Followers
బెల్లం అమ్మకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మార్కెట్లో సమస్యలను పరిష్కరిస్తాం
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల వైకాపా పార్లమెంట్ పరిశీలనలు దాడి రత్నాకర్ సూచించారు. బుధవారం ఎన్టీఆర్ మార్కెట్న్ను సందర్శించిన ఆయన నిత్యావసర దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ లోని వసతులను, సమస్యలను అధికారులు వర్తకులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. వర్తకులు కరోనా వైరస్ కు సంబందించి సామాజిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ముఖానికి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కూరగాయలను అమ్మేటప్పుడు కొనే వ్యక్తి నుండి కనీస దూరాన్ని పాటించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ వై.సి.పి నాయకులు పాల్గొన్నారు. వియ్యపుు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సప్త సూత్రాలు ప్రజలందరు పాటించాలి : బిజెపి నాయకురాలు అరుణ కుమారి.
కూరగాయలను రోడ్లపై పారబోస్తున్న రైతులు
గ్రామీణ కూరగాయల రైతులపై లాక్ డౌన్ ప్రభావం.
కష్టపడి పండించిన పంట కొనే నాథుడు లేడు.
కూరగాయలను రోడ్లపై పారబోస్తున్నరైతులు.
రైతు బజార్ లకు తరలించే అవకాశం కల్పించాలి.
పెన్ పవర్, స్టాఫ్ రిపోర్టర్ మజ్జి శ్రీనివాస మూర్తి, విశాఖపట్నం
కరోనా మహమ్మారి నియంత్రణలో అమలు జరుగుతు న్న లాక్ డౌన్ ప్రభావం గ్రామీణ కూరగాయల రైతుల పై పడింది. కష్టపడి పండించిన కూరగాయలు అమ్మటానికి మార్కెట్ కి తెచ్చిన రైతులకు కొనే నాథుడు కనిపించడం లేదు. వచ్చిన ఒకరిద్దరు వ్యాపారులు తోచిన ధరకు అడుగుతున్నారు. ఆధరకు కూరగాయలు అమ్ముకోలేక తిరిగి మూసుకొని పోలేక వాటిని రోడ్లపై పారబోస్తున్నారు. బుధవారం జిల్లాలోని దేవరపల్లి మండల కేంద్రంలో జరిగే కూరగాయల బజారులో రైతులు కూరగాయలను పార బోసిన సంఘటన చోటు చేసుకుంది. సంచి పురంకు చెందిన రామ్మూర్తి అనే రైతు నిగనిగలాడుతున్న తాజా వంకాయలు 10 కేట్లలో 100 కిలోలు రోజు మార్కెట్కి తెచ్చారు. 11 గంటల వరకు అడిగే నాధుడు లేరు.ఆ తర్వాత వచ్చిన వ్యాపారి కేటు 20 రూపాయలకు అడగటంతో రైతు బిత్తరపోయాడు. కిలో రెండు రూపాయలు రాకపోవడంతో రైతు విసుగు చెంది మొత్తం వంకాయలను నేలపై పోసి నిరాశతో వెళ్లాల్సి వచ్చింది. దేవరపల్లి మండల కేంద్రంలో 40 ఏళ్లుగా నిత్యం కూరగాయల మార్కెట్ జరుగుతుంది. ఈ మార్కెట్ కు మండలంలోని రైతులు కాకుండా చీడికాడ వేపాడ అనంతగిరి చిన్న సన్నకారు రైతులు కూరగాయలు పండించి తెస్తారు. వాటిని వ్యాపారులు కొనుగోలు చేసి విశాఖపట్నం రైతు బజార్ లకు తరలిస్తారు. ప్రాముఖ్యత గల కూరగాయల మార్కెట్ కావడంతో దేవరపల్లి కి విశాఖ నుంచి ప్రతి పదిహేను నిమిషాలకి ఒక బస్సు తిరుగుతుంటాయి.లాక్ డౌన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సంతలు మార్కెట్లు నిలిచిపోయాయి. కానీ కూరగాయల మార్కెట్లకు వెసులుబాటు కల్పించారు. రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో పట్టణాల నుంచి వచ్చే ఒకరిద్దరు వ్యాపారులు ఎంతో కొంత కొని పోతున్నారు. కాస్త తేడా కనిపిస్తే ఆ కాయ కూరలను కన్నెత్తి అయినా చూడడం లేదు. కొందరు రైతులు గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి ఎంతో కొంతకి కట్టబెడుతున్నారు. మార్కెట్లలో కిలో వంకాయలు 30 నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదు.
కాయకష్టం మిగిలింది. రైతు ఆవేదన. : ఎంతో కష్టపడి వంగతోట సాగు చేశాను. పంట దిగుబడి కోసం ఎరువులు క్రిమిసంహారక మందులు వాడను. తీరా పంట కోతకు వచ్చాక బజారుకి తీసుకుపోతే కొనేవారు లేరు. కోసిన వంకాయలు వృధాగా పారేయడం బాదగా ఉంది.
శ్రీరామ్ మూర్తి మింది పురం రైతు...
దేవరపల్లి మార్కెట్లో దళారులను అరికట్టాలి.
రైతుల వద్ద నుంచి కూరలు ప్రభుత్వమే కొనాలి.
జిల్లా కలెక్టర్ కు సిపిఎం డిమాండ్.
దేవరపల్లి కూరగాయల మార్కెట్ లో దళారుల బెడద ఎక్కువైందని చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దాసరి వెంకన్న ఆరోపించారు. రైతులకు అందుబాటులో మార్కెట్ రవాణా సౌకర్యం లేక పండించిన కూరగాయలు స్థానికంగానే అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. నిత్యం కూరగాయలు పండించే ఈ ప్రాంత రైతులకు విశాఖ రైతు బజార్ లలో తన కూరగాయలను అమ్ముకునే అవకాశం కల్పించాలని కోరారు. రైతు బజార్ లో అమ్ముకోవడానికి ఆకాశం కల్పిస్తూ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అని కోరారు. ఈ మేరకు కలెక్టర్ తో పాటు దేవరపల్లి తహసిల్దార్ మార్కెటింగ్ శాఖలకు పత్రాన్ని సమర్పించామని వెంకన్న తల్లి పాట.
సామాజిక దూరం ఎలా ఉంది..!
సామాజిక దూరం ఎలా ఉంది..!
అంటరానితనం రుచి ఒకసారి స్వయంగా అనుభవించి చూస్తారా..?
సామజిక దూరం - 'కరోనా వైరస్' వెర్సస్ 'కులం వైరస్'
కరోనా కాటుకి నన్నంటుకోకు నా "మాల" కాకి
సీనియర్ జర్నలిస్ట్ మొయ్యేటి రమేష్ కుమార్, పెన్ పవర్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న మహమ్మారి "కరోనా వైరస్ - కోవిడ్-19 " సామజిక దూరం పేరుతో మనిషిని సాటి మనిషి దూరం పెట్టటడం చూస్తే ప్రస్తుత భారతదేశంలోని అంటరానితనం గుర్తుకొస్తుంది। కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది। ప్రపంచానికి మనిషిని మనిషి దూరం పెట్టటం ఇది మొదటిసారి కావొచ్చు కానీ, ప్రాచీన భారత చరిత్ర నుండి, నేటి ప్రస్తుత భారతం వరకు భారత దేశానికీ ఈ తరహా వివక్ష కొత్త కాదు। ఇటీవల మన దేశాధినేతలు, అధికారుల, మీడియా మరియు అందరినోటనుడి సామజిక దూరం అనే మాట విపరీతంగా వినిపిస్తుంది। కరోనా అనే వైరస్ ప్రాణాంతకం అని భయపడి దూరం పెట్టడం లో అర్ధం ఉంది। ఎందుకంటె ఈ వైరస్ నిరోధానికి ఎటువంటి మందు లేకపోవడం, విస్తృతంగా మనిషినుండి మనిషికి వ్యాపించడంతో కాస్త దూరం పాటించడం, ఒకరిని ఒకరు అంటుకోకపోవడం ద్వారా మాత్రమే ఈ వైరస్ ని నిరోధించడం సాధ్యం। అందుకే సామజిక దూరం వహించడం మంచివిషయం। కానీ ఎటువంటి అంటు రోగం కాకపోయినా, లేకపోయినా కావాలనే ఒక పథకం ప్రకారం పరాన్నభుక్కులుగా బ్రతికే కొంత మంది హిందూ సామజిక విద్రోహులు బలహీనులను దోచుకోవడానికి, వారిని కట్టడి చేయడానికి అఖండ భారతావని చరిత్రలో మాయని మచ్చలాంటి వైరస్ ని సృష్టించారు। అదే "కులం" దీని మూలంగానే "అంటరానితనం" అనే సామాజిక వెలివేత ఏర్పడింది। అయితే కరోనా లా ఈ వైరస్ కంటికి కనిపించదు। ఇది ఒక మానసిక భావన మాత్రమే। హిందూ మతోన్మాదులు అంటరానితనం అనే ఒక మానసిక రోగాన్ని ఎప్పటికి చెదరిపోని "కులం" అనే కంచు కోటలాంటి వైరస్ సృష్టించారు। ఈ వైరస్ భారిన పడి ఇప్పటివరకు కొన్ని లక్షలు మంది ఒక సామజిక వర్గానికి చెందిన భారతీయులు మరణించారు। కులం పేరుతో కోట్ల మందిని కూడికి, గూడికి, తిండికి, బట్టకి, చదువుకి, సంపదకు చివరకి తాగే నీటికి కూడా దూరం చేశారు। ఒక ప్రత్యేక సామజిక వర్గాన్ని అంటరాదని, ముట్టరాదని, చూడరాదని, వారిని చూస్తే పాపమని, గోరమని , నేరమని ఇలా అనేక రకాలుగా చిత్ర హింసలకు గురి చేస్తూ చీత్కారాలతో, అవమానాలతో వారి మనుగడే ప్రశ్నర్ధకంగా మార్చేశారు।బానిసలుగా వారిని వాడుకున్నారు। భూమిపై హక్కును వారు కోల్పోయారు। వారిపై జరిగిన, జరిపిన దాడులు, మరణహోమాలు లెక్కకు మించినవే। ఇలా చెప్పుకుంటూ పోతే భారత దేశం చాల పెద్ద పాపాల మూట గట్టుకుందనే చెప్పాలి। మాల ముండా అని, మాల కాకి అని దుష్ట శకునాలతో పోల్చుతూ వారిని మానసికంగా క్రుంగ దీశారు । వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబలిజషన్ లో కూడా భారతీయుల్లో ఈ కులం పట్ల కనీస మార్పు రాకపోవడం ఆశ్చర్యం। ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని భారత దేశంలో దాదాపు 11,000 కు చేరిన కరోనా రోగుల పుణ్యమా అని ప్రతి ఒక్కరు సామాజిక దూరం వహిస్తున్నారు। స్వీయ నిర్బంధం లోనికి కొందరు వెళ్లిపోయారు। కులం లేదు, మతం లేదు, ఫ్రెండ్స్ లేదు సొంతవారు సహితం ఒకరిని ఒకరు దూరం పెట్టుకుంటున్నారు। అంటరానితనం ని పాటిస్తున్నారు। ఇప్పటికే 21 రోజులు లాక్ డౌన్ గడిచిన సందర్భంలో దేశ ప్రజల మానసిక స్థితి రోజురోజుకు దిగజారిపోతోంది। ఇది మరికొన్నాళ్లు కొనసాగితే సాటి మనిషి పలకరింపు లేక, సహవాసం లేక మనుషులు నిజంగానే పిచ్చివాళ్లుగా మారిపోతారు। అంటరాని తనాన్ని మరిపిస్తున్న ఈ కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికైనా సమాజంలోని మార్పు రావాలని, సాటి మనుషులను మనిషిగా గుర్తించి సమానత్వాన్ని పాటిస్తారేమో చూడాలి। అంటరానితనం మూలాలు ఎంత ఎంత భయంకరంగా ఉంటాయో కరోనా వైరస్ ద్వారా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే। అందుకే నెమో ప్రపంచం మొత్తం మీద భారత్ స్వీయ నిర్బంధం విధించుకుంది। ఈ కరోనా ద్వారా సాటి మనిషిని దూరం చేస్తే వచ్చే భాధ ఇలా ఉంటుందో ఈ పాటికైనా హిందూ మతోన్మాదులకి, మూర్ఖులకి అర్ధం అవుతుందని ఆశిద్దాం। కరోనా తగ్గిన వెంటనే ఇకపై అంటరానితనం అనే సామజిక దుర్మార్గానికి చరమగీతం పడదాం।మనుషులంతా ఒక్కటే అనే భావన పెంపొందించుకుందాం।
సర్వైలన్స్ పటిష్టంగా చేయడం వల్లనే జీరో కేసులు
:
సర్వైలన్స్ పటిష్టంగా చేయడం వల్లనే జీరో కేసులు
లాక్ డౌన్ కొనసాగింపులో మినహాయింపులు
పాత్రికేయుల సమావేశం లో జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్
వాహనాలకు, దుకాణాలకు అనుమతులు తప్పనిసరి
లాక్ డౌన్ కు సహకరించి, స్వీయ నిర్బంధం లో ఉండాలి : జిల్లా ఎస్.పి బి. రాజకుమారి
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి డేవిడ్ రాజ్
జిల్లాలో సర్వైలన్స్ పటిష్టంగా చేయడం వల్లనే కరోనా జీరో కేసులతో సురక్షితంగా ఉండగలిగామని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ తెలిపారు . బుధవారం కలెక్టర్, జిల్లా ఎస్.పి బి . రాజకుమారి తో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి జిల్లా లో చేపట్టిన కార్యక్రమాలను, మే నెల 3 వరకు లాక్ డౌన్ కొనసాగింపులో తీసుకోనున్న చర్యల పై వివరించారు. కరోనాను కట్టడి చేయడానికి జిల్లాలో 6 లక్షల 99 వేల కుటుంబాల ఇంటింటికి వెళ్లి 6 రకాల వివరాలను తీసుకోవడం జరిగింది . విదేశాల నుండి, డిల్లి నుండి, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి వచ్చిన వారి వివరాలతో పాటు, వయో వృద్ధులు, జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులతో బాధ పడుతున్న వివరాలను సర్వే ద్వారా డేటా ను సేకరించడం జరిగిందన్నారు. జిల్లాలో 794 నమూనాలను సేకరించి, కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపగా ఇంతవరకు 316 నెగటివ్ వచ్చాయని పేర్కొన్నారు.
మిమ్స్ ఆసుపత్రితో పాటు మరో 5 ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చి అన్ని వసతులను ఏర్పాటు చేసి, వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో 22 వెంటిలేటర్లను, 66 ఐ.సి.యు, 959 నాన్ ఐ.సి.యు బెడ్స్ ను, సిద్ధం చేయడం జరిగిందన్నారు. 382 మంది వైద్యుల్ని, 1186 మంది నర్స్ లను, పారా మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. వైద్యుల కోసం 3500 పి పి ఎక్విప్మెంట్ ను, 4500 ఎన్-95 మాస్క్లను, 69 వేల సర్జికల్ మాస్క్ లను , 9 వేల లీటర్ల శానిటైసర్ తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచామని, స్టాక్ రిజిస్టర్ ద్వారా వినియోగించిన, వచ్చిన వాటి వివరాలను నమోదు చేయడం జరుగుతోందని తెలిపారు.
జిల్లాలో 1422 గదులలో 4507 బెడ్స్ కెపాసిటీ తో 39 క్వరెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జే.ఎన్.టి.యులో 139 మందిని క్వరెంటైన్ లో ఉంచి 14 రోజులు పూర్తి చేసుకున్న వారిని వారి ఇళ్ళకు పంపించినట్లు తెలిపారు. వీరికి భోజన, వసతి సౌకర్యాలతో పాటు వైద్య పరీక్షలను, మందులను అందించడం జరుగుతోందన్నారు. ఉపాధి కోల్పోయిన వారికీ 9 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి 316 మందికి ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు. ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా ప్రజా పంపిణి ద్వారా బియ్యం కంది పప్పు సరఫరా చేయడం జరిగిందన్నారు. వెయ్యి ఉన్న డిపో లను 3 వేలకు పెంచుతూ, ప్రజలు గుమికూడి ఉండకుండా చర్యలు తీసుకోవడం జరి గిందన్నారు. నిత్యావస రాలను సరఫరా చేసే వాహనాలకు, వ్యక్తులకు అనుమతినిస్తూ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధిక ధరల నియంత్రణకు ప్రతి చోట ధరల పట్టికలను ప్రదర్శించేలా ఆదేశించడం జరిగిందన్నారు. పారిశుధ్యం పై ప్రత్యెక ద్రుష్టి పెట్టడం జరిగిందని, అన్ని వార్డులలో, 920 పంచాయతీలలో హైపో క్లోరైడ్ ను స్ప్రే చేసేలా 344 పారిశుధ్య బృందాలను ఏర్పాటు చేయడమైనదన్నరు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం తదితర అంశాల పై అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. పాలనా పరంగా జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ లను ఏర్పాటు చేసి, నోడల్ వ్యవస్థ ద్వారా ఒక్కో అంశాన్ని ఒక్కో అధికారి పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ లకు వచ్చే ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరించడం జరుగుతోందన్నారు.
ఇతర ప్రాంతాల నుండి వచ్చే రహదారులన్నీ మూసివేత :
జిల్లాలో 40 రూట్ లను గుర్తించి వాటికీ బారికాడింగ్ చేయడం జరిగిందని ముఖ్యంగా విశాఖపట్నంలో పాజిటివ్ కేసు లున్నందున, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళకుండా జిల్లా సరిహదుల్లో ఉన్న రహదారులన్నిటిని మూసి వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రధాన మార్గాల వద్దే కాకుండా లింక్ రోడ్ల వద్ద కూడా చెక్ పోస్ట్ లను పెట్టి నిఘా పెంచడం జరిగిందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారుల అనుమతి తోనే ఎవరైనా కదిలేలా కట్టుదిట్ట మైన ఏర్పాట్లను చేశామన్నారు. ఇందులో పోలీస్ పాత్ర కీలకమని, ముఖ్యంగా పోలీస్, వైద్యాధికారులు, సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పాత్రికేయులు ప్రధాన భూమిక వహించారని వారి సేవలను కొనియాడారు. మే3 వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యం లో రైతులకు, కూలీలకు, కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అన్ని జాగ్రతలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉపాది పనులకు, కొన్ని పరిశ్రమల్లో స్కెలిటన్ స్టాఫ్ తో పని చేయుటకు అనుమతినివ్వనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవ్వరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రైవేటు వైద్యులు అత్యవసర ఓ.పి లను చూడాలని, కోవిడ్ లక్షణాలు కనపడితే ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలని విజ్ఞప్తి చేసారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని, తమ ఆరోగ్య పరిస్దితిని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు.
లాక్ డౌన్ కు సహకరించి, స్వీయ నిర్బంధం లో ఉండాలి : జిల్లా ఎస్.పి బి. రాజకుమారి
ప్రజల కోసం పోలీస్ లు రోడ్ల పైకి వసున్నారని, ప్రజలు దీనిని గమనించి, ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే ఒక్కరే బయటకు రావాలని జిల్లా ఎస్.పి బి. రాజకుమారి తెలిపారు. ఈ విషయం లో ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను చేపదుతున్నామని అన్నారు. విదేశాల నుండి వచ్చిన 445 మందిని గుర్తించి వారిని గృహ నిర్బంధం లో ఉంచామని, అయితె వారిలో 67 మంది చట్టాన్ని ఉల్లంఘించారని, వారి పై కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. లాక్ డౌన్, క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి అవగాహనా కల్పిస్తూనే, మరో పక్క కేసులను బుక్ చేస్తున్నమన్నారు. అనుమతి లేని 558 వాహనాలను సీజ్ చేసామని, అనుమతి లేని, సమయాన్ని పాటించని 435 షాపుల పై కేసులు పెట్టామని తెలిపారు. ఇంతవరకు ఒక కోటి 15 లక్షల రూపాయలను అపరాధ రుసుం ను వసూలు చేయడం జరిగిందన్నారు. బయట వారిని జిల్లా లోనికి రాకుండా నివారించడానికి 8 అంతర్ జిల్లా చెక్ పోస్ట్ లను, 4 అంతర్ రాష్ట్ర , 3 ఎన్ .హెచ్ చెక్ పోస్ట్ లను నిరంతరంగా పనిచేసే సిబ్బంది తో పెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించేలా దృష్టి పెడుతున్నామని, రైతు బజార్లను, చేపల మార్కెట్ ను వికేంద్రీకరించి, జన రద్దీని తగ్గించగలిగామని, అక్కడ కూడా కోవిడ్ పై అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో 3500 మంది పోలీస్ శాఖ నుండి పనిచేయడం జరుగుతుందని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరిస్తున్నారని, ఇక పై కూడా ఇలాగే సహకరించాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా రెవిన్యూ అధికారి జే.వెంకటరావు పాల్గొన్నారు.
సేవ కార్యక్రమలు కొనసాగుతాయి: దామా సుబ్బరావు
లాక్ డౌన్ పొడిగింపు నేపాధ్యంలో తన సేవ కార్యక్రమలు కొనసాగుతాయి అని తెల్పిపారు దామా సుబ్బరావు
పెదగంట్యాడ, పెన్ పవర్ ప్రతినిధి జయకుమార్
కరోనా వైరస్ మహమ్మారీ కట్టడి నేపాధ్యంలో లాక్ డౌన్ మే 3వ తేది వరుకు కోనసాగుతుంది అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మెరుకు దామా ఫౌండేషన్ ఆద్వర్యంలో సేవ కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి అని వైసీపీ 86వ వార్డు అభ్యర్ధీ దామా సుబ్బరావు తెల్పిపారు, లాక్ డౌన్ వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నా నిరాశ్రాయులకు, నిరు పేదలకు రోజు తన స్వంత నిధులతో భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు దామా సుబ్బరావు, కూర్మన్నపాలెంలో తన స్వంత స్థలంలో పేదలకు, రోజు కూలీలకు, నిరాశ్రాయులకు మే 3వ తేది వరుకు ప్రతి రోజు 250 మందికి నిత్య అన్నదానం సదుపాయం కోనసాగిస్తున్నాట్టు తెల్పిపారు దామా సుబ్బరావు, అలాగే 86వ వార్డులో నిరుపేదలకు నిరాశ్రయులకు నిత్యవసర సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణి కూడా చేస్తున్నాటు తెల్పిపారు దామా సుబ్బరావు, కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మెడికల్ బాబు, చెగొండి శ్రీను, పెంటారావు, మాటూరీ శ్రీను, బార్ సాయి, చిట్టి దేముడు, ఆనీష్ , దువ్వాడ రాజు తదితరులు పాల్గున్నారు
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...