Followers

కూరగాయలను పంపిణీ చేసిన సహాయం స్వచ్ఛంద సంస్థ



కరోనా సహాయం గా కూరగాయలను పంపిణీ చేసిన


 సహాయం స్వచ్ఛంద సేవా సవస్థ అధ్యక్షుడు రౌతు శ్రీను

 

             పరవాడ, పెన్ పవర్ : చింతమనేని అనిల్ కుమార్ 

 

పరవాడ మండలం:కరోనా ప్రభావం వలన ఏర్పడిన గృహ నిర్బంధం వల్ల ప్రజలు నిత్యావసర వస్తువులకు పడుతున్న ఇబ్బందులు చూసి వారికి కూరగాయలను రౌతు శ్రీనివాస్ ఉచితం గా పంపిణీ చేశారు.సహాయం స్వచ్ఛంద సేవా సవస్థ అధ్యక్షుడు రౌతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో లంకెలపాలెం గ్రామం,బిసి కాలనీ,ఎస్సీ కాలనీ,గోడ్డి పేట,ఆర్ కె శివాని నగర్,సంపత్ స్కూల్ ఏరియాల్లో ఉన్నటువంటి 950 కుటుంబాలకు కుటుంబానికి 5 కేజీ ల కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సవస్థ కార్యదర్శి అప్పికొండ వెంకటరమణ,ఉపాధ్యక్షుడు యల్లపు సాంబశివ,ట్రెజరర్ గుర్రం సెంకర్రావు మరియు సవస్థ సభ్యులు రౌతు రామచంద్రరావు,లాలం కిషోర్ కుమార్,అప్పికొండ నర్సింగరావు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అధికారులు ప్రజల్లో భయాందోళనలు దూరం చేయాలి



అధికారులు ప్రజల్లో భయాందోళనలు దూరం చేయాలి. పర్యాటకమంత్రి అవంతి శ్రీనువాస్ .

 

 ఎస్.రాయవరం.... పెన్ పవర్.

 

నియోజకవర్గంలోని అరట్లకోట గ్రామ ప్రజలు మరియు పాయకరావుపేట పరిసర గ్రామాల ప్రజలలో నెలకొన్న భయాంధోళనలను తొలగించేదిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటకశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనువాస్ ఆదేశించారు. ఆదివారం ఉదయం రాయవరం మండలపరిషత్ సమావేశమందిరంలో నియోజకవర్గస్థాయి అధికారుల రివ్యూ సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులనుండి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అధికారులు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా పాయకరావుపేట రాజుగారిబీడులో నివసిస్తున్న ఉపాధ్యాయుడు కరోనా బారిన పడడంతో ఆయన స్వగ్రామంతో కలసి కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించిన నేపధ్యంలో ఆప్రాంత ప్రజలలో విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారన్నారు.ఆ ప్రాంతాలకు నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడంతోపాటు ప్రజలకు భరోసా కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. తమలపాకు రైతులకు ట్రాన్స్ పోర్టు ఏర్పాటుచేసి వారికి ఎన్వోసిల ద్వారా వారికి నష్టం రాకుండా చూడాలన్నారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగు మండలాల ఆరోగ్యకేంద్రాల వద్ద అంబులెన్సులు అద్దెకు ఏర్పాటు చేయాలని సూచించారు.అన్ని పంచాయితీలలో పారిశుద్ధ్యలోపం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కార్డులేని వారికి బియ్యం సరఫరా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపి బి సత్యవతి ఎమ్మెల్యే జి బాబూరావు, ఆర్డీవో శివలక్ష్మి డిఎం అండ్  హెచ్వో  నాలుగు మండలాల ఎంపిడివోలు,తహశీల్ధారులు, వైద్యులు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు పోలీస్ హెచ్చరికలు

ప్రజలకు పోలీస్ హెచ్చరికలు

 

- ఇతరులకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు

 

అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్ 

 

ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయని దీనిలో భాగంగా 144 సెక్షన్ అమల్లో ఉందనేది ప్రజలు గమనించాలని పోలీస్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాధి నివారణ జరగాలంటే ప్రజలు సమూహంగా ఉండకూడదు. ఇది తెలిసి కొందరు అవగాహన లేక  కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడెక్కడ గుంపులు గా తిరుగుతున్న జనాలను డ్రోన్ కెమెరా తో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాళ్ళ పై కేసులు తప్పవని హెచ్చరించారు. ఆహారాన్ని పేదలకు పంపిణీ చేయాలని అనుకునేవారు కూడా పోలీసులకి ముందస్తు సమాచారం అందించాలన్నారు. పంపిణీ పేరుతో ఎక్కడికక్కడ జనం గుంపులుగా చేరుతుండడంతో ప్రజలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఆంటు వ్యాధుల చట్టం ప్రకారం వాళ్ళు నేరస్తులుగా పరిగణించవలసి వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో వివాహాలు చేసుకోవడం తగదని  అత్యవసరమైతే జనం లేకుండా సంబంధిత అధికారుల అనుమతితో చేసుకోవాలన్నారు. వాహనాలతో పదేపదే రోడ్డుపై తిరిగే వారిపై కేసులు నమోదు చేశామని వారినుంచి అపరాధ రుసుమును కూడా వసూలు చేసినట్లు వివరించారు. ప్రజల ప్రాణాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విధిగా పాటించకపోతే కేసులకు గురవుతారని హెచ్చరించారు. 


కరోనా కట్టడికి పూర్తి సన్నద్ధం



    కరోనా కట్టడికి పూర్తి సన్నద్ధం



       విశాఖ నుండి రక పోకల్ని కట్టుదిట్టం చేసాం
     వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్


 


బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజ్


  జిల్లాలో కరోనా  నియంత్రణకు అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ తెలిపారు .  ఆదివారం ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య  కార్యదర్శి డా. జవహర్ రెడ్డి  కరోనా ఏర్పాట్ల పై, ప్రస్తుత పరిస్థితుల పై జిల్లా కల్లెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో  కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి  జిల్లా లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మిమ్స్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా  మార్చి అన్ని వసతులను ఏర్పాటు చేసి,  వైద్యులను, పారా  మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.  జిల్లాలో 22 వెంటిలేటర్లను 66 ఐ.సి.యు, 959 నాన్ ఐ.సి.యు బెడ్స్ ను,  సిద్ధం చేయడం జరిగిందన్నారు. 382 మంది వైద్యుల్ని, 1186 మంది నర్స్ లను,పారా మెడికల్ సిబ్బందిని  నియమించడం  జరిగిందని తెలిపారు.    కరోనా ట్రీట్మెంట్  కోసం ప్రబ్బుత్వ ఆసుపత్రులతో పాటు  నాలుగు ప్రైవేటు  ఆసుపత్రులను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.  జిల్లాలో 4507 బెడ్స్ కెపాసిటీ తో  32 క్వరెంటైన్  కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జే.ఎన్.టి.యు  లో ప్రస్తుతం 120 మంది క్వరెంటైన్   లో ఉన్నారని తెలిపారు. అన్ని ప్రాంతాల నుండి నమూనాలను సేకరిస్తున్నామని,  జిల్లా నుండి ఇప్పటి వరకు కరోనా పరీక్షల కోసం 306 నమూనాలు పంపగా 216 నెగటివ్  వచ్చాయని  ఇంకను 90  పరీక్షల ఫలితం రావలసి ఉందని పేర్కొన్నారు.   అయతే విశాఖపట్నం నుండి వ్యాధి నిర్ధారిత పరీక్షల ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయని, కాకినాడ పంపడానికి అవకాసం కల్పిస్తే త్వరగా ఫలితాలు వచ్చే వీలుంటుందని కలెక్టర్ కోరగా, విశాఖ పట్నంలోనే  అదనపు వనరులను సమకూర్చడం ద్వారా త్వరగా వచ్చేలా చూడడం జరుగుతుందని డా.జవహర్ రెడ్డి గారు తెలిపారు.
విశాఖ  నుండి వచ్చే రహదారులన్నీ మూసివేత :
        విశాఖపట్నంలో పాజిటివ్ కేసు లున్నందున, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళకుండా  జిల్లా సరిహదుల్లో  ఉన్న రహదారులన్నిటిని మూసి వేయడం జరిగిందని  కలెక్టర్ తెలిపారు.   ప్రధాన మార్గాల వద్దే కాకుండా  లింక్ రోడ్ల వద్ద  కూడా చెక్ పోస్ట్ లను పెట్టి నిఘా పెంచడం జరిగిందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో  ఉన్నతాధికారుల అనుమతి తోనే  ఎవరైనా కదిలేలా కట్టుదిట్ట మైన ఏర్పాట్లను చేశామన్నారు.
 కరోనా నియంత్రణ సామాగ్రి సిద్ధం:
   వైద్యుల కోసం 667 పి పి ఎక్విప్మెంట్ ను, 1600 ఎన్-95 మాస్క్లను, 31,425  గ్లోవ్స్  ను, 69 వేల  సర్జికల్ మాస్క్ లను , 9 వేల లీటర్ల సానిటైసర్  తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచమని, స్టాక్ రిజిస్టర్ ద్వార వినియోగించిన, వచ్చిన వాటి వివరాలను నమోదు చేయడం జరుగుతోందని తెలిపారు.
          ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ జి.సి.కిశోర్  కుమార్,  సహాయ కలెక్టర్ కేతన్ గార్గ్ , జే.సి-2 కుర్మనాద్,  జిల్లా రెవిన్యూ అధికారి వెంకట రావు, జిల్లా  వైద్య అధికారి డా. రమణ కుమారి, ఆసుపత్రుల సమన్వధికారి డా. నాగభూషణ రావు, సూపరింటెండెంట్ డా. సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు.


కరోనా పై పోరులో మేము సైతం 


కరోనా పై పోరులో మేము సైతం..!  స్వతంత్ర నగర్ (ఆర్.ఎస్.ఎ) యువకులు .....                            


మధురవాడ, పెన్ పవర్: సునీల్



 మధురవాడ:  జీవీఎంసీ మధురవాడ స్వతంత్ర నగర్ (ఆర్.ఎస్.ఎ) యువకుల ఆధ్వర్యంలో స్వతంత్ర నగర్ గ్రామంలో నివసించే నీరుపేద మరియు వికలాంగుల కుటుంబాలకు  సుమారు 250 మందికి నిత్యవసర వస్తువులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సిఐ ఎ. రవి కుమార్ హాజరయ్యారు. సిఐ రవికుమార్ చేతులమీదుగా సామాజిక దూరం పాటిస్తూ నిత్యవసర వస్తువులు, బియ్యం పంపిణీ ప్రారంభించారు. అనంతరం సిఐ ఎ.రవికుమార్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని మానవాళి నుండి తరిమికొట్టాలంటే సామాజిక దూరం తప్పక పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత తో ఎంతటి వైరస్ నైనా తరిమి కొట్టవచ్చునని, ఈ విపత్కర సమయంలో పేదవారికి సహాయం చేస్తూ,సమాజ శ్రేయస్సుకు  నడుం బిగించిన స్వతంత్రనగర్ యువకులకు అభినందనలు తెలిపారు. సమాజం నైతిక అభివృద్ధిలో  యువతదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమం తరువాత స్వతంత్ర నగర్ యువత సామాజిక దూరం పాటిస్తూ ఇంటింటికి వెళ్లి సరుకులను అందించారు, పేద వారి మన్ననలు పొందారు.


మూసి ఉన్న మద్యం షాపుల్లో మిస్ అవుతున్న లిక్కర్


మూసి ఉన్న మద్యం షాపుల్లో మిస్ అవుతున్న లిక్కర్


 


వరంగల్/హుస్నాబాద్, పెన్ పవర్ :దాసు


 వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూసి ఉన్న  మద్యం షాపుల్లో లిక్కర్  మిస్ అవుతున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ముందు రోజు ఉన్న లెక్క కి ఇపుడున్న మద్యం కి భారీ తేడా గమనించారు అధికారులు. అయితే  తాళం వేసి ఉన్న లిక్కర్ షాపుల్లో నుంచి లిక్కర్ ఎలా మాయం అవుతుందా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లిక్కర్ లెక్కను ఎక్సైజ్ శాఖ రాసి పెట్టుకుందట. ఆ లెక్కకి ఈ లెక్కకి భారీ తేడాలు ఉన్నట్టు గమనించారు అధికారులు. లోకల్ లీడర్ల హామీతోనే లిక్కర్ మాయామయినట్టు చెబుతున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు షాపులపై  కేసులు నమోదు అవుతున్నాయి
అలాగే వరంగల్ అర్బన్ జిల్లా లో ప్రముఖ వైన్స్ నుంచి హోటల్స్,బార్లకు వరకు తాళాలు వేసి ఉన్న షాపులో నుంచి లిక్కర్ మాయం అవుతోంది. లాకుడౌన్ తరువాత లిక్కర్ గోడాన్ , షాపుల్లో లెక్క ఎక్సైజ్ శాఖ తెలుస్తోంది. లెక్క తప్పితే కేసులు నమోదు చేస్తోండ్ది ఎక్సైజ్ శాఖ.పెద్ద ఎత్తున లిక్కర్ బ్లాక్ దందా కొనసాగుతుoది.పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు అధికంగా ఆదాయం వస్తుండడంతో మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతున్న లిక్కర్ దందా. కొన్ని ప్రాంతాల్లో
 ఇక లిక్కర్ లేకపోవడంతో చాలా మంది నాటుసార,కళ్లు వైపు మార్లుతున్నారు.కరోనా వల్లన అటు ప్రభుత్వనికి ఆదాయం కోల్పోయిన ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద సాహసమే చేసింది. కాని మద్యం వ్యాపారులకు మాత్రం పెట్టిన పెట్టుబడి, ఖర్చులకు బోను నాలుగు రూపాయలు వెనుక వేసుకుంది


పోలీసుల ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నిరోధక ద్వారం


విజయనగరం జిల్లా వై జంక్షన్ వద్ద పోలీసు యంత్రాంగం కరోనా వ్యాధి నిరోధక ద్వారం.


విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజ్


 


ఏర్పాటు చేశారు, ఆదివారం  మధ్యాహ్నం  జిల్లా ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వచ్చి వెళ్లే వాహనదారులను ఆపి,  వైరస్ సోకకుండా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయడం ద్వారా బ్యాక్టీరియాను, వైరస్లను, అరికట్టవచ్చని  కరోనా వ్యాధి నిరోధక ద్వారం ద్వారా  వాహనదారులను పంపిస్తామని  తేలియజేశారు..


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...