Followers

కరోనా వైరస్ నివారణకు పటిష్టమైన చర్యలు


 బ్యూరో రిపోర్ట్ విజయనగరం. పెన్ పవర్: డేవిడ్ రాజ్


 


 


జిల్లాలో కరోనా వైరస్ నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ప్రజల సహకారంతో జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం ఆనందించదగ్గ విషయమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. సోమవారం నాడు విజయనగరం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న p w మార్కెట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి కౌశిక్ ల ఆధ్వర్యంలో తమ సొంత నిధులతో మహిళా విభాగం తరపున kovid 19 నివారణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రిమిసంహారక(Dis Infection Tunnel) టన్నెల్ ను ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరపున క్రిమిసంహారక ద్వారాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 420 కేసులు నమోదయితే, అందులో 360 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారని తెలిపారు. మిగతా 60 కేసులు వివిధ దేశాల నుంచి వచ్చిన వారి వల్ల నమోదైన కేసులు అని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 134 ప్రాంతాలలో కరోనా వైరస్ ఎక్కువగా ఉందని గుర్తించడం జరిగిందని, వాటిని హాట్ స్పాట్ గా గుర్తించి రాకపోకలు పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని మండలాలను మూడు జోన్లుగా విభజించి రెడ్, ఆరెంజ్, గ్రీన్ గా విభజించడం జరిగింది అన్నారు. ముప్పై ఏడు మండలాలను రెడ్ జోన్ పరిధిలోని, 44 మండలాలను ఆరెంజ్ జోన్ పరిధిలో, 595 మండలాలు గ్రీన్ జోన్ పరిధిలో విభజించి లాక్ డౌన్ అమలులో కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 27 వేల isolation బెడ్లు సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో 5.3 కోట్ల జనాభాకు దాదాపు 16 కోట్ల మాస్కులు సిద్ధం చేసి ఒక్కొక్కరికి 3 మాస్కులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ తోపాటు, వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. రెండో విడత రేషన్ పంపిణీ కి తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. విజయనగరం జిల్లా ప్రజలు క్రమశిక్షణతో కూడిన వారని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసులు కూడా లేకుండా సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ధరల నియంత్రణ విషయంలో తగు చర్యలు చేపట్టామని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నామన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కరోనా వైరస్ నివారణకు క్రిమిసంహారక ద్వారాన్ని కొద్ది రోజుల క్రితం రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, తన తండ్రి మరియు విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచనలతో, ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి సేవా స్పూర్తితో మహిళా విభాగం తరపున కరోనా వైరస్ క్రిమిసంహారక ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా లో లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం, ప్రజల సహకారం, పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవా దృక్పథానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నేతలు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయా డివిజన్ల మహిళా అభ్యర్థులు శ్రీమతి బి ధనలక్ష్మి, పిన్నింటి కళావతి, aasapu సుజాత, ద్వాదశి సుమతి, తాళ్లపూడి సంతోష్ కుమారి, కనుగు ల తేజశ్రీ, పట్టా ఆదిలక్ష్మి, నాయిని పద్మ, లతోపాటు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కేదారి శెట్టి సీతారామమూర్తి( రాంపండు), జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్, తదితరులు ఉన్నారు...


నీరు పేద కుటుంబాలకు సేవచేయడంలోనే నిజమైన సంతృప్తి



విపత్కర పరిస్థితుల్లో నీరు పేద కుటుంబాలకు సేవచేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని జీవీఎంసీ 59  వ వార్డు( ఎస్సీ కాలనీ)  ములగాడ హౌసింగ్ కాలనీ  అరుంధతి సేవా  సంఘం యూత్  అన్నారు.  


మల్కాపురం, పెన్ పవర్ : జయకుమార్



కరోనా వ్యాధి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా వార్డు పరిధిలో  , భవన నిర్మాణ కార్మికులు, కులి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న వారికి ,     150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను  అందజేశారు..ఈ  సందర్భంగా  వారు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి పై అవగాహన కల్పిస్తూ,  చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న  కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు ప్రజలంతా నడుం బిగించాలన్నారు. లాక్ డౌన్  ప్రకటించిన కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు..  ఇళ్లనుండి ఎవరు బయటికి రావద్దని కొలనీ వాసులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం రాజకీయ పార్టీలు కు, నాయకులకు అతీతంగా, అరుంధతి సేవా సంఘం యూత్ చెయ్యి చెయ్యి కలుపుకొని  చేస్తున్నట్టు చెప్పారు ఈ  కార్యక్రమంలో అరుంధతి సేవా సంఘం యూత్    తదితరులు పాల్గొన్నారు..


కాటూరి రవీంద్ర దాతృత్వం


కాటూరి రవీంద్ర దాతృత్వం


- మూగజీవాలకు పశుగ్రాసం అందజేత


-కరోనా సంక్లిష్టంలో మూగజీవాలను ఆదుకోవాలని పిలుపు


మధురవాడ, పెన్ పవర్: సునీల్


కరోనా వైరస్ తాండవిస్తున్న సంక్లిష్ట పరిస్థితుల్లో అన్నార్తులకు ఆపన్న హస్తంగా నిలిచి అనేక కుటుంబాలలో కాంతులను వెలిగిస్తున్న కాటూరి సూరన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం... ట్రస్ట్ నిర్వాహకులు, బీజేపీ సీనియర్ లీడర్ కాటూరి రవీంద్ర కరోనా అన్నార్తుల పాలిట దేవుడిగా నిలుస్తున్నారు... లాక్ డౌన్ ప్రారంభం నుండి నేటి వరకు చేతికి ఎముక లేదన్న చందాన అభాగ్యులను ఆదరిస్తూ...ప్రస్తుత కరోనా కాటీణ్యంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులను నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు..ఇంతే కాకుండా మూగజీవాలకు కూడా తానున్నానంటూ కాటూరి రవీంద్ర ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమం చేస్తూ మూగజీవల పాలిట దైవంగా నిలుస్తున్నారు...పశుగ్రాసం లేక రోడ్ల పై ఆకలితో అలమటిస్తున్న ఆవులు,గేదలను గుర్తించి వాటికి పశుగ్రాసం అందిస్తున్నారు.. అందులో భాగంగా సోమవారం కూడా సీతమ్మధార,వెంకజిపాలెం,హెచ్,బీ కాలనీ,చిన వాల్తేర్,జగదాంబ ప్రాంతాలలో మూగజీవలైన ఆవులు,గేదెలకు పశుగ్రాసం ఆయన చేతుల మీదుగా వేశారు...ఈ సందర్బంగా కాటూరి రవీంద్ర మాట్లాడుతూ తన తాత గారైన కాటూరి సూరన్న చారిటబుల్ ట్రస్ట్ పేరిట గత 20 ఏళ్లుగా సేవా కార్యక్రామాలు నిర్వహిస్తున్నామని అన్నారు..ప్రస్తుత కరోనా భయానక పరిస్థితుల్లో తన సంస్థ పేరిట అన్నార్తులకు,ప్రజలకు సేవ చేస్తున్న పోలీస్, వైద్యులు,పారిశుధ్య కార్మికులకు సుమారు 2000 మందికి  నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు..లాక్డౌన్ ముగింపు వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని అన్నారు.. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాతలు  ప్రజలకు సాయం చేయడానిక్ ముందుకు రావాలని పిలుపినిచ్చారు
 


ఫరి ట్రాన్స్ పోర్ట్ ఆధ్వర్యం లో భోజనాలు పంపిణి


జీవీఎంసీ 86 వ వార్డు ఫకీర్ తఖీయాలో ఫరి ట్రాన్స్ పోర్ట్ ఆధ్వర్యం ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా అనాధులకు, నిరాశ్రాయులకు భోజనం పంపిణి


గాజువాక, పెన్ పవర్: ఫిరోజ్ 


సోమవారం 86వార్డులో గాజువాక వైసీపీ లీడర్ తిప్పల దేవన రెడ్డి గారు, వైసీపీ నాయకులు  దామా సుబ్బారావు గారు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన నేపద్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, నిరాశ్రయులకు, నిరుపేదలకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు భోజనాలు పంపిణి చేస్తున్నారు, దీంతో పాటు నిరుపేద కుటుంబాలకు బియ్యము తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ  కార్యక్రమంలో వైసీపీ నాయకులు 66వ వార్డు అధ్యక్షులు షౌకిత్ ఆలీ, మెడికల్ బాబు, చెగొండి శ్రీనివాస్ , బార్ సాయి, పెంటారావు, నజీర్ , అల్లాహుద్దిన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


కువైట్ లో  వలస కార్మికులకు భోజన పంపిణీ


 మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో కువైట్ లో  వలస కార్మికులకు భోజన పంపిణీ


 


న్యూస్ డెస్క్, పెన్ పవర్ :గంట్యాడ అప్పలరాజు


మహమ్మారి కరోన వైరస్ వల్ల కువైట్ లో  కర్ఫ్యూ  ఉన్న నే పద్యంలోఈరోజు కువైట్ మాలియ పరిసరప్రాంతంలో  మా యూత్ వెల్ఫేరే అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 100 మంది వలసకార్మికులకు, రోజువారీ కూలీలకు, అభాగ్యులకు భోజనం సమకూర్చి అందజేశారు. అలాగే ముర్గాప్ అనేప్రతంలో 50 మంది సభ్యులకు  ఆహార పంపిణీ చేశారు  ఈ కార్యక్రమం చేసినందుకు మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అలీ  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సురేష్. ఖాదర్వాలి.గౌస్. త్రినాద్ మునిర్ తదితరులు నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.


గూడ్స్‌ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్‌


గూడ్స్‌ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్‌


అన్ని రకాల గూడ్స్ వాహనాలకు అనుమతి


పాసులతో పనిలేదు.. ఖాళీగా అయినా వెళ్లొచ్చు


ప్రయాణికులను ఎక్కించుకునే వీల్లేదు


కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలతో రవాణా సడలింపులు


పోలీసులకు డీజీపీ ఆదేశాలు


 


(స్టేట్ బ్యూరో చింతా వెంకటరెడ్డి  అమరావతి, పెన్ పవర్)


విజయవాడ: రవాణా లారీలు రోడ్డెక్కాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వటంతో లారీలు రోడ్లపైకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తమ ఉత్పత్తులను రవాణా చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిశ్రమలు లారీ సప్లై ఆఫీసులకు ఫోన్లు చేసి బుకింగ్‌ చేసుకుంటున్నాయి.


దీంతో క్రమేణా లోడింగ్‌లు, అన్‌లోడింగ్‌లు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పూర్తి నిర్మానుష్యంగా కనిపించిన జాతీయ రహదారులపై లారీలు పరుగులు పెట్టనున్నాయి. పాసులు ఇస్తే తప్ప రవాణా వాహనాలకు అనుమతి ఉండదన్న అపోహల కారణంతో చాలామంది బుకింగ్‌లు చేసుకోవటానికి ఆలోచిస్తున్నారు. దీంతో ఆశించినంతగా బుకింగ్‌లు జరగటం లేదని తెలుస్తోంది. 


డీజీపీ ఆదేశాలు: పాస్‌ల అనుమానాలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెరదించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులకు రవాణా వాహనాల అనుమతులకు సంబంధించి ఫ్యాక్స్‌/రేడియో మెసేజ్‌ను పంపారు. అన్ని రకాల గూడ్స్‌ వాహనాలను, ఖాళీగా ఉన్నవి అయినా సరే రోడ్ల మీద తిరిగేటపుడు పోలీసులు అడ్డుకోవద్దని సూచించారు. అలాగే, పాస్‌లు చూపించమని కూడా వాహనదారులను డిమాండ్‌ చేయొద్దని ఆదేశించారు.


ఏ రకమైన గూడ్స్‌ రవాణా వాహనాల్లో అయినా కేవలం డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉండాలని, ప్రయాణికులను తరలించటాన్ని మాత్రం అనుమతించవద్దని పేర్కొన్నారు.


పాస్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ


 


జగ్గంపేట, పెన్ పవర్: రమ్య


 


జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని గుడ్ సమరిటన్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ అధినేత పాస్టర్ రెవరెండ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ నేపథ్యంలో గృహాలు కే పరిమితమైన కొంతమంది పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో భోజనాలను పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం పాస్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తన ఇంటి వద్ద భోజనాలను వండించి వాటిని ప్యాకింగ్ చేయించి గ్రామంలోని లెప్రసీ కాలనీ, ఎస్సీ కాలనీలో పలువురికి నివాసాల వద్దకు వెళ్లి సామాజిక దూరం పాటిస్తూ డోర్ డెలివరీ గా అందజేశారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ అమలులో ఉన్నందున పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మా యొక్క గుడ్ సమరిటన్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో  ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రతిరోజు  వంద మందికి చొప్పున  భోజనాలు తయారు చేసి అందించడం జరుగుతుందని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది పేదలకు అవసరాలను అర్థం చేసుకుని నగదును సహాయం చేయడం జరిగిందని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో గుణం సుబ్బలక్ష్మి, గద్దె విజయ్ కుమార్, గద్దె రాజశేఖర్, కాతేటి హరీష్ తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...