Followers

స్టూడెంట్స్ కు సహాయం చేసిన జన సైనికులు


 


మధురవాడ, పెన్ పవర్: సునీల్


 


కోవిద్ 19 లాక్ డౌన్ కారణంగా, విశాఖ జిల్లా పాడేరు కు చెందిన కొంతమంది యువకులు ఇంజనీరింగ్ పూర్తి చేసి మారికవలస కాలనీలో ఉంటూ బ్యాంక్ ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఇక్కడ ఉండి పోవడం  వల్ల వారి గురించి జనసేన పార్టీ అరకు పార్లమెంటరీ ఇంచార్జ్  వి. గంగులయ్య సూచన మేరకు, భీమిలి నియోజకవర్గo  ఐదవ  వార్డు జనసేన పార్టీ నాయకురాలు యడ్ల లక్ష్మీ  ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకుల మరియు ఆర్థిక సహాయము చేయడం జరిగింది., ఈ కార్యక్రమంలో ఐదవ  వార్డ్ జనసేన సైనికులు యడ్ల గణేష్ యాదవ్  నరేష్  పి ఎస్ పి కెె., శశి పాల్గొన్నారు, ఓట్లు కోసం చేసే సేవ కాదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బాటలో నాడుస్తాం, అరుకు వారికి ఇక్కడ ఓట్లు లేవు అని ఎవ్వరు వాళ్ళకి అదుకోలేదు, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడంలో జనసేన ముందు ఉంటుందని అన్నారు.


తోటి వారికి సాయపడాలి


తోటి వారికి సాయపడాలి..      


 


విజయనగరం , పెన్ పవర్ : డేవిడ్ రాజు


ప్రతి ఒక్కరు తోటివారికి సాయం చేయాలని వైసీపీ నాయకులు కెల్ల త్రినాధ్, కరుమజ్జి అప్పలనాయుడు అన్నారు. శనివారం మండలంలోని దుప్పాడ గ్రామంలో ఇంటింటికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం చేసి తోటి వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్మి, భాస్కర్ నాయుడు,నేవి రాజు,బొబ్బది గురునాయుడు ,యూత్ పాల్గొన్నారు.


రెడ్ జోన్ ప్రాంతం ఆకస్మిక తనిఖీ



 







పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఐపీఎస్   ఏలూరు  పట్టణము నందు కత్తేపు విధి లో  ఉన్న రెడ్ జోన్ ప్రాంతామును  ఆకస్మికంగా తనిఖీ

 

 

పెన్ పవర్, పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ : రాము 

 

 

 

 

ఈరోజు అనగా 10.4.2020 వ తేదీ నాడు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఐపీఎస్  వారు ఏలూరు  పట్టణము నందు కత్తేపు విధి లో  ఉన్న రెడ్ జోన్ ప్రాంతామును  ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు. సదరు రెడ్ జోన్ ప్రాంతాలలో పికెట్ ల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు సలహాలు తెలియజేస్తూ, రెడ్ జోన్ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి  ప్రజలు లు నిత్యావసర వస్తువులకు గాని మరి ఏ ఇతర అవసరాలు గాని రెడ్ జోన్ ప్రాంతము నుండి బయటికి రాకూడదని, సదరు రెడ్ జోన్ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు వారికి అవసరమయ్యే  అన్ని విషయాలలో ప్రజలకు  డోర్ డెలివరీ ద్వారా, లేదా వాలంటరీ ల ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తారని ఎవరికైనా ఏవిధము అయినా అత్యవసర పరిస్థితులు ఏర్ప డితే  helpline కు తెలియజేయాలని. రెడ్ జోన్ ప్రాంతాలకు వెళ్ళే రహదారులన్నీ దిగ్బంధనం చేయాలని బయటికి వెళ్ళుటకు లోపలకి వచ్చుటకు ఒకటే మార్గాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ. ప్రజలందరూ నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసే నిమిత్తము గా ఉదయం 6 గంటలనుండి ఉదయం 9 గంటల వరకు ఇంటికి ఒకరు చొప్పున బయటకు వచ్చి నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసే సమయంలో మనిషికి మనిషికి రెండు మీటర్ల మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తూ వస్తువులను కొనుగోలు చేసిన వెంటనే తమ తమ ఇళ్ళకు వెళ్లాలని. ముఖ్యంగా ప్రజల గమనించవలసినది ఏమనగా ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా  మాస్క్ లు ధరించాలి అని జిల్లా ఎస్పీ  తెలియజేసినారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియమ నిబంధనలు ది 23. 3 .2020 వ తేదీ నుండి ఇప్పటి వరకూ అనగా 09.04.2020 వ తేదీ  వరకు లాక్ డౌన్ సందర్భంగా నియమ నిబంధనలు అతిక్రమించిన 915 మంది పై ఐపిసి కేసులు నమోదు పరిచినట్లు 4025 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు వారి వద్ద నుండి   11,67,228/-,రూ.లు స్వా దినపరుచుకొన్నట్లు.  1193 వాహనములను స్వాధీనం చేసుకున్నట్లు 11,677ఎం.వి. యాక్ట్ ప్రకారం కేసు లు నమోదు పర్చి  58,38,500/- రూ. అపరాధ రుసుము విధించినట్లు, 41  కోడిపుంజులను 40  కోడి కత్తులను, 403 లిక్కర్ బాటిల్ అను 492 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్న నట్లు గా తెలియజేసినారు.


 








 


 






 

 




 




 


 



 



ఆదివాసీలకు నిత్యవసర వస్తువులు అందజేత.


ఆదివాసీలకు నిత్యవసర వస్తువులు అందజేత.


 



ఎటపాక, పెన్ పవర్ : వెంకటేశ్వర్లు 


 


ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను బట్టి  ఎటపాక మండల పరిధిలోని విస్సాపురం  పంచాయతీలో గల సంగంపాడు గ్రామాంలోని ఆదివాసీలకు  ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేకపోవడంతో రెవ.పా.కొమ్ము అంతోని ఫాదర్  ఆధ్వర్యంలో ఆదివాసీలకు నిత్యవసర వస్తువులైన కూరగాయలను వాళ్ల గ్రామాలకు వెళ్ళి అంతోనీ ఫాదర్ చేతుల మీదుగా పంపిణి చేశారు.ఈ సందర్భంగా రేవ.పా.కొమ్ము అంతోని ఫాదర్ మాట్లాడుతూ అందరూ వ్యక్తిగత శుభ్రత,వ్యక్తిగత క్రమశిక్షణ,సామాజిక దూరం పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రంబాల.నాగేశ్వరరావు,గల్లా.శివ,బద్దెపూడి.జాన్,డాక్టర్.శ్రీను,రంబాల.రాహుల్,కార్తీక్,బొప్పని.నరేష్ ,గ్రామ వాలంటరీ,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .


తెలంగాణ మద్యం ఆంధ్రలో పట్టివేత


 






తెలంగాణ మద్యం ఆంధ్రలో పట్టివేత


ముగ్గురు వ్యక్తులు అరెస్టు


ఎటపాక-పెన్ పవర్ : వెంకటేశ్వర్లు 

 

తెలంగాణ రాష్టానికి చెందిన మద్యాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తూ ఆంధ్రలో పట్టుబడ్డ ఘటన శుక్రవారం తెల్లవారుజామున కన్నాయిగూడెంగ్రామంలోచోటుచేసుకుంది,వివరాల్లోకి వెళ్తే...చింతూరు డిఎస్పీ. శ్రీ ఖాదర్ భాషా ఆదేశాల మేరకు మండల పరిధిలో ఉన్న అన్ని చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం గ్రామ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో టీ ఎస్28 బి 9244 నెంబర్ గల కారులో 56 తెలంగాణా రాష్ట్ర మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించామని ఎటపాక సిఐ.గీతా రామకృష్ణ తెలిపారు,ఈ తనిఖీల్లో తెలంగాణా రాష్ట్రానికి చెందిన పెద్దిరాజు, సంతోష్, సాంబిరెడ్డిలను అరెస్టుచేసి ఆరా తీయగా చర్ల నుండి భద్రాచలం తరలిస్తున్నామని తెలిపారు,అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై జ్వాలా సాగర్,చినబాబులు తెలిపారు.

 




 

 


 



 



అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.



అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.

 

 

 ఏలేశ్వరం, పెన్ పవర్ : మాధవ్ 

 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సేవలు అభినందనీయమని ఏలేశ్వరం ఏ ఎస్ ఐ ఎం. స్వామి నాయుడు పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో పేద ప్రజలు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో   అమ్మ చారిటబుల్ ట్రస్ట్  గత  20రోజులుగా అన్నదానం, నిత్యావసర సరుకుల పంపిణీ చేసి  పేద ప్రజల ఆకలి తీర్చడం అభినందించాల్సిన విషయం అన్నారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ట్రస్ట్ సభ్యులు లింగంపర్తి, ఏలేశ్వరం , యర్రవరం , ప్రత్తిపాడు లో పేదవారికి యాచకులకు భోజనం మరియు వాటర్ బాటిల్స్ పంచిపెట్టారు.  ఏలేశ్వరం ఏపీఎస్ ఆర్టిసి కార్మికులు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తమ వంతు సేవ చేస్తున్న కార్మికులకు వాటర్ బాటిల్స్ ,టీ , ట్రస్ట్ నుండి పంచి పెట్టారు. నర్సీపట్నం రోడ్ లో దుర్గాదేవి గుడి దగ్గర ఉన్న రిక్షా కార్మికులకు ఐదు కేజీల బియ్యం నూనె,పప్పులు, నిత్యవసర వస్తువులు మరియు  ఏ ఆధారమూ లేని నిరుపేదలైన కొంతమందికి పది కేజీల బియ్యం, నూనె ,పప్పులు నిత్యవసర వస్తువులు ఈరోజు లింగంపర్తి రోడ్డు లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ట్రస్ట్ చైర్మన్ మాసరి మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో వితరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొవ్వ శ్రీరామచంద్రమూర్తి , నూకల సుబ్రమణ్యం, పలివేల లవ రాజు తదితరులు ఉన్నారు

కూరగాయలు శానిటేషన్ కిట్లు పంపిణీ


 


లాక్ డౌన్లో ఉన్న పేద కుటుంబాలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్థిక సహాయంతో కూరగాయలు శానిటేషన్ కిట్లు పంపిణీ చేశారు

 

 

 

పెన్ పవర్ గోపాలపురం : రాము 

 

 

 కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదల పట్ల మేము సైతం అంటూ మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు సెయింట్  జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం తమ దాతృత్వాన్ని చాటారు. శుక్రవారం మండలంలోని పెద్దాపురం వెల్ల చింతగూడెం గ్రామాలలో 200 పేద కుటుంబాలకు కూరగాయల కిట్లను అందజేశారు. అదేవిధంగా గ్రామ సచివాలయం పరిధిలోని వేల చింతగూడెం పెద్దాపురం గ్రామ వాలంటీర్లకు శానిటైజరులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా గోపాలపురం మండలం సంస్థ అధ్యక్షులు మురళి, నెల్ల చంద్రశేఖర్, పద్మ సాయి ఫైనాన్స్ బాబ్జి, గుబ్బ లక్ష్మణరావు, మడిచర్ల గోపి, సెయింట్ జోసెఫ్ సిబ్బంది సిస్టర్ జూలియా,సిస్టర్ జానెట్ తదితరులు పాల్గొన్నారు.

 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...