అనకాపల్లి, పెన్ పవర్ : బోస్
అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయితీ లో గల బి ఆర్ టి కాలనీ లో కురకాయలు 600 కుటుంబాలకు పంచిపెట్టడం జరిగింది.వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన యల్లపు వెంకట రమేష్ మానవసేవ మాధవ సేవ అని వారం రోజులుగా పిసినికడ చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు కూరగాయలు పంచిపెట్టే కార్యక్రమం చేపట్టారు.ఇప్పుడు వరకు 3000 కుటుంబాలకు కూరగాయలు పంచిపెట్టారని ఇంకా సాధ్యమైనంత వరకు పేదలను ఆదుకుంటామని ప్రతి ఒక్కరు లాక్ డౌన్ పాటించాలని మేమున్నము మీకు ఏమి ఇబ్బంది పడకండి అనే ధైర్యాన్ని పిసినికడ పంచాయితీ ప్రజలకు చెప్పారు
ప్రజా సేవలో జనసేన 100 సోల్జర్స్
పెన్ పవర్, ఆత్రేయపురం : చిరంజీవి
కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాకుడౌన్ విధించడంతో ఇంటిలో నుండి ప్రజలు బయటకు వెళ్లరాదని ప్రభుత్వం చెప్పడం వలన ఎవరు బయటకు రాని పరిస్థితి లో మండలంలోని ర్యాలీ గ్రామం వారికి జనసేన 100 సోల్జర్స్ . రెండు రోజులుగా ప్రజలకు అందుబాటులోఉంటు, వారికి కావల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేసారు . అలాగే ప్రజలుకు కరోనా గూర్చి అవగాహన కలిపిస్తూ మనుసుల మధ్య దూరం పాటించాలని చెపుతూనే ఆదివారం బీసీ .ఓ సి య సి కాలనిలో కూరగాయలు పంపిణీ చేశారు. జన సేన అనుబంధ సంస్థ అయిన 100 సోల్జర్స్ సంస్థ సభ్యులు కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా గ్రామ ప్రజలు బయటకి రాకుండా ఇంటింటికి 3 రోజులకు సరిపడ కాయగూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నూతిగూడెం గ్రామానికి అధికారులు చేయూత
అనారోగ్యంతో మృతి చెందిన వెంకటేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం.
వి ఆర్ పురం, పెన్ పవర్ : ముత్యాల సాయి బాబు
ప్రపంచాన్ని వణికిస్తున్న కారోన వైరస్ నిర్ములనలో భాగంగా లాక్ డౌన్ విధించటంతో రోజువారీ పనులు చేసుకుని జీవించే కూలీలు ఇంటికి పరిమితం కావటంతో వారు పడుతూన్న ఇబ్బందులు గుర్తించి అధికారులు ఆగ్రామనికి నిత్యావసర వస్తువులు, 74 కుటుంబలకు అధికారుల సొంత ఖర్చుతో కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపినిచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందిన సోడి వెంకటేష్ కుటుంబనికి నిత్యావసర వస్తువులు బియ్యం బట్టలు కొంత నగదు అందించారు.గ్రామస్తులు ఆ కుటుంబానికి సహకారం గా ఉండాలని చుచించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్, ఎన్ శ్రీధర్,యం పి డి ఓ శ్రీనివాస్ ,డా,,సుందర్ ప్రసాద్,నాగార్జున, వి ఆర్ పురం ఎస్సై వెంకట్, చంటి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...