Followers

రైతుల డేటాను  డి-కృషి యాప్ లో పొందుపరచాలి


 


రైతుల డేటాను  డి-కృషి యాప్ లో పొందుపరచాలి


రైతు భరోసా కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలి


                       జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్


విజయనగరం , పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్ 


 


గ్రామాల్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల పరిధి లోనున్న రైతుల డేటా మొత్తం డి-కృషి యాప్ లో నిక్షిప్తం చేయాలని  జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ వ్యవసాయాధికారులకు సూచించారు.   బుధవారం వ్యవసాయ, ఉద్యాన  శాఖాధికారులతో కలెక్టర్ టెలి  కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ ఖరిఫ్ 2020 లో వేరుసెనగ , వరి పండించే రైతుల వివరాలను వెంటనే సేకరింఛి డి-కృషి యాప్ లో పొందుపరచాలన్నారు.   నిత్యావసర సరుకుల మార్కెట్ స్థానిక ధరలను గ్రామ వ్యవసాయ సహాయకులు(అగ్రికల్చర్ అసిస్టెంట్), ఉద్యాన శాఖ సహాయకులు (హార్టికల్చర్ అసిస్టెంట్) లు   ప్రతి రోజు ఉదయం 11 గంటల లోపు  ఎస్సెన్సియల్  కమోడిటీస్ యాప్ ద్వారా పంపాలన్నారు.  జిల్లాలో గత ఏడాది రైతు భరోసా క్రింద 2 లక్షల 71 మంది కి సహాయాన్ని అందించాలని ఎంపిక చేయగా  27 వేల 500 మందికి వేర్వేరు కారణాల రీత్యా ఆర్ధిక సహాయం  వారి అకౌంట్స్ లో జమ కాలేదని అన్నారు. అయితే వారికి ప్రభుత్వం  ప్రస్తుతం ఎడిట్ చేసే అవకాశం  కల్పించిందని,  వ్యవసాయ, పంచాయతి రాజ్, రెవిన్యూ, బ్యాంకర్స్  తో టై అప్ చేసుకొని  ఏ కారణంగా లబ్ది పొందలేదో గుర్తించి లబ్ది దారులందరికి జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో మంజూరు చేసిన 664 రైతు భరోసా కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  మొదటి విడత లో చేపట్టిన 170 పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిని రెండు విడతల్లో పూర్తి చెయ్యాలని అన్నారు.  ఈ నెల 30 లోగా  రెండవ విడతలో చేపట్టిన 170 రైతు భరోసా కేంద్రాలకు పెయింటింగ్ పూర్తి చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖా సంయుక్త సంచాలకులు ఆశా దేవి తెలిపారు.  ఈ టెలి కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ డి డిలు, ఎ.డి లు, మార్కెటింగ్ శాఖ ఎ.డి శ్యాం కుమార్ , వ్యవసాయాధికారులు , గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.  


ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలే కీలకం


 


కరోనా తీవ్రత మధింపులో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలే కీలకం - జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన


 


పూర్ణ మార్కెట్ , పెన్ పవర్ ప్రతినిధి సతీశ్   


 


జివిఎంసి పరిధిలో కరోనా వ్యాధి తీవ్రత మధింపునకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల పాత్ర కీలకమైనదని జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన పేర్కొన్నారు. వి.ఎం.ఆర్.డి.ఏ. చిల్డ్రన్ ఎరీనాలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండవ విడత ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలలో గల మెడికల్ సిబ్బందికి ఇస్తున్న శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జివిఎంసి పరిధిలో క్షేత్రస్థాయిలో 98 వార్డులలో వచ్చిన ఫిర్యాదుల మేరకు హాజరై, వారిలో ఎవరైనా కరోనా లక్షణాలు కల్గిన వారిని గుర్తించి, సంబంధిత ఆసుపత్రులకు పరీక్షలకు పంపే నిమిత్తం 15 రోజులు విధులు నిర్వర్తించుటకు గాను మొదట విడత 50 బృందాలను షిఫ్టులు పద్ధతి ద్వారా పనిచేయడానికి జిల్లా కలెక్టరు వారి ఆదేశాలు మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాల వారి సహాయంతో ఏర్పాటు చేసియున్నారు. వారికి కేటాయించిన 15 రోజులు కాల పరిమితి పూర్తయినందున, వారి స్థానంలో తిరిగి నూతనంగా ఆంధ్రా మెడికల్ కళాశాల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పట్టణ ప్రణాళికా సిబ్బంది తో కూడుకొని రెండవ విడత ఆర్.ఆర్.టి బృందాలు ఏర్పాటు చేసి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎ.ఎమ్.సి ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనదన్నారు. నూతనంగా ఏర్పాటైన బృందాలు పనిచేసేవిధానం ఏవిధంగా ఉండాలో, శిక్షణా కార్యక్రమంలో డి.ఎం. హెచ్.ఓ తిరుపతిరావు, ఎ.ఎం.సి ప్రిన్సిపాల్ సుధాకర్ శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశ కార్యక్రమంలో జివిఎంసి ముఖ్యవైద్యఆరోగ్యశాఖాధికారి డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారిణి విజయలక్ష్మి, డా.ఎర్రయ్య, డా.చంద్రశేఖర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.


 నేటి నుంచి జిల్లాలో  రెండో విడత బియ్యం పంపిణీ.


 


 నేటి నుంచి జిల్లాలో  రెండో విడత బియ్యం పంపిణీ.



  జాయింట్ కలెక్టర్  శివ శంకర్.

 పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్ మజ్జి శ్రీనివాస మూర్తి, విశాఖపట్నం


 


జిల్లా వ్యాప్తంగా  ఏప్రిల్ 16 నుంచి  రెండో విడత   ఉచిత బియ్యం పంపిణీ  అమలు జరుగుతుందని  జాయింట్ కలెక్టర్  ఎల్ శివ శంకర్  తెలిపారు. బుధవారం  ఆయన మాట్లాడుతూ  రెండో విడత లాక్ డౌన్  సందర్భంగా  బియ్యం పంపిణీ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అన్నారు. ఈ మేరకు  జిల్లాలోని  రేషన్ షాపులు   ఉదయం  ఆరు నుంచి 11 గంటల వరకు బియ్యం అందజేస్తారని   డిపోల వద్ద  రద్ది లేకుండా   250 కార్డులు దాటితే  రెండు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాటు చేయాలని  కోరారు. రేషన్ పంపిణీ  జరిగే చోట  సామాజిక దూరం  పాటించాలని  సబ్బులు  శానిటైజర్స్  టెంట్లు  ఏర్పాటు చేయాలని  అధికారులకు ఆదేశించామన్నారు. ఐదు రోజులలో   రేషన్ సరఫరా పూర్తిచేయాలని   వాలంటీర్లు  సచివాలయ ఉద్యోగులు  అంగన్వాడీల సహకారం తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు  కోరామన్నారు. కరోనా  వైరస్  కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నడవలేని వృద్ధుల బియ్యాన్ని ఇంటికి చేరవేయాలని డీలర్లను కోరారు. రేషన్ షాపుల్లో   సరుకులు సరఫరాలో  సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని   జెసి  కోరారు.


 

 మాస్క్ ధారణను చట్టం చేయాల్సిందే


 


 


 


 మాస్క్ ధారణను చట్టం చేయాల్సిందే


-- లేకుంటే కరోనా ముప్పు తప్పదంటున్న విశ్లేషకులు

 

అనకాపల్లి , పెన్ పవర్ ప్రతినిధి : వానపల్లి రమణ 

 

మాస్క్ ఇప్పుడు మన జీవితంలో కీలకంగా మారింది అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచాన్ని పట్టిపడిస్తున్న కరోనా నుంచి కాస్తయినా తప్పించుకోవాలంటే మాస్క్ తప్పనిసరి అనేది ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది. అయితే ఎంత చెప్పినా పెడచెవిన పెట్టే జనం క్షేత్రస్థాయిలో ఉంటారనేది జగమెరిగిన సత్యం. వ్యక్తిగత ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే మాస్క్ దారణను చట్టంగా చేయాల్సిందే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి సాధారణ పరిస్థితుల్లో కూడా మాస్క్ ఎంతో ఉపకారంగా నిలుస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నా శ్వాసకోస వంటి ఇబ్బందులు ఉన్నా రక్షణ కల్పించడంతో పాటు ఇతరులు ఇబ్బంది పడకుండా ఉపకరిస్తుంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దాని ఉపయోగం తప్పనిసరి అయింది. 

      కరోనా వ్యాధి ఒక మనిషి నుండి ఒక మనిషికి సంక్రమిస్తుంది తెలిసిందే. దీనిలో ప్రధానంగా లాలాజలం తో ఇతరులకు వ్యాపిస్తుంది అని వైద్యులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని ఆదేశిస్తునే ఉంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మాస్కులు లేకుండా బయటకు వస్తే కేసు నమోదు చేయాలని నిర్ణయించాయి. అయితే ఏం చెప్పినా వినిపించుకోని జనం క్షేత్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కోసమే కాబట్టి మాస్క్ ధరించడం చట్టంగా చేస్తే బాగుంటుందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వ్యాధి ఇప్పటిదో తప్పే సమస్య కాదు. వ్యాక్సిన్ వచ్చే వరకూ ఈ సమస్య ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలో జనం ప్రయాణ సమయంలో రద్దీగా ఉన్న సమయంలో ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంది. దీంతో ఇంటి నుండి బయటకు వస్తే మాస్కు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పక్కాగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటే చట్టంగా చేయాల్సిందే. ఈ వ్యాధి అనే కాకుండా అనేక విధాలుగా జనాలకు మాస్క్ ఉపయోగ పడే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి సహాయనిధికి కోటిరూపాయలు విరాళం : మెప్మా


 


కోటిరూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళమిచ్చి సామజిక బాధ్యతను చాటుకున్న "మెప్మా" స్వయం సహాయక సంఘ మహిళలు


 


 కరోనా  మహాహమ్మారిపై పోరాటంలో వీరు సైతం.


ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించిన మెప్మా స్వయం సహాయక సంఘ    మహిళలు.


ఒకపక్క మాస్కులు, శానిటైజెర్లు మరియు పీపీఈ సెట్లు తయారు చేస్తూ కరోనా నివారణ సేవకులకు తోడ్పాటు అందిస్తునే మరో పక్క వార్డ్ స్థాయిలో  రాపిడ్ సర్వేలో, కూరగాయలు మరియు పండ్లు ప్రజలకు అందుబాటులో ఉంచుటలో భాగస్వామ్యులవుతున్నారు స్వయం సహాయక సంఘ మహిళలు. 


 


     గంట్యాడ అప్పలరాజు  ఎడిషన్ ఇంచార్జ్ విశాఖపట్నం, పెన్ పవర్ :  


          కరోన మహమ్మారిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అలుపెరుగని పోరాటం మరియు ప్రజల ఆరోగ్య పరిరక్షణే  లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రణాళికాబద్ధమైన నివారణ చర్యలలో తోడ్పాటు అందించడంలో మేము సైతం అంటూ మెప్మా ఆధ్వర్యంలో ఉన్న ప్రతి స్వయం సహాయక  సంఘ సభ్యురాలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రతి సభ్యురాలు తమవంతు సహాయంగా కొంత చొప్పున మొత్తం వెరసి కోటి రూపాయలను కరోనా నిరోధక చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి  సహాయ నిధికి పట్టణ స్వయం సహాయక సంఘ సభ్యులంతా కలిసి విరాళంగా అందించాయి. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి శ్రీ జె.శ్యామలారావు మార్గదర్శకత్వంలో మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ జి.ఎస్ నవీన్ కుమార్, ఐఏఎస్, మరియు స్వయం సహాయక సంఘ ప్రతినిధుల బృందం బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ కోటి రూపాయల చెక్కును  అందించడం జరిగింది.  ఈ సందర్బంగా మిషన్ సంచాలకులు నవీన్ కుమార్, ఐఏఎస్ మెప్మా ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం తీసుకుంటున్న చర్యలలో భాగంగా స్వయం సహాయక సంఘాల ద్వారా 10000 పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్ (PPE) సెట్లు, 18, 55,949 మాస్క్లు మరియు 59,739 లీటర్ల శానిటైజెర్లను తయారుచేసి ప్రజలకు పంపిణీ చేయడంతో పాటు, 10,775 నిరాశ్రయులకు అన్ని వసతులతో కూడిన  222 శాశ్వత మరియు తాత్కాలిక షెల్టర్ల ద్వారా కల్పిస్తున్న ఆశ్రయం, అలాగే వార్డ్ స్థాయిలో నిర్వహిస్తున్న ఇంటి ఇంటి సర్వే బృందంలో రిసోర్స్ పర్సన్ల పనితీరును, లాక్డౌన్ నేపథ్యంలో ఇంటివద్దకే ప్రజలకు కూరగాయలు, పండ్లను స్వయం సహాయక సంఘాల ద్వారా అందుబాటులో ఉంచుతున్న విధానం, క్షేత్ర స్థాయి ఉన్న పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటు ప్రతి ఒక్కరికి కోవిడ్19 నివారణ కోసం పాటించవలసిన నియమాల గురించి అవగాహన కల్పించేలా  యూనిసిఫ్ సమన్వయం తో జూమ్ టెక్నాలజీ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ శిక్షణల  గురించి ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే భవిష్యత్తులో మెప్మా ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలైన పట్టణ మహిళలందరికీ శానిటరీ పాడ్స్ ఇవ్వటం కోరకు హ్యాపీడేస్ శానిటరీ పాడ్స్ తయారీ యూనిట్ ను ఎస్.హెచ్.జి. ఎంట్రీప్రెన్యూర్ల ద్వారా  స్థాపించడం, పులివెందులలో పులి చాకెలేట్స్ ను ఎస్.హెచ్.జి. ఎంట్రీప్రెన్యూర్ల ద్వారా తయారు చేయించడం,  లక్ష మంది నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉపాధి కల్పించేలా వైస్సార్ ఉపాధి పధకం, ఎస్.హెచ్.జి. ఎంట్రీప్రెన్యూర్ల ద్వారా ఉత్పత్తి అవుచున్న ఉత్పత్తులన్నింటినీ ఒకేచోట మారాయి ఆన్లైన్ లో  అమ్ముటకు "ఆసమ్ మాల్" ను ఏర్పాటుచేయబడుతుందని అలాగే       "దిశ - టాక్సీ" ద్వారా ఈ-ఆటో రిక్షాలను మహిళలకు ఇచ్చి పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించి మహిళలకు ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించామని తెలియచేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి  శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం సహాయక సంఘ మహిళల స్ఫూర్తిని మరియు కరోనాపై  ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో వారి అందిస్తున్న తోడ్పాటును, వారు చేస్తున్న సేవలను, మెప్మా  అమలుచేస్తున్న కార్యక్రమాలను అభినందించి వీరిని ఆదర్శంగా తీస్కొని మరింత మందిలో సామజిక స్ఫూర్తి కలగాలని ఆశిస్తున్నానని  తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మెప్మా అడిషనల్ మిషన్ డైరెక్టర్ శ్రీమతి. శివపార్వతి మరియు రాష్ట్రస్థాయి సిబ్బంది పాల్గొనడం జరిగింది.


అవిఘ్నంగా సాగుతున్న వలస కూలీల భోజన సదుపాయం


 


అవిఘ్నంగా సాగుతున్న వలస కూలీల భోజన సదుపాయం


 పరవాడ,  పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్ 

 

పరవాడ మండలం:సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో లాక్ డవున్ మొదలు అయిన దగ్గరనుండి ప్రతిరోజు ఎవరో ఒకరు ధాతలతో మండలంలో ఉన్న 200 మంది వలస కూలీల భోజన సదుపాయం నిరాటంకంగా సాగుతూనే ఉంది.బుధవారం నాడు భోజన సదుపాయం తాణాo గ్రామ యువత వర్రి రోహిణి,వర్రి మీనా వారి సొంత నిధులు వెచ్చించి 200 వందల మందికి బిర్యాని పేకెట్లను అందించారు.వీరికి సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ ధన్యవాదాలు తెలియచేసి వారు చేసిన ఈ సేవకు అభినందించారు.లాక్ డవున్ పొడిగించిన నేపథ్యంలో ఎవరు అన్నా దాతలు మండలం లో ఉన్న ఇతర రాష్టాల నుంచి వచ్చిన వలస కూలీలకు భోజన సదుపాయం కలిగించ ధలుచుకుంటే తనకు తెలియజేయవలిసిందిగా కోరారు.

అత్యవసర పరిస్థితుల్లో అద్దెకు  ఆర్టీసీ బస్సులు.


 


అత్యవసర పరిస్థితుల్లో అద్దెకు  ఆర్టీసీ బస్సులు.

 పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్ మజ్జి శ్రీనివాస మూర్తి, విశాఖపట్నం 


అత్యవసర పరిస్థితుల్లో   ఆర్టీసీ బస్సులు  అద్దెకు కేటాయిస్తామని  వాల్టేర్ డిపో మేనేజర్  గంగాధర్ రావు తెలిపారు. కరోనా వైరస్ లాక్ డౌన్  సందర్భంగా  అత్యవసర పరిస్థితుల్లో  బస్సులు అవసరమైతే  డిపో లో సంప్రదించాలని  ఆయన కోరారు.   నిత్యవసర సరుకులు  తరలించడానికి  ఇతర  అత్యవసర పరిస్థితుల్లో  అవసరమైతే   ఆర్ టిసి బస్సులను  బడుగుకి  ఇస్తామన్నారు.
  మే 3 వరకు  ఆర్టీసీ  బస్సులు తిరగవు,    మే నెల మూడవ తేదీ వరకు  ఆర్టీసీ బస్సులు  తిరగవని   ఆ సంస్థ  ఈ డి .కె ఆర్.బి  రెడ్డి తెలిపారు.కరోనా లాక్ డౌన్  కారణంగా  మే 3 వరకు   రెండో విడత లాక్ డౌన్ పొడిగించడం తో  ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తదుపరి  ఆదేశాలు  అనంతరం  ఆర్టీసీ బస్సులు  నడుపుతామని  రెడ్డి  తెలిపారు. ప్రస్తుతం  కార్గో సర్వీస్ నామమాత్రం గా కొనసాగిస్తున్నామని  చెప్పారు. రిజర్వేషన్లు  చేయించుకున్న  వారి  నగదు  రిటన్ చేస్తున్నామని రెడ్డి తెలిపారు.


 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...