Followers

86వ వార్డులో దామా వెనుక జన ప్రభంజనం



86వ వార్డులో దామా వెనుక జన ప్రభంజనం ... దామా సమక్షంలో 200 మంది వైసీపీ తీర్ధం ..


గాజువాక , పెన్ పవర్ : శ్రీనివాస్ 


ప్రజా సేవే పరమార్ధంగా భావించి నిత్యం ప్రజా సమస్యల పై అలు ఎరుగని పోరాట నాయకుడు, ప్రజా సేవకి కృషి చేసే యోధుడు దామా సుబ్బరావు అని 86వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మెడికల్ బాబు అన్నారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, 86వ వార్డు వైసీపీ అభ్యర్ధీ  దామా సేవలు మరువని అని మెడికల్ బాబు అన్నారు, కరోనా మహమ్మారి నేపాధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో నిరు పేదలు, నిరాశ్రయులు, రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వడంతో 86వ వార్డులో ప్రతి రోజు వైసీపీ నాయకులు దామా సుబ్బరావు నిత్య అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసారు, అలాగే వార్డులో కాశీపాలెం, యాతపాలెం, కూర్మన్నపాలెం,ఎన్టీఆర్ నగర్  తదితర ప్రాంతంలో నిరుపేదలకు, ప్రజలకు నిత్యవసర సరుకులు, బియ్యం, కూరగాయాలు పంపిణి చేసారు దామా సుబ్బరావు, అలాగే వైసీపీ నాయకులు దామా సుబ్బరావుగారు ఆశయాలు , సేవ కార్యక్రమలకు ఆకర్షితులై 86వ వార్డు ప్రజలు దామా సుబ్బరావుకి బ్రహ్మరధం పడుతున్నారు, 86వ వార్డు రెల్లివీధీకి చెందిన 200 మంది దామా సుబ్బరావు సమక్షంలో వైసీపి తీర్ధం పుచ్చుకున్నారు, దామా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు, కార్యక్రమంలో మెడికల్ బాబు, చెగొండి శ్రీనివాస్ , బార్ సాయి ,  పెంటారావు, మాటూరి శ్రీను, మురళి,సుహసిని తదితరులు పాల్గున్నారు


జీడి మామిడి పై ఆదారపడిన రైతులను ఆదుకోవాలి.


 


జీడి మామిడి పై ఆదారపడిన రైతులను ఆదుకోవాలి

 

స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్) : మజ్జి శ్రీనివాస మూర్తి 

 

 

జిల్లా లో  జీడీ మామిడి  తోటలపై  ఆదారపడి జీవిస్తున్న  రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రెల్లి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రెల్లి రైతులు జీడి మామిడి తోటల పై భారీగా పెట్టుబడులు పెట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా వ్యాపారం కుంటు పడింది వారు తీవ్రంగా నష్ట పోయరని అన్నారు. ఈ సీజన్‌లో జీడి మామిడి ని మార్కెట్ ధర నిర్ణయించి ప్రభుత్వమే  ఐకెపికి  అప్పగించి  కొనుగోలు చేయాలని ఆయన కోరుతున్నారు. డ్వాక్రా మహిళలు  ద్వారా మార్కెట్ ధరకె  విక్రయించేటట్లు  ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని అలాగే  జీడీ మామిడి కి రవాణా సౌకర్యo కల్పించాలని కోరుతున్నారు. రెల్లి జీడీ మామిడి రైతులకు  న్యాయం జరిగేలా ప్రభుత్వం ఆదుకోవాలని  పాపారావు కోరుతున్నారు.

 

                     

తాటిపర్తి  చెట్టుపల్లి  రహదారి  విస్తరణకు  102 కోట్ల మంజూరు








  తాటిపర్తి   చెట్టుపల్లి  రహదారి  విస్తరణకు  102 కోట్ల మంజూరు.  ఆర్ అండ్ బి డిఈ  వేణుగోపాల్.

 


         వి. మాడుగుల ..పెన్ పవర్. : మజ్జి శ్రీనివాస మూర్తి 




 




నర్సీపట్నం  రోడ్లు భవనాల  శాఖ   డివిజన్ పరిధిలో  రెండు రహదారులు  విస్తరణకు  ప్రభుత్వం 102 కోట్ల రూపాయలు   మంజూరు చేసిందని  ఆర్ అండ్ బి  నర్సీపట్నం  డి ఈ  వేణుగోపాల్  తెలిపారు. ఆదివారం  ఆయన  మాట్లాడుతూ  చెట్టు పల్లి నుంచి   వడ్డాది జంక్షన్ వరకు  రోడ్డు విస్తరణకు  80 కోట్ల రూపాయలు  కేటాయించారని  తెలిపారు. అలాగే   వడ్డాది నుంచి  తాటిపర్తి  వరకు  రోడ్డు విస్తరణకు  22 కోట్ల రూపాయలు  కేటాయించారని తెలిపారు.18 అడుగులు  ఉన్న రహదారి  30 అడుగులకు పెంచడం జరుగుతుందన్నారు. తాటిపర్తి నుంచి  గరిక బంధ చెక్పోస్ట్ వరకు  గత ఏడాది  రోడ్డు విస్తరణ చేశామన్నారు. తాటిపర్తి  వడ్డాది   చెట్టు పల్లి వరకు   రోడ్డు విస్తరణ  చేపడతామన్నారు.  టెండరు నిర్వహించిన తర్వాత  పనులు ప్రారంభమవుతాయని  తెలిపారు.  ప్రస్తుతం  రహదారి  ఉన్న వెడల్పును  కొలతలు వేసి  గుర్తు ఇస్తున్నామని  తెలిపారు. అలాగే పాడేరు డివిజన్ లో  సుజన పేట రహదారి 5 కిలోమీటర్లు  కూడా  విస్తరిస్తున్నారు.

 





 



 

సామాజిక దూరాన్ని పాటించి కరోనాను తరిమికొట్టాలి


 


సామాజిక దూరాన్ని పాటించి కరోనాను తరిమికొట్టాలి

 

-- వైకాపా నాయకులు కొణతాల భాస్కర్ రావు

 

అనకాపల్లి, పెన్ పవర్ : వానపల్లి రమణ 

 

ప్రభుత్వం సూచించిన సామాజిక దూరాన్ని పాటించి కరోనా వ్యాధిని తరిమికొట్టాలని వైకాపా 80 వ వార్డు ఇంచార్జ్  నాయకులు  కొణతాల భాస్కరరావు  కోరారు.  లాక్ డౌన్ నేపథ్యంలో లో పేదలకు ఆదివారం నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ , ఎం.పి భీశెట్టి సత్యవతమ్మ , దాడి వీరభద్రరావు ,పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ ,జయవీర్ సూచనల మేరకు కార్యక్రమాన్నిి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  జీవీఎంసీ విలీన గ్రామాలు పెదతాడి, చినతాడి  గ్రామ ప్రజలు  ప్రస్తుతం వున్నా పరిణామం వలన ఎవరు పనులకు వెళ్లకుండా  అందరు ఇళ్లకు పరిమితమై ఉండటం వల్ల ఆర్థికంగా వారు చాలా ఇబ్బంది పడుతున్నారని వారికి  తన వంతు సేవ చెయ్యాలని ప్రతి ఇంటికి నిత్యావసరాలైన కాయగూరలను పంచారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పారు.  లాక్ డౌన్ కి స్వచ్చందంగా సహకరిస్తున్నందుకు గ్రామ ప్రజలందిరికి కృతజ్ఞతలు చెప్పారు. సమిష్టి కృషితో ఈ కరోనా  మహమ్మారిని తరిమికొట్టాలని  కరోనాని ప్రతి ఒక్కరూ యుద్ధంలా భావించి విజయం సాధించాలని కోరారు.  కార్యక్రమంలో కె.ఎమ్.నాయుడు, కోరిబిల్లి పరి,కోరిబిల్లి ఆరుద్ర, కాండ్రేగుల శ్రీరామ్,కర్రి అప్పాజీ,విల్లూరి సంతోష్,  పెంటకోట  దామోదర్,పెంటకోట సునీల్,పిల్లా నాగేశ్వరరావు, బంతికోరు గోవింద్, శీలం నదియా,కోమటి సూరిబాబు, గొన్న వెంకటరమణ, శీలం సూరిబాబు, పితాని నీలకంఠరావు, గనిరెడ్డి కనకరాజు, ముమ్మన అప్పారావు, ముమ్మన పోతురాజు, జుత్తుకు రాము, గొలగాని గోవింద్ మరియు పెదతాడి, చినతాడి గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.


వైకాపా నేత పలకా రవి పేదలకు చేయూత


 

వైకాపా నేత పలకా రవి పేదలకు చేయూత

 

అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్ 

 

లాక్ డౌన్  నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తామని 84 వ వార్డ్ వైకాపా ఇంచార్జ్  పలకా రవి  పేర్కొన్నారు. విలీన గ్రామం అయినా కొత్తూరు నర్సింగ్ రావు పేట  లో ఆదివారం పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధిని తరిమి కొట్టడం లో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిిక దూరాన్ని పాటించాలన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఎమ్మెల్యే అమర్నాథ్ సూచనల మేరకు పేదలకు అండగా నిలుస్తామనారు. 250 కుటుంబాలకు బియ్యం,  కూరగాయలు ,మాస్కులు  పంపిణీ చేశారు.కార్యక్రమంలో. వైసిపి నాయకులు పీలా తులసి, కరణం సురేష్,   గొల్లవిల్లి అప్పారావు ,ఎ కనకరాజు, వి కుమార్, గొల్లవిల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.


పేదలకు అండగా తెదేపా నాయకులు కామేష్ 



 

పేదలకు అండగా తెదేపా నాయకులు కామేష్ 

 

అనకాపల్లి, పెన్ పవర్ :వానపల్లి  రమణ 

 

పేద ప్రజలకు అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు 84వ వార్డ్ ఇంచార్జ్ అరేపు కామేష్ పేర్కొన్నారు. లాక్ డోన్ తో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆదివారం చేయూతను అందించారు. కొత్తూరు నర్సింగ్ రావు పేట, నెయ్యల వీధి, కుంచా వారి వీధి ల లో పేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మనోధైర్యంతో ఉండాలన్నారు. వ్యాధిని సామాజిక దూరం పాటించి తరిమి కొట్టాలన్నారు. ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందల సూచనల మేరకు తాను కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సుమారు 1000 కుటుంబాలకు అందజేశారు.

కె సత్యనారాయణ, జాజి మొక్కల అప్పలరాజు, కసిరెడ్డి అప్పలకొండ, సిరసపల్లి పైడ్రాజు, కె .రత్నకుమారి , రేబాక ఈశ్వరరావు, గణపతి, కుంచా చిన్న బాబు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

(మోడి కిట్స్) నిత్యావసరాలు పంపిణీ.


 


19 వ వార్డ్ బిజెపి ఆధ్వర్యంలో (మోడి కిట్స్) నిత్యావసరాలు పంపిణీ.


         ఆరిలోవ   పెన్ పవర్.

తూర్పు నియోజకవర్గం 19 వార్డు బిజెపి ఆధ్వర్యంలో, పార్టీ అభ్యర్థిని అరుణకుమారి. ఎం వీ పి కాలనీ లో ఆమె నివాసంలో పేదలకు (మోడి కిట్స్)నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి  ఒకరికొకరు వ్యకిగత  దూరం పాటించి ధైర్యంగా ఉండాలని, కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...