Followers

ఆరోగ్యమే మహాభాగ్యం....


 


ఆరోగ్యమే మహాభాగ్యం...


హెల్త్ డెస్క్, పెన్ పవర్ : మంజూష యార్లగడ్డ 

ప్రపంచ చరిత్ర లో కని విని ఎరుగని రీతిలో జరుగుతున్న కాలం ఇది. కొన్ని తరాలు ఔరా ఇటు వంటి
ఇక్కట్లు మానవాళి అనుభవించిందా అని కధలుగా చెప్పుకోనే రోజులు  ఎ కాలమైనా సమైక్యతతో సమాలోచనలతో పోరాడే సమయమిది. నిర్బందన సమయంలో మనం మన అరోగ్యం ఎలా కాపాడుకోవాలి వాకింగ్స్ , జిమ్ లు  లేవు కాని చిన్నపాటి వ్యాయమాం  ద్వారా మన అరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఉదయం పది లోపు అల్పాహరం తీసుకోండి (నూనె లో వేపిన వెపుళ్లు వద్దు) మధ్యాహ్నం ఒంటి గంట లోపు భోజనం చేయండి.అనంతరం ఒక్క అరగంట నిద్ర పొండి. సాయంకాలం  7.00గం॥ లోపు భోజన ప్రక్రియ ముగించాలి దాని వల న అరుగుదల కు కావల్సినంత సమయం వుంటుంది. మీకు తెలిసిన చిన్న చిన్న  వ్యాయమాల తో ఆరోగ్యాన్ని  కాపాడుకొవచ్చు. ప్రతిరోజు 15నిమిషాలు  పాటు ధ్యానం చేయటం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం చీకటి రాత్రికి మాత్రమే పరిమితం... రాబోయే మెలుతురును గుర్తుంచుకొని ఈ చీకటిని ఎదుర్కొందాం.


Dr. Ravichandra Vattipalli
MBBS, DNB Orthopedic Surgeon
National University Hospital - Singapore
Inselspital Berne - Switzerland
Royal Childeren's Hospital – Melbourne


 


SG ORTHO CARE
VISAKHAPATNAM


 


Help Line : 9396339636


శానిటైజర్స్ మాస్కులు  అందజేసిన   ప్రభుత్వ విప్


 


వాలంటీర్లు సచివాలయం ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికులకు   శానిటైజర్స్ మాస్కులు  అందజేసిన
  ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు.

వి.మాడుగుల, పెన్ పవర్ :మజ్జి  శ్రీనివాస మూర్తి 



కరోనా వైరస్  నియంత్రణలో  ప్రజల కోసం  సచివాలయ ఉద్యోగులు  గ్రామ వాలంటీర్లు   పారిశుద్ధ్య కార్మికుల  సేవలు  అభినందనీయమని  ప్రభుత్వం  విప్ బూడి  ముత్యాలనాయుడు  అన్నారు. సోమవారం  మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో  మండల పరిషత్  సమకూర్చిన  2000  మాస్కులు  600  హ్యాండ్  శానిటైజర్స్ ను  సచివాలయ ఉద్యోగులు  వాలంటీర్లు  పారిశుధ్య కార్మికులకు  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా వైరస్  వ్యాప్తి  చెందకుండా   గ్రామాలలో  కట్టుదిట్టమైన ఏర్పాట్లు  చేయడంలో  వాలంటీర్లు  కార్మికులు  సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా కృషి చేశారని అన్నారు. ప్రజల కోసం  శ్రమిస్తున్న  వారికి  తగిన ఏర్పాట్లు  చేయాలన్నారు. ప్రభుత్వం  ప్రజాసంక్షేమం కోసం  అహర్నిశలు కృషి చేస్తుందని. దేనికి  వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు  కట్టుబడి పనిచేయాలని  సూచించారు. పారిశుద్ధ్య నిర్మూలన  తాగునీటి సమస్య  లేకుండా చూడాలని కోరారు. లాక్ డౌన్  సందర్భంగా  ప్రజలు  సామాజిక దూరం  పాటించాలా  చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న  కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాలని  అన్నారు. గ్రామాల్లో  వైరస్ నియంత్రణకు  అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో  పోలినాయుడు  మాట్లాడుతూ  అహర్నిశలు  ప్రజల కోసం  శ్రమిస్తున్న  సచివాలయ ఉద్యోగులు  వాలెంటర్ల్లు పంచాయతీ కార్యదర్శులకు  మాస్కులు  శానిటైజర్స్  అందజేశారు.  పారిశుద్ధ్య కార్మికులకు  20 కిలోల బియ్యం   700 రూపాయలు విలువచేసే  నిత్యావసర సరుకులు  ఇచ్చామన్నారు. మండల పరిషత్   మరియు పంచాయితీ  నిధులతో  మాస్కులు శానిటైజర్స్  కూర్చోమన్నారు. ఈ కార్యక్రమంలో  మండల ప్రత్యేక అధికారి   ఆర్.నీలయ్య  వివో  రామ సత్యనారాయణ పాల్గొన్నారు.


ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలి


 


(స్టేట్ బ్యూరో చింతా వెంకటరెడ్డి, అమరావతి, పెన్ పవర్ )


 


స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని ఏపీ ఎన్నికల కమిషనర్ కనగరాజ్ అధికారులకు సూచించారు. 


నేడు ఆయన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.


 కరోనా వైరస్ ప్రభావం కారణంగా అసాధారణ పరిస్థితి నెలకొందని కనగరాజ్ వ్యాఖ్యానించారు.


 గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. 


చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరువ కావాలన్నారు.


స్థానిక సంస్థల ఏర్పాటు ఇందులో చాలా కీలకమని కనగరాజ్ పేర్కొన్నారు. 


జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వం సమాయత్తంగా ఉండాలని సూచించారు. 


సమాయనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. 


స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అత్యంత కీలకమన్నారు. 


చక్కటి అవగాహనతో కమిషన్‌కు మంచి పేరు తీసుకురావాలని అధికారులకు కనగరాజ్ సూచించారు.


మీడియా ప్రతినిధులకు నిత్యవసర సరుకులు పంపిణీ : మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ


జగ్గంపేట నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నిత్యవసర వస్తువులు 25 కేజీల బియ్యం బస్తా అందించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ


జగ్గంపేట, పెన్ పవర్ : రమ్య


తూర్పు గోదావరి జిల్లా  స్థానిక జగ్గంపేట జ్యోతుల నవీన్ గారి ఇంటివద్ద జగ్గంపేట నియోజకవర్గం లోని జగ్గంపేట. కిర్లంపూడి. గోకవరం. గండేపల్లి. మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు 25 కేజీల బియ్యం బస్తా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్  జ్యోతుల నవీన్  చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ  మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల లాక్ డౌన్ విధిస్తే ప్రజలందరూ గృహాల కే పరిమితమై కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు పాటించారు మళ్లీ లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉన్నదని ప్రతి ఒక్కరు  అవసరమైతే మళ్లీ ఇళ్లకే పరిమితం అవ్వాలని తెలియజేశారు ఎప్పటికప్పుడు తమ వార్తాపత్రికలు ఛానెల్స్ ద్వారా  ప్రజల్లో అవగాహన కల్పించి   ప్రజలకు వారధిగా నిలబడిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా నాయకుల మరియు కార్యకర్తలందరూ సహకారంతో  ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అలాగే నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు నాయకులు కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూరగాయలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కందుల కొండయ్య దొర ఎస్విఎస్ అప్పలరాజు కోర్పు లచ్చయ్య దొర మారిశెట్టి భద్రం  జీను మణిబాబు పాండ్రంగి రాంబాబు చదరం చంటిబాబు కొర్పు సాయి తేజ కన్నబాఋ భరత్ బాబు కాళ్ల దొంగబాబు  అడబాల భాస్కర్ రావు యర్రం శెట్టి బాబ్జి తదితరులు పాల్గొన్నారు


హిజ్రాలకు బియ్యం కూరకాయలు పంపిణి 


హిజ్రాలకు బియ్యం కూరకాయలు పంపిణి 


జగ్గంపేట,  పెన్ పవర్: రమ్య


తొండంగి మండలం గోపాలపట్నం గ్రామం లో ఫెయిత్ యూత్ వాలంటరీ ఆర్గనేజేష&ఎస్ సి ఎస్ టి విజిలెన్స్  &మోనటరీ కమిటీ సభ్యురాలు బూర కృష్ణవేణి  హిజ్రాలకు  మరియు నిరుపేదలకు బియ్యం  కూరగాయలు అంద చేసారు అనంతరం మాట్లాడుతు కరోనావైరస్ వాలన ప్రభుత్వం లాక్ డౌన్ విదించడంలో హిజ్రాలు బయటకు వెళ్ళలేక తిండి కి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళతో పాటుగా రేషన్ కార్డులేని నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు వారియొక్క దినస్థితిని చూచి వాళ్ళకు సహయం చేయాలి అనే సంకల్పంతో ఈ రోజు సంస్థ వ్వార పేద ప్రజల ఆకలి తీర్చడం సంతోషకరమాని అన్నరు లాక్ డౌన్ మొదలైన అప్పటి నుండి నవంతు సహయంగా పేద ప్రజలకు సహయం చెస్తున్నాను అని అన్నరు బియ్యం  ఇచ్చిన దాత తుని మార్కట్ యార్డ్ చైర్మన్ కొయ్య శ్రీను  పిట్టా నాగమణి  సచివాలయ మహిళ పోలిస్ లక్ష్మి  వాలంటరీ స్వామి రాజుబాబు అడ్డాల లక్ష్మి  కుమిలి తెరీసా ప్రనూష్ తదితరులు పాల్గున్నారు


ఇటలీ నుంచి ఆంధ్రా విద్యార్థుల రాక

 



 


 ఇటలీ నుంచి ఆంధ్రా విద్యార్థుల రాక.


 ప్రత్యేక బస్ లో రాయపూర్ నుంచి విశాఖకు తరలింపు..


విజయనగరం,, పెన్ పవర్ ప్రతినిధి:
 బి డేవిడ్ రాజు


ఇటలీలో చదువుతున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన 23 మంది విద్యార్థులను రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవతో  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇటలీలో కరోనా(కోవిడ్ 19) వైరస్ వ్యాప్తి తీవ్రత ను గుర్తించిన ఆంధ్రా విద్యార్థులు స్వదేశానికి రావడానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్న దరిమిలా కేంద్రం స్పందించింది. దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేస్ లు నమోదు అవుతున్న తొలిలో ఇటలీ నుంచి వచ్చిన ఈ ఆంధ్ర విద్యార్థులకు వైద్య  పరీక్షల అనంతరం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ పూర్ లో ప్రత్యేక క్వరంటైన్ లో ఉంచారు. వీరిలో ఎవరికీ ఎటువంటి కరోనా లక్షణాలు లేనట్టు నిర్ధారణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఆదివారం రాయ పూర్ నుంచి *ఏఎన్ టి* అనే ఒక ప్రత్యేక బస్ లో ఈ 23 మందిని జగదల్ పూర్, విజయనగరం మీదుగా విశాఖ పట్నం తీసుకు వచ్చారు. ఈ బస్ లో వచ్చిన 23 మంది విద్యార్థుల్లో విజయనగరం పట్నంకి చెందిన ఒక విద్యార్థి ఉండడంతో వైద్య, పోలీస్ అధికారులు సోమవారం మధ్యాహ్నం విజయనగరం చేరుకున్న బస్ లో నుంచి దిగిన విద్యార్థిని తమ స్వాధీనంలోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మిగిలిన 22 మంది విద్యార్థులను అదే బస్ లో విశాఖ తరలి వెళ్లారు. ఈ బస్ కి ఎక్కడికక్కడ జిల్లా పోలీసులు ఎస్కార్ట్ గా వ్యవహరించారు. ఇదిలా ఉంటె విదేశాల నుంచి ఢిల్లీ కి అక్కడ నుంచి ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ ట్రైన్ లో విజయనగరం వచ్చిన మరో 12 మంది స్వదేశీయిలను కూడా సోమవారం వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం వీరిని తమ స్వగ్రామాల కి పంపనున్నట్టు అధికారులు చెప్పారు.


పార్టీ శ్రేణులు ముందుకు రావడం ఎంతైనా అభినందనీయం


విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజ్..... ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో ప్రజలను ఆదుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. పట్టణంలోని ఎనిమిదవ డివిజన్ శంకర మఠం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వాదశి వేణు ఆధ్వర్యంలో డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి ద్వాదశి సుమతి తమ స్వంత నిధులతో ఏర్పాటుచేసిన నిత్య అవసరాలను కోలగట్ల శ్రావణి చేతులమీదుగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను ఆదుకుంటున్న, తన తండ్రి మరియు విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచనలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయా డివిజన్ల లో లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అని అన్నారు. ఇప్పటివరకు జిల్లా లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ఇదే స్ఫూర్తితో ప్రజలు లాక్ డౌన్ పాటిస్తూ, ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ఎనిమిదవ డివిజన్ లో రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి పది కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, కేజీ గోధుమ నూక అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సంఘం రెడ్డి బంగారు నాయుడు, జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్, ఎనిమిదవ డివిజన్ పార్టీ నేతలు పల్లి సన్యాసిరావు, కరు మజ్జి సాయి , అయితా నాగరాజు , ఆదిరాజు సంతోష్, చిల్లా వాసు, ఆంజనేయులు, మూర్తి లతోపాటు మహిళా నేతలు శ్రీరంగం మంగాదేవి, చిల్లా పుష్ప, పిల్లా పద్మ తదితరులు ఉన్నారు. డివిజన్లో రేషన్ కార్డు లేని వంద కుటుంబాలకు నిత్యావసరాలను అందజేశారు...


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...