమలు సమయంలో స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. స్థానిక వాలేంటర్ల హొ సమాచారంతో వారందరిని కరోనా పరీక్షల నిమిత్తం సతివాడ పిహెచ్ సికి, అక్కడ నుంచి జిల్లా కేంద్రాసుపత్రి లోని ఐసోలేషన్ కేంద్రానికి వివిధ వాహనాల్లో తీసుకు వచ్చారు. అక్కడ వారి నమూనాలు సేకరించారు. అనంతరం వారందరినీ 108 వాహనంలో ఒకరి పై ఒకరు నొక్కుకుపోయి కూర్చుండేటట్లు కిక్కిరిసినట్టుగా ఎక్కించి అక్కడ నుంచి సతివాడకు తరలించారు. ఆ సమయంలో అక్కడ వైద్యాధికారులు గానీ, బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది గానీ లేరు. దీంతో అంత మందిని ఒకే వాహనంలోకి ఎక్కించి తరలించాలని 108 సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది ఎవరో, భద్రత దృష్ట్యాహొ అలా అందరినీ కిక్కిరిసి తీసుకు వెళ్లడం క్షేమం కాదని, అది లాక్ డౌన్ షరతుల ఉల్లంఘన కిందికి వస్తుందని 108 , వైద్య సిబ్బంది ఎందుకు హొ గ్రహించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ సమయంలో వారిని ఇళ్లకు చేర్చేందుకుహొ ప్రయివేట్ వాహనాలు లేని కారణంగానే 108 వాహనంలో తరలించారు అనుకుంటే, అంత మందిని ఒకే వాహనంలో కాకుండా అధికారులు మరి కొన్ని వాహనాలు లేదా ఒక ప్రత్యేక బస్సును గానీ ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. అంటే అధికారులు, వైద్య సిబ్బంది అంతా కలిసి నిర్ణయం తీసుకొనే ఇలా తరలించారని తెలుస్తోంది. మంగళవారం ఒక్క రోజే కాదు గత వారం పది రోజులగా ఎక్కువ శాంపిల్స్ సేకరణ మొదలు పెట్టిన నాటి నుంచి ఎక్కువ మంది అనుమానితులని 108 వాహనాలు ద్వారానే అధిక సంఖ్యలో తీసుకు వచ్చి తిరిగి అవే వాహనాల్లో వారిని ఇళ్లకు చేర్చుతున్నారని స్వయంగా 108 సిబ్బందే చెబుతున్నారు. అలా తాము తీసుకు వచ్చి, తిరిగి ఇళ్లకు చేర్చే వారెవ్వరికీ ఎటువంటి వైరస్ లక్షణాలు లేనందునే తాము అందరిని కలిపి ఒకే వాహనంలో తరలిస్తున్నామని సిబ్బంది సమర్ధించుకుంటున్నారు. బుధ వారం జరిగిన ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ కూడా ఇలాగే సమర్ధించారు. అలా ఒకే వాహనంలో కిక్కిరిసి తీసుకు వెళ్లిన వారెవ్వరికీ ఎటువంటి రోగ లక్షణాలు లేవని, భయపడాల్సిన అవసరం లేనందున అలా తీసుకు వెళ్లడం వల్ల ఏమీ జరగదని కలెక్టర్ పేర్కొనడం విశేషం. నిజానికి సాంపిల్స్ సేకరణకు తీసుకు వస్తున్న వారంతా అనుమానితులు. వీరంతా విదేశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారు, వారి కాంటాక్ట్స్. వీరికి వ్యాధి లక్షణాలు లేవన్న ధీమాతో వారి నమూనాలు సేకరించకుండా ఇక్కడి యంత్రాంగం వారిని హెూమ్ క్వరంటైన్ లో ఉంచేసి తమ పనై పోయిందని ధీమా పడింది జిల్లా యంత్రాంగం. జిల్లా నుంచి ఒకటి అరాహొ నమూనాలు పంపించి పాజిటివ్ కేసులు లేవంటూ రోజూ చంకలు గుద్దుకునే పరిస్థితి ఉండేది. అయితే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు గట్టిగా హెచ్చరించిన నాటి నుంచి నిద్ర మేలుకున్న యంత్రాంగం ఈనెల 6 నుంచి పదుల సంఖ్యలో శాంపిల్స్ తీసి కరోనా పరీక్షలకు పంపిస్తోంది. అలా తీసి పంపిన శాంపిల్స్ రిపోర్ట్ రెండు మూడు రోజులకొకసారి వస్తున్నాయి. అలా ఇప్పటి వరకు జిల్లా నుంచి 794 మంది నమూనాలు సేకరించి పరీక్షలకి పంపగా 316 మంది నివేదికలు నెగెటివ్ వచ్చాయి. ఇంకా 478 మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. అంటే ఈ 478 మంది అనుమానితులకి బాహ్యంగా వైరస్ వ్యాధి లక్షణాలు లేకపోయినా,హొ కరోనా పరీక్షల నివేదికల్లో నెగెటివ్ వస్తేనే వారు నూటికి నూరు శాతం సురక్షితులుగా భావించగలం. అంత వరకు వారిని ఇతరులు, వారు ఇతరులని తాకకుండా సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇదే లాక్ డౌన్ అమలు వెనుక అసలు ఉద్దేశ్యం. అయితే మంగళ వారం శాంపిల్స్ సేకరణ నిమిత్తం కేంద్ర హాస్పిటల్ కి తీసుకువచ్చిన సతివాడ పిహెచ్ సి పరిధిలోని అనుమానితులంతా ఈ క్రమంలోకే వస్తారు. అంటే ఒక రకంగా వీరంతా సురక్షితులు కాదు. వీరి పరీక్షల నివేదికల్లో నెగెటివ్ అని ఫలితం వచ్చే వరకు వీరంతా కరోనా అనుమానితులుగానే పరిగణించ బడతారు. మరి ఇటువంటి వారందరినీ 108 వాహనంలో కిక్కిరిసి ఎక్కించి మరీ తరలించారంటే అధికారులు తీరుని ఏమని ప్రశ్నించాలో అంతు చిక్కడం లేదు. వీరి రిపోర్ట్స్ రావడానికి ఇంకా నాలుగైదు రోజులు సమయం పట్టనుండగా వీరంతా సురక్షితులేనని వారిని తరలించిన 108 వాహన సిబ్బంది చెప్పినట్టు జిల్లా కలెక్టర్ పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. కాగా బుధ వారం ప్రెస్ మీట్ లో ఈ అంశంపై స్పందించిన కలెక్టర్ హరి జవహర్ లాల్ పై విధంగా పేర్కొంటూ, 108 వాహన సిబ్బంది చేసింది తప్పెనని ఒప్పుకున్నారు. ఇక పై అలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య సిబ్బంది, అధికారులకి గట్టి హెచ్చరికలు చేసినట్టు తెలిపారు.


డోంట్ కే (మో)ర్,


డోంట్ కే (మో)ర్


లాక్ డౌన్ విదుద్దంగా నడుస్తున్న మోర్ ఫెర్రో ఎల్లాయిస్


అదేబాటలో జయలక్ష్మీ ఫెర్రోల్లాయిస్


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న అధికారులు


మంత్రి బొత్స ఇలాకాలో ఇదీ దుస్థితి లో....


బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన పవర్


కరోనా కాదు... ప్రపంచం అంతమై పోయినా మాకు డోంట్ కేర్ అన్నట్టుగా కొందరు వ్యవహారిస్తున్నారు. జిల్లాలో కొన్ని ఫెర్రోల్లాయిస్ కంపెనీలు ఇలాంటి యవ్వారాలకు పాల్పడి కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. పైగా తమకు అన్ని అనుమతులున్నాయంటూ చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. జిల్లాలో అందునా మంత్రి బొత్స ఇలాకాలో ఇలాంటి యవ్వారాలు జరుగుతున్నా పట్టించుకునే నాధులే కరువయ్యారు. గరివిడిమండలం కోడూరులో ఉన్న మోర్ ఫెర్రో ఎల్లాయిస్ ప్రపంచం ఏమైపోతే మాకేంటి అన్నట్టుగా అభం శుభం తెలీని కార్మికుల జీవితాలతో ఆటలాడుతోందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తుంటే ఫెర్రో కంపెనీలు మాత్రం కరోనా మాకు చుట్టం మాజోలికి రాదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. పైగా చాలా నష్టాల్లో ఉన్నాం కొద్దిమంది కార్మికులతోనే నడుపుతున్నామని కంపెనీ ప్రతినిధులు చెప్పడం మరీ వింతగా ఉంది. అయితే లా డౌన్లో అత్యవపరమైన ఆహార ఉత్పత్తులు, వ్యవసాయాధారిత పరిశ్రమలు తప్పిస్తే ఇతర పరిశ్రమలు తెరవాలని ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా కొన్ని కంపెనీలు మాత్రం మాకు అనుమతులున్నాయని యదేచ్చగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక అదేబాటలో బంటుపల్లి లో ఉన్న జయలక్ష్మీ ఫెర్రో ఎల్లాయిప్ కూడా తన పని తాను కానిచ్చేస్తోంది.మోర్..... అయితే వీరు లాక్ డౌన్ పాటించకుండా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నా లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. పనిలోకి వచ్చిన కార్మికులను తిరిగి ఇంటికి పంపించకుండా కంపెనీలోనే ఉంచి వారికి ఆహారం ,వసతి సదుపాయాలు కంపెనీలో కల్పించాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం. కార్మికులు తమ విధులు ముగించుకుని నేరుగా ఇళ్ళకు వెళ్తున్నారని దీంతో వారి కుటుంబాల పరిస్థితి ఎంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీకి రోజు బయటనుంచి వాహనాలు, వ్యక్తులు రాకపోకలు , యదేచ్చగా సాగిస్తుండడం ఈ మహ్మమారి ఏరూపంలో ఎలా కాటు వేస్తోందోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఇలా కొందరు తమ స్వార్ధంకోసం ఎందరో జీవితాలు బుగ్గిపాలు చేయాలనుకోవడం తగదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా అధికారులు అత్యవసరమైనవి తప్పిస్తే ఇతర వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గర్శకాలు జారీచేసిందని వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు ఇలా వ్యవహారించడం ఎంతవరకు సమంజసమన్న భావన పర్వత్రా వ్యక్తమవుతోంది. అందునా మంత్రి బొత్స నియోజకవర్గంలోనే ఇలా జరగడం మరీ విడ్డూరంగా ఉందన్న గుసగుపలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.


సేవాకార్యక్రమాల్లో అరుణ 'కిరణం'


 


సేవాకార్యక్రమాల్లో అరుణ 'కిరణం'

 

 ఆరిలోవ, .పెన్ పవర్ ప్రతినిధి కూచిపూడి భాస్కర్ కుమార్ 

 

పూజలు చేసే చేతులు కన్నా... సేవలు చేసే చేతులు మిన్న... స్పూర్తి తో బీజేపీ నాయకురాలు అరుణోధయానికి ముందే అరుణ కుమారి అడుగులు వేస్తున్నారు. మోది లాక్ డౌన్ ప్రకటించిన నుండి ప్రతి రోజు  ఉదయాన్నే 18 వార్డు లో  పర్యటిస్తూ  అనేక సేవాకార్యక్రమములు నిర్వహిస్తున్నారు, రాజకీయాలను పక్కన పెట్టి  పేదలు, అనాధలకు ఆమె తన వంతుగా సేవలు అందిస్తున్నారు. పేదలకు భోజనం,  నిత్యవసర సరుకులు ఇస్తున్నారు. వార్డు లో పేదలను  గుర్తించి వారికి  ప్రతి రోజు ఉదయాన్నే అల్ఫాహారం గా   పులిహారా, ఉప్మా, ప్యాకేట్లను పంపిణీ చేస్తుంటారు  . అంతేకాకుండా వార్డులో కలియతిరుగుతూ నిరాశ్రయులను గుర్తించి వారికి  కావలసిన వైద్య సాదుపాయంతో పాటు వారికి ఆర్ధిక సహాయం చేయటం జరుగుతుంది.  ఇటు వంటి సేవమూర్తులను చూసి నేర్చుకోవలసింది ఎంతో  ఉందని కాలనీ వాసులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు

అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం చేసిన ఎస్సై


మానవత్వం పరిమళించిన గొప్ప మనసున్న ఎస్సై మధుకర్ రెడ్డి 


అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం చేసిన ఎస్సై చల్ల మధుకర్ రెడ్డి


కరీంనగర్/ చిగురుమామిడి (పెన్ పవర్ న్యూస్)


 ఖాకీ అంటే  వెంటనే గుర్తుకు వచ్చేది కరుకు మాట కానీ ఆ కరకు మాట వెనకాల చలించే గొప్ప మానవతావాది ఉంటారని నిరుపించారు.. చిగురుమామిడి సబ్ ఇన్స్ స్పెక్టర్ చల్ల మధుకర్ రెడ్డి లాక్ డౌన్ నేపధ్యం లో తీరిక లేకుండా ఒక వైపు డ్యూటీ చేస్తూ..మరొక వైపు అనాధ పిల్లలకు  ఆపన్న హస్తం అందించి  పోలీస్ అంటే ఇదీ అనీ చాటి చెప్పాడు. వివరాల్లోకివెళితేచిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మంద సదానందం డెంగ్యూ జ్వరంతో గత నాలుగు నెలల క్రితం చనిపోయినాడు. భర్త చనిపోయిన కొద్ది రోజులకే భార్య స్వప్న కిడ్నీలు పాడైపోయి ఇటీవలే మరణించడంతో...తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలు, ఐదు సంవత్సరాల బాబు  అనాధలయ్యారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న మండలంలోని చాలా మంది ఆర్థిక సహాయం చేస్తూ... అనాధ పిల్లలకు అండగా నిలబడుతున్నారు. బుధవారం రోజున చిగురుమామిడి మండల ఎస్సై చల్ల మధుకర్ రెడ్డి అనాధ పిల్లలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా సీఆర్పిఎఫ్ జవాన్ బవండ్లపల్లి  అజయ్ వెయ్యి రూపాయల అర్థిక సహాయం అందించారు. మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే సిరాజ్ అనాధ పిల్లలకు  అందించారు. అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన ఎస్సై కి గ్రామ సర్పంచ్ సన్నీల వెంకటేశం కృతజ్ఞతలు తెలియజేశారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...