Followers
ప్రజా సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
సోడియం హైపో క్లోరైడ్ ద్రావకం పిచికారి
గొర్లవాని పాలెం బృoదావన్ కాలనీల లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేయించిన
వెలమ సంఘం ఆధ్యర్యంలో కూర కాయలు పంపిణీ
రోమన్ కాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణి
రోమన్ కాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణి
ఎటపాక, పెన్ పవర్ : అగ్నిపర్తి వెంకటేశ్వర్లు
కరోన నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను బట్టి ఎటపాక మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేక ఇబ్బందులు పడుతున్న 50 కుటుంబాలకు రెవ.పా.కొమ్ము అంతోని ఫాదర్ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యవసర వస్తువులైన కూరగాయలను రేవ.పా.కొమ్ము అంతోనీ ఫాదర్ చేతుల మీదుగా పంపిణి చేశారు.ఈ సందర్భంగా అంతోని ఫాదర్ మాట్లాడుతూ నెల్లిపాక లో గల రోమన్ కాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల్లోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను అందజేస్తున్నామని పేర్కొన్నారు.లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రంబాల.నాగేశ్వరరావు,సిస్టర్స్ ,డాక్టర్.శ్రీను,గ్రామ వాలంటరీలు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .
విపత్కర పరిస్థితుల్లో ఎటపాక వైసిపి ఉదారత
విపత్కర పరిస్థితుల్లో ఎటపాక వైసిపి ఉదారత
- వైసిపి ఆధ్వర్యంలో ఉద్యోగులకు భోజనాలు
ఎటపాక, పెన్ పవర్ : వెంకటేశ్వర్లు
లాక్ డౌన్ ప్రభావంతో ఎటపాక మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ , రెవెన్యూ , మండల పరిషత్ , ఆరోగ్య శాఖ సిబ్బందికి ఎటపాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిన్నబోయిన.రవి , అంబికా.వాసు సహకారంతో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎటపాక సీఐ గీతారామకృష్ణ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ సమాజంలో అన్ని దానాల్లో కల్లా అన్నదానం మహాదానమని పేర్కొన్నారు. దేశంలో కరోనా మహామ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలెవరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్న నేపధ్యంలో కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకుగాను తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ గీతారామకృష్ణ ఉద్బోధించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ విధిగా మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రిప్రగడ.నరసింహరావు , రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గోసు.ప్రశాంత్ (చింటూ) , జిల్లా కార్యదర్శి కొవ్వూరి.రాంబాబు , జిల్లా నాయకులు డేగల.రామకృష్ణ , కురినాల.వెంకటేశ్వర్లు (బుజ్జి), బాచినేని.రామకృష్ణ , మాదిరెడ్డి.కృష్ణమోహన్ , శీలం.కృష్ణ , గొల్లపల్లి.శివబాబు , మోసం.కన్నా , గజ్జల.రవి , సంతపూరి.వెంకటేశ్వర్లు , బయ్యని గణేష్ , కురినాల. నాగేంద్ర , కట్టా. ఓంకార్ , గజ్జల.నాగరత్నం , కురినాల.అనిల్ కుమార్ , విజయ్ , డేగల.చింటూ , బోడా.కుమార్ , వివిధ శాఖల అధికారులు , గ్రామసచివాలయ సిబ్బంది మరియు గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు.
ఐ న్యూస్ తెలుగు దిన పత్రిక ఆధ్వర్యంలో ఎల్ ఎన్ ఏ ద్వారా మీడియా మిత్రులకు కాయగూరల పంపిణీ .
ఐ న్యూస్ తెలుగు దినపత్రిక సౌజన్యంతో లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ మీడియా మిత్రులకు కాయగూరల పంపిణీ .
ఎం.వి.పి. కాలనీ , పెన్ పవర్ : మొహమ్మద్
విశాఖపట్నం... ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ సమయంలో సమాజం శ్రేయస్సు కోసం శ్రమించే మీడియా మిత్రులకు ఐ న్యూస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ కాశీమహంతి సంతోష్ కుమార్ సౌజన్యంతో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం సీతంపేటలో లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ మీడియా జర్నలిస్టులకు,చిన్న పత్రికల సంపాదకులకు తన సొంత నిధులతో కూరగాయల ప్యాకెట్లను సీనియర్ జర్నలిస్ట్ మనభూమి సత్యనారాయణ చేతులు మీదుగా కాశీమహంతి సంతోష్ కుమార్ అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వాలు విధించిన లాక్ డోన్ సందర్భంగా మన జర్నలిస్టుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టు మిత్రులకు తన వంతు చిరు సాయం అందించాలనే సంకల్పంతో కూరగాయల పంపిణీ చేశానని, అలాగే జై భరత్ నగర్ గ్రామ అధ్యక్షుడు డా, బొగ్గు శీను, 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బొడ్డేటి అనురాధ వారి ఆధ్వర్యంలో కంచరపాలెం జై భరత్ నగర్ లో ఐన్యూస్ తెలుగు దినపత్రిక ఆర్థిక సౌజన్యంతో సుమారు 400 మంది ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించాం అని తెలియజేశారు. ఈ సేవ కార్యక్రమాలు ఇంతటితో ఆగకుండా లాక్ డౌన్ కొనసాగే అన్ని రోజుల్లో తన వంతు సాయం చేస్తూనే ఉంటానని ఐన్యూస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ కాశీ మహంతి సంతోష్ కుమార్ తెలియజేశారు .ఇప్పటివరకూ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు అబ్బాస్, ఆనంద్ , భాస్కర్ లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
షౌకత్ అలి ఆధ్వర్యంలో పేద ప్రజలకు కూరగాయల పంపిణీ
షౌకత్ అలి ఆధ్వర్యంలో పేద ప్రజలకు కూరగాయల పంపిణీ
గాజువాక, పెన్ పవర్ : ఫిరోజ్
గాజువాక 66 వార్డ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వార్డు అధ్యక్షుడు షౌకత్ అలి ఆధ్వర్యంలో వార్డులో గల పేద ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సుమారు 1200 మందికి ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ కుప్పిలి సత్యనారాయణ పిట్ట ప్రకాష్ వై వి కుమార్ నజీర్ ప్రసాద్ ఆరిఫ్,అబ్దుల్ సలీం ఫజ్లు రహ్మన్ మున్వర్ ఆరీఫ్ రఫీ మంగ జ్యోతి సుమతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...