Followers

ఆహార పొట్లాల పంపిణీ


 


 


మధురవాడ:, పెన్ పవర్ : సునీల్ 


 


 మహా విశాఖపట్నం జివిఎంసి మధురవాడ పరిధి శుక్రవారం యు వి ఎస్ ఈవెంట్స్,( పీఎం పాలెం), బూర్ల సతీష్, యుసి కళ్యాణ్ చక్రవర్తి, సౌజన్యంతో మధురవాడ స్వతంత్ర నగర్ షిరిడి సాయిబాబా ఆలయ అర్చకులు అధికార్ల కాళిదాసు ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు తనవంతు సహాయంగా ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆనందపురం జంక్షన్ నుండి హనుమంతవాక జంక్షన్ వరకు అభాగ్యులకు,వలస కార్మికులకు,ఆశా కార్యకర్తలకు,  నిరుపేదకుటుంబాలవారికి, పోలీస్ సిబ్బందికి, జీవీఎంసీ కార్మికులకు ఆహార పొట్లాలను, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. లాక్ డాన్ మొదలైన నుండి  అధికార్ల కాళిదాసు ఆధ్వర్యంలో దాతల ఆర్థిక నిధులతో ప్రతిరోజు ఆహార పొట్లాలు, బిర్యానీ , మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు, వాటర్ ప్యాకెట్లు, వితరణ చేయడం జరుగుతూనే ఉంది అని లాక్ డౌన్ కొనసాగే రోజుల్లో మా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని,స్వతంత్ర నగర్ షిరిడి సాయి దేవాలయ ప్రధాన అర్చకులు అధికార్ల కాళిదాసు ఐన్యూస్ తో మాట్లాడుతూ మధురవాడ ప్రాంతంలో ఎక్కువగా దినసరి కూలీలు, పేద కుటుంబాల వారు కరొన వైరస్ వల్ల పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి   ఎటువంటి లాభాపేక్ష,రాజకీయాలు లేకుండా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని దాతలు ఎవరైనా ఉంటే స్వతంత్రనగర్ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఐ న్యూస్ కు వివరించారు. ఈకార్యక్రమంలో లోలుగు రమేష్ నాయుడు, కరకాని ఈశ్వరరావు, ఉగ్గిన నాగరాజు  పాల్గొన్నారు.


నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం.


 





నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం.

 

కోరుకొండ, పెన్ పవర్ : మనోజ్ మెహతా 

 

 కోరుకొండ రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆద్వర్యంలో బురుగుపూడి  గ్రామంలో  గ్లోరి పేంతుకొస్తు చర్చి అద్యక్షులు రెవ. కె. నవీన్ పాల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో  కరోనా  వైరస్ నివారణలో భాగంగా లాక్ డౌన్ కారణంగా నిరుపేద పాస్టర్లకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కోరుకొండ మండల రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమే గుడ్ఫ్రైడే ప్రార్థనలు ఎవరింట్లో వాళ్ళే సామాజిక దూరం పాటిస్తూ  ప్రపంచశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కె విజయ్ కుమార్, కె నవీన్ పాల్, సిహెచ్ ప్రశాంత్, డి జైపాల్, కె సన్ని బాబు తదితర పాస్టర్లు పాల్గొన్నారు.


 

 



 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు  చేస్తున్న సేవలు అభినందనీయం 


 





 

- ఎమ్మెల్యే జక్కంపూడి రాజా 

 

కోరుకొండ, పెన్ పవర్ : మనోజ్ మెహతా

 

రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జక్కంపూడి రాజా శుక్రవారం బూరుగుపూడి గ్రామంలో ప్రతి కుటుంబానికి పోషకాహారమైన  గుడ్లును పంపిణీ చేశారు. సుమారు పదిహేను వందల కుటుంబాలకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపుమేరకు బూరుగుపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రొవ్విడి సర్రాజు, కంటె  వినయ్ తేజ, కంటే సత్తిబాబు, పిట్టా కృష్ణ పలువురు నేతలు సమకూర్చిన గుడ్లను ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా చేతుల మీదుగా  పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇంటికి సొంతమైన అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సీతానగరం, రాజానగరం, కోరుకొండ  మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు భోజన ప్యాకెట్లు, కూరగాయల ప్యాకెట్లు మాస్కులు హెల్త్ కిట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించి, ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా కరోనా  వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు.


 

 



 

జిల్లాలో   కరోనా వైరస్ ని  అంతం చేయాలి.


 


జిల్లాలో   కరోనా వైరస్ ని  అంతం చేయాలి.  జిల్లా అధికారుల సమీక్ష లో  మంత్రుల  సూచన.

(స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం, పెన్ పవర్  మజ్జి శ్రీనివాస మూర్తి )


 


కరోనా మహమ్మరి నియంత్రణపై రాష్ట్ర  మంత్రులు  బొత్స సత్యనారాయణ  కురసాల కన్నబాబు  ముత్తం శెట్టి
శ్రీనివాస్  విజయ్ సాయి రెడ్డిలు  జిల్లా అధికారులతో  శుక్రవారం సమీక్ష నిర్వహించారు.జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం  పెరుగుతున్న రోగుల సంఖ్య  తీసుకుంటున్న చర్యలు  కంటోన్మెంట్ జోన్లు  ఇతరత్రా అంశాలపై   అధికారుల  నుంచి  వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణకు  తీసుకోవాల్సిన చర్యలు  సూచించారు.   ఈ సందర్భంగా  రాష్ట్ర  పంచాయతీరాజ్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ    రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  అవంతి శ్రీనివాస్  రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి  మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్   ప్రభావం తగ్గించడానికి దట్టమైన చర్యలు తీసుకోవాలని  కోరారు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో  పటిష్టమైన భద్రత  పాటించాలన్నారు. కంటోన్మెంట్ జోన్లలో   ప్రత్యేకంగా  పర్యవేక్షించారు.  కరోనా మహమ్మారి  నియంత్రించడానికి  రాష్ట్ర  ప్రభుత్వం  తీవ్రంగా కృషి చేసిందన్నారు. పారిశుద్ధ్య నిర్మూలన  త్రాగునీరు  డ్రైనేజీలు  పట్ల  శ్రద్ధ తీసుకోవాలన్నారు. కోటీ పాతిక లక్షల రూపాయలతో  కరోనా వైరస్ నిర్ధారించే పరీక్ష కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజలకు  నిత్యావసర సరుకులు  కూరగాయలు  సక్రమంగా అందేలా  చూడాలన్నారు. రైతులు పండించిన పంటలు  రైతు బజార్ లకు  తరలించేలా  చూడాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు  పెరగకుండా చూడాలన్నారు  ప్రజలు  వ్యక్తిగత దూరం  సామాజిక భద్రత  పాటించేలా  అవగాహన కల్పించాలన్నారు. కరోనా వైరస్ పై  జల్లెడ పట్టాలి అని  మంత్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ వినయ్ చంద్  జాయింట్ కలెక్టర్  ఎం శివ శంకర్  జీవీఎంసీ కమిషనర్  సృజన  పోలీస్ కమిషనర్
ఆర్కె మీనా  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  అధికారి  తిరుపతి రావు తదితర జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు  పాల్గొన్నారు.


విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ


 





విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్

 

తాడేపల్లిగూడెం, పెన్ పవర్ : రాము 

 

 

 

తాడేపల్లిగూడెంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్. లాక్ డౌన్ లో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులతో పాటుగా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వారు జర్నలిస్టులు. ప్రాణాలకు తెగించి వార్తలు సేకరించి ఇస్తున్న వారికి ఇచ్చేది దానం కాదు గౌరవమే. జీతాలు లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులకు వారిని వినియోగించుకునే రాజకీయనాయకులే వారికి జీతాలు ఇవ్వాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, పుల్లా బాబి, తోట శేషు, మారిశెట్టి పోతురాజు తదితర జన సేన నాయకులు పాల్గొన్నారు

 


 

 



 

తోట గోపి యూత్ ఆధ్వర్యంలోకూరగాయలు  పంపిణీ


 


తోట గోపి యూత్ ఆధ్వర్యంలోకూరగాయలు పంపిణీ

 

 

 పెంటపాడు, పెన్ పవర్ : రాము 

 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో తోట గోపి యూత్ ఆధ్వర్యంలో సుమారు 1000 కుటుంబాలకు కూరగాయలు నిత్యవసర వస్తువులు, శానిటైజర్ ఇంటింటికి పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పని లేక ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ సాయం చేయడానికి ముందుకు వచ్చిన తోట గోపి యూత్ సభ్యులను పలువురు అభినందించారు. కరోనా వైరస్ అనే మహమ్మారి చైనా నుంచి భారతదేశంలో ప్రవేశించిందని ఈ మహమ్మారిని దరిచేరనీయకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించాలని, ఎవరి ఇళ్లలో వారు కుటుంబంతో హాయిగా ఉండాలని అన్నారు.ఎవరి ఇంటి వద్ద వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఈ మహమ్మారిని దరిచేరనీయకుండా ఉండాలని గ్రామస్తులకు  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోటగోపి తనయుడు తోట రాజాబాబు, గంధం సతీష్, జాలాది అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ లు  చోడగిరి చినబాబు, అల్లాడి వెంకటేశ్వరరావు, పీతల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీమల్లెల ప్రసాద్, గ్రామస్తులు పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, పొట్ల ఏడుకొండలు, తదితర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జనసేన ఆధ్వర్యంలో కారోనా వైరస్ నియంత్రణ కొరకు హైడ్రోక్లోరైడ్ ద్రావణం స్ప్రే





జనసేన ఆధ్వర్యంలో కారోనా వైరస్ నియంత్రణ కొరకు హైడ్రోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేశారు

 

 

పెన్ పవర్, గోపాలపురం : రాము 

 

 

కరొనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్లో ఉన్న గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు  జనసేన సైనికులు పిలుపునిచ్చారు. మండలంలోని దొండపూడి గ్రామం లో జనసైనికులు సుమారు 15 మంది తమ గ్రామాన్ని శుభ్రం చేసుకోవడం కొరకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఫ్యాక్టరీ యాజమాన్యం సరఫరా చేసిన సోడియం హైడ్రో క్లోరైడ్  ద్రావకాన్ని గ్రామంలోని అన్ని వీధులలో స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా గా అధ్యక్షులు పోతిరెడ్డి వీరస్వామి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గ్రామాలలో సంపూర్ణ పారిశుధ్యం నెలకొల్పేందుకు జనసైనికులు పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో పోలినాటి రాజేంద్ర, కడియం శ్రీనివాస్, వంగ బ్రదర్స్, చింతా రావు, బద్రి, ,యాకోబు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


 

 



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...