Followers

విశాఖ  నగరానికి..కరోనా బూచి...


విశాఖ  నగరానికి..కరోనా బూచి...



              మూడవ దశ రూపం లో  ప్రమాదం  పొంచి ఉందా?



  రైల్వే న్యూ కాలనీ, అక్కయ్య పాలెం, తాటిచెట్ల పాలెం లలో   హై ..ఎలర్ట్.....


 ఆ ఏరియాలలో  అన్నీ రహదారులు  అష్టదిగ్బంధనం.  ఎక్కడి కక్కడ బారికేడ్లు.

     ( స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం, పెన్ పవర్ : మజ్జి  శ్రీనివాస మూర్తి )



కరోనా  వైరస్ మహమ్మరి  మూడవ దశ భయం  విశాఖ నగరాన్ని  వెంటాడుతుందా? అన్న అనుమానాలు  తలెత్తుతున్నాయి  నగరంలో  రెడ్ జోన్లు  రహదారుల అష్టదిగ్బంధనం, బారికేడ్లు  ఏర్పాటు, అధికారుల  హెచ్చరికలు   వెరసి  నగరానికి   మలిదశ కరోనా  భూతం పొంచి ఉందని  అందుతున్నాయి. కరోనా  వైరస్  విశాఖను  తాకిన  మొదటి దశ లొ   నాలుగు పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి.  రెండవ దశ నిజాముద్దీన్ మత సదస్సుకు పోయి  వచ్చిన వారితో   మొదలైందని చెప్పవచ్చు .విశాఖలో  20  కేసులు  నమోదు కావడం,   మొదటి విడతలో  చేరిన  నలుగురు  డిస్చార్జ్ అయిన విషయం తెలిసిందే. వైరస్  నిర్ధారణ కావాలంటే  సుమారు 20 రోజులు  పడుతుంది.రెండో దశలో  వచ్చిన   కేసుల  కారణంగా   పాజిటివ్ కేసులు   నమోదు  అయ్యే పరిస్థితులు  కనపడుతున్నాయి. రైల్వే న్యూ కాలనీ,  తాటి చెట్ల పాలెం, అక్కయ్యపాలెంలలో  4 రోజుల క్రితం  ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో  అధికార యంత్రాంగం  అప్రమత్తమై ఆయా ఏరియాలను రెడ్  జోన్ గా ప్రకటించి  కట్టుదిట్టమైన ఏర్పాట్లు  చేస్తున్నారు. రోడ్లు అష్టదిగ్బంధనం  ఇంటర్ రోడ్లు పై  ఎక్కడికక్కడ  బారికేడ్లు  ఏర్పాటు చేశారు. జనం  బయటకు రాకుండా   ఇతరులు   ఈ  ప్రాంతాల్లోకి రాకుండా  ఆంక్షలు విధించారు.  మే 4 వరకు   రెడ్ జోన్ల ప్రాంతాల్లో నిఘా  ఉంటుందని  అంటున్నారు.  ఇంకా  కొన్ని  శాంపిల్స్  రిజల్ట్  అందాల్సి  ఉంది.  రెండవ దశ  పాజిటివ్  కేసులు  మూలంగా  ఇంకా  వైరస్ సోకిన  వారు  ఉండొచ్చనే  ప్రచారం  లేకపోలేదు. ప్రస్తుతం  జిల్లాలో  నెలకొన్న   పరిస్థితుల దృష్ట్యా  అధికారులు  అప్రమత్తమైన ట్లు   సమాచారం.  వ్యక్తిగత దూరం  పాటించాలని   స్వీయ   నిర్బంధంలో  ఉండాలని  అధికారులు మోర పెడుతుంటే  ప్రజలు  అంతగా పట్టించుకోవడం లేదు. ఉచిత పంపిణీ, రైతు బజార్ల లలో ఎక్కడ చూసినా  గుంపులు గుంపులుగా జనాలు  కనిపిస్తున్నారు. పోలీసులు  కట్టడి చేయాలని  ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు  పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో   వైరస్ లక్షణాలు  ఎక్కడ ఎలా  బయట పడతాయో అన్న గుబులు  వెంటాడుతుంది. కరోనా వైరస్  నివురుగప్పిన నిప్పులా  పొంచి ఉందని  సంకేతాలు  అందడంతో  అధికారులు  ఉలిక్కిపడుతున్నారు.  గత రాత్రి  రాష్ట్ర మంత్రులు  జిల్లా అధికారులతో  కరోనా  వైరస్  పై  సమీక్ష జరపడం  విశేషం. జిల్లాలో  మూడో దశలో  కరోనా బూచి  లేకుండా  చూడాలని  జిల్లా యంత్రాంగం   రోజుకో  చర్యలు  చేపడుతున్నారు. ఇదిలా ఉండగా  కత్తిపూడి నుంచి  వచ్చిన  కేసు  మినహా   నగరంలో నాలుగు రోజులుగా  ఇటువంటి కేసు నమోదు కాలేదు.లాక్ డౌన్ కొనసాగిం పు పై  సందిగ్ధత కొనసాగుతోంది. కర్ఫ్యూ ఎత్తివేస్తే  విచ్చలవిడిగా  జనసంచారం  మొదలైపోతుంది. మరుగున దాగిన కరోనా  వైరస్  ఎక్కడ పడగ  విప్పు తుందో అన్న భయం ఇటు జిల్లా అధికారుల్లో అటు వైద్యుల్లో లేకపోలేదు.


ఏరులై పారుతున్న నాటుసారా


ఏరులై పారుతున్న నాటుసారా


సీతానగరం,  పెన్ పవర్ : శివరామకృష్ణ


 కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో ప్రభుత్వ వైన్ షాపులు మూసి వేయడంతో మండల కేంద్రం నందు గల చెట్టుగళ్ల పేట నందు మద్యం దొరకక మందుబాబులు అల్లాడిపోతున్నారు. మద్యం కొరతను ఆసరాగా తీసుకుని కొందరు బడాబాబులు మరి కొంతమంది వ్యాపారులు నాటు సారా వ్యాపారంలో మునిగి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తద్వారా వ్యాపారులు కాసులు సంపాదిస్తే నాటు సారా తాగి ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మద్యం షాపులు లేనందున నాటు సారా కు డిమాండ్ పెరిగిపోవడంతో కుటీర పరిశ్రమగా తయారయ్యాయి. ఈ వ్యాపారానికి అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తుల ఆశీస్సులతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. పనులు లేకపోవడంతో మందు బాబులు నాటు సారా అమ్మకాలు వద్ద కల్తీ మద్యం సేవించి అనారోగ్యానికి గురవుతున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో నాటు సారా వ్యాపారిని అదుపులోకి తీసుకున్న ఓ పోలీస్ అధికారిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి వత్తిడి మేరకు వదిలేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం రహిత రాష్ట్రంగా ముఖ్యమంత్రి తీర్చిదిద్దాలని పని చేస్తుంటే పార్టీలో కొందరు తూట్లు పొడుస్తున్నారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నాటుసారా వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు.


ఘనంగా మహాత్మా  జ్యోతిరావు   పూలే జయంతి


ఘనంగా మహాత్మా  జ్యోతిరావు   పూలే జయంతి  :                 


జాతీయ అక్షరాస్యతా దినంగా పూలె జయంతి 


       జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్లాల్    


విజయనగరం, పెన్ పవార్ : డేవిడ్ రాజ్


     మహాత్మా జ్యోతి  రావు పూలే జయంతి  సందర్బంగ జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్లాల్   కలెక్టరేట్  వద్దనున్న  మహాత్మా పూలే  కాంశ విగ్రహానికి   శనివారం   పూల మాలలు వేసి     ఘనంగా నివాళులర్పించారు . పక్కనే  ఉన్న మహాత్మా పూలే సతీమణి  సావిత్రీ భాయ్ పూలే చిత్రపటానికి  పూలమాలంకరణ  గావించారు. అనంతరం  కలెక్టర్ మాట్లాడుతూ  మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి రోజును  జాతీయ  అక్షరాస్యతా దినంగా  జరుపుకోవాల్సిన  అవసరం  ఉందన్నారు  . ఈ సందర్బంగా  ఏ.పి బి.సి  సంక్షేమ  ఉపాధ్యాయ  శాఖ ప్రతినిధులు బి.సి భవన నిర్మాణం  చేపట్టాలని  కలెక్టర్ కు వినతి  పత్రాన్ని  అందించారు. కలెక్టర్ స్పందిస్తూ  బీసీ భవన నిర్మాణానికి  స్థలాన్ని  గుర్తించడం  జరిగిందని మంత్రివర్యులతో  చర్చించి  త్వరలో  పనులు ప్రారంభిస్తామని  అన్నారు .అదే  విధంగా  వచ్ఛే ఏడాది   పూలే  జయంతి లోపల  సావిత్రి భాయ్ పూలే విగ్రహాన్ని  కూడా  పక్కనే ఏర్పాటు చేస్తామని  తెలిపారు .  వసతి  గృహాలలో   సౌకర్యాలను   మెరుగు  పరచాలని  బిసి ప్రతినిధులు కోరగా సానుకూలంగా  స్పందిస్తూ  ప్రభుత్వానికి  సిఫార్సు  చేస్తామని తెలిపారు .         ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ శాఖాధికారి   డి.కీర్తి  , బిసి సొసైటీ  ఈ.డి నాగరాణి, జిల్లా అటవీ అధికారి లక్ష్మణ రావు, ఎస్.సి సొసైటీ ఈ.డి జగన్నాధ  రావు, బీసీ సంఘం  ప్రతినిధులు ముద్దాడ  మధు,  వెంకట రావు ,  రామారావు  ఉద్యోగ సంఘ  ప్రతినిధి పొట్నూరు  భాస్కర  రావు, బీసీ ఉపాధ్యాయ ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ వి. కనగ రాజ్ 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ వి. కనగరాజ్


విజయవాడ లో బాధ్యతల స్వీకరణ


స్టేట్ బ్యూరో చింతా వెంకట రెడ్డి, అమరావతి, పెన్ పవర్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగ రాజు నియమితులయ్యారు. 


 


 ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడేంఫుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఫినెన్సు ద్వారా నూతన చీఫ్ ఎలక్షన్ కమీషనర్  గా విశ్రాంత జస్టిస్ వి.కనగరాజ్ ని నియమించింది. రాష్ట్రం లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానితో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రసమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియను చేపట్టారు.ప్రభుత్వానికి రాష్ట్ర చీఫ్  ఎలక్షన్ కమీషనర్ కి మధ్య అనంతరం చోటు చేసుకుంది.నామినేషన్ ప్రక్రియ ముగిసి ఎన్నికలకు సిద్ధమయ్యే దశలో ఎస్.ఇ. సి నిమ్మగడ్డ రమేష్  ప్రభుత్వం తో సంప్రదించక పోగా స్వయం నిర్ణయాధికారాలు ఉన్నాయని విశేష అధికారాన్ని ఉపయోగించి కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీదుకున్నారు.దానితో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలు చేపట్టింది. ప్రభుత్వ చర్యని సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కోర్టు తలుపు తట్టారు.అనంతర పరిణామాలు అనేక మార్పులకు దారితీశాయి.కోర్టు ఆదేశాలతో ఆయన కొనసాగుతుండగా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చర్యలు చేపట్టింది.ఇంతవరకు ఐ దు సంవత్సరాలు ఉన్న పడవీకాలాన్ని మూడు సంవత్సరాలకి కుదిస్తూ గవర్నర్ ద్వారా ఆర్డినెస్ తెచ్చింది.దీని ప్రకారం నిమ్మగడ్డ రమేష్  పదవీకాలం మూడు సంవత్సరాలు ముగియడం తో ఆయనకి ఉద్వాసన చెప్పి ప్రభుత్వం  ఆయన స్తానం లో నూతన ఎస్.ఇ. సి గా విశ్రాంత జస్టిస్ వి.కనగరాజ్ ని నియమించింది .దానితో శనివారం జస్టిస్ కనగరాజ్ పదవీ బాధ్యతలు చేపట్టారు.కనగరాజ్ చెన్నయ్ లో జస్టిస్ గా విధులు నిర్వహించి పడవీవీరస్మన చేశారు.
   ఇదిలా ఉండగా వివాదాస్పద  ఎస్.ఇ. సి గా  ఉన్న నిమ్మగడ్డ రసమేష్ తాజా సంఘటన ,పరిణామాల పై కోర్టు మెట్లెక్కేందుకు సిద్జం అవుతున్నారు అనే సుమాచారం చర్చ నీయాంశం అయింది .రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను వైఎస్సార్ పార్టీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు,మేధావులు వ్యతిరేకిస్తున్నాయి.ప్రభుత్వం గవర్నర్ ద్వారా తెచ్చిన ఆర్ఫినెన్సు కెవలం భవిష్యత్ నియామకాలకు వర్తిస్తుందని ఇది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్.సి.ఇ కి వర్తించదని పలువురు అభిప్రాయ పడుచున్నారు.ప్రభుత్వ చర్యకి వ్యతిరేకంగా వ్యక్తిగతం గా నిమ్మగడ్డ రమేష్,కాంగ్రెస్,తెలుగు దేశం పార్టీలు కోర్టు తలుపులు తట్టనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.బిజెపి రాష్ట్ర పరిణామాలు,ఎడ్.ఇ. సి తొలగింపు నియామకం,గవర్నర్ ఆర్డినెన్స్ ని పునః సమీక్షించాలని విన్నపాలు చేస్తుంది.


 


 


అందరి సమిష్టి బాధ్యత


విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజు 


 


ప్రజల సహకారం, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లా లో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం అభినందించదగ్గ విషయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం నాడు పట్టణంలోని ఆర్ అండ్ బి రైతు బజార్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ ఆఫ్ విజయనగరం సంస్థ ఏర్పాటుచేసిన క్రిమిసంహారక (Dis Infection Tunnel) టన్నెల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వీరందరి సమన్వయంతో కరోనా నివారణకు తగు చర్యలు చేపడుతూ ప్రజల సహకారంతో జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అన్నారు. ఇదే స్ఫూర్తితో కరోనా ను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇటీవలే ఈశ్వర్ కౌశిక్ ఆధ్వర్యంలో రాజీవ్ స్టేడియంలో బిజినెస్ ఆఫ్ యూత్ విజయనగరం పేరిట క్రిమిసంహారక ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.భౌతిక దూరం పాటించడంవల్ల కరోనా నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీసులు, పాత్రికేయులు , పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు నిరుపమానం అని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట వంతమైన చర్యలు చేపట్టిందన్నారు. విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం లో జిల్లా అధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను కట్టడి చేయాలన్న ఆలోచనతో ఆయా మాధ్యమాల ద్వారా తమిళనాడులోని తిరుపూర్ లో క్రిమిసంహారక టన్నెల్ ను ఏర్పాటు చేయడాన్ని చూడడం జరిగిందని, మన విజయనగరంలో కూడా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో ఏర్పాటుకు మొట్టమొదటగా రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమన్నారు. రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి, మార్కెట్ కమిటీ ఏ డి శ్యాం కుమార్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వి ఎస్ ప్రసాద్, విన్నకోట ప్రభాకర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు కాళ్ల సునీల్, మొక ర గాంధీ, రౌండ్ టేబుల్ సంస్థ వైస్ చైర్మన్  


గూడేసా కార్తీ,క్, సంస్థ కార్యదర్శి ఆరి శెట్టి సుమంత్, , అవినాష్ గాంధీ తదితరులు ఉన్నారు...


ఘనంగా పూలే జన్మదిన వేడుకలు


ఘనంగా నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు......  


పెన్ పవర్,  ఉలవపాడు: ఓ. రాధకృష్ణ


 


మండల కేంద్రమైన ఉలవపాడు తాహసీల్దార్ కార్యాలయం నందు  టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ఎంపీడీవో టి రవి కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు శనివారం నాడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది అన్ని శాఖలకు చెందిన ఆఫీసర్స్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు మాట్లాడుతూ కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త బహుజనుల విద్యా ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మ జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న జన్మించారని ఆయన అనగారిన కులాల వర్ణ వర్గాల కోసం ఎంతో పాటు పడ్డారు అని అతను అంటరానితనాన్ని నిర్మూలించాలని కుల వ్యవస్థ నిర్మూలన తోపాటు మహిళో ద్దరణకు ఎంతో కృషి చేశారని కులాల వెనుకబాటే తనాన్ని తొలగించి అనగారిన కులాల వారందరికీ విద్యనందించారని వితంతువుల చేరదీశారని అంటరానితనాన్ని నిర్మూలించారు అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు ఎంపీడీవో టి రవి కుమార్, ఏపీ ఎం బెజ్జం రమేష్ బాబు, తాహసీల్దార్ పి మరియమ్మ, వ్యవసాయాధికారి మాల్యాద్రి, ఎస్ ఐ యం దేవకుమార్, కరేడు డాక్టర్ కె శ్రీనివాసరావు, టీచర్ సుదర్శి భాస్కర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది, వాలంటీర్లు పంచాయతీ సిబ్బంది వైఎస్ఆర్ సీపీ నాయకులు మాజీ జడ్పీటిసి కోటు కోటిలింగం రామాల సింగారెడ్డి పజిల్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.


మహత్మ జ్యోతీరావ్ పూలేకి నివాళ్ళు అర్పించిన దామా సుబ్బరావు


 


మహత్మ జ్యోతీరావ్ పూలేకి నివాళు అర్పించారు దామా సుబ్బరావు


 


గాజువాక, పెన్ పవర్ : ఫిరోజ్



మహత్మ జ్యోతీరావ్ ఫూలే 123వ జయంతి సందర్భంగా కూర్మన్నపాలెం జంక్షన్ లో గౌ. శ్రీ భారతరత్న డా. బిఆర్ . అంబెద్కర్ విగ్రహంకి, మహత్మ జ్యోతీరావ్ ఫూలే విగ్రహంకి పూల మాలవేసి నివాళు అర్పించారు వైసీపీ రాష్ట్ర నాయకులు దామా సుబ్బరావు, మహత్మ జ్యోతీరావ్ ఫూలే ఆశయాలను యువత ముందుకు తీసుకు వెళ్ళాలి అని దామా సుబ్బరావు పిలుపునిచ్చారు, బడుగు బలహీను వర్గల ఆశజ్యోతీ డా.బిఆర్ అంబెద్కర్ , మహత్మ  జ్యోతీరావ్ ఫూలే అని దామా అన్నారు, అనంతరం సాయినగర్ , యాతపాలెంలో పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు దామా పంపిణి చేసారు,రాజీవ్ నగర్, రాసలమ్మ కాలనీలో బ్లీచింగ్ జల్లారు వైసీపీ సిఈసి నాయకులు దామా సుబ్బరావు, కార్యక్రమంలో మాటూరి శ్రీనివాస్ , యోహన్ , సాల్మాన్ రాజు, 86వ వార్డు వైసీపీ ప్రెసిడెంట్ మెడికల్ బాబు, చేగొండి శ్రీను, బార్ సాయి మురళి మోహన్ , శ్రీనివాసులు,  రాము నాయుడు, బలిరెడ్డి నాగేశ్వర్రావు, సుహసిని తదితరులు పాల్గున్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...