Followers

ప్రజలందరూ స్వచ్ఛంద నిర్బంధంలో ఉండండి


 


ప్రజలందరూ స్వచ్ఛంద నిర్బంధంలో ఉండండి


(జి మాడుగుల పెన్ పవర్ ప్రతినిధి కొండలరావు)


 


కరోనా విజ్రంభిస్తున  వేళ జి మాడుగుల జడ్పీటీసీ అభ్యర్థి వెంకట లక్ష్మి బందవీధి గ్రామాన్ని సందర్శించారు. కరోనా మహమ్మారి ని అరికట్టాలంటే, దానికి మండల ప్రజలందరు జాగ్రత్తలు పాటించండి అని అన్నారు. చేతులు శుభ్రముగా సబ్బు తో కడుక్కోవాలని. ఎక్కువ మంది జనం. కలిసి ఉండవద్దని. ఎవరి ఇళ్లల్లో వారు ఉండాలని చెప్పి. ఇంటిఇంటికి వెళ్లి మాస్క్ లు ఇచ్చా రు. ఈ సందర్భంగా వేల మాస్క్ లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమం లో మాజి మంత్రి మత్య రాసా బాల రాజు, మాజి ఎంపీపీ వెంకట గంగ రాజు పాల్గొన్నారు


 


రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జాబితాను ప్రకటించిన కేంద్రం


 


రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జాబితాను ప్రకటించిన కేంద్రం


(ఎడిషన్ ఇంచార్జ్ గంట్యాడ అప్పలరాజు పెన్ పవర్, విశాఖపట్నం)


 


రెడ్ జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో


రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు


14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే  రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు - ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు


ఏపీలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్


తెలంగాణలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు:    హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్


తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లాలు: నల్గొండ


*తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు:* సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట


రైతులను ఆదుకునేందుకు కేంద్రం చర్యలు


లాక్ డౌన్ సమయంలో రైతులు, వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి


- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన


- రైతులతోపాటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడండి



- ఏపీఎంసీ చట్టంలో మార్పులు చేస్తూ.. రైతుల వద్దనుంచే వ్యవసాయ ఉత్పత్తులు కొనే ఏర్పాట్లు చేయాలి



- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ఉపరాష్ట్రపతి సమావేశం.. లాక్ డౌన్ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ



*- రైతులను ఆదుకునేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతికి వివరించిన కేంద్ర మంత్రి


 (స్టేట్  న్యూస్ డెస్క్ ఇంచార్జ్ వై. కైలాసరావు,    పెన్ పవర్)


లాక్ డౌన్ సందర్భంగా రైతులు, వ్యవసాయరంగానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వ్యవసాయ పనుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చొరవతీసుకోవాలని సూచించారు. 
బుధవారం ఉపరాష్ట్రపతి నివాసంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. అన్నదాతలతోపాటు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు చేపట్టాలన్నారు. 
‘చాలా సందర్భాల్లో వినియోగదారుల గురించి ఆలోచించినంతగా.. అన్నదాతల ఆలోచనలు, ఇబ్బందుల గురించి సమాజం, మీడియా, ప్రభుత్వాలు ఆలోచించవనే విమర్శ వినబడుతోంది. కానీ రైతుల ఇబ్బందులను పరిష్కరించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. రాష్ట్రాలు దీనిపై చొరవతీసుకోవాలి. కేంద్రం సమయానుగుణంగా రాష్ట్రాలకు ఈ విషయంలో సూచనలు చేస్తుండాలి’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. పళ్లు, కూరగాయల వంటి వాటిపై మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాలని.. వీటిని భద్రపరిచడం, రవాణా అవకాశాలు పెంచడం, మార్కెటింగ్ విషయంలో ప్రత్యేక చొరవతీసుకోవాలని సూచించారు. రైతులు మార్కెట్ కు వెళ్లి వారి ఉత్పత్తులను విక్రయించడం కంటే.. ఏపీఎంసీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి నేరుగా రైతుల వద్దకే వెళ్లి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశం, వీటిని రాష్ట్రంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. తద్వారా వినియోగదారులకు కూడా సరిపోయేంతగా పళ్లు, కూరగాయలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండేందుకు వీలవుతుందన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సుగమం చేసేలా అధికారులు చొరవతీసుకోవాలని.. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుత పంటకోతల సమయాన్ని గుర్తుచేస్తూ.. వ్యవసాయ యంత్రాలు, ఇతర పరికరాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచడంపై దృష్టిపెట్టాలన్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను కేంద్ర వ్యవసాయ మంత్రి.. సవివరంగా ఉపరాష్ట్రపతికి తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నామని శ్రీ తోమర్ వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో రైతులకు సహాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా హామీ ఇచ్చారు.


రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండో విడత బియ్యం, శనగలు పంపిణీ.


 


రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండో విడత బియ్యం, శనగలు పంపిణీ.

 

పోలవరం,  పెన్ పవర్ ప్రతినిధి రాము 

 

 

 

కోవిడ్ 19 ప్రభావంతో లాక్ డౌన్ అమల్లోనే ఉన్నందున ఇంటికే పరిమితమైన ప్రజలకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత బియ్యం పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభించినట్లు పోలవరం తాసిల్దార్ ఎన్ నరసింహమూర్తి అన్నారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లై డి టి ఎస్ కె సలీం , వీఆర్వోలు, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించి రేషన్ సరుకులు పంపిణీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేసినట్లు తాసిల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తారీకు నుండి 27వ తారీఖు వరకు నిత్యావసర సరుకులు రేషన్ కార్డు ఉన్న ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం, రేషన్  కార్డుకు కేజీ సెనగలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్డు రకం తో సంబంధం లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సరుకులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పంపిణీ సమయంలో సర్వర్ సమస్యలు ఉన్న చొ మ్యాన్యువల్ పద్ధతిలో సరుకులు పంపిణీ చేస్తారన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా ఏ సమయంలో ఏ తారీఖున రావాలో కూపన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదనపు పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రేషన్ దుకాణం వద్దకు వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్కు లు ధరించడం వంటి జాగ్రత్తలు రేషన్ వినియోగదారులు తప్పక పాటించాలని సూచించారు. రేషన్ దుకాణాల వద్ద టెంట్లు వేయడం, త్రాగునీరు, సబ్బు, చేతులు కడుక్కునేందుకు నీళ్లు, రేషన్ దుకాణాల పరిసర ప్రాంతాలలో బీజింగ్ చల్లడం వంటివి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్లకు సూచించారు. రేషన్ దుకాణాల వద్దకు జనం గుంపులు గుంపులుగా రావద్దని సూచించారు. ఈ కార్యక్రమమును నిరంతరం అధికారులు  పర్యవేక్షిస్తారు అన్నారు. రేషన్ సరుకులు తూకంలో ఏ విధమైన తేడాలున్నా, రేషన్ డీలర్లు చేయవలసిన ఏర్పాట్లు చెయ్యకుండా అధికారులకు తెలియజేయాలని రేషన్ వినియోగదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం తాసిల్దార్ ఎన్ నరసింహ మూర్తి, సివిల్ సప్లై డి టి ఎస్ కె సలీం, సీనియర్ అసిస్టెంట్ కాజా రమేష్, డిప్యూటీ తాసిల్దార్ జె అర్జున్ రావు, వీఆర్వోలు, వీఆర్ఏలు, గ్రామ సచివాలయం గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఎమ్మార్వో సిబ్బంది, రేషన్ డీలర్లు పాల్గొన్నారు

వెయ్యి లీటర్ల బెల్లపు ఊట, 140 లీటర్ల నాటుసారా ధ్వంసం


 


వెయ్యి లీటర్ల బెల్లపు ఊట, 140 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసిన పోలవరం ఎక్సైజ్ సిబ్బంది

 

 

పెన్ పవర్,  గోపాలపురం  ప్రతినిధి రాము 

 

 

 

 

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ మద్యం కాపునాటుసారా క్రయ విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలవరం ఎక్సైజ్ సీఐ జి. సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం మండలంలోని బుచ్చయ్య పాలెం గ్రామంలో నాటు సారా తయారీ కి 1000 లీటర్లు బెల్లపు ఊట నిల్వ ఉంచగా బుధవారం సమాచారం మేరకు ఆ ప్రదేశానికి వెళ్లి బెల్లపు ఊట నాశనం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని సగ్గొండ గ్రామ శివారు గోపవరం గ్రామంలో రూట్ వాచ్ నిర్వహించి నూట పది లీటర్ల నాటుసారా ను దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామమునకు చెందిన ఇద్దరు యువకులు అక్రమంగా తరలిస్తున్న సారాను ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనం సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. మరియు దొండపూడి గ్రామం లో గ్రామ వాలంటీర్ల  గ్రామ సచివాలయ మహిళా పోలీస్ మరియు ఎక్సైజ్ సిబ్బంది గ్రామ ప్రజలకు నాటుసారా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో నాటు సార విక్రయ కేంద్రాలు తెలుసుకొని సుమారు 30 లీటర్ల సారాను పట్టుకుని గ్రామ సచివాలయం ముందు నాశనం చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ అల్లూరయ్య, సచివాలయ మహిళా పోలీస్ సిహెచ్ లక్ష్మీ తులసి వాలంటీర్లు కొక్కిరపాటి శ్రీను, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

పూజలు చేసే చేతులు కన్నా సేవలు చేసే చేతులు మిన్న


పూజలు చేసే చేతులు కన్నా సేవలు చేసే చేతులు మిన్న అనే స్పూర్తితో 38 వార్డ్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సయ్యద్ తహసీన్

 

ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ ప్రతినిధి : మొహమ్మద్

 

నిరు పేదలకు ఆదుకునే సమయం  ఆసన్నమైంది లాక్ డౌన్ పొడిగింపుతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు  ప్రపంచాన్ని అతలకుసలం చేసున్న కరోన మహమ్మారి పేదల ఉపాధికి గండికొట్టింతి రెక్కాడితే గాని డొక్కాడాని బడుగు జీవుల లాక్ డౌన్ కారణం గా పనుల్లేక అల్లడవాల్సిన పరిస్థితి ఇలాంటి అపత్కాలములో బడుగు బలహీన వర్గాలకు ఆదుకునేందుకు 38 వార్డ్ లో స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సయ్యద్ ముస్తాఫా   లాక్ డౌన్  కారణంగా 38 వార్డ్ లో పేదలకు నిరాశ్రయులకు గత కొద్ది కాలంగా బియ్యం కూరగాయలు పంపిణి చేయటం జరిగింది 38 వార్డులో బ్లీచింగ్ కార్యక్రమం నిర్వహించటం జరిగింది  తండ్రి బాటలో ఆమె కుమార్తె  సయ్యద్ తహసీన్ ఉన్నత చదువులు అభ్యసించి  వార్డ్ లో అనేక సేవాకార్యక్రమములు నిర్వహిస్త్తు వున్నారు పేదలకు కూరగాయలు ఆహారం పంపిణీ చేస్తూ తండ్రికి ఆదర్శంగా నిలిచారు వారి సేవ కార్యక్రమములకు 38 వార్డ్ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు

కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు జారీ


 


కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు జారీ చేయనున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ 

 

 

 

పెన్ పవర్,  పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జ్ రాము

 

 

 

 

కరోనా లాక్‌డౌన్‌ ను ప్రజలంతా పక్కాగా పాటిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు శాఖ తెలిపింది. అయితే, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుండి అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ వారి ఆదేశాలపై ప్రధానంగా వైద్యం, అత్యవసర సేవల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు  వెళ్లే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని. అలాంటి వారి కోసం కోవిడ్‌-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఐపీఎస్ బుధ వారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపినారు.

 

కంట్రోల్ రూం నెంబర్ 8332959175 లేదా policecontrolroomeluruwg@gmail.com  కు సంప్రదించగలరు .

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొ న్నారు. అత్యవసర వైద్య కారణాలను చూపి ప్రజలు ఈ పాసులు పొందొచ్చని వెల్లడించిం నారు. 

పాసులు కావాలనుకునేవారు. ఈ క్రింది విధముగా  వివరములు తెలియచేయాలి.

 1. దరఖాస్తుదారుని యొక్క పేరు,

2.పూర్తి చిరునామా(గ్రామము,టౌన్, విది)

3. దరఖాస్తుదారుడు ప్రయాణించే తేదీ.

4. దరఖాస్తుదారుడు తిరుగు ప్రయాణం తేదీ.

5. దరఖాస్తుదారుని యొక్క ప్రయాణం యొక్క వివరములు (అత్యవసర వైద్య కారణములు)

6. ప్రయాణించే వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు దాని యొక్క వివరములు ప్రయాణించే మార్గము.

7.ఆధార్‌ కార్డు వివరాలు,. ఫోన్ నెంబర్. ఐడి కార్డు వివరములు.

8. ప్రయాణించే వారి యొక్క  ప్రయాణికుల యొక్క సంఖ్య(అనారోగ్యం పొందిన వారితో పాటుగా ఒక్కరికి మాత్రమే అనుమతి 1+1)

9. వైద్యానికి సంబంధించిన దృవ పత్రములు.

10. దరఖాస్తుదారుడు ఎక్కడినుండి ఎక్కడికి ప్రయాణించే వివరములు పొందుపరచాలి.

 అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా జిల్లా పోలీసు అధికారులు పాసులు జారీ చేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ  కార్యాలయం స్పష్టం చేసింది..

అప్లయ్‌ చేయడం ఇలా..

కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు కొరకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూం   వాట్సాప్‌ నెంబర్‌  8332959175 కు లేదా  మెయిల్ ఐడి policecontrolroom eluruwg@gmail.com  అనుమతి కోరుతూ అప్లయ్‌ చేయాలి. 

ఎస్పీ గారి కార్యాలయం వారు

అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్‌ నెంబర్ పంపిస్తారు.

జిల్లా పోలీస్ కంట్రోల్ రూం  వాట్సాప్‌ నెంబర్‌ నుంచి మె యిల్  ఐ.డి నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్‌ చేసిన అనుమతులు (పాసులు)చెల్లవు. ప్రయాణించేటప్పుడు మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఎస్పి  కార్యాలయం వెల్లడించిం ది. పై తెలియచేసిన నెంబర్ తప్ప ఏ ఇతర ఫోన్ లకు ప్రజలు పాస్ ల కొరకు అభ్యర్థన చేసిన సదరు విన్నపము పరిగణలోకి తీసుకొని పడవు అని ఈ పత్రికా ప్రకటన ద్వారా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయము వారు తెలియజేసినారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...