Followers

విశాఖకు  రైల్ పక్షి వలస


 


విశాఖకు  రైల్ పక్షి వలస

 

(స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం, పెన్ పవర్  మజ్జి శ్రీనివాస మూర్తి )

 

లాక్ డౌన్ వల్ల వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టడంతో అరుదైన పక్షులు విశాఖ చేరుకుంటున్నాయి ఈ నేపథ్యంలో తిరుపతి కొండలపై కనిపించే అరుదైన రైల్ పక్షివిశాఖపట్నానికి వలస వస్తున్నాయి. ఇప్పటి వరకు తిరుపతి కొండలకే పరిమితమైన రైల్‌ పక్షులు నగరంలో కనిపిస్తున్నాయని.. శుక్రవారం పాండురంగాపురం వద్ద ఈ పక్షిని గుర్తించినట్లు ఫారెస్ట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ ఎకో సిస్టమ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.చక్రవర్తి తెలిపారు. ఈ పక్షులు మరిన్ని విశాఖ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు చక్రవర్తి పేర్కొన్నారు

పట్టా ఫౌండేషన్ సేవ  కార్యక్రమాలు


 


మానవ సేవయే మాధవ సేవ స్పూర్తి తో   

 

పట్టా ఫౌండేషన్ సేవ  కార్యక్రమములు

 

ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ : మోహమ్మద్

 

పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 6 :30 గంటలకు చిన్న వాల్తేరు   జీ .వీ.ఎం.సి 21 వ  వార్డు లో గల  పారిశుధ్య కార్మికులకు  టిఫిన్,  గ్లూకోస్  డ్రింక్స్ ,  మాస్కులు ,  వాటర్ పాకెట్స్, ఇవ్వడం  జరిగింది,  జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు సేవలు అభినందనీయం అని  తెలియజేస్తు,  విశాఖపట్నం ప్రజలు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని అధిక చెత్త వేయరాదని,  పారిశుధ్య కార్మికులు   తగు జాగ్రత్తలు, పాటించాలని  మాస్కులు ధరించి బయటకు రావాలని సామాజిక దూరం పాటించాలి అని సూచనలు ఇవ్వటం జరిగింది పట్టా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ పట్టా రమేష్ బాబు  పట్టా ఫౌండేషన్ సభ్యులు  : పట్టా. ఉదయ్ కిరణ్ ,  జి., దేముడుబాబు,  బొడ్డేడ. వెంకటలక్ష్మి ,  పెంటకోట నూకరాజు,  ఆర్. భాస్కర్,  యం. సూర్యనారాయణ,  పి. కార్తీక్,  పి. శ్రీలక్ష్మి,  రమేష్,  నరేంద్ర,  అర్జున్,  మరియు జీవీఎంసీ 21వ వార్డు  శానిటరీ ఇన్స్పెక్టర్ పాల్కొన్నారు

పోలీసులకు వెయ్యి మాస్కులను పంపిణీ


 


కరోనా కట్టడకి అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు 1000 మాస్కులను ఉచితంగా ఇచ్చిన


    సహాయం స్వచ్ఛంద సేవా సవస్థ

 

             పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:కరోనా నివారణకు లాక్ డవున్ ఉన్న పరిస్థితుల్లో కరోనా భారీ నుంచి ప్రజలను బాహాటంగా తిరగకుండా కట్టడ చేయడానికి లంకెలపాలెం నాలుగు రోడ్ల సెంటర్లలో పోలీసు సిబ్బంది రాత్రి అనక పగలు అనక కఠోర శ్రమతో బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణం లో వారి స్వస్థకోసం సహాయ స్వచ్చంధ సేవా సoవస్థ 1000 మాస్క్ లను సoవస్థ    అధ్యక్షుడు రౌతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించారు.ఈ కార్యక్రమంలో ఏస్ ఐ రామకృష్ణ,ఏస్ ఐ.గోపి సoవస్థ సభ్యులు అప్పికొండ వేoకటరమణ, యల్లపు సాంబశివరావు,యర్ర కోటేశ్వరరావు,గుర్రం శంకర్రావు,గుర్రం అప్పారావు,అప్పికొండ సర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

ఉక్కు ఉద్యోగి ఉదారత పలువురికి అదర్శం   


ఉక్కు ఉద్యోగి ఉదారత పలువురికి అదర్శం   


                          
 సేవాభావంతో ముందుకు వెళుతున్న  గాజువాక యువత    


                                       
విపత్కర పరిస్దితుల్లో నేను  సైతం అంటున్న పెన్‌పవర్‌ టీం



స్వచ్చందకార్యక్రమాల నిర్వహణకు ప్రముఖు ప్రశంస 



సేవాకార్యక్రమాకు ముందుకు వస్తూన్న పలు సంస్దలు



 
గాజువాక , పెన్‌ పవర్‌:  బి. శ్రీనివాస్ 


 


 ఉక్కు కర్మాగారంలో విధులు  నిర్వహిస్తూన్న కూరెళ్ళ  శ్రీనివాసరావు  తన ఉదారాతను చాటుకున్నారు. విపత్కర పరిస్దితుల్లో  తన వంతు సహాయార్దం ముందుకు రావడం పలువురికి అదర్శప్రాయంగా నిలిచింది.పారిశ్రామికప్రాంతంలో గాజువాక పెన్‌పవర్‌ టీం. స్దానిక విలేఖర్లు. యువత పలు స్వచ్చంద సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తూన్నారు. నేడు యువత చేస్తూన్న కార్యక్రమాలకు  పలువురు తమ అభినందనలు  తెలిపారు.  స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి శ్రీనివాసరావు సౌజన్యంతో పలువార్డుల్లో నివాసితులకు , శానిటరీ సిబ్బందికి వాటర్‌బాటిల్స్‌,పండ్లు, బన్ లు  పంపిణీ చేశారు. కార్యక్రమంలో  పెన్‌పవర్‌ టీం సభ్యులు  బి.శ్రీనివాస్‌, ఫిరోజ్‌ . అమరపిన్ని నానీ ,సాయి, మణికంఠ,  యువత , స్దానికులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


శానిటైజర్ స్ప్రే ఛాంబర్ ని ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ



శానిటైజర్ స్ప్రే ఛాంబర్ ని ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ


             పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం సింహద్రి ధర్మల్ పవర్ ప్లాoట్(ఎన్టీపీసీ)సoవస్థ ప్లాంట్ కి ఉన్న ప్రవేశ ద్వారాల అన్నిటి దగ్గర శానిటైజర్ స్ప్రే ఛాంబర్స్ ని ఏర్పాటు చేసింది.సంవస్థ వారు తమ ఉద్యోగులను కరోనా నా భారిన పడకుండా ఉండేందుకు రక్షణ కవచంలా ఈ చాంబర్స్ ని ఏర్పాటు చేసింది.ఉద్యోగ నిర్వహణ కోసం ప్లాంట్ లోకి ప్రవేశించే ప్రతి వక్కరు తమ ద్విచక్ర వాహనం తో సహా ఈ ఛాంబరు గుండా ప్రవేశించే విధంగా ఏర్పాటు చేశారు.సంవస్థ తమ ఉద్యోగుల గురించే కాకుండా చుట్టు పక్కల అన్ని గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేసే యంత్రాన్ని ట్రాక్టర్ కి ఏర్పాటు చేసి పిచికారి చేయిస్తూ తమ సామాజిక భాద్యతలో ముందంజలో ఉంది.ఈ ఛాంబర్స్ ని సిజీఎం

ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది


 


జగన్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది


విజయవాడ, పెన్ పవర్ 


 మాస్క్ లు లేవన్నందుకు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు, కరోనా విజృంభిస్తుంటే ఎన్నికలు ఆపించి రమేష్ మంచి నిర్ణయం తీసుకున్నారు,  తన మాట విననందుకు రమేష్ కుమార్ పై జగన్ కక్ష గట్టారు,  చెప్పినట్టు వింటే రమేష్ కులం కూడా జగన్ కు కనిపించేది కాదు, రమేష్ కుమార్ ను తొలగించే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదు, ఎస్ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్ కు మాత్రమే ఉంది,  ప్రపంచమంతా కరోనా ఉంటే.. జగన్ కొత్త వైరస్ కనిపెడుతున్నారని  సీపీఐ నేత రామకృష్ణ అన్నారు 


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటు


 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటు

 

బ్యూరో రిపోర్ట్ అమరావతి, పెన్ పవర్ 

 

 

అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటు , స్థానిక ఎన్నికల్లో వైసీపీ అవకతవకలపై తీవ్రంగా స్పందించిన రమేష్,  రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రానికి రమేష్ లేఖ .  తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని లేఖలో రమేష్ కుమార్ ఆందోళన . రమేష్ కుమార్ ముక్కు సూటితనంపై ఇటీవలే భగ్గుమన్న సీఎం జగన్ . రమేష్ పై రాజకీయ, కుల విమర్శలకు దిగిన మంత్రులు, వైసీపీ నేతలు.  కరో సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సరికాదని నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్ కుమార్ పై ఇప్పుడు వేటు వేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం . నిష్పాక్షికంగా వ్యవహరించే అధికారులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మరోసారి రుజువైందంటూ విపక్ష నేతల విమర్శలు,

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...