Followers

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన తిప్పల దేవన్ రెడ్డి


 


తిప్పల దేవన్ రెడ్డి  ఆధ్వర్యంలో 75వార్డు నందు నిత్యావసర వస్తువులు పంపిణీ


 


గాజువాక, పెన్ పవర్ ప్రతినిధి ఫిరోజ్

 లాక్ డౌన్ కారణంగా  ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు మరియు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యిన జీవీఎంసీ 75 వ వార్డు ప్రజలకు   కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే దృఢ సంకల్పంతో జిల్లా వైసీపీ కార్యదర్శి  తిప్పల దేవన్ రెడ్డి  సతీమణి మాజీ కార్పొరేటర్ శ్రీమతి తిప్పల ఎమిలీ జ్వాల  ఆధ్వర్యంలో ఇంటిటికీ బియ్యం, కూరగాయలు తో నిత్యావసర వస్తువులు పంపిణీ  చేశారు  మంగళవారం   సాయంత్రం 75 వార్డు లోని ప్రతి గడపకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి అక్కడి ప్రజలకు సామాజిక భరోసా ఇత్చారు ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు పాల్గున్నారు  


"డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్" 129వ జయంతి వేడుకలు 


"డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్" 129వ జయంతి వేడుకలు 



ఎంవిపి కాలనీ, పెన్ పవర్ ప్రతినిధి మొహమ్మద్,


ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న" డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్" 129వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరమ్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆల్ ఇండియా దళిత రైట్ ఫోరమ్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనంద్ పిలుపుమేరకు విశాఖపట్నం జిల్లా కమిటీ మరియు సిటీ కమిటీ సంయుక్తంగా కైలాసపురం డి ఎల్ బి దగ్గర డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఉద్యానవనంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఏ ఐ ఆర్ ఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పట్టా రమేష్ బాబు అధ్యక్షతన సభ్యులు ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది ఏ ఐ డి ఆర్ ఎఫ్ సభ్యులు సిటీ అధ్యక్షులు జి శ్రీనివాస్, జిల్లా సెక్రెటరీ కోటేశ్వరరావు, ఈసీ రామచంద్రరావు, ఎస్ ప్రవీణ్ కుమార్, గాలి శ్రీను, కే రాము, ఎం రామకృష్ణ, పి. లింగమూర్తి, బిబి పడల్, గోవింద్, ఆర్ కృపానందం, డీజిమూర్తి, కొండలరావు, పొట్టి గణేష్, వై రామచంద్రరావు, రాజ్ కుమార్, పాల్గొన్నారు అనంతరం 200 మందికి పేదవారికి భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది


పగడ్భందీగా  రెండవ విడత బియ్యం పంపిణీ జేసీ ఎల్.శివ శంకర్ ఆదేశం


పగడ్భందీగా  రెండవ విడత బియ్యం పంపిణీ
జేసీ ఎల్.శివ శంకర్ ఆదేశం


పాడేరు, పెన్ పవర్ ప్రతినిధి చక్రవర్తి


 


పగడ్బందీగా రెండవ విడత ఉచిత బియ్యం, పప్పు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. మంగళవారం తహసిల్దార్ లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం పంపిణీలో చౌక ధరల దుకాణాలు వద్ద భౌతిక దూరం పాటించాలని చెప్పారు. బియ్యం పంపిణీ కి అవసరమైన ఎలెక్ట్రానిక్ తూనిక యంత్రాలు సమకూర్చి పంపిణీ చేయాలన్నారు. గ్రీన్, బ్లూ పింక్, వైట్  కూపన్లు పంపిణీ చేసి ఆమేరకు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఈనెల 16న ప్రారంభించి 27 నాటికి పంపిణీ పూర్తి చేయాలన్నారు. డిపోల వద్ద టెంట్లు ఏర్పాటు చేసి, సబ్బు, నీరు ఏర్పాట్లు చేయాలన్నారు.


అంబేద్కర్ ఆశయ సిద్ధి కి ప్రతి ఒక్కరు కృషి చేయాలి


విజయనగరం, పెన్.పవర్ : డేవిడ్ రాజ్


 


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సిద్ధి కి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి పిలుపునిచ్చారు. మంగళవారం నాడు గాజులరేగ రాళ్ల వీధిలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకలు లో లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. న్యాయవాదిగా, భారత రాజ్యాంగాన్ని రాసిన ప్రధాత గా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. శంకర్రావు, కార్పొరేట్ అభ్యర్థులు నడి పిల్లి ఆదినారాయణ, kanukula తేజశ్రీ, పట్టా ఆదిలక్ష్మి, జమ్ము మధు, అట్టాడ శ్రీను తదితరులు ఉన్నారు....


ఘనంగా రాజ్యాంగనిర్మాత జయంతి 


ఘనంగా రాజ్యాంగనిర్మాత జయంతి 


 


మధురవాడ, పెన్ పవర్ : సునీల్


జనసేన పార్టీ 6 వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన అనురాధ  ఆధ్వర్యంలో  మన భారత దేశ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, కుల మతాల అడ్డుగోడలను చేరిపేసి, భావీ భారత పౌరలు అంత ఒక్కటే, వారి అభివృధే అసలైన దేశ అభివృధి అని భారత దేశాన్ని సన్మార్గంలో నడిపించిన శ్రీ బాబా సాహెబ్  డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా 6 వ వార్డ్ లో  కొమ్మది విల్లేజ్, సాయిరాం కాలనీ, కె వన్ కాలనీ లో  ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమలా వేసి నివాళి అర్పించారు.. ఈ సందర్బముగా  పోతిన అనురాధ  కాలనీ వాసులకు ఆహార పొట్లాలు పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో  6వ వార్డ్ జనసేన పార్టీ  6వ వర్డ్  అధ్యక్షులు  సంతోష్ నాయుడు, పోతిన నానజీ, అప్పలరాజు మాస్టర్,  నాగోతి ప్రకాష్, బేవర రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


పేదల మధ్యలో యల్లపు రమేష్ జన్మదిన వేడుకలు


అనకాపల్లి  పెన్ పవర్ : బోస్


 


పేదల మధ్యలో యల్లపు రమేష్ జన్మదిన వేడుకలు


అనకాపల్లి మండలం పిసినికడ గ్రామం లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యల్లపు వెంకట రమేష్ పుట్టినరోజు వేడుకలు నిడాంబరంగా పేదల మధ్యలో జరుపుకున్నారు.ఆయన పుట్టిన రోజు సందర్భరంగా పిసినికాడ గ్రామంలో పేదలందరికి కూరగాయలు మరియు కొందరికి ఉచితంగా బియ్యం మరియు మాస్కులు పంచిపెట్టడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ మే 3 వరకు ప్రధాన మంత్రి గారి ఆదేశాల మేరకు అందరూ లాక్ డౌన్ పాటించాలని అది ప్రజలకే మంచిదని రాష్ట్ర ప్రజలు ఎవరు కి ఇబ్బంది కలుగకుండా ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటున్నారని ప్రజలకి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ పార్టీ కార్యకర్తలు దాడి రామత్రినాధ్,దాడి రాము, మళ్ల నరసింగరావు,వెలగ కోటి, మొల్లేటి శివాజీ, మళ్ళ ఆనంద్, మళ్ళ జగదీశ్ పాల్గొన్నారు


జి.మాడుగుల లో మాస్క్ లు పంపిణి


మాస్క్ లు పంపిణి


జి. మాడుగుల, పెన్ పవర్: కొండలరావు


 


విశాఖపట్నం జిల్లా జి మాడుగుల మండలంలో జి మాడుగుల గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి  మత్స్య రాసా వెంకటలక్ష్మి, ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న  ప్రజలుకు, పోలీసులకు ఉచితంగా  ఐదు వందల మాస్కులు పంచారు  ఈ కార్యక్రమంలో  వెంకట గంగరాజు, బుజ్జి. బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...