Followers

జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ ఆస్పత్రుల వైద్యులతో సీఎం వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌



 



బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజు 


 


కరోనా మీద యుద్ధంలో మీరు అందిస్తున్న సేవలు చాలా ప్రశంసనీయం, చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు, సర్వీసు ఇస్తున్నారు, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా సేవలు అందిస్తున్నారు' అని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ ఆస్పత్రుల వైద్యులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


అంకిత భావంతో మన రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు:  లాక్‌డౌన్‌ నుంచి, అంతకుముందు నుంచి కూడా మంచి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రానికి సంబంధించి నాలుగు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్య సేవలను అందించడానికి గుర్తించామని జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే క్రిటికల్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ కూడా చాలా కష్టపడి ఈ సేవ చేస్తున్నారని పేర్కొన్నారు.  తెలియని భయం ఉన్నప్పటికీ కూడా మీరు వైద్య సేవలు అందిస్తున్నందుకు  సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు.


ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు సంఖ్య పెరిగింది:  పూర్తిగా వారందరి ఆచూకీ తెలుసుకొని  వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను, సెకండరీ కాంటాక్ట్స్‌ను పూర్తి క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌లో పెట్టామన్నారు. మొత్తమ్మీదకు చూస్తే పరిస్థితి అదుపులో ఉందనే చెప్పుకోవచ్చని సి.ఎం. తెలిపారు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నానని అన్నారు. మీరందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నానని చెప్పారు. జిల్లా కలెక్టర్ డా ఎం హరిజవహర్ లాల్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్ కలెక్టర్ కార్యాలయం నుండి, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామ రాజు, వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ సమన్వయ అధికారి డా ప్రియాంక, ఆర్.ఎం.ఓ. గౌరీశంకర్ రావు, డా. మధుకర్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.


హద్దులు లేని సేవలో ఆరిలోవ యువత






             
హద్దులు లేని సేవలో ఆరిలోవ యువత

 

 ఆరిలోవ. పెన్ పవర్ : భాస్కర్ కుమార్ 

 

మానవ విలువలు కనుమరుగు అవుతున్న ఈ రోజులలో  కరోనా మహమ్మరి  వచ్చి, ప్రతి ఒక్కరిలో మానవతా విలువలు చిగు రింపజేసాయి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన  రెడ్డి శ్రీ ధనుష్, కవిటి నాయుడు, రెడ్డి కృష్ణ., సుభాష్ బాబు, తదితరులు వారు సేకరించిన నిత్యవసర వస్తువులను, ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఎస్సై గోపాల్ గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ గోపాల్ రావు మాట్లాడుతూ ఆరిలోవ స్టేషన్ పరిధిలో,  వివిధ రాష్ట్రాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చి, లాక్ డౌన్ లో చికుకున్న వలస  కూలీలను గుర్తించడం జరిగిందని, తమ ద్వారా నిజమైన లబ్ధిదారులకు కు నిత్యవసర వస్తువులను అందజేస్తున్నామని. నిత్యవసర వస్తువులు అందజేస్తున్న యువతను అభినందించిన ఆయన , దాతలు ముందుకు వచ్చి మరి కొంతమందిని ఆదుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


 

 




 


 



కొవిడ్ ఆసుపత్రికి నిత్యావసర సరుకులు విరాళం


 


కొవిడ్ ఆసుపత్రికి నిత్యావసర సరుకులు విరాళం


 (బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజు )


జిల్లా కొవిడ్-19 ఆసుపత్రిగా గుర్తించిన మిమ్స్ లో వైద్యులు, సిబ్బంది, వ్యాధిగ్రస్తులకు భోజన సదుపాయం కల్పించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ ఆసుపత్రి కి ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్-2 ఆర్. కూర్మ నాథ్ చొరవతో పలు సంస్థలు 15 రోజులపాటు భోజనం కల్పించేందుకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేశారు. జిల్లా కాళింగ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ను కలసి తమవంతుగా సహాయాన్ని అందజేశారు. కొవిడ్ రోగుల కోసం వైద్యులు, సిబ్బంది ఎంతో సేవా నిరతితో తమ ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ సేవ చేస్తున్నారని వారికి తమవంతు తోడ్పాటు అందించేందుకు ఈ చిన్న ప్రయత్నం చేశామని వారు పేర్కొన్నారు.


       ఈ కార్యక్రమంలో జిల్లా కాళింగ సేవా సంఘం గౌరవాధ్యక్షులు పేడాడ జనార్ధన రావు, అధ్యక్షులు రోనంకి నాగార్జున, ప్రధాన కార్యదర్శి కంచరాన మురళీధర్, కోశాధికారి పూజారి భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.


సచివాలయ సిబ్బందికి మాస్క్ లు పంపిణీ




 

 


 

 

 

 

సచివాలయ సిబ్బందికి మాస్క్ లు పంపిణీ

 

అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్ 

 

పట్టణం వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆద్వర్యంలో  83వ వార్డ్ 7 సచివాలయాల సిబ్బంది కి , వాలెంటీర్లకు శాసనసభ్యులు  గుడివాడ అమర్ నాధ్ సహకారంతో సేనీటైజర్స్, మాస్కులు  ను పంపిణీ చేశారు. శుక్రవారం150 మంది కి  వార్డుల పార్టీ ముఖ్య నాయకుల చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాజుల రమేష్ మాట్లాడుతూ ప్రపంచమంత కరోన వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తున్న వేల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను లాక్ డౌన్ అంటు ఇంట్లోనే ఉండేల చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలను నసాగిస్తున్నారనారు. అందిస్తున్న ప్రభుత్వ పథకాలు రేషన్  ,ఫెంక్షన్లు, తెల్ల రేషన్ కార్డు దారులకు 1000/రూ తదితర పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రక్షణకై ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మదు, విన్నకోట రాజా సతీష్ , సిద్ది లింగేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ బొండా శంకరరావు, పట్టణ కార్యదర్శి కోరుకొండ రాఘవ, యువజన ప్రదాన కార్యదర్శి ఆళ్ళ ప్రవీణ్. వెల్పులవీది యువనాయకులు ఉగ్గిన అప్పారావు, డొంకా సత్తిబాబు, కోరుకొండ చిన్నా, కటారి దేముడు, కొణతాల సత్తిబాబు, కటారి మహేష్, కృష్ణ, చందూ, అనురాధ, కృషి సాయి,పెంటకోట సతీష్, సముద్రాలు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

ఇంటింటికి నిత్యావసర వస్తువుల పంపిణీ





 


ఇంటింటికి నిత్యావసర వస్తువుల పంపిణీ

 

 

కూరగాయలు, కందిపప్పు, పంచదార పంపిణీ చేసిన 18 వ వార్డు బిజెపి నాయకురాలు డి. అరుణ కుమారి

 

ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ : మహమ్మద్ 

 

కరోన వైరస్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న లాక్ డౌన్ కారణంగా తినటానికి తిండి లేక పేదవాళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఈ ప్రాంత ప్రజానీకం ఇళ్ల కే పరిమితం కావడంతో పేద ప్రజల జీవనోపాధి కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో గత కొద్దిరోజులుగా బిజెపి నాయకురాలు డి అరుణ కుమారి నేతృత్వంలో ఎంవీ.పీ కాలనీలో పేదలకు అనేక సహాయ సహకరాలు  చేస్తూ ముందు వరుసలో ఉన్నారు  ఆమె అప్పు ఘర్ కోలని లో కూరగాయలు, కందిపప్పు, పంచదార పంపిణీ చేయటం జరిగింది. కాలనీ వాసులతో ఆమె మాట్లాడుతూ  ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ లో ఎవరు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ఒకవేళ వచ్చిన మాస్కులు మరియు సామాజిక దూరం తప్పనిసరి అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, వాసుపల్లి శివ, జి అమరేశ్ పాల్గొనడం జరిగింది

తెదేపా నాయకులు కామేష్ చేయూత


 





 

తెదేపా నాయకులు కామేష్ చేయూత

 

అనకాపల్లి, పెన్ పవర్ : వానపల్లి రమణ 

 

మండలంలో కొండకొప్పాక గ్రామంలో తెదేపా నాయకులు 84 వ వార్డ్ ఇంచార్జ్ అరీపు కామేష్ ఆద్యర్యం లో శుక్రవారం పేదలకు సహాయం చేశారు. సుమారు 800 మంది పేదలకు కాయగూరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగాా ఆయ మాట్లాడుతూ కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రపంచం అల్లకల్లోలంగాా అవుతుందన్నారు . ప్రతి ఒక్కరు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీీ. వైస్ ప్రెసిడెంట్ బోయిన  మురళి మోహన్ రావు, గోపాలరావు, పాపారావు ,గిరి, హరి, సకలారమణ టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 



 

జగన్ ప్రభుత్వంపై ఆర్థికభారం


జగన్ ప్రభుత్వంపై ఆర్థికభారం
-- పరిపాలనలో కరోనా తెచ్చిన అడ్డంకులు
-- అయినా ఆగని సంక్షేమ పథకాలు
-- కష్టకాలంలో ప్రతిపక్షాల విమర్శల రాజకీయాలు
--- భవిష్యత్ పాలన ఎలా ఉంటాది అనేది ఆసక్తి


అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్ 


ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ఆర్థిక భారం  పడింది అంటే ఆశ్చర్యం లేదు. సంక్షేమ పథకాల పెంపు అనే  తపనకు కరోనా రూపంలో బ్రేక్ పడింది అనేది వాస్తవం. అయినా  ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికైతే కొనసాగిస్తూనే ఉన్నారు. కాని భవిష్యత్తులో ఎలా నెట్టుకువస్తారన్నదె ఇప్పుడు ప్రశ్న. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుడటం కూడా పరిపాలన నిర్వహణ పై ఎలాంటి ప్రభావం చూపుతుందినెది తేలాల్సి ఉంది. నిజానికి జగన్ అధికారం చేపట్టిన అప్పటినుంచి ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అమ్మబడి ,రైతు భరోసా వంటి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అనతికాలంలోనే ప్రజలకు నగదును అందజేశారు. 8 నెలల పాలనతో గాడిన పడుతున్న సమయంలో జగన్ పరిపాలనా ఆలోచనలకు కరోనా వ్యాధి రూపంలో పెద్ద అవాంతరమే ఏర్పడిందనెది చెప్పొచ్చు. 
      కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఎక్కడెకక్కడ పరిపాలన ఆగిపోయింది. ఎగుమతులు దిగుమతులు లేవు. రవాణా ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం లేనే లేదు. ఇది పక్కన పెడితే అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది పెను భారమే అన్నది విశ్లేషకుల మాట. పైగా ప్రస్తుతం పరిపాలన అంతా కరోనా పైనే దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అవసరం కావడంతో నిధులన్నీ దీని నివారణకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కారణంతో అధికారులు ,పరిపాలన విభాగం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ దీనిపైనే దృష్టి పెట్టారు. మరో ఆలోచనకు అవకాశం లేనంతగా భయాందోళన మధ్య అంతా కొనసాగుతుంది. కేంద్రం దీనికోసమే అంటూ ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు ఖర్చయిపోతునే ఉన్నాయి. గ్రామాలు తదితర అభివృద్ధి నిధులు రాష్ట్రానికి రావాల్సిన ఉన్న భవిష్యత్తులో కేంద్రం ఇస్తాదో లేదో తెలియని పరిస్థితి. దీంతో భవిష్యత్తులో రాష్ట్ర  అభివృద్ధి పై ఎలాంటి ప్రభావం పడుతుందో జగన్ దీనిని ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే అన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. 
    కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రపంచం అంతా వణికిపోతుంటే ఇక్కడ ప్రతిపక్షాలు రాజకీయాలకు తెర లేపుతుండటం ఇబ్బందికర పరిణామమే. వాళ్లు పెంచే వత్తిడితో ప్రభుత్వం లక్ష్యానికి బదులు పక్కదారి పడితే ప్రజల్లో ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లు అవుతాది. కరోనా ను ఎదుర్కోవడంలో రాష్ట్రం పై స్థాయిలో నిలిచింది అన్నది గణనీయమైనది. దీనిని అధిగమించి భవిష్యత్తులో రాష్ట్ర ప్రగతిని ఏ మేరకు తీసుకెళ్తారనెది ఆసక్తి కలిగిస్తుంది. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...