Followers

మూగజీవాలను ఆదుకుంటున్న పోలీసులు




 





మూగజీవాలను ఆదుకుంటున్న పోలీసులు

 

 

పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్, పెన్ పవర్   :  రాము 

 

 

పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్ డౌన్  సందర్భముగా ఏలూరు పట్టణములో రోడ్లపై ఉన్న మూగజీవాలు ఆవులు పశువులకు ఆహార పదార్థాలు అందక అలమటిస్తున్న మూగజీవాలను గమనించి ఉన్నత అధికారుల యొక్క ఆదేశాలపై   ఏలూరు రూరల్ సిఐ ఏ శ్రీనివాసరావు  మరియు సిబ్బంది రోడ్లపై సంచరించుచున్న మూగజీవాలకు ఆహార పదార్థాలు పచ్చి గడ్డి, ఎండు గడ్డి,  కూర గాయలను ఏలూరు పట్టణము లో ఉన్న సుమారు 100  మూగజీవాలకు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ తో పాటు ఏలూరు రూరల్ యస్. ఐ చావా సురేష్ మరియు వారి సిబ్బంది యావన్మంది పోలుగొని  మూగ జీవాలకు ఆహార పదార్థాలు అందించి నారు. ఒక వ్యాను పై  పచ్చిగడ్డి ఎండుగడ్డి మరియు కూరగాయలను పట్టణం అంతా తిరిగి ఆవులకు గోవులకు పశువులకు అందించడంలో రూరల్ సిఐ  యొక్క దాతృత్వమునకు అధికారులందరూ అభినందించారు ఏలూరు ఓల్డ్ బస్టాండ్ సెంటర్ వద్ద పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ కరీముల్లా షరీఫ్  స్వయముగా  గోవులకు ఆహార పదార్థాలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా అదనపు ఎస్పి అడ్మిన్  మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏలూరు రూరల్ సిఐ ని ప్రత్యేకంగా   అభినందించారు


 

 



 

ప్రార్థనలు నిర్వహిస్తున్న ఆరుగురు వారిపై కేసు నమోదు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగించి ప్రార్థనలు నిర్వహిస్తున్న ఆరుగురు వారిపై కేసు నమోదు 

 

 

పెన్ పవర్,  గోపాలపురం : రాము 

 

 

 

 

 లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి చర్చిలో ప్రార్ధనలు నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ, వి. సుబ్రహ్మణ్యం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి గుడ్ ఫ్రై డే సందర్భంగా  స్థానిక రజక పేటలోని ఒక ప్రార్థనా మందిరంలో ప్రార్థన నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్ డౌన్ నిబంధనల మేరకు ప్రార్థనా మందిరాల్లో గాని, మసీదులో గాని, దేవాలయాల్లో గాని,ఎటువంటి పూజలు ప్రార్థనలు నిర్వహించటం చట్టరీత్యా నేరం అన్నారు. దానిని ఉల్లంగిస్తే కేసులు నమోదుచేసి  అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీనిపై ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నిత్యావసర సరుకులు అందిస్తున్న వైఎస్ ఆర్ సి పి నాయకులు. 


 


కొందరెడ్లుకు నిత్యావసర సరుకులు అందిస్తున్న వైఎస్ ఆర్ సి పి నాయకులు.                               


 


 వి ఆర్ పురం,  పెన్ పవర్    : సాయి బాబు           


 


                        


వి ఆర్ పురం మండలంలోని లాక్ డౌన్ కారణంగా బయటకు రాలేని, రోడ్డు మార్గం లేని మారుమూల గ్రామాలకు డి సి సి బి  చైర్మన్ అనంత బాబు మరియు ఎమ్మెల్యే ధనలక్ష్మి అదేశాలమేరకు పోచవరం పంచాయతీ లోని గలా గ్రామాలు ,గొందురు, కొల్లూరు, కొండేపూడి, గ్రామాల ప్రజలకు ఒక్కక కుటుంబానికి 7 కేజీలు చొప్పున బియ్యం ,మరియు  నిత్యావసర సరుకులు, కందిపప్పు, హాలుగడ్డలు, పచ్చిమిర్చి ,టామాట, ఉల్లిపాయలు, ఉచితంగా వలంట్రీలు ద్వారా పంపిణీ చేసినారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ పోడియం గోపాలు, రాష్ట్ర కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్ రావు,అరకు పార్లమెంటు కార్యదర్శి బొడ్డు సత్యన్నారాయణ, యూత్ కన్వీనర్ చిక్కాల బాలు, ముత్యాల మురళి, మాదిరెడ్డి సత్తిబాబు, మాచర్ల గంగులు, మాచర్ల వెంగల్ రావు, మామిడి రమణ, కడుపు రమేష్ మామిడి బాలాజీ, .ముత్యాల గౌతమ్ పండు, అందేలా రమణారావు, కాపవరపు ఉమా.ఆశ వర్కర్లు వాలంట్రీలు పాల్గొన్నారు.


 


నేటి కోవిడ్ 19 పాజిటివ్ కేసుల వివరాలుః  నిల్

 


 


నేటి కోవిడ్ 19 పాజిటివ్ కేసుల వివరాలుః  నిల్


 


బ్యూరో రిపోర్ట్,  విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజు 


 


విజయనగరం జిల్లా కోవిడ్-19,  శాంపిల్  టెస్టింగ్ వివరాలు


























1



ఈరోజు  వరకు పంపిన మొత్తం శాంపిల్స్



258



2



పోజిటివ్ గా వచ్చిన శాంపిల్స్



0



3



నెగిటివ్ గా వచ్చిన శాంపిల్స్



172



4



ఇంకా ఫలితాలు రావలసినవి



86



 


Ø    కరోనానివారణలోముఖ్యంశాలుః


Ø    రాష్జ్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వీడియోకాన్పెరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ల, వైద్యులు, కోవిడ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులతో  మాట్లాడారు.  జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్సులో కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ డా.హరి జవవహర్ లాల్, మహరాజా జిల్లా కేంద్రఆసుపత్రి నుండి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు తదితర్లు పాల్గొన్నారు.  కోవిడ్  సందర్భంగా వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, నర్శులు, పారిశుద్ద్య సిబ్బంది సేవలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. 


Ø    జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించిన మిమ్స్ లో వైద్యులు, వైద్య సిబ్బంది అందులో చేరిన వ్యాధిగ్రస్తులకు 15 రోజులకు భోజన వసతి కల్పించేందుకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను విజయనగరంలోనే కళింగ సంక్షేమ సేవా సంఘం సభ్యులు విరాళంగా అందజేసారు. 


Ø    పొరుగున వున్న జిల్లా నుండి జిల్లాలోకి ఇతరులు ప్రవేశించకుండా చూసే నిమిత్తం జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ వివరించారు. 


సామాజిక దూరాన్ని పాటించాలి


 


సామాజిక దూరాన్ని పాటించాలి

 

 వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామ్

 

అనకాపల్లి, పెన్ పవర్  : సాయి రామ్ 

 

ప్రతి ఒక్కరూ సామాజిక ద్వారాన్ని పాటించి కరోనా వ్యాధికి దూరం కావాలని వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు కోరారు. పట్టణంలో 82 వ వార్డులో గాంధీనగర్  అంజయ్య కాలనీ లో వై.య.స్.ఆర్.సి.పి నాయకులు   కార్యకర్తలు ఆధ్వర్యంలో రిక్షా కార్మికులకు ,ఆటో కార్మికులకు మాస్కులు ,సబ్బులు, బ్లీచింగ్ పౌడరకర్చీఫ్ లను అందజేశారు.  రైస్, బిస్కెట్లులు ను పంపిణీ చేశారు. యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ ,ఆకుల సంతోష్,  నంబరు అప్పారావు , మెలిక దుర్గ, ఎస్ కే శ్రీనివాస్ ,  అల్లు మల్లు ,జై రాము కొండూరు రవీంద్ర ,మార్కండేయషేక్ రఫీ ,డొంక సత్తిబాబు అంజయ్య కాలనీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

ముడవ రోజు గడపగడపకు చేయూత


 


ముడవ రోజు గడపగడపకు చేయూత


             పాయకరావుపేట,పెన్ పవర్ 

 

  లాక్ డౌన్ దృష్ట్యా  తెలుగుదేశం పార్టీ శ్రేణులు  నిర్వహిస్తున్న   గడపగడప చేయూత కార్యక్రమం మూడవరోజు స్థానిక పట్టణ కర్ణంగారివీది,తోకలవీది తదితర ప్రాతంలో  శుక్రవారం ఇంటింటికి  ఐదు కేజీల కూరగాయలను 1000 కుటుంభాలకు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు,వేములపూడి అప్పారావు,దళిత నాయకులు పల్లా విలియం కేరి మరియు పెదిరెడ్డి నాని,గుల్లా నాగరాజు,పెదిరెడ్డి పండు,గోవిందు తదితరులు పాల్గొన్నారు.

 

 

పాయకరావుపేట పేదలకు నిత్య అన్నదానం 


 


పాయకరావుపేట పేదలకు నిత్య అన్నదానం 


              పాయకరావుపేట, పెన్ పవర్ : కన్నా 

 

సీనియర్ బిజేపి నాయకులు,జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మెను తోట నగేష్ ఆద్వర్యంలో   లాక్ డౌన్ దృష్ట్యా పట్టణంలో  నిర్వహిస్తున్న పదమూడవ  రోజు అన్నధాన కార్యక్రమం.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన బృందం వైజంక్షన్ హైవేపై విధులలో వున్న పోలీస్ సిబ్బందికి,వాహనదారులకు,పాదచారులకు,బిచ్చగాళ్ళకు ఆహారపొట్లాలను,వాటర్ ప్యాకెట్లను అందజేసారు.ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు రవిరాజు,కార్యకర్తలు దేయాదుల మంగాదేవి,ఇంజరపు సూరిబాబు,పల్లా బాల,పెంకే శ్రీను ,శివ ,తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...