Followers

1200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ



1200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

 

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి -  జడ్పీటీసీ ఎమ్. రవికుమార్ రెడ్డి

 

  వేంపల్లె/కడప జిల్లా, పెన్ పవర్ : జీవన్ 

 

 

మహమ్మారి కరోనా వైరస్ నివారణలో భాగంగా శుక్రవారం వేంపల్లెలోని బిడాలమిట్ట, కాలేజీ రోడ్డు ఉన్న పేద కుటుంబాలకు సుమారు 1200 కుటుంబాలకు కూరగాయలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయున జడ్పీటీసీ ఎమ్. రవి కుమార్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ షబ్బీర్ వలీ మరియు ఎస్సై సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీటీసీ హబిబుల్లా (ఎమ్. హెచ్), మైనారిటీ కన్వీనర్ మునీర్ బాషా ,కటికచంద్ర తదితరులు ఇంటింటికీ వెళ్లి సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎంపిటిసి హబిబుల్లా (ఎమ్.హెచ్) ను నాయకులు, ప్రజలు అభినందించారు. అలాగే తన సొంత ఆర్థిక సహాయంతో పేదలకు కూరగాయలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత పేద ప్రజలకు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్డయ్య, షాదిఖాన ప్రెసిడెంట్ బిఎస్ షేక్షావలి, ఎంపీటీసీ బాబా షరీఫ్, కెకె, భారతీ, రాఘవయ్య, లిమ్రా సభ్యులు మదార్ షా వలి, నాయబ్, బజాజ్ షోరూం అధినేత సమీర్, కాలేషా, అక్రం, ముస్తాక్, వాలంటీర్ పఠాన్ గౌస్ మరియు తదితర లిమ్రా సోషెటీ సభ్యులు పాల్గొన్నారు.

.చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి





చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

 

పెన్ పవర్;కడప జిల్లా

 

జిల్లా లోని చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లి కార్జున అన్నారు, శుక్రవారం చేనేత ఐక్య వేదిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నందు చేనేత వ్రుత్తి పై ప్రత్యక్షంగా 2లక్షల కుటుంబాలు ,పరోక్షంగా ఒక లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారు, కోవిడ్19 కరోనా వైరస్ వలన దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా లాక్ డౌన్ పాటిస్తున్నారు, చేనేత కుటీర పరిశ్రమ వ్యక్తుల సమూహం తో పని చేస్తారు అని ప్రభుత్వం నోటీసులు ఇచ్చి పని ఆపేయాలనీ చెప్పింది, దీని వలన లక్షల కుటుంబాలు పని లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, అలాగే చేనేత అనుబంధ వ్రుత్తులు అయిన నూలు వడికే వారికి లాక్ డౌన్ కారణంగా నూలు సరఫరా చేసే వాహనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మగ్గం మీద నేసిన వస్త్రాలు రవాణా వ్యవస్థ ఆగిన కారణంగా విక్రయించడానికి వీలు లేకుండా పోయింది, కాబట్టి చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వం కొని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, పని లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి చేనేత వ్రుత్తుల కుటుంబాలకు ఐదు వేల రూపాయల ను జీవన భ్రృతి కొరకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుచున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్య వేదిక జాతీయ కన్వీనర్  అవ్వారు మల్లి కార్జున మరియు ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు.

 


 

 



 

ప్రజలకు సేవచేస్తుంటే  అడ్డుకోవడం తగదు


ప్రజలకు సేవచేస్తుంటే  అడ్డుకోవడం తగదు

 

అనకాపల్లి, పెన్ పవర్ : వానపల్లి రమణ 

 

 విపత్కర పరిస్థితుల్లో చేతనైతే ప్రజలకు సేవ చేయాలి కానీ రాజకీయ ముసుగులో అధికార పార్టీ  తాము చేస్తున్న సేవా కార్యక్రమాలు ను  అడ్డుకోవడం తగదని మాజీ శాసనసభ్యులు,నియోజకవర్గ ఇంచార్జ్  పీలా గోవింద సత్యనారాయణ  అన్నారు. ప్రజలకు మంచి జరగడం వైకాపా నాయకులకి ఇష్టం లేదని అన్నారు. అనకాపల్లి లో  అధిక పార్టీకి ఒకలాగా, ప్రతి పక్ష పార్టీలతో ఒకలాగా  అధికారులు వ్యవహరించడం దారుణం అని అన్నారు. వైరస్ వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం విఫలం కావడంతోనే తాము రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సొంత డబ్బులతో  పట్టణంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తుంటే,వారిని అడ్డుకోవడంతో శుక్రవారం  ఆర్ డి ఓ, జోనల్ కమిషనర్, సర్కిల్ఇన్స్పెక్టర్ లను కలిసి ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. అధికారులు సైతం అధికార పార్టీవారి అడుగులకు మడుగులొత్తడం సమాంజసం కాదని అన్నారు."అధికార పార్టీ నేతల వొత్తిళ్ల మేరకే" అధికారులు ఇలా తాము చేస్తున్న  ప్రజా ఆరోగ్యహిత కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మళ్ళ సురేంద్ర,  జోగి నాయుడు, బొద్దపు ప్రసాద్, అర్రెపు కామేష్, కాయల మురళి, పొలారపు త్రినాధ్,సబ్బవరపు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

14వ రోజు చేరిన భోజన ప్యాకెట్లు పంపిణీ.


 


14వ రోజు చేరిన భోజన ప్యాకెట్లు పంపిణీ.

 

గోకవరం, పెన్ పవర్: శివరామ కృష్ణ 

 

 

అన్నదాత స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగముగా కరోనా వైరస్ ప్రభావం వలన, భోజన ప్యాకెట్ల పంపిణీ 14 వ రోజుకు చేరిందిఅని కరాసు శివప్రసాద్ తెలిపారు.గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామములో (అన్నదాత) శివప్రసాద్ లాక్ డౌన్ కారణంగా ఆహారానికి ఇబ్బంది పడే, వృద్ధులకు, నిరుపేదలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కిట్లు భోజనం ప్యాకెట్లు పంచిపెట్టారు. జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వీర్రాజు ఆదేశానుసారం జరిగింది ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి  వెంకట రామకృష్ణ రావు మాస్టారు  " ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.పురం శెట్టి సత్య రమేష్, పి. యుగంధర్ మరియు వాసంశెట్టి వెంకట సత్య రామారావు, కొత్త కృష్ణ బ్రహ్మాజీ రావు, K.మహేష్ పాల్గొన్నారు, అచ్యుతాపురం గ్రామం నాయకులైన మాదే టి శ్రీను, ఎం శ్రీనివాసులు, పోసిబాబు, కె వీరబాబు, ఎల్ వెంకన్న, మరియు సైని బాలు సోమరాజు, అప్పికొండ అప్పారావు, మాగాపు దుర్గ, చింతల బాలరాజు, దువా ని సీత, భక్తుల రాముడు, పాల్గొన్నారు.

జన సే(వ)న ఆధ్వర్యంలో లో  మాస్కులు గ్లౌజులు కూరగాయలు పంపిణీ.


జన సే(వ)న ఆధ్వర్యంలో లో  మాస్కులు గ్లౌజులు కూరగాయలు పంపిణీ.


 


 




      ఆరిలోవ, పెన్ పవర్ : భాస్కర్ కుమార్ 
 

 

తూర్పు నియోజకవర్గం 13వ వార్డు,  శ్రీకాంత్ నగర్ లో జనసేన ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు. పేదలకు. మాస్కులు. గ్లవుస్ లు. కూరగాయలు, సుమారు 300 మందికి జనసేన అభ్యర్థిని నీలి వెంకట భాను.  ఆరిలోవ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ మూర్తి. ఎస్ఐ గోపాల్ రావు. చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  సి ఐ లక్ష్మణ మూర్తి. మాట్లతూ కరోనా మహమారి భారీన  పడకుండా  ప్రతి ఒక్కరూ రూ తగిన జాగ్రత్తలు తీసుకుని, ఇంటికే పరిమితం కావాలని,  వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం పాటించాలని ఇలాంటి సేవ కార్యక్రమం ద్వారా దాతలు ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని.  సేవా కార్యక్రమాలు  నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో నీలి పైడ్రాజు. నీలి శ్రీరామ్మూర్తి. అర్జున్ రావు. పొట్టి అప్పారావు. తదితరులు పాల్గొన్నారు.


 

 



 

ముగ్గురమ్మలకు జేజేలు




కరోనా పై యుద్దంలో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టిన  ముగ్గురమ్మలకు జేజేలు


 


న్యూస్ డెస్క్, పెన్ పవర్ 


 


అగ్రదేశాల వెన్ను విరిచిన కరోనా భారతదేశంలో తలవంచడానికి ముగ్గురు మహిళా అధికారులు కీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల నుండి ఆఫీసు లోనే నివాసముంటూ, కుటుంబాలను కూడా కలవలేకపోయిన
ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమయ్యారు. వీరే  ప్రీతి సుడాన్, డాక్టర్‌ నివేదిత గుప్త, సైంటిస్ట్ 
రేణు స్వరూప్.  ప్రీతి సుడాన్ - హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ  ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ఇప్పుడు కరోనా యుద్ధంలో నరేంద్ర మోడీ గారితో ప్రత్యక్షంగా పని చేస్తూ మన్ననలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయుల ను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. .


డాక్టర్ నివేదిత గుప్త - 
స్వయంగా ఏం బి బి ఎస్  అయిన ఈమె మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్‌డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో ఈమె కృషి ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రపందేశాలను సమన్వయం చేస్తున్నారు. 


 డాక్టర్ రేణు స్వరూప్ - జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్‌డీ చేసిన  ఈ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త నరేంద్ర మోడీ గారి శాస్త్ర సలహాదారుల కమిటీలో సేవలందిస్తున్నారు. కరోనా పై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. ఈమె 2001, 2007, 2015 లో రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు  ఎన్నో ప్రశంసలు పొందాయి.


వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో మొదటి వారు 
లవ్ అగర్వాల్. ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ సాధించిన ఈ 48 ఏళ్ల యోగా నిపుణుడు విశాఖ జిల్లా కలెక్టర్ గా,  ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమీషనర్ గా పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రతి రోజు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తున్నారు. అనేక వినూత్న ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఆదర్శమవుతున్నారు. మొబైల్ ఫోన్ల కరోనా కాలర్ ట్యూన్, కంటైన్మెంట్ స్ట్రాటజీ, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, క్లస్టర్ ఔట్ బ్రేక్ స్ట్రాటజీలు ఈయన రూపొందించినవే. మరో వ్యక్తి డాక్టర్ జితేంద్ శర్మ. సత్య సాయి బాబాకు అత్యంత విశ్వాసపాత్రుడు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గా పని చేసిన  ఈయనను మళ్ళీ ఏపీ మెడ్ టెక్ ఎం.డీ గా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అధిపతిగా నియమించారు. ఈయన పని ప్రారంభించిన కొద్ది రోజులలోనే దేశంలోనే మొట్టమొదటి గా రాపిడ్ టస్ట్ కిట్స్ ను తయారు చేయిస్తున్నారు. ఇవి కేవలం యాభై నిముషాలలో కరోనాను నిర్ధారిస్తాయి. ప్రస్తుతం రోజుకు రెండు వేల కిట్లు తయారవుతుండగా వచ్చే వారానికి ఇది ఇరవై ఐదు వేలకు చేరుతుందని అంచనా. మార్చి 31నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కేవలం 148 వెంటిలేటర్లు ఉండగా, జితేంద్ర శర్మ గారి నేతృత్వంలో నెలకు మూడు వేల వెంటిలేటర్లు తయారుచేయడానికి కృషి జరుగుతోంది. దీనితో ఆసియా మొత్తానికి ఈయన కృషి ఫలితాలు అందనున్నాయి.


నేకూరి  రాజేష్ సేవలు  అభినందనీయం 



నేకూరి  రాజేష్ సేవలు  అభినందనీయం 

 

ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

 

రాజేష్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

 

రావులపాలెం, పెన్ పవర్: కోణాల వెంకట రావు 

 

ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని  నిరూపిస్తూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ దృష్ట్యా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న  నిరుపేద ప్రజలకు   మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు, సంస్థలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహాయపడడం ‌ అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు ,రాష్ట్ర పియుసి చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో  నిత్యావసర వస్తువులు దొరకక  పడుతున్న ఇబ్బందులు గుర్తించిన రావులపాలెం గ్రామానికి చెందిన నేకూరి రాజేష్, ఆయన కుటుంబ సభ్యులు దొండపాటి పనసయ్య,దొండపాటి వీర్రాజు లు తమ దాతృత్వం చాటరు. శుక్రవారం రావులపాలెం గ్రామంలోని సుమారు మూడు వందల కుటుంబాలకు  నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని  ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు రాజేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు అందజేయడం అభినందనీయమన్నారు. నేకూరి రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.  లాక్ డౌన్ నేపధ్యంలో  ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పంచారు.ఈ కార్యక్రమంలో  గొలుగూరి మునిరెడ్డి, సాకా ప్రసన్న కుమార్,కోట చెల్లయ్య,పడాల పరమేశ్వర రెడ్డి,పడాల వెంకట రెడ్డి, కప్పల వరప్రసాద్, మాకా రాజేంద్రన్ , యార్లగడ్డ జగజ్జీవన్ రావు, నేకూరి మల్లేశ్వరరావు, వంగలపూడి బాబూరావు, యార్లగడ్డ భాస్కర రావు, యార్లగడ్డ చిట్టిబాబు, గెల్లారాజు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...