Followers

కోవిడ్ ఐసోలేషన్ బోగీ..


విజయనగరం రైల్వే స్టేషన్ లో కోవిడ్ ఐసోలేషన్ కోచ్..


 కోవిడ్ ఐసోలేషన్ బోగీ..


విజయనగరం, పెన్ పవర్ :  డేవిడ్ రాజ్


   కరోనా వైరస్(కోవిడ్-19) రోజు రోజుకు విస్తరిస్తూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. కరోనా పాజిటివ్ కేస్ లు పెరిగిన పక్షంలో పరిస్థితి చేయి దాటుతుందని ముందే అంచనా వేసిన ప్రభుత్వం రైల్వే కోచ్ లని ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ కోచ్ లుగా తీర్చిదిద్దింది.  విజయనగరం రైల్వేస్టేషన్లో కూడా ఒకటో నెంబర్ ప్లాట్ పాం పై ఒక ట్రైన్ లో రైల్వే అధికారులు కోవిడ్ ఐసోలేషన్ కోచ్ లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి వీటిని డెమో లుగా అధికారులు పేర్కొంటున్నప్పటికీ అత్యవసర సమయంలో వీటికే మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించి ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తెనున్నట్టు చెబుతున్నారు.


కరోనా మహమ్మారి పై పోలీసుల వినూత్న ప్రచారం.


 


కరోనా మహమ్మారి పై పోలీసుల వినూత్న ప్రచారం.

 

  వేపగుంట రోడ్డు పై ఆకర్షిస్తున్న పెయింటింగ్.

 

  స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

కరోనా మహమ్మారి పై ప్రజలు కు అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. నిన్న విజయనగరం లో విచిత్ర వేష దార ణతో రోడ్లపై కి వచ్చిన వారి కి సూచనలు చేశారు. యమ ధర్మరాజు రక్షక బటుడుతో బొలేరో వాహనం లొ తిరిగారు. ఈ రోజు వేపగుంట ట్రాఫిక్ పోలీస్ లు ముందడుగు వేసి ప్రత్యేకంగా ఆకర్షణ గా ఉండేలా  మీ రక్షణే మా బాధ్యత అంటూ రోడ్డు పై  పెయింటింగ్ వేయడం విశేషం. ఆ మార్గం లో వచ్చి పోయేవారని ఈ పోలీస్ పెయింటింగ్ ఎంత గానో ఆకట్టుకుంటుంది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల పెందుర్తి పోలీస్ స్టేషన్ వేపగుంట జంక్షన్ లో ట్రాఫిక్ పోలీసులు కరోనా మహమ్మారిని అరికట్టడానికి అందరూ ఇంట్లోనే ఉండాలంటే నినాదాలు చేస్తూ ఏర్పాటుచేసిన పెయింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది ప్రతి ఒక్కరు పోలీసులు విజ్ఞప్తి నీ పాటించి అందరూ ఇంట్లో ఉండాలి అని పోలీసు అధికారులు కోరుతున్నారు

రెడ్ క్రాస్  ఆద్వర్యంలో స్వచ్చంధంగా రక్త దానం 


రెడ్ క్రాస్  ఆద్వర్యంలో స్వచ్చంధంగా రక్త దానం 


శ్రీకాకుళం, పెన్ పవర్ :


 


జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ అద్యక్షులు జె.నివాస్, ఐ.ఎ.యస్, పిలుపు మేరకు  ముగ్గురు వాలంటీర్లు,  వజ్రపుకొత్తూరు మండలం రెవిన్యూ ఉద్యోగులు ఐదుగురు మరియు శ్రీకాకుళం మేక్సి యూత్ అసోసియేషన్, పెద్ద రెల్లి వీధి నకు చెందిన పది మంది సభ్యులు స్వయంగా వచ్చి రక్త దానం చేసినారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఛైర్మన్  పి. జగన్ మోహన్ రావువారిని అభినందించారు. ఈ కార్యక్రమములో శ్రీ.నిక్కు అప్పన్న గారు, మేక్సి యూత్ అసోసియేషన్ అద్యక్షులు ఆర్.దివాకర్,  ఉంకిలి శ్రీను,  రెడ్ క్రాస్ సభ్యులు కె.సత్యనారాయణ, సూర్య ప్రకాష్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


 


 


మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ.


5 వార్డ్ స్వతంత్రనగర్ లో మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ.


  మధురవాడ, పెన్ పవర్ : సునీల్


 


మదురవాడ 5వ వార్డు ప్రజలకు టిడిపి సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో 5 వార్డ్ స్వతంత్రనగర్ ప్రజలకు కూరగాయల పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ సందర్బంగా ఈ ప్రాంత ప్రజానీకం ఇళ్లకే పరిమితం కావడంతో పేద ప్రజలకు జీవనోపాధి కష్టంగా ఉంటుందని ఉద్దేశంతో తన వంతు సహాయంగా 5 వార్డు ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేస్తూ వస్తున్నారు. బుధవారం శివశక్తినగర్ నుండి ప్రారంభమైన పంపిణీ కార్యక్రమం శనివారం స్వతంత్రనగర్, గణేష్ నగర్, గ్రామాల్లో నిర్వహించారు . ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణ చేయుట లో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, జివిఎంసి సిబ్బందికి, డాక్టర్లకు, పత్రిక విలేకరులకు లక్ష్మణరావు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో వాండ్రాసి అప్పలరాజు, నాగోతి శివాజీ, వాసుపల్లి బండయ్య ,జోగేశ్వర పాత్రో, కొత్తలశ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..


"బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి" జ్యోతీరావు పూలే.


"బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి" జ్యోతీరావు పూలే.


.పెన్ పవర్ టంగుటూరు: .వెంకటేశ్వర్లు


మహాత్మా  జ్యోతీరావు పూలే. 193 వ జయంతి ఉత్సవాలు టంగుటూరు లోని సచివాలయం 4లో శనివారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ముక్య అతిధిగా పాల్గొన్న పీ.ఏ.సీ.యెస్.అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటిగా విద్య నందించి కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతీరావు పూలే అని అన్నారు.1978 లో సత్యశోదక్ సమాజాన్ని ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యక్తి పూలే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వై.కా.పా.అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిరావు,మాజీ జెడ్.పీ.టీ.సీ.పటాపంజుల కొటేశ్వరమ్మ,మాజీ సర్పంచ్ పుట్టా వెంకటరావు పాల్గొన్నారు.


వలస కూలీలకు భోజన పంపిణీ


 


వలస కూలీలకు భోజన పంపిణీ చేసిన  సిపిఎం నేత రామస్వామి


 

            పరవాడ, పెన్ పవర్ : చింతమనేని అనిల్ కుమార్ 

 

పరవాడ మండలం:సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న వలస కూలీల భోజన వసతి కార్యక్రమంలో శనివారం నాడు మండల సిపిఎం నేత ఏ రామస్వామి ఆర్ధిక సహాయం తో పంపిణీ చేశారు.లంకెలపాలెం,బ్యాంక్ కాలనీ ప్రాంతాల్లోని 200 మంది వలస కూలీలకు సిపిఎం నేత రామస్వామి ఏర్పాటు చేసిన బిర్యాని పేకెట్లను సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో భోజన పేకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు అధ్యక్షుడు ఎమ్ రాము తదితరులు పాల్గొన్నారు.

275 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ



275 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేసిన  పైడి మాంబ యూత్ సభ్యులు


 

              పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:సినిమా హాలు జెక్షన్ లోని పైడి మాంబ యూత్ అధ్యర్యంలో కరోనా ప్రభావం తో ఆర్ధిక ఇబ్బoధులు ఎదుర్కొంటున్న 275 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.శనివారం నాడు యూత్ సభ్యులు 5 1/2 కేజీ లు 8 రకాల కూరగాయలను పంపిణీ చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.యూత్ సభ్యులు ప్రజలు కరోనా భారిన పడకుండా ఎంతో శ్రమిస్తున్న గ్రామ పారిశుద్య కార్మికుల కు ఆశ వర్కర్లకు కూడా కూరగాయలను అందించారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు బొద్ధపు అయ్యబాబు,పయిల అప్పలనాయుడు,బోండా శ్రీనివాసరావు,రెడ్డి నాగేశ్వరరావు,చీపురుపల్లి కృష్ణ,రెడ్డి వెంకునాయుడు,పయిల నాయుడు(భద్రి),ఆడారి జానీ రాంబాబు,చొప్ప సతీష్,పయిల వెంకటరావు,కటారి నాయుడు(బాలు),పి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...