Followers
సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.
లాక్ డౌన్ ఉన్నంతవరకు ప్రజలకు సేవ కార్యక్రమలు : మొల్లి లక్ష్మణరావు
లాక్ డౌన్ పొడిగింపు నేపాధ్యంలో తన సేవ కార్యక్రమలు కొన సాగుతూనే ఉంటాయి 5 వార్డ్ టిడిపి సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు .
మధురవాడ, పెన్ పవర్ ప్రతినిధి సునీల్
కరోనా వైరస్ మహమ్మారీ కట్టడి నేపాధ్యంలో లాక్ డౌన్ మే 3వ తేది వరుకు కోనసాగుతుంది అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మెరుకు జివిఎంసి 5 వార్డ్ టిడిపి సీనియర్ నాయకుడు మొల్లి.లక్ష్మణరావు ఆద్వర్యంలో సేవ కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. లాక్ డౌన్ వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న నిరాశ్రాయులకు, నిరు పేదలకు 5 వార్డ్ ప్రజలందరికీ కూరగాయల పంపిణీ గత వారం రోజుల నుండి చేస్తున్నారు. బుధవారం మొల్లి లక్ష్మణరావు 5 వార్డు మారికవలస (వైట్ బిల్డింగ్స్) పరిధి ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేశారు. పేదలకు, రోజు కూలీలకు, నిరాశ్రాయులకు మే 3వ తేది వరుకు 5వ వార్డులో నిరుపేదలకు నిరాశ్రయులకు, పేద ప్రజలకు తన వంతు సహాయం కొనసాగుతూనే ఉంటుందని ఐ న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు. ఈకార్యక్రమంలో వాండ్రంశి అప్పలరాజు,మన్యల సోంబాబు, పిల్లా వెంకట్రావు, పిల్లా నర్సింగరావు , బోయి శీను, నాగోతి సత్యనారాయణ, (జపాన్), నాగోతి శివాజీ, నమ్మి శ్రీను, ఈగలరవి,తదితరులు పాల్గున్నారు..
నిత్యావసరాలు పంపిణీ
నిత్యావసరాలు పంపిణీ
విజయనగరం/ మెంటాడ, పెన్ పవర్ ప్రతినిధి సత్యం
మెంటాడ మండలం లోని బుధవారం మెంటాడ మాజీ పిఎసిఎస్ అధ్యక్షు గొర్లె ముస్లి నాయుడు (టిడిపి) ఆధ్వర్యంలో సారాడ వలస, మల్లె డ వలస గిరిజన గ్రామాల్లో సుమారు వంద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. మెంటాడ మండలం టిడిపి అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు ఆధ్వర్యంలో గుర్ల తమ్మీ రాజుపేట గ్రామంలో సుమారు 1000 కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులను అందజేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో అంచెంలంచెలుగా నిత్యావసర సరుకులను అందజేయనున్నట్లు మండల టిడిపి అధ్యక్షులు వెంకట్రావు తెలిపారు. కరోనా కర్ఫ్యూ కారణంగా ప్రజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజులు అత్యవసరమైతే తప్ప, మిగతా సమయాల్లో బయటకు రావద్దని, తమ పిల్లలను ఇంట్లోనే ఉండేవిధంగా పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించడం ద్వారా కరోనా వైరస్ కట్టడి చేయవచ్చని టిడిపి నేతలు సూచించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
నర్సీపట్నం, పెన్ పవర్ ప్రతినిధి శివ
నర్సీపట్నం మున్సిపాలిటీ శారదానగర్‌కు చెందిన రొంగ పరమేశ్వరరావుకు గుండె ఆపరేషన్‌కు ఖర్చు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద విడుదలైన రూ.75వేను బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కర్రి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విపత్తుల ప్రత్యేక నిధులు వినియోగించేలా చూడాలి
విపత్తుల ప్రత్యేక నిధులు వినియోగించేలా చూడాలి
జనసేన నియోజకవర్గ నాయకు రాజాన వీరసూర్యచంద్ర
నర్సీపట్నం, పెన్ పవర్ ప్రతినిధి శివ
ఇటీవలే విడుదల చేసిన విపత్తుల ప్రత్యేక నిధులు నర్సీపట్నం మున్సిపాలిటీలో సక్రమంగా వినియోగించేలా చూడాలని నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు రాజాన వీరసూర్యచంద్ర బుధవారం నర్సీపట్నం ఆర్డీవో కె. లక్ష్మీశివజ్యోతిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో కూడా సక్రమంగా కాలువలు శుభ్రపరచడం, క్లోరినేషన్ కీటకనాశిని ద్రావకం పిచికారీ చేయడం, మాస్క్‌ు పంపిణీ చేయడం జరగలేదన్నారు. అలాగే వైద్య సిబ్బంది అందరికి పిపిఈ సూట్స్ అందించడం, 108 వాహనాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ఏరియా ఆసుపత్రిలో సక్రమంగా మందులు ఉండేలా చూడటం, మున్సిపాలిటీలో కరోనా వైరస్ ప్రభావంతో అనుమానితులు ఎవరైనా ఉంటే గుర్తించడం కేసు వచ్చిన పరిసరాలలో పూర్తిగా వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం లాంటి విషయాలపై దృష్టి పెట్టాలని కోరడం జరిగిందన్నారు. దీనిపై ఆర్డీవో సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శివనారాయణరాజు, జనసేన నాయకులు అద్దేపల్లి గణేష్, పంచాడ హరినాథ్ తదితయి పాల్గొన్నారు.
నిత్యావసరాలు పంపిణీ
నిత్యావసరాలు పంపిణీ
నర్సీపట్నం, పెన్ పవర్ ప్రతినిధి శివ
దక్ష భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణలో లాక్‌డౌన్‌లో భాగంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు బలిఘట్టంకు చెందిన రోహిత్ ఎంటర్ ప్రైజస్ అధినేత, వైసిపి నాయకులు గుడిబండ నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో వారి చేతుల మీదగా నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద శెట్టి రామశేఖర్‌బాబు, బేతా ప్రకాశ్, దక్ష భారత్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ అడిగర్ల సతీష్, సభ్యులు కె.శివ, జి.వినోద్ పాల్గొన్నారు.
లాక్ డౌన్‌కు సహకరించండి
లాక్ డౌన్‌కు సహకరించండి
మాకవరపాలెం, పెన్ పవర్ ప్రతినిధి గోవింద్
మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని మాకవరపాలెం ఎస్సై కరక రాము కోరారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అత్యవసర వైద్య సేవాలు కోరే వారి పేరు, ఆధార్ కార్డు నెంబర్, వాహనం నెంబర్, వాహన డ్రైవర్ లైసెన్స్ నెంబరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్‌తోపాటు ఎందు నిమిత్తం వెళ్తున్నారో తమకు లిఖితపూర్వకంగా తెలపాన్నారు. అటువంటి దరఖాస్తుకు అనుమతి ఇస్తామన్నారు. అటువంటి వాటిని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తిరుగు ప్రయాణంలో జిల్లా ఉన్నత అధికారులు అనుమతితో తిరిగి రావాల్సి ఉందన్నారు. ఇది అత్యవసర వైద్య సేవ కొరకు మాత్రమేనని ఆయనన్నారు. నిత్యావసర సరుకులకు వాహన డ్రైవర్‌తో పాటు ఒక సహాయకుడుని అనుమతిస్తామని అధిక సంఖ్యలో జనాలు ఉన్నట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందజేసే కార్యక్రమం చేపట్టినట్లు అయితే గ్రహీత యొక్క గృహాలు వద్దనే అందజేయాలని, గుంపుగా గుమి గూడ రాదని ఆయన తెలిపారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...