జన సే(వ)న ఆధ్వర్యంలో లో మాస్కులు గ్లౌజులు కూరగాయలు పంపిణీ.
జన సే(వ)న ఆధ్వర్యంలో లో మాస్కులు గ్లౌజులు కూరగాయలు పంపిణీ.
కరోనా పై యుద్దంలో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టిన ముగ్గురమ్మలకు జేజేలు
న్యూస్ డెస్క్, పెన్ పవర్
అగ్రదేశాల వెన్ను విరిచిన కరోనా భారతదేశంలో తలవంచడానికి ముగ్గురు మహిళా అధికారులు కీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల నుండి ఆఫీసు లోనే నివాసముంటూ, కుటుంబాలను కూడా కలవలేకపోయిన
ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమయ్యారు. వీరే ప్రీతి సుడాన్, డాక్టర్ నివేదిత గుప్త, సైంటిస్ట్
రేణు స్వరూప్. ప్రీతి సుడాన్ - హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ఇప్పుడు కరోనా యుద్ధంలో నరేంద్ర మోడీ గారితో ప్రత్యక్షంగా పని చేస్తూ మన్ననలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయుల ను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. .
డాక్టర్ నివేదిత గుప్త -
స్వయంగా ఏం బి బి ఎస్ అయిన ఈమె మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో ఈమె కృషి ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రపందేశాలను సమన్వయం చేస్తున్నారు.
డాక్టర్ రేణు స్వరూప్ - జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్డీ చేసిన ఈ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త నరేంద్ర మోడీ గారి శాస్త్ర సలహాదారుల కమిటీలో సేవలందిస్తున్నారు. కరోనా పై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. ఈమె 2001, 2007, 2015 లో రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు ఎన్నో ప్రశంసలు పొందాయి.
వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో మొదటి వారు
లవ్ అగర్వాల్. ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ సాధించిన ఈ 48 ఏళ్ల యోగా నిపుణుడు విశాఖ జిల్లా కలెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమీషనర్ గా పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రతి రోజు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తున్నారు. అనేక వినూత్న ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఆదర్శమవుతున్నారు. మొబైల్ ఫోన్ల కరోనా కాలర్ ట్యూన్, కంటైన్మెంట్ స్ట్రాటజీ, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, క్లస్టర్ ఔట్ బ్రేక్ స్ట్రాటజీలు ఈయన రూపొందించినవే. మరో వ్యక్తి డాక్టర్ జితేంద్ శర్మ. సత్య సాయి బాబాకు అత్యంత విశ్వాసపాత్రుడు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గా పని చేసిన ఈయనను మళ్ళీ ఏపీ మెడ్ టెక్ ఎం.డీ గా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అధిపతిగా నియమించారు. ఈయన పని ప్రారంభించిన కొద్ది రోజులలోనే దేశంలోనే మొట్టమొదటి గా రాపిడ్ టస్ట్ కిట్స్ ను తయారు చేయిస్తున్నారు. ఇవి కేవలం యాభై నిముషాలలో కరోనాను నిర్ధారిస్తాయి. ప్రస్తుతం రోజుకు రెండు వేల కిట్లు తయారవుతుండగా వచ్చే వారానికి ఇది ఇరవై ఐదు వేలకు చేరుతుందని అంచనా. మార్చి 31నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కేవలం 148 వెంటిలేటర్లు ఉండగా, జితేంద్ర శర్మ గారి నేతృత్వంలో నెలకు మూడు వేల వెంటిలేటర్లు తయారుచేయడానికి కృషి జరుగుతోంది. దీనితో ఆసియా మొత్తానికి ఈయన కృషి ఫలితాలు అందనున్నాయి.
మధురవాడ:, పెన్ పవర్ : సునీల్
మహా విశాఖపట్నం జివిఎంసి మధురవాడ పరిధి శుక్రవారం యు వి ఎస్ ఈవెంట్స్,( పీఎం పాలెం), బూర్ల సతీష్, యుసి కళ్యాణ్ చక్రవర్తి, సౌజన్యంతో మధురవాడ స్వతంత్ర నగర్ షిరిడి సాయిబాబా ఆలయ అర్చకులు అధికార్ల కాళిదాసు ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు తనవంతు సహాయంగా ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆనందపురం జంక్షన్ నుండి హనుమంతవాక జంక్షన్ వరకు అభాగ్యులకు,వలస కార్మికులకు,ఆశా కార్యకర్తలకు, నిరుపేదకుటుంబాలవారికి, పోలీస్ సిబ్బందికి, జీవీఎంసీ కార్మికులకు ఆహార పొట్లాలను, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. లాక్ డాన్ మొదలైన నుండి అధికార్ల కాళిదాసు ఆధ్వర్యంలో దాతల ఆర్థిక నిధులతో ప్రతిరోజు ఆహార పొట్లాలు, బిర్యానీ , మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు, వాటర్ ప్యాకెట్లు, వితరణ చేయడం జరుగుతూనే ఉంది అని లాక్ డౌన్ కొనసాగే రోజుల్లో మా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని,స్వతంత్ర నగర్ షిరిడి సాయి దేవాలయ ప్రధాన అర్చకులు అధికార్ల కాళిదాసు ఐన్యూస్ తో మాట్లాడుతూ మధురవాడ ప్రాంతంలో ఎక్కువగా దినసరి కూలీలు, పేద కుటుంబాల వారు కరొన వైరస్ వల్ల పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఎటువంటి లాభాపేక్ష,రాజకీయాలు లేకుండా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని దాతలు ఎవరైనా ఉంటే స్వతంత్రనగర్ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఐ న్యూస్ కు వివరించారు. ఈకార్యక్రమంలో లోలుగు రమేష్ నాయుడు, కరకాని ఈశ్వరరావు, ఉగ్గిన నాగరాజు పాల్గొన్నారు.
జిల్లాలో కరోనా వైరస్ ని అంతం చేయాలి. జిల్లా అధికారుల సమీక్ష లో మంత్రుల సూచన.
(స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం, పెన్ పవర్ మజ్జి శ్రీనివాస మూర్తి )
కరోనా మహమ్మరి నియంత్రణపై రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ కురసాల కన్నబాబు ముత్తం శెట్టి
శ్రీనివాస్ విజయ్ సాయి రెడ్డిలు జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న రోగుల సంఖ్య తీసుకుంటున్న చర్యలు కంటోన్మెంట్ జోన్లు ఇతరత్రా అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గించడానికి దట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత పాటించాలన్నారు. కంటోన్మెంట్ జోన్లలో ప్రత్యేకంగా పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందన్నారు. పారిశుద్ధ్య నిర్మూలన త్రాగునీరు డ్రైనేజీలు పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. కోటీ పాతిక లక్షల రూపాయలతో కరోనా వైరస్ నిర్ధారించే పరీక్ష కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజలకు నిత్యావసర సరుకులు కూరగాయలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. రైతులు పండించిన పంటలు రైతు బజార్ లకు తరలించేలా చూడాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చూడాలన్నారు ప్రజలు వ్యక్తిగత దూరం సామాజిక భద్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. కరోనా వైరస్ పై జల్లెడ పట్టాలి అని మంత్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ జాయింట్ కలెక్టర్ ఎం శివ శంకర్ జీవీఎంసీ కమిషనర్ సృజన పోలీస్ కమిషనర్
ఆర్కె మీనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతి రావు తదితర జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...