Followers

జన సే(వ)న ఆధ్వర్యంలో లో  మాస్కులు గ్లౌజులు కూరగాయలు పంపిణీ.


జన సే(వ)న ఆధ్వర్యంలో లో  మాస్కులు గ్లౌజులు కూరగాయలు పంపిణీ.


 


 




      ఆరిలోవ, పెన్ పవర్ : భాస్కర్ కుమార్ 
 

 

తూర్పు నియోజకవర్గం 13వ వార్డు,  శ్రీకాంత్ నగర్ లో జనసేన ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు. పేదలకు. మాస్కులు. గ్లవుస్ లు. కూరగాయలు, సుమారు 300 మందికి జనసేన అభ్యర్థిని నీలి వెంకట భాను.  ఆరిలోవ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ మూర్తి. ఎస్ఐ గోపాల్ రావు. చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  సి ఐ లక్ష్మణ మూర్తి. మాట్లతూ కరోనా మహమారి భారీన  పడకుండా  ప్రతి ఒక్కరూ రూ తగిన జాగ్రత్తలు తీసుకుని, ఇంటికే పరిమితం కావాలని,  వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం పాటించాలని ఇలాంటి సేవ కార్యక్రమం ద్వారా దాతలు ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని.  సేవా కార్యక్రమాలు  నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో నీలి పైడ్రాజు. నీలి శ్రీరామ్మూర్తి. అర్జున్ రావు. పొట్టి అప్పారావు. తదితరులు పాల్గొన్నారు.


 

 



 

ముగ్గురమ్మలకు జేజేలు




కరోనా పై యుద్దంలో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టిన  ముగ్గురమ్మలకు జేజేలు


 


న్యూస్ డెస్క్, పెన్ పవర్ 


 


అగ్రదేశాల వెన్ను విరిచిన కరోనా భారతదేశంలో తలవంచడానికి ముగ్గురు మహిళా అధికారులు కీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల నుండి ఆఫీసు లోనే నివాసముంటూ, కుటుంబాలను కూడా కలవలేకపోయిన
ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమయ్యారు. వీరే  ప్రీతి సుడాన్, డాక్టర్‌ నివేదిత గుప్త, సైంటిస్ట్ 
రేణు స్వరూప్.  ప్రీతి సుడాన్ - హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ  ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ఇప్పుడు కరోనా యుద్ధంలో నరేంద్ర మోడీ గారితో ప్రత్యక్షంగా పని చేస్తూ మన్ననలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయుల ను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. .


డాక్టర్ నివేదిత గుప్త - 
స్వయంగా ఏం బి బి ఎస్  అయిన ఈమె మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్‌డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో ఈమె కృషి ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రపందేశాలను సమన్వయం చేస్తున్నారు. 


 డాక్టర్ రేణు స్వరూప్ - జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్‌డీ చేసిన  ఈ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త నరేంద్ర మోడీ గారి శాస్త్ర సలహాదారుల కమిటీలో సేవలందిస్తున్నారు. కరోనా పై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. ఈమె 2001, 2007, 2015 లో రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు  ఎన్నో ప్రశంసలు పొందాయి.


వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో మొదటి వారు 
లవ్ అగర్వాల్. ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ సాధించిన ఈ 48 ఏళ్ల యోగా నిపుణుడు విశాఖ జిల్లా కలెక్టర్ గా,  ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమీషనర్ గా పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రతి రోజు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తున్నారు. అనేక వినూత్న ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఆదర్శమవుతున్నారు. మొబైల్ ఫోన్ల కరోనా కాలర్ ట్యూన్, కంటైన్మెంట్ స్ట్రాటజీ, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, క్లస్టర్ ఔట్ బ్రేక్ స్ట్రాటజీలు ఈయన రూపొందించినవే. మరో వ్యక్తి డాక్టర్ జితేంద్ శర్మ. సత్య సాయి బాబాకు అత్యంత విశ్వాసపాత్రుడు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గా పని చేసిన  ఈయనను మళ్ళీ ఏపీ మెడ్ టెక్ ఎం.డీ గా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అధిపతిగా నియమించారు. ఈయన పని ప్రారంభించిన కొద్ది రోజులలోనే దేశంలోనే మొట్టమొదటి గా రాపిడ్ టస్ట్ కిట్స్ ను తయారు చేయిస్తున్నారు. ఇవి కేవలం యాభై నిముషాలలో కరోనాను నిర్ధారిస్తాయి. ప్రస్తుతం రోజుకు రెండు వేల కిట్లు తయారవుతుండగా వచ్చే వారానికి ఇది ఇరవై ఐదు వేలకు చేరుతుందని అంచనా. మార్చి 31నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కేవలం 148 వెంటిలేటర్లు ఉండగా, జితేంద్ర శర్మ గారి నేతృత్వంలో నెలకు మూడు వేల వెంటిలేటర్లు తయారుచేయడానికి కృషి జరుగుతోంది. దీనితో ఆసియా మొత్తానికి ఈయన కృషి ఫలితాలు అందనున్నాయి.


నేకూరి  రాజేష్ సేవలు  అభినందనీయం 



నేకూరి  రాజేష్ సేవలు  అభినందనీయం 

 

ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

 

రాజేష్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

 

రావులపాలెం, పెన్ పవర్: కోణాల వెంకట రావు 

 

ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని  నిరూపిస్తూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ దృష్ట్యా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న  నిరుపేద ప్రజలకు   మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు, సంస్థలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహాయపడడం ‌ అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు ,రాష్ట్ర పియుసి చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో  నిత్యావసర వస్తువులు దొరకక  పడుతున్న ఇబ్బందులు గుర్తించిన రావులపాలెం గ్రామానికి చెందిన నేకూరి రాజేష్, ఆయన కుటుంబ సభ్యులు దొండపాటి పనసయ్య,దొండపాటి వీర్రాజు లు తమ దాతృత్వం చాటరు. శుక్రవారం రావులపాలెం గ్రామంలోని సుమారు మూడు వందల కుటుంబాలకు  నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని  ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు రాజేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు అందజేయడం అభినందనీయమన్నారు. నేకూరి రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.  లాక్ డౌన్ నేపధ్యంలో  ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పంచారు.ఈ కార్యక్రమంలో  గొలుగూరి మునిరెడ్డి, సాకా ప్రసన్న కుమార్,కోట చెల్లయ్య,పడాల పరమేశ్వర రెడ్డి,పడాల వెంకట రెడ్డి, కప్పల వరప్రసాద్, మాకా రాజేంద్రన్ , యార్లగడ్డ జగజ్జీవన్ రావు, నేకూరి మల్లేశ్వరరావు, వంగలపూడి బాబూరావు, యార్లగడ్డ భాస్కర రావు, యార్లగడ్డ చిట్టిబాబు, గెల్లారాజు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

ఆహార పొట్లాల పంపిణీ


 


 


మధురవాడ:, పెన్ పవర్ : సునీల్ 


 


 మహా విశాఖపట్నం జివిఎంసి మధురవాడ పరిధి శుక్రవారం యు వి ఎస్ ఈవెంట్స్,( పీఎం పాలెం), బూర్ల సతీష్, యుసి కళ్యాణ్ చక్రవర్తి, సౌజన్యంతో మధురవాడ స్వతంత్ర నగర్ షిరిడి సాయిబాబా ఆలయ అర్చకులు అధికార్ల కాళిదాసు ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు తనవంతు సహాయంగా ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆనందపురం జంక్షన్ నుండి హనుమంతవాక జంక్షన్ వరకు అభాగ్యులకు,వలస కార్మికులకు,ఆశా కార్యకర్తలకు,  నిరుపేదకుటుంబాలవారికి, పోలీస్ సిబ్బందికి, జీవీఎంసీ కార్మికులకు ఆహార పొట్లాలను, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. లాక్ డాన్ మొదలైన నుండి  అధికార్ల కాళిదాసు ఆధ్వర్యంలో దాతల ఆర్థిక నిధులతో ప్రతిరోజు ఆహార పొట్లాలు, బిర్యానీ , మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు, వాటర్ ప్యాకెట్లు, వితరణ చేయడం జరుగుతూనే ఉంది అని లాక్ డౌన్ కొనసాగే రోజుల్లో మా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని,స్వతంత్ర నగర్ షిరిడి సాయి దేవాలయ ప్రధాన అర్చకులు అధికార్ల కాళిదాసు ఐన్యూస్ తో మాట్లాడుతూ మధురవాడ ప్రాంతంలో ఎక్కువగా దినసరి కూలీలు, పేద కుటుంబాల వారు కరొన వైరస్ వల్ల పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి   ఎటువంటి లాభాపేక్ష,రాజకీయాలు లేకుండా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని దాతలు ఎవరైనా ఉంటే స్వతంత్రనగర్ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఐ న్యూస్ కు వివరించారు. ఈకార్యక్రమంలో లోలుగు రమేష్ నాయుడు, కరకాని ఈశ్వరరావు, ఉగ్గిన నాగరాజు  పాల్గొన్నారు.


నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం.


 





నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం.

 

కోరుకొండ, పెన్ పవర్ : మనోజ్ మెహతా 

 

 కోరుకొండ రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆద్వర్యంలో బురుగుపూడి  గ్రామంలో  గ్లోరి పేంతుకొస్తు చర్చి అద్యక్షులు రెవ. కె. నవీన్ పాల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో  కరోనా  వైరస్ నివారణలో భాగంగా లాక్ డౌన్ కారణంగా నిరుపేద పాస్టర్లకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కోరుకొండ మండల రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమే గుడ్ఫ్రైడే ప్రార్థనలు ఎవరింట్లో వాళ్ళే సామాజిక దూరం పాటిస్తూ  ప్రపంచశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కె విజయ్ కుమార్, కె నవీన్ పాల్, సిహెచ్ ప్రశాంత్, డి జైపాల్, కె సన్ని బాబు తదితర పాస్టర్లు పాల్గొన్నారు.


 

 



 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు  చేస్తున్న సేవలు అభినందనీయం 


 





 

- ఎమ్మెల్యే జక్కంపూడి రాజా 

 

కోరుకొండ, పెన్ పవర్ : మనోజ్ మెహతా

 

రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జక్కంపూడి రాజా శుక్రవారం బూరుగుపూడి గ్రామంలో ప్రతి కుటుంబానికి పోషకాహారమైన  గుడ్లును పంపిణీ చేశారు. సుమారు పదిహేను వందల కుటుంబాలకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపుమేరకు బూరుగుపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రొవ్విడి సర్రాజు, కంటె  వినయ్ తేజ, కంటే సత్తిబాబు, పిట్టా కృష్ణ పలువురు నేతలు సమకూర్చిన గుడ్లను ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా చేతుల మీదుగా  పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇంటికి సొంతమైన అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సీతానగరం, రాజానగరం, కోరుకొండ  మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు భోజన ప్యాకెట్లు, కూరగాయల ప్యాకెట్లు మాస్కులు హెల్త్ కిట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించి, ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా కరోనా  వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు.


 

 



 

జిల్లాలో   కరోనా వైరస్ ని  అంతం చేయాలి.


 


జిల్లాలో   కరోనా వైరస్ ని  అంతం చేయాలి.  జిల్లా అధికారుల సమీక్ష లో  మంత్రుల  సూచన.

(స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం, పెన్ పవర్  మజ్జి శ్రీనివాస మూర్తి )


 


కరోనా మహమ్మరి నియంత్రణపై రాష్ట్ర  మంత్రులు  బొత్స సత్యనారాయణ  కురసాల కన్నబాబు  ముత్తం శెట్టి
శ్రీనివాస్  విజయ్ సాయి రెడ్డిలు  జిల్లా అధికారులతో  శుక్రవారం సమీక్ష నిర్వహించారు.జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం  పెరుగుతున్న రోగుల సంఖ్య  తీసుకుంటున్న చర్యలు  కంటోన్మెంట్ జోన్లు  ఇతరత్రా అంశాలపై   అధికారుల  నుంచి  వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణకు  తీసుకోవాల్సిన చర్యలు  సూచించారు.   ఈ సందర్భంగా  రాష్ట్ర  పంచాయతీరాజ్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ    రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  అవంతి శ్రీనివాస్  రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి  మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్   ప్రభావం తగ్గించడానికి దట్టమైన చర్యలు తీసుకోవాలని  కోరారు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో  పటిష్టమైన భద్రత  పాటించాలన్నారు. కంటోన్మెంట్ జోన్లలో   ప్రత్యేకంగా  పర్యవేక్షించారు.  కరోనా మహమ్మారి  నియంత్రించడానికి  రాష్ట్ర  ప్రభుత్వం  తీవ్రంగా కృషి చేసిందన్నారు. పారిశుద్ధ్య నిర్మూలన  త్రాగునీరు  డ్రైనేజీలు  పట్ల  శ్రద్ధ తీసుకోవాలన్నారు. కోటీ పాతిక లక్షల రూపాయలతో  కరోనా వైరస్ నిర్ధారించే పరీక్ష కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజలకు  నిత్యావసర సరుకులు  కూరగాయలు  సక్రమంగా అందేలా  చూడాలన్నారు. రైతులు పండించిన పంటలు  రైతు బజార్ లకు  తరలించేలా  చూడాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు  పెరగకుండా చూడాలన్నారు  ప్రజలు  వ్యక్తిగత దూరం  సామాజిక భద్రత  పాటించేలా  అవగాహన కల్పించాలన్నారు. కరోనా వైరస్ పై  జల్లెడ పట్టాలి అని  మంత్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ వినయ్ చంద్  జాయింట్ కలెక్టర్  ఎం శివ శంకర్  జీవీఎంసీ కమిషనర్  సృజన  పోలీస్ కమిషనర్
ఆర్కె మీనా  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  అధికారి  తిరుపతి రావు తదితర జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు  పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...