శానిటైజర్ స్ప్రే ఛాంబర్ ని ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ
Followers
శానిటైజర్ స్ప్రే ఛాంబర్ ని ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ
ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది
జగన్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది
విజయవాడ, పెన్ పవర్
మాస్క్ లు లేవన్నందుకు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు, కరోనా విజృంభిస్తుంటే ఎన్నికలు ఆపించి రమేష్ మంచి నిర్ణయం తీసుకున్నారు, తన మాట విననందుకు రమేష్ కుమార్ పై జగన్ కక్ష గట్టారు, చెప్పినట్టు వింటే రమేష్ కులం కూడా జగన్ కు కనిపించేది కాదు, రమేష్ కుమార్ ను తొలగించే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదు, ఎస్ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్ కు మాత్రమే ఉంది, ప్రపంచమంతా కరోనా ఉంటే.. జగన్ కొత్త వైరస్ కనిపెడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటు
మార్కెట్లు తనిఖీ చేసిన జెసి కిశోర్‌కుమార్
మార్కెట్లు తనిఖీ చేసిన జెసి కిశోర్‌కుమార్
ధరలపై కొనుగోలుదారులను ఆరా
లారీ ఎక్కిమరీ సరుకులు పరిశీలన
విజయనగరం, పెన్ పవర్ ః సామాన్య ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ శుక్రవారం ఉదయం మార్కెట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు దారులను అడిగి మరీ ధరలపై వాకబు చేశారు. బోర్డుపై ఉన్న రేట్లకు, వ్యాపారులు విక్రయిస్తున్న దానికీ తేడా ఉందేమోనని ఆరా తీశారు. లారీ ఎక్కి మరీ సరుకులను, బిల్లులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ శుక్రవారం ఉదయం ముందుగా ఆర్అండ్‌బి రైతు బజార్‌ను తనిఖీ చేశారు. మార్కెటింగ్ సహాయ సంచాలకులు వైవి శ్యామ్‌కుమార్‌తో కలిసి ప్రతీషాపు తిరిగి, విక్రయిస్తున్న ధరలను వాకబు చేశారు. ప్రస్తుత కూరగాయల ధరలను ఆయనకు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ సిహెచ్.సతీష్‌కుమార్ వివరించారు. కొన్ని షాపుల్లో బోర్డు ధరలు కంటే కూరగాయలు తక్కువకు విక్రయిస్తుండటాన్ని గమనించారు. కూరగాయలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్న వారిని కూడా ధరలపై వాకబు చేశారు. ఇదే సమయంలో కొనుగోలు దారులు భౌతిక దూరాన్ని పాటిస్తున్నదీలేనిదీ పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గంటస్థంభం వద్దనున్న హోల్‌సేల్ సరుకుల మార్కెట్‌ను పరిశీలించారు. ఆయా షాపుల్లో ఉన్న స్టాకును, విక్రయిస్తున్న ధరలను తనిఖీ చేశారు. సామాన్లు కొనుగోలు చేసి వెళ్తున్న వారితో మాట్లాడి, ఆయా వస్తువులను ఎంత ధరకు కొనుగోలు చేసిందీ అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ ఎడివద్ద నున్న ధరల పట్టికతో పోల్చిచూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. సరుకులు దించుతున్న లారీపైకి ఎక్కి మరీ, దానిలో సరుకులను, వాటి ధరలను జెసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోల్ వర్తకుల అసోసియేషన్ ప్రతినిధులు కె.ప్రభాకర్, రేపాక రామారావు, వికె సతీష్, రాంపండు తదితరులతో మాట్లాడాకె. సరుకులకు ఎటువంటి కొరతా రాకుండా చూడాలని వారిని జెసి కోరారు. అలాగే కొనుగోలు దారులు భౌతిక దూరాన్ని పాటించేటట్టు చూసే బాధ్యత కూడా వ్యాపారస్తులదేనని స్పష్టం చేశారు.
ప్రజలకు భరోసా కల్పించాం ః జెసి కిశోర్
కూరగాయలు, నిత్యావసరాలకు కొరత ఉండదన్న భరోసాను జిల్లా ప్రజల్లో కల్పించామని జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్ అన్నారు. ప్రజలు ఏరోజుకారోజు తమకు కావాల్సిన సరుకులను కొనుగోలు చేసుకుంటుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. లాక్‌డౌన్ మొదలైన దగ్గరనుంచీ జిల్లాలో ఎక్కడా ఏ వస్తువుకూ కొరత రాలేదని, అలాగే బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకోలేదని చెప్పారు. రానున్న 15 రోజులకు సరిపడే నిత్యావసరాలు స్టాక్ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. హోల్‌సేల్, రిటైల్ వర్తకులను సమన్వయం చేయడం ద్వారా ఇటు విక్రేతలకు గానీ, అటు ప్రజలకు గానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే జిల్లాకు ఇతర జిల్లాలనుంచి, ఇతర రాష్ట్రాలనుంచి సరుకులు దిగుమతి చేసుకొనే సందర్భంలో రవాణాపరంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నిర్ణయించిన ధరలకంటే ఎక్కడా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని, అటువంటివి ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయాలని జెసి సూచించారు.
బస్సు రిజర్వేషన్లను నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడి
బ్యూరో రిపోర్ట్ అమరావతి, పెన్ పవర్
బస్సు రిజర్వేషన్లను నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడించింది.
కరోనా వ్యాప్తి, నియంత్రణ నేపథ్యంలో ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశలుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు నగదు వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చాకే రిజర్వేషన్లు తిరిగి ప్రారంభిస్తామని ఆర్టీసీ తెలిపింది.
వైన్ షాపుకు కన్నం, ప్రయత్నం విఫలం
విజయనగరం, పెన్ పవర్
విజయనగరం జిల్లా సుంకర పేట జంక్షన్. ప్రభుత్వ మద్యం షాప్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు రాత్రి 12 గంటల సమయంలో వాటర్ తాగడానికి వెళ్లగానే దొంగలు ప్రవేశించి సుత్తి శానం తో తలుపును పగలగొట్టి పది బాక్స్ లు తీసి ఓపెన్ ప్లేస్ లో అక్కడ అక్కడ పెట్టారు. సెక్యూరిటీ గార్డు రావడంతో దొంగతనంకు పాల్పడిన వారు అక్కడనుంచి వెళ్లిపోయారు. ఈ విషయం గార్డు సూపర్వైజర్ కి తెలియడంతో వెంటనే ఎక్స్చేంజి అధికారులకి ఫోన్ చేయడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. పది బాక్స్ లు దొరికాయని, ఇంకా మరి ఏమి పోలేదని, దొంగతనం చేసిన వారిపై ఎంక్వైరీ చేస్తామన్న జిల్లా ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం
లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం
(పెన్‌పవర్, పొదిలి)
పట్టణంలోని బిసి కాలనీ రామాలయం వద్ద కరోనా వైరస్ నేపథ్యంలో పనులు లేక అవస్థులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం అన్నదానం నిర్వహించారు. దాతల సహకారంతో నడుస్తున్న ఈ అన్నదానంకు లాల్ ఫౌండేషన్ నిర్వాహకులు ఆరీఫ్ అహ్మద్, ఆకీబ్ అహ్మద్, లాల్ అహ్మద్ ఒక రోజు భోజనంకు అయ్యే ఖర్చును అందజేసి కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ సమయంలో పేదలకు చేసుకునేందుకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్ధేశ్యంతో తన వంతు సాయంగా అన్నదానం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భోజనాల సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా సచివాయం 4 వ హెల్త్ సెక్రటరి కె శార, వాంటీర్లు నరేష్, మౌలాలి, చెన్నకేశవులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ బాష, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు దాసరి గురుస్వామి, సిపిఎం నాయకులు ఎం రమేష్, ఎం సురేష్, జి రమణారెడ్డి, జి సురేష్ తదితయి పాల్గొన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...