Followers

ప్రజల కోసం ఎంపీ సత్యవతి మృత్యుంజయ హోమం


ప్రజల కోసం ఎంపీ సత్యవతి మృత్యుంజయ హోమం

 

అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్ 

 

ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి విష్ణుమూర్తి దంపతులు శనివారం మహాగణపతి మృత్యుంజయ హోమం నిర్వహించారు. వేద పండితులతో వినాయకుని ఆలయం ముందు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా వ్యాధిని బారిన పడకుండా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి  ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం పేదలకు వివేకనంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు వంట సరుకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

పూలేను యువత ఆదర్శంగా తీసుకోవాలి


 


పూలేను యువత ఆదర్శంగా తీసుకోవాలి

 

అనకాపల్లి, పెన్ పవర్ : వానపల్లి రమణ 

 

బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం జ్యోతిరావు పూలే చేసిన కృషి గణనీయమైనదని 84 వ వార్డు వైకాపా ఇంచార్జ్ పలకా రవి పేర్కొన్నారు. యువత పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నడవాలని సూచించారు. శనివారం పూలే జయంతి వేడుకలను నెహ్రూచౌక్ కూడలి లో నిర్వహించారు. చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం అందరికీ విద్యావకాశాలు కోసం వెనకబడిన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగం మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో గొన్నాబత్తుల వెంకటరమణ, మొగుళ్లపల్లి సుబ్బారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా లోను జగన్ కక్షసాధింపు వీడలేదు


 


కరోనా లోను జగన్ కక్షసాధింపు వీడలేదు

 

అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్ 

 

ప్రపంచంతా కరోనా వైరస్ నివారణకై అహోరాత్రులు కష్టపడుతున్న ప్రజాప్రతినిధులును మనం చూస్తున్నామని కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  కక్ష సాధింపు చర్యలకు ఏ విధంగా చేయాలి ఎలా లబ్ధి పొందాలి అనే ఆలోచనా ధోరణితో పరిపాలించడం  నియంతృత్వ పోకడలకు అద్దం పడుతుందని   శాసనమండలి సభ్యులు  బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నారని నివారణకై ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రజలను ఎలా కాపాడాలి ఆలోచన లేకుండా రాజకీయ కక్షలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ పదవులు నిబంధనలకు విరుద్ధంగా ఆర్డినెన్స్ రూపంలో ఐదు సంవత్సరాల కాలాన్ని మూడు సంవత్సరాలకి మారుస్తూ జీవో ఇచ్చారనారు. తన మాట వినడం లేదనే కక్షతోనే ఎన్నికల వాయిదా వేసారని కుల ప్రస్తావనతో విమర్శలు చేశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న అధికారులను సస్పెండ్ చేస్తున్నారని మంచి ఆలోచన ఎక్కడా కనబడటం లేదనారు. కరోనా వైరస్ చాలా సాధారణమైన వ్యాధిలాగా బాధ్యతారహితంగా మాట్లాడుతూ వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ దేశాలు గడగడ లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చంద్రబాబు నాయుడిపై అవాకులు చవాకులు పేలుతున్నారనారు. హైదరాబాద్ నుంచి వస్తే 14 రోజులు కార్వానెంట్ లో ఉండాలని చెప్పిన మంత్రులు ముందుగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లినందున ముందు మంత్రిని హైదరాబాదులో కార్వానెంట్ లో 14 రోజులు ఉండే ఏర్పాటు చేయాలని  కోరారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా వైరస్ బాధితులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతి ఇంటికి సర్వే హై టెంపరేచర్ మిషన్ తో ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి వ్యాధి లక్షణాలు ఉంటే ఆస్పత్రికి తరలించాలని ఆవిధంగా చేయకుండా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలుతో వాలంటీర్లతో తూతూమంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులను మాత్రం చెల్లించి కమిషన్ కొట్టేసింది అన్నారు.


విజయవాడ నుంచి నడుచు కుంటూ...



విజయవాడ నుంచి నడుచు కుంటూ...

 

పాయకరావుపేటకు చేరుకున్న21మంది వలస కూలీలు

 

అర్ద రాత్రి కూలీల ఆకలి తీర్చి న ఎస్ ఐ విభూషణ్..

 

     

స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం , పెన్ పవర్ :  మజ్జి శ్రీనివాస మూర్తి 

 

తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ నుండి  21 మంది వలస కూలీలు ఓ లారీ లో కృష్ణా జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద దిగారు.  విజయవాడ నుండి గురువారం ఉదయం 11 గంటలకు బయలుదేరి నడుచు కుంటూ వలస కార్మికులు శుక్రవారం రాత్రి సమయానికి పాయకరావు పేట కు చేరుకున్నారు.హైదరాబాద్ నుండి ఏ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లోనూ పకడ్బందీ గా ఏర్పాట్లు లేకపోవడంతో వారు పాయాకరావుపేట వరకు వచ్చేసారు.జిల్లా ఎస్.పి అట్టాడ బాబుజీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసిన  విశాఖ  జిల్లా సరిహద్దు చెక్ పోస్టు వద్ద పకడ్బందీ గా విధులు నిర్వహిస్తున్న  పాయకరావుపేట ఎస్.ఐ విభూషణరావు వారి వివరాలు అడుగగా వారు శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి,నంది గామ మండలాల చుట్టుపక్కల  గ్రామాలకు వెళ్లాలని గత రెండు రోజులుగా నిద్ర హారాలు లేకుండా పొట్ట చేత పట్టుకొని మా స్వగ్రామాలకు వెళ్ళేందుకు విజయవాడ నుండి ఏ ఒక్క వాహనం అపకపోవడం వల్ల కాలి నడకన బయలు దేరి వస్తున్నామని తెలిపారు.  వారి ఇబ్బందులు తెలుసుకుని వారి ఆకలిని గమమించిన ఎస్.ఐ వారికి భోజనాల ఏర్పాట్ల కై సంబంధిత రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించక పోవడంతో మీడియా చొరవతో ఎస్.వి.ఎస్ దాబా యజమాని పులి బాబ్జీ ఆర్దిక సాయంతో స్థానిక ఎస్.ఐ విభూసనరావు మానవతాదృక్పదంతో భోజనాలు పెట్టించారు.

అదును చూసి కిరాయి పెంచేస్తారా..


 



 


అదును చూసి కిరాయి పెంచేస్తారా..
మాన‌వ‌తా దృక్ఫ‌థం లేదా ?
లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్‌పై జెసి ఆగ్ర‌హం
ర‌వాణా ఛార్జీలు త‌గ్గించాల‌ని ఆదేశం



 


బ్యూరో రిపోర్ట్ విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్: డేవిడ్ రాజ్ 


 


లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంతా ఇబ్బంది ప‌డుతున్నారు. పేద‌లు ఉపాధి కోల్పోయారు. ఇది మాన‌వ‌తా దృక్ఫ‌థాన్ని చూపించాల్సిన స‌మ‌యం. ఇలాంటి క‌ష్ట‌కాలంలో అదను చూసి కిరాయిలు పెంచేస్తారా ?...అని లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్‌కుమార్‌ మండిప‌డ్డారు. లారీల అద్దెలు పెంచేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌ల ర‌వాణా ఛార్జీల నియంత్ర‌ణ‌పై సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు, లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ల‌తో క‌లెక్ట‌రేట్‌లో శ‌నివారం జెసి స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లాలోని ఇత‌ర మండ‌లాల‌కు, ఇక్క‌డినుంచి ఇత‌ర జిల్లాల‌కు, ఇత‌ర రాష్ట్రాల‌కు స‌రుకుల ర‌వాణాకు ప్ర‌స్తుతం వ‌సూలు చేస్తున్న ర‌వాణా ఛార్జీలు, ఒక‌ప్ప‌టి ఛార్జీల‌ను బేరీజు వేశారు. ప్ర‌స్తుతం చాలా ఎక్కువ వ‌సూలు చేస్తున్నార‌ని లారీ ఓన‌ర్ల‌పై  తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. జిల్లాలో లాక్‌డౌన్ కార‌ణంగా నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు ధ‌ర‌లు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. అయితే లారీ కిరాయిలు పెంచేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వు తున్నాయ‌ని అన్నారు. గ‌తానికంటే ఒక్క రూపాయి కిరాయి పెంచినా స‌హించేది లేద‌ని, క‌ఠిన చర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. లారీ ఓన‌ర్స్‌తో, ఇత‌ర రాష్ట్రాల అసోసియేష‌న్ల‌తో మాట్లాడి, వారి ఇబ్బందులు తెలుసుకొని ప‌రిష్క‌రించాల‌ని ర‌వాణాశాఖ డిప్యుటీ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవిని, మార్కెటింగ్ ఎడి వైవి శ్యామ్‌కుమార్‌ను ఆదేశించారు. నిత్యావ‌స‌రాల ర‌వాణాకు రాష్ట్రంలో ఎక్క‌డా ఇబ్బంది లేద‌ని, ఎక్క‌డినుంచి ఎక్క‌డికైనా త‌ర‌లించ‌వ‌చ్చ‌ని జెసి స్ప‌ష్టం చేశారు. ఓఎస్‌డి జె.మోహ‌న‌రావు మాట్లాడుతూ నిత్యావ‌స‌రాల ర‌వాణా విష‌యంలో పోలీసుశాఖ ప‌రంగా ఎక్క‌డా ఇబ్బంది రాకుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా త‌న‌కు ఫిర్యాదు చేయాల‌ని ఆయ‌న కోరారు. ఈ స‌మావేశంలో వివిధ శాఖ‌ల అధికారులు, లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.


(ఇ ఎమ్ సి )ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ


 


ఇ తి హాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ (ఇ ఎమ్ సి )ఆధ్వర్యంలో 14 వార్డ్ లో నిత్యావసర సరుకులు పంపిణీ

 

 

ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ : మొహమ్మద్

 

 

14 వార్డు విద్యుత్ నగర్లో కోవిడ్ -19 నివారణ చర్యలలో బాగంగా   (ఈ ఎం సి )ఇ తి హాద్  ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ తరుపున 300 కిట్లు రైస్,షుగర్, పప్పు దినిసులు, చింతపండు, ఉప్పు   తతితర నిత్యావసర వస్తువులు మహ్మద్ ఫారుకి  ఆద్వర్యంలో  విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజు  చేతులు మీదుగా  పేదలకు  అందజేశారు ఈ కార్యక్రమంలో 14వార్డు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.అనిల్ కుమార్ రాజు,రియాజ్,జాఫర్,హాబీబ్,అక్బర్,జిలాని,అబీదూల్లా,నవాబ్ తదితరులు పాల్గొన్నారు

దినసరి కూలీలకు షౌకత్ ఆలీ  వితరణ


దినసరి కూలీలకు షౌకత్ ఆలీ  వితరణ


 


గాజువాక, పెన్ పవర్ : ఫిరోజ్


 


గాజువాక 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వార్డు అధ్యక్షుడు షౌకత్ అలి కరోనా వ్యాధి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగినది దీనివలన రోజువారి కూలీలు పని చేసుకున్న వాళ్ళకి పేద ప్రజలకు తెలుపు కార్డు లేనందువలన వార్డు అధ్యక్షుడు దృష్టికి తేవడం జరిగింది అలాంటి ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో శనివారం  బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశారు అదేవిధంగా కరొన నియంత్రణ కొరకు అవగాహన కల్పించడానికి పాంప్లెట్స్  పంచడం జరిగినది ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ కుప్పిలి సత్యనారాయణ, అబ్దుల్ సలీమ్, నియాజుద్దీన్, పిట్ట ప్రకాష్, కనకారావు ,వై వి కుమార్, రఫీ, సుమతి, జ్యోతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...